సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండడంతో ప్రభుత్వం మినీ లాక్‌డౌన్ విధించింది. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి పలు ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,276 పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. రాజధాని నగరం చెన్నైలో 1,520 పాజిటివ్ కేసులు, 6 మరణాలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు ఆంక్షలతో కూడిన మినీ లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రధాన లక్షణమైన జ్వరం బారినపడిన వారిని గుర్తించేందుకు ఇంటింటా పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment