సాక్షి, చెన్నై : డ్రైవర్లకు రవాణా సంస్థ ఆంక్షలు విధించింది. ముందు సీట్లో మహిళలు కూర్చుంటే వారితో మాట్లాడ కూడదని, బ్యానెట్‌పై ఎవ్వర్నీ కూర్చోబెట్టకూడదన్న ఆంక్షల చిట్టాను విడుదల చేసింది. రాష్ట్రంలో చెన్నై, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, కోయంబత్తూరు, విల్లుపురం, తిరునల్వేలి, కుంభకోణం డివిజన్లుగా రవాణా సంస్థ బస్సుల సేవలు సాగుతున్నాయి. 22 వేల మేరకు బస్సులు నిత్యం రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి. ప్రధానంగా బస్సుల్ని నడిపే సమయంలో డ్రైవర్లు అత్యధికంగా సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నట్టుగా వీడియో ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి.
దీంతో సెల్‌ఫోన్ల వాడకంకు తగ్గ ఆంక్షలు విధించినా, అమలు చేసే డ్రైవర్లు అరుదే. అలాగే, ముందు సీట్ల మహిళలు కూర్చుంటే, వారితో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లేదా బ్యానెట్‌పై మహిళలను కూర్చొబెట్టి మాట్లాడడం వంటి చర్యలకు అనేక మంది డ్రైవర్లు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రవాణా సంస్థకు వచ్చి చేరాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో డ్రైవర్లకు ఆంక్షల చిట్టాను రవాణా సంస్థ ప్రకటించింది. సెల్ వాడకానికి విధించిన ఆంక్షలను కఠినత్వం చేస్తూ, ఇక, మీదట ముందు సీట్లో› మహిళలు కూర్చున్న పక్షంలో వారితో మాట్లాడకూడదని, ప్రధానంగా ఇంజిన్ బ్యానెట్‌పై మహిళలను కూర్చోబెట్టకూడదన్న ఆంక్షలు ఈ జాబితాల ఉన్నాయి. అయితే, వీటిని డ్రైవర్లు అనుసరించేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment