ఏ దేశంలోనైనా రెండే చోట్ల కరెన్సీ ప్రింట్ అవుతుంది. ఒకటి ప్రభుత్వ ముద్రణాలయం. ఇంకొకటి ఆర్టీఏ ఆఫీసు. రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ. ఇక్కడేం ప్రింటింగ్ మిషన్‌లు ఉండవు. లైసెన్సు కోసం, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వాళ్ల నుంచి నోట్లను ‘మింట్’ చేసేస్తారు. గవర్నమెంట్ రూల్స్ ఉండటానికి ఉంటాయి. వాటితో మన బండి నడవదు. కౌంటర్లలో మనిషికో రూల్ ఉంటుంది. ఏ మనిషి దగ్గర ఆ రూల్ పాటించకపోతే ఆడీ కారు ఉన్నా బతుకు జట్కా బండే. ‘భారతీయుడు’ సినిమాలో శంకర్ శాంపిల్‌గా చూపించాడు. ఇప్పుడొక పాకిస్తానీయురాలి అనుభవం. ఆ అమ్మాయి పేరు శిరీన్. డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయింది. బండి మీద 8 కొట్టింది. ఆఫీసర్ ‘గుడ్’ అన్నాడు. అని కూడా ‘సారీ అమ్మా, అమ్మాయిలకు డ్రైవింగ్ లైసెన్సును నేనైతే ఇవ్వలేను‘ అన్నాడు. ‘ఇవ్వాల్సింది మీరే కదా సర్’ అంది ఆ అమ్మాయి మన దిల్ ఖుష్ దివ్యలా.. సర్ అనే మాటను నొక్కి పలుకుతూ.
‘అయిననూ ఇవ్వలేనమ్మా.. ఆడపిల్లలు బండ్లు పడేస్తారు’ అన్నాడు. ‘డబ్బుల కోసమా సర్ ’ అంటే.. ‘కాదమ్మా.. నీకు దెబ్బలు తగులుతాయని’ అన్నాడు. శిరీన్‌కి కోపం వచ్చింది. ట్విట్టర్‌లోకి వెళ్లి ‘ఏం రూల్ ఇది?’ అని నేరుగా ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్‌కి ట్వీట్ కొట్టింది. వెంటనే ఇమ్రాన్ లైన్‌లోకి వచ్చారు. ఆ ఇమ్రాన్ ఆర్టీఏ ఆఫీసర్. ‘వచ్చి లైసెన్స్ తీసుకెళ్లమ్మా..’ అని ఫోన్ చేశాడు. వెళ్లి లైసెన్స్ తెచ్చుకుని.. ‘థ్యాంక్యూ మిస్టర్ ఇమ్రాన్’ అని ట్వీట్ చేసింది. ఆర్టీఏ ఇమ్రాన్‌కి కాదు, పీఎం ఇమ్రాన్‌కి. ట్విట్టర్ వచ్చాక దేశ ప్రధానులు తప్ప ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. మన మోడీనే చూడండి. ‘కువ’ అని పలకరిస్తే చాలు.. ‘కువ కువ’ అని బదులిస్తున్నారు!
@ImranKhanPTI
— Shireen Ferozepurwalla (@SFerozepurwalla) September 14, 2020
Can a woman not ride a bike in Pakistan? I'm being told by the License Office that they do not issue bike riding licenses to women.
They said and I quote: "Larkiyo ko bike ka license nahi dete, aap gaari chalaye."
Why? What kind of rule is this? Please respond.
Comments
Please login to add a commentAdd a comment