రవాణా శాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు | nellore rta officer in acb net | Sakshi
Sakshi News home page

రవాణా శాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు

Published Thu, Dec 21 2017 9:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

nellore rta officer in acb net

సాక్షి, నెల్లూరు : నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్‌ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో శేషాద్రి కృష్ణకిశోర్‌ ఇంట్లోనేగాక ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లల్లో ఏడుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, నరసరావుపేట, పిడుగురాళ్ల, విశాఖ, గుంటూరులోని కృష్ణకిశోర్‌ కుటుంబసభ్యుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక విజయవాడ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కార్యాలయంలోని కృష్ణకిశోర్‌ ఆఫీసులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement