Nellore News
-
1.81 కోట్లు సీజ్.. నారాయణ అల్లుడు పునీత్‌పై కేసు
సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం.. . పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు. -
'Michaung' Cyclone: దిశమార్చుకున్న మిచౌంగ్.. తీవ్ర తుపానుగా..
cyclone michaung Live Updates.. ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్ ప్రచండ గాలులతో విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ తీరం దాటిన తర్వాత కూడా కొనసాగనున్న తుపాను ప్రభావం తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పలువురు.. సహాయక చర్యలందించేందుకు రెడీ చెన్నై-నెల్లూరు రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను బీభత్సం సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదనీరు తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు బారికేడ్లతో జాతీయ రహదారి మూసివేత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచన మిచౌంగ్ ఒంగోలు హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆఫీస్‌లో హెల్ప్ లైన్ 1. 9949796033 2. 8555931920 3. 9000443065 4. 7661834294 5. 8555871450 ఎలాంటి సమస్య వున్నా హెల్ప్.లైన్.నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పిలుపు చెన్నై నగరంలో వర్ష బీభత్సం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం నగరంలో ఎటు చూసినా నీరే. నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తుపాను తీవ్రతకు సరిపోలేదని వ్యాఖ్య తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందన్న తమిళనాడు మంత్రి ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించినట్లు వెల్లడి చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి కాళంగి నది ఉధృతి ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల తిరుపతిలో స్కూళ్లకు సెలవు మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ధాన్యం నష్టపోకుండా.. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ ) తుపాన్ ఎఫెక్ట్‌తో గన్నవరం నుంచి విమానాలు రద్దు ముంచుకొస్తున్న ముప్పు అల్లకల్లోలంగా సముద్రం రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్ నెల్లూరు 120 కి.మీ. దూరంలో! రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం కుంభవృష్టి వర్షాలతో ఆక్మసిక వరదలు తప్పవని హెచ్చరిక తీవ్ర తుపాను నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు తీవ్రతుపాన్గా మారిన మిచౌంగ్ అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు అనకాపల్లి : 08924 - 221698 తుని : 08854 – 252172 సామర్లకోట : 08842 - 327010 రాజమండ్రి : 08832 – 420541 తాడేపల్లిగూడెం : 08818 – 226162 ఏలూరు : 08812 – 232267 భీమవరం టౌన్ : 08816 – 230098; 7815909402 విజయవాడ : 08862 – 571244 తెనాలి : 08644 – 227600 బాపట్ల : 08643 – 222178 ఒంగోలు : 08592 – 280306 నెల్లూరు : 08612 – 345863 గూడూరు : 08624 – 250795; 7815909300 కాకినాడ టౌన్ : 08842 – 374227 గుంటూరు : 9701379072 రేపల్లె : 7093998699 కర్నూల్ సిటీ : 8518220110 తిరుపతి : 7815915571 రేణిగుంట : 9493548008 కమర్షియల్ కంట్రోల్ రూమ్స్ సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112 హైదరాబాద్ : 9676904334 కాచిగూడ : 040 – 27784453 ఖాజీపేట్ : 0870 – 2576430 ఖమ్మం : 7815955306 దిశమార్చుకున్న మిచౌంగ్ హఠాత్తుగా దిశ మార్చుకున్న మిచౌంగ్ తుపాను ప్రస్తుతం నెల్లూరు సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం ఇప్పటికే జలదిగ్బంధంలో సూళ్లూరుపేట రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం.. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కలువాయి, నెల్లూరులో ఈదురు గాలుల బీభత్సం ఇవాళ అర్ధరాత్రి లోపు నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశం మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు బాపట్లలో హైఅలర్ట్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో బాపట్ల చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు 14 పునరావస కేంద్రాలకు 800 మందిని తరలించిన అధికారులు మండలానికి ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీములు ఏర్పాటు 350 మంది గజ ఈతగాళ్ళను సిద్దం చేసిన అధికారులు 43 తుఫాను పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండో చోట్లా బస్సుయాత్ర వాయిదా మిచౌంగ్ ఎఫెక్ట్‌తో డిసెంబర్ 5వ తేదీ రెండు చోట్ల వైఎస్సార్సీపీ బస్సు యాత్ర వాయిదా రేపు చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన యాత్ర భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాయిదా అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా కొనసాగనున్న యాత్ర వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం తెలంగాణపైనా మిచౌంగ్ ఎఫెక్ట్ ఏపీతో పాటు తెలంగాణ పైనా మిచౌంగ్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు.. హాస్టల్ విద్యార్థులు బయటకు రావొద్దని హెచ్చరికలు సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు 1077, 9063211298 ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ తీవ్రతుపానుగా మారిన మిచౌంగ్ తీరప్రాంత గ్రామాల్లో పెరిగిన గాలుల తీవ్రత , వర్షం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఎదురుమొండి దీవుల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఏటిమొగ గ్రామంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం రాబోయే రెండు రోజుల్లో.. చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తరుముకొస్తున్న మిచౌంగ్ అధికార యంత్రాగం అప్రమత్తం తిరుపతిలో.. రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు.. వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం.. రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేసిన అధికారులు.. మిచౌంగ్‌తో.. నాలుగు రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను కారణంగా 4 రైళ్లు పూర్తిగా రద్దు 3 రైళ్లు పాక్షికంగా రద్దు తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం బాపట్ల – కాటమనేని భాస్కర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి తూర్పుగోదావరి – వివేక్ యాదవ్ కాకినాడ – యువరాజ్ ప్రకాశం – ప్రద్యుమ్న నెల్లూరు – హరికిరణ్ తిరుపతి – జె.శ్యామలరావు వెస్ట్‌గోదావరి – కన్నబాబు చెరువును తలపిస్తున్న చెన్నై విమానాశ్రయం చెన్నై విమానాశ్రయంలోకి భారీగా చేరిన వరద నీరు. వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 వర్షపు నీటిలో మునిగిపోయిన వాహనాలు.. #ChennaiRains Hi Chennai! The same old chennai with not a single improvement. This is happening every year & still no one cares about it. All they need is big apartments & for that they cut down the trees, demolish the lakes. Hence, the suffering!!!#CycloneMichuang #CycloneAlert pic.twitter.com/L0yo94nwBD — Bala Harish (@balaharish25) December 4, 2023 నీట మునిగిన పలు కాలనీలు.. It's Aishwarya Nagar, Madambakkam, Chennai-126 (@TambaramCorpor ) It's a scary day... Seems like ocean. #ChennaiFloods #Chennai #ChennaiCorporation #chennairains pic.twitter.com/rBgvF6CQig — CommonHuman (@voiceout_m) December 4, 2023 ఈదురు గాలులతో భారీ వర్షం.. location: sholinganallur wipro. #ChennaiRains #ChennaiFloods pic.twitter.com/GMuHc9NqS6 — ワル.🍭🍿 (@itz_shivvvuuu) December 4, 2023 పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు.. Despite this much rain TNEB power is still going. So that I can use Twitter. Hats off to vidiyal arasu. #ChennaiRains #Guduvacheri pic.twitter.com/hcyTrj26Kr — Kabilan Shan (@ksrsk92_) December 3, 2023 கடவுளை கொஞ்சம் கருணை காட்டு பா.... தண்ணி ஏறிக்கிட்டே வருது... 😰😰😰#ChennaiRains #CycloneMichaung https://t.co/d0D3HjnqiU pic.twitter.com/7wTG4zr8xy — Ravi (@ajuravi) December 4, 2023 SAD!!!!!Next to Apollo hospitals at Teynampet be safe #chennairains #chennairains #ChennaiRains #ChennaiFloods #ChennaiFloods #DunkiTrailer #DunkiDrop4 #Yash19DAMNNN@Portalcoin#CycloneMichuang pic.twitter.com/GrkHTzLwtS — Jussu ❤️ Memecoin | jitu123sahani.bnb (@Jussu26237885) December 4, 2023 తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్‌హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అనుభవం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి కృష్ణాజిల్లా: మిచౌంగ్ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి రైతులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడల రేవు సముద్రతీరంలో ఎగసి పడుతున్న అలలు 8 మీటర్ల మేర కోతకు గురైన సముద్రతీరం అధికారిక యంత్రాంగం అప్రమత్తం నక్కపల్లి నుండి వేటకు వచ్చిన 30 మంది మత్స్యకారులను నక్కా రామేశ్వరం తుఫాన్ పునారావాస కేంద్రానికి తరలింపు... మిచౌంగ్ ప్రభావంతో ఐదు జిల్లాలకు అలర్ట్.. మచిలీపట్నం చేరుకున్న 25 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అవనిగడ్డ చేరుకున్న 37 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తణుకులో మంత్రి కారుమూరి పర్యవేక్షణ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన కారుమూరి మిచౌంగ్ తుపాన్‌కు రైతులు ఎవరూ అదైర్యపడవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని మీకు అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలి ఆప్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించాం. ఏ మిల్లర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తుపాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించాము. ఏ ఒక్క రైతు నష్టపోకుండా మనమే చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం.. తుపాన్ ఎఫెక్ట్‌తో పలు విమానాలు రద్దు.. ఐదు విమానాలను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన తమిళనాడు అతలాకుతలం.. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours#ChennaiRains #CycloneMichaung pic.twitter.com/QNu8LPNkqL — Memer Aspirant (@MemerAspirant) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid heavy rainfall in Chennai city, severe water logging witnessed in several areas of the city. (Visuals from the Pazhaverkadu Beach area) pic.twitter.com/dQpvK0e5VA — ANI (@ANI) December 4, 2023 పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Tamil Nadu: As cyclone 'Michaung' approaches Chennai coast, accompanied by heavy rainfall, several trains are delayed and a few have been cancelled. (Visuals from Egmore Railway Station) pic.twitter.com/5SfV1Xr81L — ANI (@ANI) December 4, 2023 Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours #ChennaiRains @Portalcoin #CycloneMichaung pic.twitter.com/fMUerahj2v — M.N.K (@Nithin1833) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షం, కూలిన చెట్లు.. #WATCH | Tamil Nadu: Amid heavy rainfall, trees uprooted near the Ambattur area, Chennai. pic.twitter.com/XU2Tihh9PO — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 కాకినాడలో అప్రమత్తం.. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణ పరిస్ధితులు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానలు తుపాన్ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు వేటను నిలిపివేసిన మత్స్యకారులు భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచన ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం. యుద్ద ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా 16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు ఉప్పాడ జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు. హోప్ ఐలాండ్ మత్స్యకారుల తరలింపు. తుపాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. కలెక్టరేట్.. 18004253077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం 9701579666 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం 9949393805 నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు నేడు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా నేడు, రేపు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు. తుపాను ఎఫెక్ట్ నేడు పలు రైళ్లు రద్దు.. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు. Cancellation of Trains pic.twitter.com/JpRBLoj5Cx — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Cancellation of Trains pic.twitter.com/JtoUYobINh — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Diversion/Restoration of Trains pic.twitter.com/EgdyrWLBX7 — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు.. రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీరు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. #WATCH | Tamil Nadu | Heavy rainfall in Chennai causes massive waterlogging in parts of the city. Visuals from Vadapalani area of the city. pic.twitter.com/nBNE5oDW25 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Several parts of Chennai receive heavy rainfall as cyclone 'Michaung' approaches the coast. pic.twitter.com/SXeeGaCaH0 — ANI (@ANI) December 4, 2023 మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాన్ రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్ దీని ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం తీరం వెంబడి గంటకు 80 -100 కి.మీ సాయంత్రం నుంచి గంటకు 90-110 కి.మీల వేగంతో గాలులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. #ChennaiRains to continue till noon #ChennaiRain#CycloneMichaung is 110 kms E-NE of #Chennai as it slowly moves North closer to the coasts of North Tamil Nadu & South Andhra Pradesh. North TN will see heavy rains till noon. Coastal AP will see heavy rains post late noon with… pic.twitter.com/N3IggzlHz6 — Karnataka Weather (@Bnglrweatherman) December 4, 2023 విజయవాడ: దక్షిణమధ్య రైల్వే హెల్ప్ డెస్క్.. మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు ఒంగోలు - 08592-280306 కాకినాడ టౌన్ - 0884-2374227 తెనాలి - 08644-227600 గూడూరు - 08624-250795; 7815909300 నెల్లూరు - 0861-2345863 ఏలూరు - 08812-232267 బాపట్ల - 08643-222178 భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402 సామర్లకోట - 0884-2327010 గుడివాడ - 08674-242454 విజయవాడ - 0866-2571244 తుని - 0885-4252172 రాజమండ్రి - 0883-2420541. విశాఖ, అనకాపల్లిలో సెలవు.. ►మిచౌంగ్ తుపాన్ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. -
అక్షరాల... టైమ్ ట్రావెల్!
ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి... చిరంతనంగా నిలవాలంటే సాహిత్యం సుసంపన్నంగా వెలగాలి. ముద్రణ లేని రోజుల్లో మౌఖికం, తాళపత్ర బంధితంగానే మిగిలిన అపార మైన, అపురూప సాహిత్యాన్ని ఆ తర్వాత పుస్తక రూపంలో అందరికీ దగ్గర చేసి, అక్షరాస్యతా ఉద్యమంలో భాగమైన పుణ్యమూర్తులైన ప్రచురణకర్తలు ఎందరెందరో! ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించి ఇవాళ వందేళ్ళ గోరఖ్‌పూర్ గీతాప్రెస్ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం. కానీ, అంత కన్నా కొన్ని దశాబ్దాల ముందే ఒక తెలుగు ప్రచురణ సంస్థ అంతకు మించిన భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవ చేసిందని ఈ తరంలో ఎంత మందికి తెలుసు? తెలుగు ప్రచురణల ద్వారా అక్షర యాగం చేసి, మన జాతి సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవ చేసినసంస్థ – వావిళ్ళ సంస్థ. ఇప్పటికి దాదాపు 170 ఏళ్ళ క్రితం... 1854లోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి, అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్ళ వారు. పురాణాలు, ప్రబంధాలు, స్తోత్రాలు, వేదాంత శాస్త్రాలు, శతకాలు, వ్రతకల్పాలు, వ్యాకరణాలు, నిఘంటువులు... ఇలా వారు ప్రచురించనిది లేదు. అనేక తాళపత్ర గ్రంథా లనూ, చేతిరాతలనూ, ప్రాచీన కావ్యాలనూ పండితులతో పరిష్కరింపజేసి, సవివరమైన పీఠికలతో సప్రామాణికంగా అందించిన ప్రచురణకర్తలు, కవిపండిత పోషకులు, దేశభక్తులు వారు. సంస్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనుపమానం. ఆరు పదులైనా నిండక ముందే ఆయన పరమపదిస్తే, అనంతరం ఆయన కుమారుడు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ఆ కృషిని కొనసాగించారు. తండ్రి నాటిన మొక్కను మహావృక్షంగా పెంచారు. తెలుగుకే కాదు... సంస్కృత, తమిళ, కన్నడ భాషా రచనల్ని కూడా ప్రచురించి, ఆ సాహిత్యాలకు విశేష సేవలందించారు. తెలుగులో ‘త్రిలిఙ్గ’, ఇంగ్లీషులో ‘ఫెడరేటెడ్ ఇండియా’, తమిళంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి సహ కారంతో ‘బాల వినోదిని’ మాసపత్రిక... ఇలా పలు పత్రి కలూ నడిపారు. ఇవాళ్టికీ వావిళ్ళ వారి ప్రచురణ అంటే ప్రామాణికతకూ, సాధికారికతకూ, సాహితీ విలువలకూ ఐఎస్ఐ మార్క్. ముద్రణ దశలోని ప్రూఫ్ గ్యాలీలను తమ ప్రెస్ బయట అంటించి, ప్రచురిస్తున్న పుస్తకంలో అక్షర దోషం పట్టుకుంటే తప్పుకు ఇంత చొప్పున డబ్బులిస్తామని వావిళ్ళ వారు ధైర్యంగా ప్రకటించేవారని పాత తరంవారు చెప్పేవారు. అందుకే, ప్రస్తుతం పలు సంస్థలు చలామణీలోకి తెస్తున్న అనేక పాత పుస్తకాల కొత్త ప్రింట్లు వావిళ్ళ ప్రతులకు సింపుల్ జిరాక్స్ కాపీలే! ఈ తరం పాఠకులకు వావిళ్ళ సంస్థ కృషిని పరిచయం చేయాల్సిన పరిస్థితుల్లో, అదే లక్ష్యంగా వచ్చిన పుస్తకం–‘వావిళ్ళ సాహితీ వికాసం.’ సాంకేతిక విద్యానైపుణ్యం పుష్కలంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్ వి.వి. వేంకటరమణ ఈ పుస్తక రచయిత. కంప్యూటర్ విజ్ఞానం నుంచి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని రచనల దాకా వివిధ అంశాలపై ఇప్పటికే 15 ప్రామా ణిక రచనలు చేసిన నిరంతర జిజ్ఞాసి. ఆయన పుష్కర కాలం శ్రమించి, పరిశోధించి మరీ చేసిన రచన ఇది. దాదాపు 700 పేజీల పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలనూ, ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాలనూ అందించారు. వెయ్యికి పైగా వావిళ్ళ ప్రచురణల్ని పట్టికలు, తేదీలతో సహా పాఠక లోకం ముందుంచారు. ప్రపంచంలో ముద్రణారంభం, బ్రిటీషు కాలంలో మన దేశంలో ముద్రణ, మద్రాసులో ముద్రణ తొలినాళ్ళు, పుదూరు ద్రావిడులైన వావిళ్ళవారు ముద్రణా రంగం లోకొచ్చిన తీరు, వారు నడిపిన పత్రికలు, చేసిన సాహిత్య సేవ, అప్పట్లో జరిగిన వాదవివాదాలు, వావిళ్ళపై వచ్చిన ప్రత్యేక సంపుటాల విశేషాలు... ఇలా ఈ పుస్తకం ఓ సమా చార గని. ‘కన్యాశుల్కం’ రచన గురజాడదా? గోమఠం శ్రీని వాసాచార్యులదా? అంటూ అప్పట్లో వావిళ్ళ చుట్టూ నడిచిన వివాదం ఆసక్తిగా చదివిస్తుంది. తండ్రి ఆరంభించిన ‘ఆది సరస్వతీ నిలయం’ నుంచి కుమారుడు నడిపిన వావిళ్ళ ప్రెస్ దాకా, ఆ తర్వాత జరిగిన చరిత్రకు అద్దం ఈ రచన. అలా ఇది వావిళ్ళ వారు చేసిన బృహత్తర యజ్ఞంపై ఓ అరుదైన లో చూపు. బోలెడుశ్రమతో ఈ రచనలో పునర్ముద్రించిన వావిళ్ళ వారి ప్రచురణల ముఖచిత్రాలు, ఫోటోలు, వార్తల్ని చూస్తూ పేజీలు తిప్పినా ఇది అక్షరాలా 170 ఏళ్ళ టైమ్ ట్రావెల్! – రెంటాల జయదేవ(నేడు నెల్లూరులో ‘వావిళ్ళ సాహితీ వికాసం’ ఆవిష్కరణ) -
'పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. అభిమానులకు ఏం భరోసా ఇస్తారు'
నెల్లూరు: నెల్లూరులో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిల్ ఫైరయ్యారు. పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్ పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. మహిళ శక్తిపై టీడీపీ చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యే అనిల్ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్త శుద్ది లేదని విమర్శించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి -
నెల్లూరు: నర్సాపూర్-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, నెల్లూరు: నర్సాపూర్-ధర్మవరం రైలుకు పెను ప్రమాదం తప్పింది. కాగా, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. దీంతో, రైలు పట్టా పక్కకు పడిపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. నర్సాపూర్-ధర్మవరం రైలు శనివారం అర్ధరాత్రి ట్రాక్‌పై వెళ్తుండగా కొందరు రైల్వే పట్టాలపై 2 మీటర్ల రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో ఓ పట్టా.. ట్రాక్‌పై పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఘటన కావలి, బిట్రగుంట సమీపంలోని ముసునూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం -
చంద్రబాబుకు కొత్త ట్విస్ట్.. పార్టీ నేతనే ఓడిస్తానని సవాల్!
పాతాళంలో ఉన్న టీడీపీని పైకి తెద్దామని సింహపురి నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. అష్టకష్టాలు పడి కేడర్‌ను దారిలోకి తెచ్చుకున్నారు. అంతా బాగుందని అనుకుంటుంటే..మాజీ మంత్రి ఒకరు ఎంట్రీ ఇచ్చారు. ఈ సిటీ సీటు నాదే అంటున్నారు. పచ్చ పార్టీ బాస్ కూడా ఆ మాజీ మంత్రితో ఉన్న బంధం కారణంగా ఆయనేకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అప్పటిదాకా కష్టపడ్డ నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి?.. నెల్లూరు టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం.. పాదయాత్రలో లోకేష్ నుంచి సరైన హామీ రాకపోవడంతో వారు లోలోన మదనపడుతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ పరిస్థితి పచ్చ పార్టీకి తలనొప్పిగా మారింది. సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ రీ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి దాకా ఇన్చార్జిగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం పక్కన పెట్టేసింది. రాష్ట ప్రధాన కార్యదర్శి అంటూ నామమాత్రపు పదవి అప్పగించింది. లోకేష్ పాదయాత్రలో కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో శ్రీనివాసులురెడ్డి పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. నాలుగేళ్ల నుంచి పార్టీ కార్యక్రమలకు భారీగా ఖర్చు చేశానని ఇప్పుడు నారాయణ మళ్ళీ వచ్చాడని తనను పక్కకు తప్పిస్తారా అంటూ మండిపడుతున్నారు. మాజీ మంత్రి నారాయణ ఎంట్రీ.. పార్టీ ఓడిపోయాక మాజీ మంత్రి నారాయణ సిటీ పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు సిటీలో బలమైన నేతగా ఉన్న వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే అనిల్‌ను ఎదుర్కొనడం నారాయణకు సాధ్యం కాదని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అంటున్నారు. అనిల్‌కు ఎదురు నిలబడి ఇప్పటివరకు పార్టీని కాపాడితే తనను పక్కనపెట్టారని.. తన సహకారం లేకుండా సిటీలో నారాయణ గెలుపు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని అనుచరుల వద్ద కోటంరెడ్డి చెబుతున్నారంటూ పార్టీలో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన బ్యాచ్‌ను వేసుకుని నారాయణ రాజకీయం చేస్తున్నారని.. ఇదే జరిగితే.. ఆయన మరోసారి ఓడిపోవడం ఖాయమని సిటీ నేతలు చెబుతున్నారు. కోటంరెడ్డి అసంతృఫ్తిని గమనించిన నారాయణ.. ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. తనను గెలిపిస్తే.. ఎమ్మెల్సీ ఇప్పిస్తాననని.. చంద్రబాబు ద్వారానే హామీ ఇప్పిస్తానని చెబుతున్నారట. జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ సీరియస్.. ఇక మాజీ మంత్రి నారాయణ వ్యవహార శైలిపై జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ కూడా సీరియస్‌గా ఉన్నారట. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి నారాయణ తన గొంతు కోశారని అనుచరుల వద్ద రూరల్ సీటు ఆశిస్తున్న అజీజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే ముందు కూడా కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నారాయణ వెన్నుపోటు పొడిచాడని మండిపడుతున్నారట. నెల్లూరు సిటీ, రూరల్‌లో తనకు ఉన్న ఓటు బ్యాంక్‌తో నారాయణను, కోటంరెడ్డిని ఓడిస్తానని అజీజ్ శపథం చేశారట. నాలుగేళ్ళ పాటు పార్టీని, కేడర్‌ను పట్టించుకోని మాజీ మంత్రి నారాయణను ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకులే అంటున్నారు. పైగా నారాయణ వెంట కేడర్ ఎవరూ లేరని, అదే సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అజీజ్‌లు అసంతృప్తితో ఉన్నందున నారాయణకు మళ్ళీ ఓటమి తప్పదని విస్పష్టంగా చెబుతున్నారు తెలుగుతమ్ముళ్ళు. అయినా టీడీపీ నాయకుల పిచ్చి గాని...కోట్లు కుమ్మరించేవారకి కాకుండా..వేరేవారిని చంద్రబాబు ప్రోత్సహించడని వారికి తెలియదా? ఇప్పుడైనా తెలుసుకోండని అంటున్నారు అక్కడి ప్రజలు. ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం
ఆపదలో ఉన్న వారు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వస్తే ఆయన తక్షణమే స్పందించి చేయూతనిస్తుంటారు. గతంలో పలుచోట్ల నేరుగా బాధితుల వద్దకు వెళ్లి సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. అదేవిధంగా శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వచ్చి న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు తమ సమస్యలు చెప్పుకోగా వారికీ ఆర్థిక సాయం అందించి సీఎం మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. – నెల్లూరు (సెంట్రల్) ♦ కలిగిరికి చెందిన బత్తిన షణ్ముఖకుమార్ అనే చిన్నారిని తండ్రి శ్రీనివాసులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకుకొచ్చారు. జన్యుపరమైన సమస్యతో ఎదుగుదలలేక ఇబ్బందులు పడుతున్నాడని, తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్‌కు సూచించి, తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందేలా చేశారు. ♦ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్లవల్లపల్లి గ్రామానికి చెందిన పి. నాగరాజు అనే వికలాంగుడు ముఖ్యమంత్రికి తన వేదనను మొరపెట్టుకున్నాడు. తనకు కాలు, చెయ్యిలేదని ఆదుకోవాలని కోరాడు. ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆర్థిక సాయాన్ని అందిస్తూ అవసరమైన వైద్యాన్ని అందించేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ♦ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు అనే వికలాంగుడు ముఖ్యమంత్రిని కలిసి రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతినిందని, తనకెవరూ లేరని, ఆర్థిక సాయంచేస్తే వైద్యం చేయించుకుంటానని చెప్పుకొచ్చాడు. సీఎం వెంటనే స్పందించి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చూశారు. ♦ కావలికి చెందిన పోసిన వెంకట్రావు అనే వికలాంగుడు తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఆర్థిక సాయంచేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. స్పందించిన వైఎస్ జగన్ తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించేలా చేశారు. ♦ సర్వేపల్లికి చెందిన దంపతులు తమ కుమార్తె నోసం అమూల్య అరుదైనవ్యాధితో బాధపడుతోందని నాలుగేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకొచ్చారు. చలించిన సీఎం జగన్మోహన్రెడ్డి తక్షణ సాయంగా రూ.లక్ష అందించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ♦ కందుకూరు సమీపంలోని కళవళ్ల గ్రామానికి చెందిన దుగ్గిరాల రాధ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వచ్చింది. తన భర్త దుగ్గిరాల రాఘవులుకు (గ్రామ సర్పంచ్) కిడ్నీలు చెడిపోయాయని, వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తమకు లేదని, తన భర్తను ఆదుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి.. అతనికి ఖర్చులు చూడాలని, మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.లక్ష చెక్కును అందచేశారు. అలాగే, కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల పింఛన్ వెంటనే మంజూరు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. ♦ పొదలకూరు మండలం ఊట్లపాళెంకు చెందిన వెంకట అఖిల్ అనే వ్యక్తి తనకు వెన్నెముక ఆపరేషన్ జరిగిందని.. ఆరోగ్యం సరిగాలేదని, మరింత మెరుగైన వైద్యం చేయించుకునే స్థోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. దీంతో సీఎం స్పందించి తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేసేలా చూశారు. -
అబద్ధాల ‘బాబు’ తీరు ఇది.. ఇదేం సెల్ఫీ చంద్రబాబు!
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించిన వారు లేరు. చేయని పనిని చేసినట్లుగా చెప్పడం ఆయన నైజం. ఇది మరోసారి నిరూపితమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో కట్టిన టిడ్కో ఇళ్లంటూ బాబు సెల్ఫీ దిగారు. అయితే ఆ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిన ఘనత గత ప్రభుత్వానిది. నిజం ఏంటంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలను లబ్ధిదారులకు అందించింది. ఇంకా వేలాదిమంది మహిళలకు పట్టాలిచ్చి గృహాలు కట్టిస్తోంది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు. వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్దకు శుక్రవారం ఆయన చేరుకుని సెల్ఫీ తీసుకున్నారు. ‘చూడు జగన్ మా ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన వేలాది ఇళ్లు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా?’ అని ట్వీట్ చేశారు. అసలు విషయం తెలిసిన వారందరూ చంద్రబాబు అబద్ధాల కోరంటూ మండి పడుతున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో టిడ్కో గృహ సముదాయంలో నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 2019లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇళ్లు పూర్తి కాకపోయినా టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా హడావుడిగా కొందరు లబి్ధదారులకు తాళాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే లబ్ధిదారులు స్పందించలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అన్ని వసతులు కలి్పంచి లబి్ధదారులకు అందజేసింది. ఇప్పటికే వేలాదిమంది ఈ గృహాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన అప్పటి పాలకులు పేదల నెత్తిన అప్పుల భారాన్ని మోపారు. సింగిల్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు డిపాజిట్ రూపంలో నగదు వసూలు చేశారు. అంతేకాక బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి లబ్ధిదారులు నెల వాయిదాలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. సింగిల్ బెడ్రూం ఇల్లు పొందిన లబి్ధదారు క్రమం తప్పకుండా 20 సంవత్సరాలపాటు నెలకు రూ.3,500 చొప్పున చెల్లించేలా ఒప్పంద పత్రాలను తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సింగిల్ బెడ్రూం లబ్ధిదారుల నుంచి ఎటువంటి డిపాజిట్ రుసుం వసూలు చేయకుండా రూ.1కే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. అదేవిధంగా అప్పట్లో డబుల్ బెడ్రూం లబి్ధదారుల నుంచి కట్టించుకున్న డిజిపాట్లలో నేటి ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇచ్చింది. నేడు అక్కడే ఏడు వేలకు పైగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నాడు 4 వేల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయగా.. నేటి ప్రభుత్వం వాటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అదే జనార్దనరెడ్డి కాలనీలోనే జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఏడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సొంతింటి కల సాకారం చేసేందుకు.. నెల్లూరు(అర్బన్): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిలువ నీడ లేని నిరుపేదలు వేలాది మంది తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో 494 జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 56,734 మందికి స్థలాలు మంజూరు చేసింది. ఇళ్లు కూడా తామే కట్టిస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను జిల్లాలోనే ఖర్చు చేస్తోంది. కేవలం స్థలాలను ఇవ్వడమే కాకుండా ఆ కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు పదివేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. పలుచోట్ల పేదలు ఇళ్లలో చేరి ఆనందంగా ఉంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి ఒక్కో లబి్ధదారు సొంతం కానుంది. ఈ ఇంటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నందున వారి భవిష్యత్ అవసరాలకు విక్రయించుకోవచ్చు. రిజి్రస్టేషన్ వల్ల విలువ పెరుగుతుంది. కాగా ఏప్రిల్ 15వ తేదీ నాటికి 16 వేల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేశారు. అవి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్స్ తప్పనిసరి. సభ్యులకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అసలు వాస్తవాలు ఇవైతే ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ఇప్పుడు ఇళ్ల పేరుతో డ్రామా ఆడుతున్నారని లబి్ధదారులు మండి పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో నాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. అయితే నిర్మాణ పనులు అప్పుడు పూర్తికాకపోవడంతో ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఒక్క రూపాయితో రిజి్రస్టేషన్ చేయించి ఇచ్చారు. – జోత్స్న, టిడ్కో ఇల్లు లబి్ధదారు -
జట్టు కట్టారు.. లాభాల గుట్టు పట్టారు
వ్యవసాయ రంగంలో లాభాల గుట్టు పట్టాలన్న ఓ యువరైతు ఆలోచన తోటి రైతులను సైతం జట్టు కట్టేలా చేసింది. ఒక్కొక్కరుగా చేయి కలుపుతూ ఆ రైతులంతా దళారులను తరిమికొట్టి.. సాగులో లాభాల పంట పండిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాంకేతిక పద్ధతుల్ని అవలంబిస్తూ.. తమకు అవసరమైన సదుపాయాలను తామే సమకూర్చుకుంటున్నారు. పొలం బడుల్లో ప్రగతి దారులు పరుచుకుంటున్న ఆ రైతులను చూడాలంటే.. నెల్లూరు జిల్లా లేగుంటపాడు వెళ్లాల్సిందే..! సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన రైతులు 2016లో చేయిచేయి కలిపి సంఘటితమయ్యారు. ఎంబీఏ చదివిన యువరైతు భూపేష్‌రెడ్డితో కలిసి నాబార్డు సహకారంతో రైతు ఉత్పత్తిదారులు సంఘం (ఎఫ్‌పీవో) తరఫున ప్రగతి యువ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత 20 ఎకరాల పొలంతో 100 మంది రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కాగా.. ఆ తర్వాత కోవూరు మండలంతో పాటు ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు, జగదేవీపేట, కొత్తూరు, లేబూరు, కొడవలూరు మండలంలోని తలమంచి గ్రామ రైతులు కూడా వారితో జత కలిశారు. ఇలా దాదాపు 2,500 మంది పండ్లు, పూలు, కూరగాయలు సాగు చేసే రైతులు ఎఫ్‌పీవోలో సభ్యులుగా చేరారు. ఒక్కో సభ్యుడు రూ.100 చొప్పున సభ్యత్వ రుసుం, షేర్ క్యాపిటల్ రూ.వెయ్యి వంతున చెల్లించి దాదాపు రూ.25 లక్షల వరకు సమకూర్చుకున్నారు. ఆ సొమ్ముతో వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యుల్లో అత్యధికులు కౌలు రైతులే కావటం విశేషం. అల్లికల కోసం అరటి నార తీస్తున్న రైతులు యంత్రాల బాటపట్టి.. ఉద్యాన శాఖ, నాబార్డు ద్వారా సబ్సిడీ రుణం పొంది రవాణా వాహనాన్ని, తూకంలో మోసపోకుండా విద్యుత్ తూకం యంత్రాలను, వీడర్లను సమకూర్చుకున్నారు. అంతేకాకుండా కలెక్షన్ సెంటర్లు, సోలార్ కోల్డ్ రూమ్, సోలార్ డ్రయ్యర్, పోర్టబుల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం సమకూర్చుకున్నారు. సోలార్ కోల్డ్ రూమ్ నిర్మాణానికి దాదాపు రూ.14.5 లక్షల వ్యయం కాగా.. ప్రభుత్వం రూ.11 లక్షల సబ్సిడీ ఇచ్చింది. రైతులకు కొత్త వంగడాలు అందించడం, గిట్టుబాటు ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకునేలా అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ పంట ఉత్పత్తులకు ధర లేకపోయినా కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసి ధర వచ్చినప్పుడే మార్కెట్‌కు పంపిస్తున్నారు. జేఎల్‌జీ గ్రూపులకు రుణ సదుపాయం ఐదుగురు చొప్పున రైతులను జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి అధికారులు వారికి రుణాలు అందేలా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 500 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షల వరకు పెట్టుబడుల కోసం రుణం మంజూరు చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు గ్రీన్హౌస్ టెక్నాలజీ అందించేందుకు కృషి జరుగుతోంది. 10 సెంట్ల విస్తీర్ణంలో సైతం రూ.లక్ష వ్యయంతో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి పంటల సాగు చేసేలా కృషి చేస్తున్నారు. పచ్చి మిర్చి గ్రేడింగ్ చేస్తున్న రైతులు విదేశాలకు ఎగుమతులు చేసే లక్ష్యంతో.. రైతులకు అన్ని అవసరాలు తీర్చడంతో పాటు రైతులే సొంతంగా మార్కెటింగ్ చేసుకునే స్థాయికి చేరుకున్నాం. ఆధునిక పద్ధతులతో సేంద్రియ పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ సహకారంతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సోలార్ కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెటింగ్ కోసం వారాంతపు సంత ఏర్పాటు చేసుకున్నాం. విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – భూపేష్‌రెడ్డి , రైతు ఉత్పత్తిదారుల సంఘ రూపకర్త ఆధునిక పద్ధతులతో సాగు రైతులంతా ఐకమత్యంతో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరాం. మాకు పంటల సాగుపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆ«ధునిక పద్ధతులతో సాగు చేస్తున్నాం. ఏటా భూసార పరీక్షలు చేయించి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుతున్నాం. దీనివల్ల పంటల దిగుబడి పెరిగి వ్యయం తగ్గింది. – రాజశేఖర్, యువ రైతు, లేగుంటపాడు చదవండి: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్.. -
చిన్న వయసు.. పెద్ద ఆలోచన
చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్ ప్రిన్స్ విలియమ్స్ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్ డయానా’ అవార్డు దక్కించుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్‌కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్ ఉమన్ ఇన్ మైక్రో ఫైనాన్స్ టర్మేయిల్’ (స్విఫ్ట్) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది. వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్లైన్ ద్వారా అందించారు. రూ.25 లక్షలతో ప్రారంభం విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్) ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు. ప్రిన్స్ డయానా అవార్డుకు ఎంపిక సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్ రాణి డయానా అవార్డును ప్రిన్స్ విలియమ్స్ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్ సంస్థ ఈసారి ప్రిన్స్ విలియమ్స్ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేశారు. మరింత బాధ్యత పెరిగింది ప్రిన్స్ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. – గోభాను శశాంకర్, స్విఫ్ట్ ఫౌండర్ -
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
మూగజీవాలకు పెళ్లి విందు, రూ.65వేలతో ఏర్పాటు
నెల్లూరు:మనదేశంలో పెళ్లిళ్లు భారీ ఎత్తున, హంగు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.కానీ కరోనా కారణంగా కాబోయే నూతన వధువరులు పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో బాధితులకు, మూగ జీవాలకు అండగా నిలుస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మానవాళి మనుగడ ప్రశ్నర్థకంగా మార్చింది. ఈ సమయంలో పలువురు దాతలు... పేదలు, కార్మికులు, నిర్వాసితులకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు.ఈ క్లిష్ట సమయంలో మూగ జీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆహారం కోసం అల్లాడిపోతున్నాయి. సరైన తిండి, తాగునీరు దొరక్క అలమటించిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నూతన వధువరులు తమ పెళ్లి సందర్భంగా మూగ జీవాలకు పెళ్లి విందును ఏర్పాటు చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటుంది. అయితే కుటుంబంలో నిఖిల్ - రక్షల వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధువరులు జిల్లాకు చెందిన జంతు సంరక్షణ శాలలో మూగ జీవాలకు రూ.60వేలతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణశాలలో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. మూగజీవాలపై ప్రేమను చాటుకున్నారు. A marriage held at a GOSHALA in Nellore, Andhra by a North Indian fmly at a total cost of just Rs. 65,000 feeding only animals n inmates pic.twitter.com/O2B7cYhzoN — S K Raman 🇮🇳 (@S_K_Raman) June 5, 2021 -
పెద్దల మితిమీరిన జోక్యం.. అధికారుల చేతివాటం..
గత ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికారుల చేతివాటం.. బినామీ కాంట్రాక్టర్ల అత్యాశ నగర మణిహారానికి శాపంలా పరిణమించాయి. అర్హత లేని వ్యక్తికి కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం మొదలు నిర్మాణ పనుల వరకు అన్నీ అక్రమాలే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్భాటంగా.. హడావుడిగా నుడా ఆధ్వర్యంలో చేపట్టిన నెక్లెస్ రోడ్డు పనులు అవినీతిలో కూరుకుపోయాయి. నెల్లూరు నగరీకరణలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన అమృత్ పథకం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా రివర్స్ టెండరింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు స్వర్ణాల చెరువుపై నెక్లెస్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అమృత్ పథకంలో దీన్ని చేరుస్తూ కేంద్రం రూ.25,84,90,268 నిధులు మంజూరు చేసింది. వీటితో చెరువుకట్టను రెండు కిలోమీటర్ల వరకు వెడల్పు చేసి వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ కోర్టులు, ఐస్‌క్రీం పార్కులు, చిన్న పార్కులతో పాటు, ఆర్చీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులను ప్రారంభించారు. అయితే అర్హత లేని ఆరెమ్మెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను కట్టబెట్టారు. వాస్తవానికి సదరు కంపెనీ హైదరాబాద్‌లోని హెచ్ఆర్డీసీసీలో రూ.44.23 కోట్లతో పనులు చేస్తోంది. దీన్ని అమృత పథకం టెండర్లలో చూపించకుండా సదరు కాంట్రాక్ట్ పొందిన సంస్థ మోసం చేసింది. ఈ టెండర్లలో హైదరాబాద్‌లో జరిగే ప్రాజెక్ట్‌ను చూపించి ఉంటే బిడ్ సామర్థ్యం లేక అనర్హతకు గురయ్యేది. అయితే తప్పుడు సమాచారమిచ్చి మోసం చేసి టెండర్ దక్కించుకుంది. దీంతో పాటు నెల్లూరు చెరువుకట్ట అభివృద్ధి కోసం గతేడాది నీరు – చెట్టు పథకం ద్వారా రూ.1.7 కోట్లు మంజూరయ్యాయి. ఆర్కేఎన్ సంస్థ పనులను దక్కించుకొని పూర్తిచేసింది. ఆ పనికి సంబంధించిన రికార్డులను పూర్తి చేసి బిల్లుల కోసం ఇరిగేషన్ శాఖకు పంపించారు. ఇదే పనిని మళ్లీ అమృత్ పథక నిధులతో చేపట్టే నెక్లెస్‌రోడ్డు నిర్మాణంలోనూ చూపారని సమాచారం. టెండర్లో అక్రమాలపై హైకోర్టులో రిట్ నెల్లూరు చెరువు నెక్లెస్ రోడ్ టెండర్లలో అక్రమాలపై కార్తీక్ నవీన్ అనే కాంట్రాక్టర్ హైకోర్టులో 47611 / 2018 నంబర్‌తో కేసు దాఖలు చేశారు. రిట్ స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించింది. టెండర్లలో జరిగిన అక్రమాలు, ఒకే పనికి రెండు బిల్లుల చేస్తున్నారనే ఆరోపణలతో సెంట్రల్, స్టేట్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు. అక్రమాలపై గళమెత్తిన ఎమ్మెల్యేలు నెల్లూరు నెక్లెస్ రోడ్డు నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెరువునీరు పారుదల కోసం ఏర్పాటు చేసిన తూముతో పాటు కాలువలను కూడా పూడ్చేయడంతో పారుదల లేకుండా పోయిందని, భవిష్యత్తులో చెరువు నిండితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుకట్ట తెగితే నెల్లూరు సగభాగం మునిగిపోయే అవకాశం ఉందని వారు చెప్పారు. ప్రజాప్రతినిధులు డిమాండ్ మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రివర్స్ టెండరింగ్‌కు కసరత్తు నుడా ఆధ్వర్యంలో జరిగిన నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఆరెమ్మెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 4.67 శాతం ఎక్సెస్‌తో పనులు దక్కించుకున్న సంస్థ నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల అస్మదీయుడిగా ఉన్న రమేష్‌నాయుడికి సబ్ కాంట్రాక్ట్‌ను అప్పగించి ముందే కమీషన్లు పుచ్చుకుంది. పనులను అత్యంత నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిర్మాణాలు పూర్తి కాకముందే పగుళ్లు రావడం, చెరువు మట్టినే కట్టకు వాడడంతో కట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి. టీడీపీ హయాంలో దాదాపు రూ.ఏడు కోట్ల మేర పనులు జరిపినట్లు రికార్డ్ చేశారు. అయితే నుడా ఇంజినీరింగ్ అధికారులు పనులను పరిశీలిస్తే దాదాపు రూ.5.5 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు నిర్ధారించారు. ఆ బిల్లులు సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించి మిగిలిన పనులకు రివర్స్ టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. -
నీటి పారుదల కాదు.. నిధుల పారుదల శాఖ
నెల్లూరు(సెంట్రల్): గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను నిబంధనలకు విరుద్ధంగా పెంచి దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం కాకాణి గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన దోపిడీపై మాట్లాడారు. గత ప్రభుత్వం నీటి పారుదల శాఖ నిర్వహించిందా..లేక నిధుల పారుల శాఖ నిర్వహించిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. రూ.17వేల కోట్లతో పోలవరం, సుజలశ్రవంతి ప్రాజెక్టులను తప్ప అన్ని పూర్తి చేస్తామని చెప్పారని, కానీ కొన్ని నెలలు తిరగక ముందే రూ.68వేలు కోట్లు ఖర్చు చేసి అన్ని పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలను పెంచి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోచుకున్నారే తప్పా, ఎక్కడా ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని డేగపూడి–బండేపల్లి కాలువ పనులను నిబంధనలకు విరుద్ధంగా రూ.30 కోట్లతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు అప్పగించారని తెలిపారు. ఈ విషయమైన తాను ప్రశ్నించడంతో తిరిగి అదే టెండర్‌ను 12 శాతం లెస్‌కు వేశారన్నారు. దీంతో దాదాపు రూ.4కోట్లు ప్రభుత్వానికి మిగిలిందన్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో భారీగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పేరుతో సాగించిన దోపిడీపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ పెద్దలు దోచుకున్న రూ.68 వేల కోట్లను తిరిగి రాబడితే రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. ఈ దిశగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. -
సోమిరెడ్డి..నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమా?
నెల్లూరు(సెంట్రల్): మీరు చేస్తున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తాం, అందుకు మీరు సిద్ధమాని వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు. మాగుంట లేఅవుట్లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేశారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను అనుచరులకు అప్పగించింది మీరు కాదాని ప్రశ్నించారు. టీడీపీ నేతల చెరలోని అటవీ భూములను ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే రాజకీయ రంగుపులమడం సిగ్గుచేటన్నారు. అవినీతి పరుల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే అభినందించాల్సింది పోయి అనుచరులకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం సిగ్గుచేటన్నారు. నిడిగుంటపాళెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణ జరిపించారన్నారు. కంటేపల్లిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన సెల్‌టవర్ వ్యవహారంలో మీ పాత్ర లేదాని సోమిరెడ్డిని ప్రశ్నించారు. తమ వైపు తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, మీరు సిద్ధమాని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు తరిమి కొట్టినా సిగ్గులేకుండా, ఏదో రకంగా వార్తల్లో ఉండాలని ఇటువంటి నీచ పనులు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లలో సాగించిన దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని సోమిరెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలోని బీసీ నేతలంతా సోమిరెడ్డి బాధితులేనన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో బీసీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకులను ఇబ్బంది పెట్టే సంస్కృతి సోమిరెడ్డిదేనన్నారు. ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి పంచభూతాలను, గుళ్లను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్న సోమ్మును కక్కిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, చిరంజీవులుగౌడ్, నెల్లూరు శివప్రసాద్, భాస్కర్‌గౌడ్, ఉప్పల శంకరయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశంలో ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మైనార్టీల అభివృద్ధికి కృషి జరుగుతోందని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ, కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు హనీఫ్ అలీ పేర్కొన్నారు. నగరానికి చెందిన బీజేపీ సీనియర్ మైనార్టీ నేత అబ్దుల్ రహీంకు మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవి లభించడంతో నిర్వహించిన అభినందన సభలో పాల్గొనేందుకు మంగళవారం నగరానికి వచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని మైనార్టీలకు బీజేపీని శత్రువుగా చూపి దూరం చేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించే బీజేపీ ముస్లింల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీయలేదని చెప్పారు. గత సీఎం చంద్రబాబు ఫొటోలు మార్చి వారి పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు అస్తులను గుర్తించి అన్యాక్రాంతం కాకుండా వాటిని పరిరక్షిస్తామని ప్రకటించారు. అనంతరం అబ్దుల్‌రహీం దంపతులను సత్కరించారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ్, రాష్ట్ర నాయకులు ఖలీబుతుల్లా, సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, శ్రీనివాసులు, చాంద్‌బాషా, షఫీపుల్లా, సుమేరా, యాస్మిన్, తాజుద్దీన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నగరాధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, జిల్లా నాయకులు ఫిరోజ్, అజారుద్దీన్, షబ్బీర్, తాహీర్, మహబూబ్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. -
నగదు వసూలు చేస్తే జైలుకే
పొదలకూరు: గ్రామ, సచివాలయ వలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని ఎవరైనా నగదు వసూలు చేస్తే తీసుకున్న వారితో పాటు, ఇచ్చిన వారిని కూడా జైలుకు పంపుతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే మంగళవారం రాజధాని నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల కల్పన పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎవరైనా పైరవీలు సాగించి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల వద్ద నగదు వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపించి ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఆశావాహులు అర్హులైతే పార్టీలకు అతీతంగా వలంటీర్ల పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఇంటి నివేశనా స్థలాలు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్టు తెలిపారు. వీటి అమలులో అవకతవకలు చోటుచేసుకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పథకాల పేరు చెప్పి ఎవరైనా వసూలుకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతికి తావులేదని, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు అర్హులకే అందజేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. -
గ్యాస్ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది
ఓజిలి: వంట గ్యాస్ అయిపోయిందని విద్యార్థులకు వసతిగృహ సిబ్బంది భోజనం తయారు చేయలేదు. ఈ సంఘటన మండల కేంద్రమైన ఓజిలి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గృహంలో 105 మంది విద్యార్థులున్నారు. అయితే 37 మంది మాత్రమే ఉదయం గృహానికి వచ్చి ఉన్నత పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చారు. రాత్రి ఏడు గంటలు దాటినా వారికి భోజనం తయారు చేయలేదు. ఈ విషయం ఓజిలిలోని కొందరు యువకులకు తెలిసింది. వారు వసతిగృహానికి వెళ్లి ప్రశ్నించగా గ్యాస్ అయిపోందని, దీంతో తాము భోజనం వండలేదని సిబ్బంది తెలిపారు. దీంతో యువత స్వచ్ఛందంగా కట్టెలు తీసుకొచ్చి భోజనం తయారు చేయించి తొమ్మిది గంటలకు విద్యార్థులకు వడ్డించారు. అప్పటి వరకు విద్యార్థులు ఆకలితో అలమటించారు. 37 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటే 105 మందికి హాజరు వేసి ఉండడం గమనార్హం. గత నెలలో చిట్టమూరు వసతిగృహం నుంచి వార్డెన్ తిరుపాలయ్య ఓజిలికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి రెండురోజులు మాత్రమే ఆయన హాస్టల్‌కు వచ్చారని చెబుతున్నారు. కానీ రిజిస్టర్లో మాత్రం జూన్ నెల నుంచి సంతకాలు చేసి ఉన్నారు. కాగా ఈ వ్యవహారంపై జిల్లా బీసీ సంక్షేమాధికారిణి రాజేశ్వరిని వివరణ కోరగా వసతిగృహాన్ని పరిశీలించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు భోజనం తయారు చేయని విషయంపై వార్డెన్ నుంచి వివరణ తీసుకుంటామన్నారు. చిలమానుచేను వార్డెన్ రమణయ్యను హాస్టల్‌కు పంపి విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎవరైనా బీజేపీలో చేరొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారతీయ జనతాపార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇతర పార్టీలకు చెందినవారు పార్టీలో చేరవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ 100 మంది చేత బీజేపీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం బీజేపీ, మైనార్టీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్కే అబ్దుల్‌రహీం అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఆలిండియా వక్ఫ్‌బోర్డు సభ్యులు, పలువురు జాతీయ మైనార్టీ నాయకులు నగరానికి రానున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తులు, త్రిబుల్‌తలాక్‌పై విస్త్రతంగా సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు వస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని మండల, నగర స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి, ఇప్పటి వరకు 10 వేల మందికి నూతన సభ్యత్వాలు ఇవ్వటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఇన్చార్జిలుగా రాష్ట్ర నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, చక్రవర్తిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేఈపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, కాయల మధు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్కే అబ్దుల్ రహీం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే చాంద్‌బాషా పాల్గొన్నారు. -
డైవర్షన్!
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకుపైగా వ్యయం చేసి 100 ఎకరాల విస్తీర్ణంలో డైవర్షన్ యాష్‌పాండ్ నిర్మించారు. కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాల నుంచి బయటపడి, 100 ఎకరాల యాష్‌పాండ్‌ను 30 ఎకరాలకు కుదించారు. అయితే మంచినీరు కలిసిన బూడిదను ఈ యాష్‌పాండ్‌లోకి విడుదల చేయాల్సి ఉండగా, పాత యాష్‌పాండ్ మాదిరిగానే సముద్రపు(ఉప్పు)నీరు కలిసిన బూడిదను విడుదల చేస్తున్నారు. సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ‘వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్’ నిర్మాణం పూర్తికాకపోవడమే దీనికి కారణం. మూడో యూనిట్ కింద నిర్మించే 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి మంచినీటితో నిర్వహించేందుకు, ఉద్యోగుల కాలనీలకు తాగునీరు అందించేందుకు 33 ఎంఎల్డీ, 21 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) వాటర్ ట్రీట్ ప్లాంట్ల నిర్మాణం తలపెట్టారు. మొదటి దశ ప్లాంటు పనులు గత ఏడాది జూన్‌కే పూర్తికావాల్సి ఉంది. ఏడాది గడిచినా కూడా పనులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పాత దాని వలే కొత్త యాష్‌పాండ్‌తో కూడా కాలుష్యం వ్యాపిస్తుందని ఇటు రైతులు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాష్‌పాండ్ ఎత్తు పెంచే టెండర్ రద్దు? బూడిదతో పొంగిపొర్లుతున్న పాత యాష్‌పాండ్‌లోకి బూడిద విడుదల నిలిపివేశారు. దీన్ని ఐదు మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు టెండర్లు కూడా పిలిచారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ టెండర్ రద్దు అయ్యిందని ఇంజినీర్లు చెబుతున్నారు. అందువల్లనే ఈ పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ కాలేదని వెల్లడించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల్లో జాప్యం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్టు ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉప్పునీటి బూడిద విడుదల చేయాల్సి వస్తోందని తెలిపారు. సముద్రం నుంచి నీరు తరలించేందుకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నా. వాటర్ పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీసుకోవడమే మిగిలిందని తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే డైవర్షన్ యాష్‌పాండ్‌లోకి ఉప్పునీరు కలిసిన బూడిదను ఆరు నెలల పాటు విడుదల చేయవచ్చని ఎంఓయూలో గడువు ఇచ్చి ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు. మంచినీటి బూడిద విడుదల చేస్తామన్నారు కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి మంచినీటి బూడిద విడుదల చేస్తామని గతంతో ఏపీజెన్కో ఇంజినీర్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఉప్పునీటి బూడిద విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నేలటూరు, పైనాపురం ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉప్పు మయంగా మారాయి. పంటలు పండే పరిస్థితి లేకుండాపోయింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది. కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీని ఎందుకు తరలించలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమైంది. కొత్త ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. – నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు -
ప్రియుడే కాలయముడు..ప్రియురాలు హత్య
వెంకటగిరి (నెల్లూరు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వెంకటగిరిలోని చింతచెట్టు సెంటర్‌కు చెందిన రజియా అలియాస్ పోలమ్మ (22)ను ఆమె ప్రియుడు పట్టణానికి చెందిన పూజారి రాంబాబు హత్యచేసి పూడ్చిపెట్టిన ఘటన గురువారం మండలంలోని యాతలూరు అటవీప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్ట్టణంలోని కైవల్యానది సమీపంలోని వీరమాతల దేవాలయం చింతచెట్టు ప్రాంతానికి చెందిన రజియా శ్రీకాళహస్తి మండలం చింతపూడికి చెందిన వెంకటేశ్వర్లు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం రజియా భర్త వెంకటేశ్వర్లు సూళ్లూరుపేటలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఈనెల 11వ తేదీన సబ్బు తీసుకువస్తానని పోలమ్మ పట్టణంలోకి వెళ్లి అప్పటినుంచి కనిపించకుండా పోయింది. రజియా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. అయితే ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె తల్లి జవ్వల మస్తానమ్మ తన కుమార్తె కనిపించడంలేదని ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పూజారి రాంబాబుపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాంబాబు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలించారు. రాయితో కొట్టి.. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం స్థానిక వీఆర్వోతో కలసి రాంబాబు పోలీసులకు లొంగిపోయాడు. అతడిని విచారించగా రజియాను హత్య పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తనకు పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడు. రజియా వివాహం చేసుకున్న తర్వాత తనతో సరిగ్గా ఉండటంలేదని 11వ తేదీన పిలిపించుకుని మండలంలోని యాతలూరు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాయితో రజియా ముఖంపై కొట్టడంతో మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. మృతదేహాన్ని సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కొండపనాయుడు, తహసీల్దార్ రాజ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడి వైద్యుడు శ్రీనివాస్ శవపరీక్ష నిర్వహించేందుకు నిరాకరించడంతో ఎస్సై చొరవతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. రాంబాబును పోలీసులు కోర్టుకు హజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
కారుడ్రైవర్ అనుమానాస్పద మృతి
నెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ నెల్లూరులోని నగరంలోని ఓ లాడ్జీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగనాయకులపేట రైలువీధికి చెందిన బాషా, రజియాలు దంపతులు. వారికి అబీద్, నౌషాద్ (33) పిల్లలు. అబీద్ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నౌషాద్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అబీద్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు వరకు అన్నదమ్ములిద్దరూ చాలా ఆప్యాయంగా, స్నేహంగా ఉండేవారు. వివాహం తర్వాత అబీద్ వేరే కాపురం పెట్టాడు. అప్పటినుంచి నౌషాద్ మానసికంగా కృంగిపోయాడు. పలుమార్లు తనకు వివాహం చేయమని తల్లిదండ్రులను కోరాడు. అయితే పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. పనిచేసుకుని నగరంలోని లాడ్జిలో ఉండేవాడు. రెండు, మూడునెలలకోసారి ఇంటికి వెళ్లేవాడు. నెలరోజులుగా అతను నగరంలోని ఆర్ఆర్ లాడ్జీలో రూం నంబర్ 302లో ఉంటున్నాడు. మూడో అంతస్తుపై నుంచి పడి.. నౌషాద్ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించాడు. 11.30 గంటల సమయంలో రూమ్‌బాయ్‌ని పిలిచి పెరుగన్నం తెప్పించుకుని తిన్నాడు. అనంతరం ఏమైందో కానీ మంగళవారం తెల్లవారుజామున లాడ్జీ మూడో అంతస్తు పైనుంచి బ్రాందీషాప్నకు చెందిన స్థలంలో పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది గుర్తించి వెంటనే సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఎస్సై షేక్ సుభాన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జీ సిబ్బందితో మాట్లాడారు. మూడో అంతస్తు పైభాగంలో మృతుడి సెల్‌ఫోన్, కాలి చెప్పు ఒకటిపడి ఉంది. మృతదేహానికి సమీపంలో మరో చెప్పు పడి ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద కుప్పకూలిపోయి గుండెలవిసేలా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నౌషాద్ ప్రమాదవశాత్తు పడిపోలేదని ఎవరో తోసివేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా కిందకు తోసివేశారా? ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. -
మీరు చెబితే సీఎం మాట వింటారు..
ఆత్మకూరు అధికార పార్టీలో మరోసారి చిచ్చురేగింది. అసంతృప్తి నేత కన్నబాబు మరోసారి పార్టీ నేతల తీరుపై ఓ ప్రైవేట్ పంక్షన్ వేదికగా విమర్శలు గుప్పించారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో మరోసారి ఆత్మకూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ సీఎంఓకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం మరింత ముదిరింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నబాబు అవకాశం దొరికినప్పుడుల్లా పార్టీ వేదికలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో టీడీపీ నేత కుమార్తె వివాహ వేడుకలకు కన్నబాబు హాజరయ్యారు. అదే వివాçహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య హాజరయ్యారు. వీరిరువురు ఎదురుపడిన క్రమంలో కన్నబాబు కృష్ణయ్య ఎదుట తన ఆక్రోశం వెళ్లగక్కారు. తనకు సహకరించాలని బొల్లినేని కృష్ణయ్య కన్నబాబును కోరగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యవహర శైలిపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కాలిక ఇన్చార్జిగా ఉండి ఆయన పెత్తనం కొనసాగితే చివరికి నా మాదిరిగానే మీరు అవుతారు’ అని బొల్లినేని ఎదుట కన్నబాబు పేర్కొన్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గ నేతలు పెత్తనం చేస్తే క్యాడర్ ఇబ్బంది పడుతుందని కన్నబాబు మాట్లాడగా రెడ్డి సామాజికవర్గ నేతను సీఎం ఇక్కడ ఇన్చార్జిగా నియమిస్తే ఆయన్ను తొలగించాలని చెప్పడానికి నేను ఎవర్ని.. ఇది కరెక్ట్ కాదు.. అందరం కలసి సీఎం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలే తప్ప తీసివేయమని చెప్పే అధికారం తనకు లేదన్నారు. మీరు చెబితే సీఎం మాట వింటారు మీరే మాట్లాడాలని మీరే దీనికి సరైన వ్యక్తి అని కన్నబాబు పేర్కొన్నారు. నేను ఎలా చెబుతానని, నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు నేను ఏం చేస్తాను ఇది కరెక్ట్ కాదని బొల్లినేని కృష్ణయ్య బుదలిచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తొలుత ప్రత్యేకంగా గదిలో సమావేశమై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కన్నబాబు వ్యవహారంపై ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ సీఎంఓకు కన్నబాబు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్చార్జి నుంచి తప్పించిన తర్వాత కన్నబాబు 2014 ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తర్వాత ఇన్చార్జిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలోకి మాజీ మంత్రి ఆనం చేరిన క్రమంలో ఆయన్ను ఇన్చార్జిగా నియమించి కన్నబాబును తప్పించారు. తదనంతరం మారిన సమీకరణాలలో కన్నబాబు ఇన్చార్జి పదవిని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. దీంతో కన్నబాబు పార్టీని కాపాడండి అంటూ నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు దిగారు. తదనంతరం పార్టీ నేతలు దీక్ష విరమింపజేశారు. తర్వాత కన్నబాబును పట్టించుకోలేదు. దీనికి అనుగుణంగా మాజీ మంత్రి ఆదాల బొల్లినేని కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. రెండు పర్యాయాలు సీఎంను కలిసిన తర్వాత ఆయన పార్టీలో అధికారికంగా చేరకుండా పార్టీ సభ్యత్వం తీసుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొనటం, అన్ని మండలాల్లో శ్రేణుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలో సహజంగానే అసంతృప్తి నేతగా ఉన్న కన్నబాబు వెళ్లగక్కిన ఆక్రోశం వెలుగులోకి రావటంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర దీనిపై దృష్టి సారించి జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆదాలతో బీద సమావేశమయ్యారు. -
నెల్లూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
నెల్లూరు (వేదాయపాళెం): అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి నెల్లూరు రూరల్ పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం రాత్రి మండలంలోని కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డులో జరిగింది. స్థానికులు, నెల్లూరురూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. గూడూరు మసీదువీధికి చెందిన సయ్యద్‌హాసిన్‌బాషా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో తరచూ గొడవ పడుతుండడంతో ఆమె అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి జీవనోపాధి నిమిత్తం వచ్చాడు. కొంతకాలంగా నెల్లూరు నగరంలో ఓ ప్రాంతంలో ఉంటుండేవాడు. ఇటీవల మళ్లీ కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఎల్ఐజీ 2లో 169వ ప్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. ప్లాటు పక్కనే ఉన్న రెండు ప్లాట్లకు చెందిన బాలికలతో సన్నిహితంగా ఉండేవాడు. మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక, నాల్గో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికలకు తరచూ డబ్బులు, స్వీట్లు ఇచ్చి ఇంటికి పిలిపించుకునేవాడు. ముస్లిం పండగలు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా వీరికి డబ్బులు, తినుబండారాలు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ ఇద్దరు బాలికలు ఆటలాడుకుంటుండగా ఇంటిలోకి పిలిచి నోట్లో గుడ్డలు కుక్కి దుస్తులు విప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికలు మరుసటి రోజు జరిగిన విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నుంచి హాసిన్‌బాషా ఇంట్లో కనిపించలేదు. శనివారం సాయంత్రం హాసిన్‌బాషా ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని బాలికల తల్లిదండ్రులు, స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని తాళ్లతో కట్టివేసి దేహశుద్ధి చేశారు. నెల్లూరురూరల్ పోలీసులకు ఇతడిని అప్పగించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇతడిపై ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికలకు ఆదివారం నెల్లూరు ప్రభుత్వాస్పపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. -
మూడోసారీ మువ్వా సరెండర్
నెల్లూరు (టౌన్): డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. ఆయన్ను జిల్లా నుంచి వరుసగా పాఠశాల విద్యాశాఖకు మూడుసార్లు సరెండర్ చేశారు. 2016 ఆగస్ట్‌లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ 2017 సెప్టెంబర్‌లో డీఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల్లో అవకతవకలు, కార్యాలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. అనంతరం రెండు నెలల తర్వాత బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొచ్చి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా నాలుగు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడి విషయంలో డైరెక్టర్ ఉత్తర్వులను పాటించలేదనే ఫిర్యాదుతో మువ్వా రామలింగాన్ని రెండోసారి పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. తదనంతరం 2018 ఆగస్ట్ మొదటి వారంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొని వెంటనే బాధ్యతలు స్వీకరించారు. సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై సీరియస్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ మువ్వా రామలింగాన్ని రెండు సార్లు పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్‌గా తీసుకున్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకునే సమయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలవలేదు. దీంతో మువ్వా వ్యవహారాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అప్పుడే మువ్వా ఆర్డర్‌ను కలెక్టర్ వ్యతిరేకించినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్ మాత్రం మువ్వాను సరెండర్ చేయాలనే నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా విద్యాశాఖ ద్వారా రహస్యంగా నడిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల ఆరున మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేస్తూ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి. మువ్వాకు మంత్రి నారాయణ అండదండలు మువ్వా రామలింగానికి మంత్రి నారాయణ అండదండలు ఉన్నాయి. ఆయన డీఈఓగా పనిచేస్తున్న సమయంలో నారాయణ విద్యాసంస్థలపై సానుకూల ధోరణిని అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో నగరంలోని ధనలక్ష్మీపురంలో గల నారాయణ స్కూల్లో ఫిజిక్స్ పేపర్‌ను లీక్ చేశారు. ఈ వ్యవహారంలో నారాయణ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత ఉన్నా, అప్పటి డీఈఓగా పనిచేసిన రామలింగం సదరు విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సస్పెండైనా, సరెండర్ చేసినా నెలలు తిరగకుండానే మళ్లీ అదే జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. -
టికెట్ ఫైట్ : అభ్యర్థి మార్పు ఖాయం..
ఉదయగిరి అధికార పార్టీలో టికెట్ రగడ తారా స్థాయికి చేరింది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తీరుపై పార్టీ అధిష్టానం నుంచి కేడర్ వరకు వ్యతిరేకత బలంగా ఉండడంతో ఈ దఫా అభ్యర్థి మార్పు ఖాయమని ప్రచారం బలంగా సాగుతోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఆశావహులు బలమైన లాబీయింగ్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీటు కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ దఫా టికెట్ కూడా వేరే సామాజికవర్గానికి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారంతో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో ఆశావహులు ఎక్కువయ్యారు. పార్టీ మండల అధ్యక్షులు కొందరు కూడా తమకు టికెట్ కేటాయిస్తే బాగా ఖర్చు పెట్టుకొని గెలుస్తామని ప్రకటించుకోవడం ఇందుకు నిదర్శనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార టీడీపీలో ఎన్నికల లొల్లి మొదలైంది. ముఖ్యంగా జిల్లాలో సిట్టింగ్ స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఈ నెలాఖరుకు ప్రకటిస్తారని పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉదయగిరి టికెట్ రగడ తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు 2014 ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాంట్రాక్టర్ కావడం, ఇతర రాష్ట్రాల్లో వర్కులు ఎక్కువగా చేస్తున్న క్రమంలో నియోజకవర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండరనే పేరు మొదటి నుంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో ఎన్నడూ ఆయన అందుబాటులో ఉండలేదు. కొన్ని నెలల క్రితం నిర్వహించిన పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకుని నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని హెచ్చరించిన జాబితాలో బొల్లినేని కూడా ఉన్నారు. దీంతో పాటు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి ఆరోపణలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనులు మొదలుకుని మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డులో చేసిన పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. స్థానికంగా నియోజకవర్గంలో నీరు–చెట్టులో ఎక్కడా లేని విధంగా ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీతో ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణం భారీగా చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, పూర్తి నాసిరకంగా నిర్మాణాలు చేసి రూ.కోట్లు స్వాహా చేశారని ప్రభుత్వ నిఘా విభాగం విజిలెన్స్ అధికారులే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాంట్రాక్టర్‌గా విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి చేపట్టిన పనుల్లో అయితే భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం అక్కడ ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు మరికొందరిపై అక్కడి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కూడా కోర్టుకు చేరింది. వీటికితోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతిష్ట మసక బారడంతో పాటు వ్యక్తిగత పరపతి కూడా పూర్తిగా తగ్గిపోయింది. సామాజిక సమీకరణాలు సైతం బలంగా తెరపైకి వచ్చి కీలకంగా మారడంతో ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కదనే ప్రచారం అధికార పార్టీలో బలంగా సాగుతోంది. తీవ్రమైన టికెట్ పోరు అధికార పార్టీలో టికెట్ పోరు తారస్థాయికి చేరింది. నేతలు వ్యక్తిగతంగా జిల్లాలోని పార్టీ ముఖ్యుల ద్వారా లాబీయింగ్‌కు తెరతీశారు. జిల్లాలోని మంత్రి సహకారంతో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి మూడునెలల క్రితం తెరపైకి వచ్చారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో స్కూల్ బ్యాగుల పంపిణీతో నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. మరో వైపు కృష్ణారెడ్డి వర్గం టికెట్ తమ నేతకే దక్కుతుందని బలంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూడా టికెట్ రేసులో తెరపైకి వచ్చారు. మాజీ మంత్రి ఆదాల ప్రబాకర్‌రెడ్డి ద్వారా తన ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉండటంతో మళ్లీ టికెట్ కోసం యత్నిస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో సీఎం సొంత సామాజిక వర్గానికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తారని బలంగా ప్రచారం సాగుతోంది. ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య, కందుకూరులో మరో నేత ఉండటంతో ఉదయగిరిలో మార్పు అనివార్యమనే ప్రచారం సాగుతోంది. ఇక వీరితో పాటు మండల స్థాయి నేతలు ముగ్గురు, ఒక అధికారి కూడా ఇక్కడి టికెట్‌ను సామాజిక సమీకరణాల నేపథ్యంలో ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద డిసెంబర్ నాటికి కానీ టికెట్ పోరుకు ముగింపు రాని పరిస్థితి ఏర్పడింది. -
నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీకి షాక్
-
నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్!
సాక్షి, నెల్లూరు : ఐటీ దాడులతో నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ తగిలింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, ఆయన సోదరుడు మస్తాన్ రావు కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలోని బీఎంఆర్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డులు, కంప్యూటర్ డేటాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో రొయ్యల వ్యాపార లావాదేవీలపై బీద సోదరులను ఆరా తీసినట్లు సమాచారం. -
కాకాణికి మద్దతుగా కదిలిన యువత
సాక్షి, నెల్లూరు : రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని సూరాయపాళెం చెందిన యువత పేర్కొంది. ప్రజల కోసం కాకాణి చేస్తున్న పోరాటాలు మెచ్చి ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. రైతుల పట్ల కాకాణి విధానాలకు బాగున్నాయని, ఆయన నాయకత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు. అందుతో తామంతా స్వచ్ఛందంగా ఆయనతో మమేకమవ్వడానికి ముందుకొచ్చామని పేర్కొన్నారు. కాకాణి గెలుపే తమ గెలుపని అందుకోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. -
నెల్లూరులో రాజన్న కంటివెలుగు కార్యక్రమం
-
అనిల్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన నెల్లూరు యువత
-
డివైడర్‌ను ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
నెల్లూరులో 3000 వేల కొబ్బరి కాయలు కొట్టి ప్రజాసంకల్పయాత్ర మద్దతు
-
అభీష్టం కొద్దీ రొట్టె
రొట్టెలమ్మా రొట్టెలు... ఇంటి రొట్టె, చదువుల రొట్టె, ఉద్యోగాల రొట్టె, పెళ్లి రొట్టె, విదేశీ రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె... మీకు ఏ రొట్టె కావాలి? అంటూ అడుగుతుంటారక్కడ. అలాగని అమ్ముకోరు. ప్రేమగా పిలిచి మరీ ఇస్తారు. తీసుకునే వాళ్లు కూడా భక్తిశ్రద్ధలతో రొట్టెను అందుకుంటారు. ఈ సంవత్సరం రొట్టెను తీసుకున్న వారి కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం తామే రొట్టెలు తయారు చేసి వాటిని కావలసిన వాళ్లకు దానిని అందిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఘాట్లు కూడా ఉంటాయి. హిందూ, ముస్లిం భేదం లేకుండా మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెలపండగ ప్రతి సంవత్సరం నెల్లూరు నగరంలో జరుగుతుంది. ఉద్యోగం మొదలుకొని వీసా వరకు అన్ని రొట్టెలు ఇక్కడ భక్తులు భక్తితో సమర్పించి కోరిక తీరాక మళ్లీ రొట్టెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు సమర్పించే రొట్టెలకు బారాషహిద్ సంతసించి కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా ఖ్యాతి గాంచడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అరబ్ దేశాల నుంచి ఏటా ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందుకే కాబోలు నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు రాష్ట్రపండగ హోదాను 2015లో ప్రకటించింది ప్రభుత్వం. 1751లో మొదటిగా రొట్టెల పండగను ఆర్కాట్నవాబులు నిర్వహించారు. తదనంతరం అన్ని మతాల భక్తులు ఇందులో భాగస్వాములై కులమతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం మొదలైన ఈ పండుగ ఐదు రోజులపాటు అంటే మంగళవారం, 25వ తేదీ వరకు జరుగుతుంది. ఖండాంతరాలకు ఎగిరిన రొట్టె బారాషహిద్ దర్గా కంటే రొట్టెల పండగ దర్గాగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. మొదట్లో వ్యాపారం, ఆరోగ్యం రెండు రొట్టెలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా కోరికల రొట్టెలు పెరిగాయి. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పడు ఉద్యోగం రొట్టె, ప్రమోషన్ రొట్టె, వ్యాపారం రొట్టె, ఆరోగ్యం రొట్టె, విద్య రొట్టె, రాజకీయ రొట్టె, సంతానరొట్టె, వీసా రొట్టెల ఇలా అనేకం ఉన్నాయి. ఉత్సవాల్లో స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకంగా ఒక్కో రొట్టెకు సంబంధించి ఒక్కో ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో, ఆయా ఘాట్ల వద్ద భక్తులు మార్చుకుంటారు. ముఖ్యంగా సంతానం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య రొట్టెలు లక్షల సంఖ్యలో భక్తులు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరాలని మొదటగా ఒకరు రొట్టె ఇస్తారు. దానిని స్వీకరించిన వారు వారి కోరిక నెరవేరగానే మరుసటి సంవత్సరం వచ్చి మళ్లీ వారు మొక్కు తీర్చుకుంటారు. ఏటా రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతోపాటు అరబ్ దేశాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. అధికార, ప్రతిపక్షనేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు వచ్చి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చాలని రొట్టెలు సమర్పిస్తుండటం విశేషం. ఎలా తయారు చేయాలంటే..? గోధుమ, బియ్యం పిండి కలిపి అర కిలోకు ఐదు రొట్టెలు వచ్చేలా సిద్ధం చేస్తారు. రొట్టెలపై ఏదైనా కూర ఉంచి స్వర్ణాల చెరువులోని నీటిలో నిలుచొని రొట్టెలను కావాల్సిన వారికి ఇస్తారు. ఉద్యోగం, పెళ్లిరొట్టెను బెల్లంతో కలిపి అందజేస్తారు. ఐదు రొట్టెలను ఏదైనా కోరికతో సిద్ధం చేసి ఒకటి ఇంట్లో ఉంచి మిగిలిన నాలుగు రొట్టెలను దర్గాకు తీసుకువచ్చి బారాషహిద్కు సమర్పించి స్వర్ణాల చెరువులో రెండు విడిచి మిగిలిన రెండింటిని కావాల్సిన వారితో మార్చుకుంటారు. బారా అంటే 12 షహీద్ అంటే అమరుడు అని అర్థం. మత ప్రబోధం చేస్తూ జరిగిన పవిత్ర యుద్ధం మరణించిన 12 మంది వీరులు ఒకే ప్రాంతంలో సమాధి కావడం ఇక్కడ విశేషం. 1751లో 12 మంది సౌదీ అరేబియాలోని మక్కా నుంచి భారత్‌కు మతప్రచారం నిమిత్తం వచ్చారు. బీజాపూర్ సుల్తాన్ కు, తమిళనాడు వాలాజా రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన 12 మంది సమాధుల ప్రాంతమే బారాషహిద్ దర్గా. అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రం పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు లేని విధంగా పూర్తి అటవీ ప్రాంతంగా, సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. అప్పటి ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్లలో ఒకరు ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆమెకు ఉపదేశించారు. తనకొచ్చిన స్వప్నాన్ని ఆర్కాట్ నవాబుకు ఆమె చెప్పగా వెంటనే భారీగా సైన్యంతో అటవీ ప్రాంతంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలను తమతో వచ్చిన పరివారానికి పంచి పెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు మెండుగా పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూభాగాన్ని దర్గాకు కేటాయించారు. ఏటా మొహర్రం కలిసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆనాడు మొదలైన ఈ ఉత్సవాలు ఈ విధంగా 266 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. – కాట్రపాటి కిశోర్, సాక్షి, నెల్లూరు -
నెల్లూరు: రొట్టెల పండుగ ప్రారంభం
-
నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ
-
రూ.కోటికి ఎసరు!
నెల్లూరు సిటీ: నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా ఐదు రోజుల పాటు రొట్టెల పండగ చేస్తున్నారు. ఈ ఏడాది 21 నుంచి 25వ తేదీ వరకు రొట్టెల పండగ జరగనుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు, సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు కోసం నగర పాలకసంస్థ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాలకవర్గం ఈ ఏడాది రొట్టెల పండగకు నెల రోజుల ముందు వరకు ప్రతిపాదనలు పేరుతో కాలయాపన చేసింది. రొట్టెల పండగకు 20 రోజులకు ముందు హడావుడిగా పనులు ప్రారంభించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా> సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దర్గా ఆవరణలో మొత్తం కిలో మీటరు మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. 20 రోజుల కిందట దర్గాలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి స్వర్ణాచెరువు వరకు 500 మీటర్లు సీసీ రోడ్డును నిర్మించారు. మరో 500 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు 10 రోజుల క్రితం మేయర్ అజీజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అధికారులు మాత్రం కేవలం 10 రోజుల ముందు సీసీ రోడ్డు నిర్మిస్తే తాము బలికావాల్సి వస్తుందని కమిషనర్ అలీంబాషాకు విన్నవిచుకోవడంతో ఆ పనులను వాయిదా వేశారు. పండగ సమీపిస్తున్నా కొనసాగుతున్న పనులు.. ఈ నెల 21వ తేదీ నుంచి రొట్టెల పండగ అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో బారాషహీద్ దర్గాకు వస్తున్నారు. పండగ సమీపిస్తున్నా కాంట్రాక్టర్లు పనులు చేస్తూనే ఉన్నారు. విద్యుత్ స్తంభాలు, ఫుట్‌పాత్ నిర్మాణం, చెట్లు ఏర్పాటు, ఘాట్ మరమ్మతులు ఇంకా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దర్గా వద్ద రూ.13 లక్షలతో నిర్మిస్తున్న ఫుట్‌పాత్ పనులను చేయడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తులు రద్దీ ఎక్కువైతే ఫుట్‌పాత్ నిర్మాణం పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫుట్‌పాత్ నిర్మాణంలో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఈ ఫుట్‌పాత్ ఎందుకు నిర్మించారో అని వచ్చిన భక్తులు ప్రశ్నిస్తున్నారు. రూ.1.20 కోట్లు నామినేషన్ కింద కేటాయింపు రొట్టెల పండగ ఏర్పాట్లు కోసం ఈ ఏడాది మొత్తం రూ.2.50 కోట్ల పనులకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. రూ.1.30 కోట్లు కార్పొరేషన్ రిసెప్షన్, సీసీరోడ్లు, ఫుట్‌పాత్‌లు, విద్యుత్ దీపాలు, శానిటరీ కార్మికులు ఇలా వివిధ రకాల పనులను టెండర్ రూపంలో కేటాయించారు. అయితే మరో రూ.1.20 కోట్లతో నామినేషన్ కింద హడావుడిగా పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అత్యవసరం పేరుతో ఇష్టారాజ్యంగా పనులను అధికార పార్టీ అనుచరులకు, అధికారులకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను గుట్టు చప్పుడు కాకుండా కేటాయించారు. దర్గా చుట్టూ స్టీల్ రైలింగ్, ఎలక్ట్రికల్ పనులకు రూ.31 లక్షలు, స్వర్ణాల చెరువులో మోటార్లు ఏర్పాటుకు, వాటర్ స్టాల్స్, చెట్లును ఏర్పాటు చేసేందుకు, టపాసులు, షామియానాలు, టెంట్లు, ఇతర మరమ్మతులకు రూ..52 లక్షలతో పనులు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి పండగ అనంతరం స్టాండింగ్ కమిటీ సభ్యులతో ఆల్‌పాస్ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాలక వర్గంలోనికి కీలక వ్యక్తి చెందిన ఓ వ్యక్తికి రెండు శాతం వాటాలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్టు సమాచారం. స్టాండింగ్ కమిటీ సభ్యులకు కూడా వాటాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీసీ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయండి స్వర్ణాల చెరువు వద్దకు నిర్మించిన సీసీ రోడ్డుకు వాటర్ క్యూరింగ్‌కు ఏర్పాటు చేసిన పెచ్చులు ఇంకా తొలగించకపోవడంపై కమిషనర్ అలీంబాషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సుబ్బరాజుకు బిల్లులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పండగ సమీపిస్తున్నా పనులు పూర్తిస్థాయిలో చేయకపోవడంపై కాంట్రాక్టర్ తీరుపై మండిపడ్డారు. అనంతరం దర్గా పరిసరాల్లో పనులను అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎస్ఈ రవికృష్ణంరాజుతో కలిసి పరిశీలించారు. -
మంత్రి సోమిరెడ్డిపై న్యాయవాదుల ఫిర్యాదు
నెల్లూరు లీగల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యంగ వ్యవస్థ అయిన కోర్టు ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు చేయటానికి కోర్టు ప్రాంగణాన్ని అనుమతి లేకుండా వినియోగించటం నిబంధనలకు పూర్తి విరుద్ధం అని పేర్కొంటూ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదును పంపారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కోర్టు నియమ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఈ నెల 15న మంత్రి సోమిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన అనంతరం మంత్రి సోమిరెడ్డి కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అది కూడా పూర్తిగా వ్యక్తిగత రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డిపైనే మాట్లాడారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో రాజకీయపరమైన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కోర్టు ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేలా వ్యవహరించటంతోపాటు కోర్టు విలువలను, నిబంధనలను పాటిం చకుండా ఉండటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించటం అధికార దుర్వినియోగం అవుతుందని, దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ప్రాంగణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్త పద్ధతికి తెరతీసి పవిత్ర న్యాయస్థానాలను అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీతో పాటు విలేకరుల సమావేశానికి సంబం« దించిన వీడియోలు, ఫొటోలను అందజేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుడుముల రవికుమార్, మురళీధర్‌రెడ్డి, పత్తి రాజేష్‌తో పాటు పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
సానుభూతి కోసం బాబు జిమ్మిక్కులు
నెల్లూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి నాన్‌బెయిలబుల్ వారంట్ ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..సానుభూతి కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు జగన్‌కు అనుకూలంగా వస్తుండటంతో చంద్రబాబు వెన్నులో భయం మొదలైందన్నారు. 2013 నుంచి 13 సార్లు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేస్తూనే ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు 35 సార్లు ఇదే కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని తెలిపారు. బీజేపీతో కలిసి ఉన్నపుడు వారెంట్ వస్తే అప్పుడు మభ్యపెట్టాడని, ఇప్పుడేమో నాన్ బెయిలబుల్ వారంట్ ఇస్తే కుట్ర చేసిందని వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కేసు వేసి కోర్టుకు వెళ్లాడు..అదే వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేసి చట్టాలపై ఆరోపణలు చేస్తాడని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. -
నెల్లూరులో సాక్షి మెగా ఆటో షో
-
త్వరలోనే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది
-
నెల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం
-
నెల్లూరులో వైఎస్ఆర్సీపీలో చేరిన యువకులు
-
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
నెల్లూరు(మినీబైపాస్) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడిన ఘటన ఎంజీబీ మాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బారకాస్ సెంటర్లో నివాసం ఉంటున్న రక్షిత్ తన కుమార్తెలు డోయల్(4), రేవా(3)తో ఎంజీబీ మాల్‌కు వచ్చారు. ఈ క్రమంలో మెయిన్ గేట్‌కు చేరుకునేసరికి వెనుక నుంచి తమిళనాడు రిజిస్ట్రేషన్ గల స్విఫ్ట్ కారు మితిమీరిన వేగంతో వస్తూ ఢీకొంది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు వేగానికి నిలిపి ఉన్న పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. కారులో ఐదుగురు ఉన్నారని, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారయ్యాడని, అతను మద్యం సేవించి ఉన్నాడని బాలికల తండ్రి తెలిపాడు. కాగా మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుండగా, కారులోని ఓ మహిళ దుర్భషలాడి దాడికి యత్నించారు. -
ఎంజీబీ మాల్ వద్ద కారు బీభత్సం
-
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం లక్ష్యంగా తన వంతు పనిచేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, ముఖ్యనేతల సమన్వయంతో సమష్టిగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కోటనరవలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ రామ్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితో పాటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేదురుమల్లి వర్గీయులు పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి నేదురుమల్లి వర్గీయులు భారీ ర్యాలీగా విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి ముఖ్య అనుచరులు దామోదర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ద్వారకానా«త్, సుధాకర్‌నాయుడు, రామయ్యనాయుడు, ఎల్ కోటేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోసం జనం ఎదురు చూపు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం 13 జిల్లాల్లోని ప్రజలు ఎదురు చూస్తున్నారని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పూర్వకాలంలో రాజులు దేశాటన చేసి పరిస్థితులను అవగతం చేసుకుని పట్టాభిషిక్తులు అయిన తర్వాత ఆ దేశ ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకునే వారన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు నమ్మకం, అభిమానం ఉన్నాయని, అవే ఆయన్ను పట్టాభిషిక్తుడిని చేస్తాయని తెలిపారు. గతంలో అనుభవజ్ఞుడన్న కారణంతో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని, ఆయన అన్నీ వర్గాలను వంచించారని తెలిపారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నేదురుమల్లి అభిమానుల అభీష్టం మేరకు వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, నేదురుమల్లి అభిమానులు చేరడంతో ఇంకా తిరుగులేని శక్తిగా మారిందన్నారు. -
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం
-
సిఫార్సు ఉంటేనే!
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.5 లక్షల సబ్సిడీ జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. రథాల రాజకీయం గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కనుసన్నల్లో జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చేస్తున్నాం మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్‌నాయుడు, యనమదల, చేజర్ల మండలం అర్హులకు అందడం లేదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల -
పొట్టకూటి కోసం వెళ్తుండగా..
చిట్టమూరు(నెల్లూరు): ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్‌ను తప్పించే క్రమంలో రొయ్యల కంపెనీ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడడంతో పొట్టకూటి కోసం కంపెనీలోకి పనికి వెళ్తున్న 29 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మల్లాం సమీపంలో ఆదివారం వేకువన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కోట మండలం చెందోడు వద్ద ఉన్న సాగర్ గాంధీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీవీఆర్) రొయ్యల కంపెనీలో పనికి వాకాడు మండలం వాలమేడు, వైట్ కుప్పం తదితర గ్రామాలకు చెందిన మహిళా కూలీలు నిత్యం వెళ్తుంటారు. రోజూలాగే ఆదివారం వేకువన 29 మంది మహిళలు కంపెనీ వ్యాన్‌లో పనికి బయలుదేరారు. మండలంలోని తిరుమూరు గ్రామానికి వెళ్లే మలుపు వద్దకు వ్యాన్ వచ్చేసరికి ఎదురుగా మోటారు సైకిల్ వచ్చింది. డ్రైవర్ మోటారు సైకిల్‌ను తప్పించబోగా వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడి పోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని 29 మంది మహిళలు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మహిళల అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలు పాలైన వారిని వ్యాన్‌లో నుంచి బయటకు తీసి ఆటోల్లో మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. 108కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన గంట తర్వాత రెండు 108 వాహనాలు మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం గూడూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మహిళలను నెల్లూరు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. చిట్టమూరు ఎస్సై వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. వ్యాన్ డ్రైవర్‌ను విచారించి వివరా>లు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరిమితికి మించి కూలీలను ఎక్కించడంతోనే.. జీవీఆర్ కంపెనీకు చెందిన వ్యాన్ సీటింగ్ కెపాసిటీ 15 మంది కాగా, పరిమితికి మించి ఎక్కించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన కూలీలకు వైద్యం అందించి కంపెనీ ఆదుకోవాలని కోరారు. -
మరపురాని మహానేత
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు, అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భౌతికంగా వైఎస్సార్ దూరమైనా ఎల్లప్పుడూ తమ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఎప్పటికీ మరపురాని మహానేతగా నిలిచిపోతారన్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు(సెంట్రల్) : కావలిలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ మరణించి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎన్నటికీ మరచిపోలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట పట్టణం, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు కృషి చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉందామన్నారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ చూపి న అడుగుజాడల్లో నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలసి పనిచేద్దామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. గూడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో సమన్వయకర్త మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ లాంటి ప్రజాసంక్షేమ పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహానేత రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్‌కు గుర్తుగా జగనన్నకు తోడుగా ఉందామన్నారు. మహానేత మన మధ్య లేక పోయినా ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరవలేమన్నారు. ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో స్థానిక వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కరెంటు ఆఫీçసు సెంటర్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు, నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఖర్జూరం ప్రత్యామ్నాయం
భూ నైసర్గిక స్వరూపంతో పాటు సాగునీటి వనరుల దృష్ణ్యా మెట్ట ప్రాంత రైతులకు నిమ్మసాగు అనివార్యమైంది. ధరల ఆటు పోటులతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా.. ఈ భూముల్లో ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక పంట మరొకటి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖర్జూరం సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలమేనని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దీంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖర్జూరం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే సిరులు పండించవచ్చు. గూడూరు (నెల్లూరు): జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలైన గూడూరు, చిల్లకూరు, సైదాపురం, డక్కిలి, ఓజిలి, బాలాయపల్లి, వెంకటగిరి, పొదలకూరు, రాపూరు, చేజర్ల తదితర మండలాల్లో ప్రస్తుతం సుమారు 25 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. నిమ్మ సాగు చేయాలంటే ఫలసాయం కోసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాగు చేసి, కాపుకొచ్చే సమయంలో ధరలు ఉండక రైతులు అప్పులపావుతున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో నీటి వనరులు, భూముల పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ పంటలు లేక నిమ్మ సాగే అనివార్యమైంది. ఇదే నీటి వనరులు ఉన్న కరువు సీమలైన ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లోని ఎందుకూ, ఏ పంట సాగుకూ పనికిరాని చవుడు భూముల్లో సైతం ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం సాగు చేస్తూ రైతులు లాభాల బాటన నడుస్తున్నారు. పెట్టుబడులు అధికమే.. నాలుగేళ్లకే దిగుబడులు నిమ్మ పంటతో పోల్చితే ఖర్జూరం కూడా ఫలసాయం సమయం దాదాపు సమానంగానే ఉంది. టిష్యూ రకం నిమ్మ మొలక సుమారు రూ.10 మాత్రమే ఉంటుంది. కానీ ఖర్జూరం మొక్క అయితే మాత్రం టిష్యూ రకం ఒక్కొక్కటి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ ఉంటుంది. అదే తరహాలో ఫల సాయం కూడా వస్తున్నట్లు సాగు చేసిన రైతులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలుతో పాటు భూమిని చదును చేయడం, డ్రిప్, ఎరువులు, కూలీలు ఇతర ఖర్చులకు ప్రారంభంలో ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. రెండో సంవత్సరం నుంచి కూడా ఏడాదికి ఎకరానికి సుమారు రూ. లక్ష లోపే ఉంటుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి కూడా ఎకరానికి ఏడాదికి సుమారు రూ. 4 లక్షలకు పైగానే ఆదాయం 40 నుంచి 50 ఏళ్ల వరకూ ఫలసాయం అందుకోవచ్చని సాగు చేస్తున్న రైతులే అంటున్నారు. ఎకరానికి 60 నుంచి 80 వరకూ మొక్కలు నాటాలి. వాటిలో కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూరం మొక్కలుండేలా చూసుకోవాల్సి ఉంది. మూడేళ్ల పాటు జాగ్రత్తగా మొక్కలను నాలుగో ఏట కాపునకు వస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ పైన, మార్చి 15వ తేదీ లోపుగా చెట్లు పూత దశకు వస్తాయి. ఈ క్రమంలో పూతకు నెల ముందుగా నీటిని పెట్టకుండా ఆపేయాలి. అప్పుడే వాడి పూత ఎక్కువగా పూసే వీలుంటుంది. టన్ను ఖర్జూరం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఎకరం ఖర్జూరం సాగు చేస్తే నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి కనిష్టంగా 3.5 టన్నుల నుంచి గరిష్టంగా 5 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. దీంతో ఫల సాయం సుమారు ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్జూరం సాగు చేస్తే హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చవుడు భూములు ఖర్జూరం సాగుకు అనువే నల్గొండ ప్రాంతంలో ఎందుకూ పనికిరాని చవుడు భూముల్లో కూడా ఖర్జూరం సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. చవుడు భూముల్లో ఈత మొక్కలు మొలిచి ఉండడాన్ని గుర్తించిన రైతు, అక్కడి రైతులు కూడా విస్మయం చెందేలా ఫలసాయాన్ని పొందుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు. అవగాహన కల్పిస్తే మంచిది నేను 3 ఎకరాల్లో నిమ్మ తోట సాగుచేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి, నీటి వసతి కోసం బోర్లు వేసేందుకు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది రూ.2 లక్షల వరకూ నష్టపోయా. అవగాహన కల్పించి సాగుకు రాయితీలు ఇస్తే ఖర్జూరం సాగు చేస్తాం. – ఎన్.పెంచలయ్య, రైతు, అక్కమాంబాపురం, రాపూరు మండలం ప్రత్యామ్నాయ పంటలే దిక్కు నిమ్మ తోటలకు ప్రత్యామ్నాయ పంట వస్తే నిమ్మ రైతులందరూ ముందుకొస్తారు. మెట్ట ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తే ఖర్జూరం వంటి పంటలు సాగు చేపడుతాం. – కె.పెంచలనరసయ్య, రైతు, చీకవోలు, సైదాపురం మండలం ప్రోత్సాహం అందిస్తే సాగు చేస్తాం డ్రిప్‌కు రాయితీతో పాటు, బోర్లు వేయడంతో పాటు, ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వం రుణాలు అందజేస్తే ఖర్జూరం సాగుకు సిద్ధమవుతాం. ప్రయోగం చేయాలంటే అది ముందుగా ఉద్యాన శాఖ ద్వారా జరిగితేనే మంచిది. – జి.భాస్కర్‌రెడ్డి, రైతు, వెడిచర్ల గూడూరు మండలం సాగుకు సిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు జిల్లాలోని భూములు కూడా ఖర్జూరానికి అనువైనవే. ఎవరైనా రైతులు ఖర్జూరం సాగు చేసేందుకు సంసిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు పంపుతాం. రైతులు ముందుకు వస్తే శాఖా పరమైన సహకారం అందజేస్తాం. – అనురాధ, ఉద్యాన శాఖ ఏడీ -
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్‌లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
సివిల్ ఇంజినీర్ దారుణహత్య
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్‌గోపి (25) అనే యువకుడిని మేనకూరు సేజ్ పరిధిలో కోనేటి రాజుపాళెం సమీపంలో దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ బీటెక్ (సివిల్) పూర్తి చేశాడు. తమ ప్రాంతానికి చెందిన యార్ల తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఓ కాంట్రాక్ట్‌కు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెంలో ఉన్నాయని, అక్కడ సిబ్బందితో కలిసి పనిచేయాలని కాంట్రాక్టర్ అతడికి చెప్పాడు. గోపి ఈనెల 22వ తేదీన నాయుడుపేటకు చేరుకున్నట్లు ఆరోజు రాత్రి తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 23న గోపికి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్‌ను కలిసి తన కుమారుడు ఫోన్ పనిచేయడంలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ కోనేటిరాజుపాళెం వద్ద తేజ అనే సూపర్వైజర్ ఉన్నాడని, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో గోపి కుటుంబసభ్యులు ఈనెల 25వ తేదీన కోనేటిరాజుపాళెం చేరుకుని విచారించగా సురేష్‌గోపి ఇక్కడకు రాలేదని తేజ వారికి చెప్పాడు. దీంతో వారు భయాందోళనకు గురైన అతని మేనమామ సిరిగిరి శ్రీనివాసులు అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు యువకుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పూడ్చిపెట్టారు గోపి అదృశ్యమైన విషయమై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు సారథ్యంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జి.వేణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు యువకుడిని అక్కడ పనిచేస్తున్న ఎవరో హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టినట్లుగా తెలుసుకున్నారు. దీంతో డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు సంస్థ సమీప ప్రాంతాల్లో బుధవారం తవ్వకాలు చేపట్టారు. ఓ చోట దుర్వాసన వస్తుండటంతో తవ్వించారు. యువకుడి మృతదేహం బయటపడింది. కాగా గోపి కనిపించకుండా పోయినరోజు నుంచి అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో హత్య వెనుక వారి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గోపి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
హరికృష్ణ మృతి.. కళ్యాణమండపంలో విషాద ఛాయలు
సాక్షి, నెల్లూరు : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతితో నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ ఆకస్మిక మరణవార్త విని ఆయన మిత్రుడు మోహన్ దిగ్ర్భాంతికి గురయ్యారు. తన కుమారుడి పెళ్లికి వస్తాడనుకున్న హరికృష్ణ దుర్మరణం చెందారని తెలిసి భోరున విలపించారు. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. నెల్లూరు జిల్లా కావలిలో జరగనున్న తన స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న హరికృష్ణ కారు అన్నెపర్తి వద్ద అదుపు తప్పి ముందు వాహనాన్ని ఢికొట్టింది. అనంతరం డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. తీవ్రగాయాలైన హరికృష్ణను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని వార్త విన్న మోహన్,అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సీఎస్సార్ నిధులకు ఎసరు!
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద ప్రాజెక్ట్‌లు ఖర్చు చేయాల్సిన నిధులకు తాళాలు పడ్డాయి. సీఎస్సార్ నిధులు ఖర్చు చేసే బాధ్యతలను ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్వాహకుల నుంచి తొలగించింది. నిధులు వ్యయం చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అటకెక్కాయి. అభివృద్ధి పనులు పడకేశాయి. ముత్తుకూరు(నెల్లూరు): రాష్ట్ర రాజధాని అమరావతిలో జూన్ 26వ తేదీన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, థర్మల్ ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎస్సార్ నిధులను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చే ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహించే దిక్కులేక మూతపడ్డాయి. మరికొన్ని ప్లాంట్లలో అభివృద్ధి పనులు పడకేశాయి. మూతపడ్డ ఆర్వో వాటర్ ప్లాంట్లు ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసిన 13 ఆర్వో వాటర్ ప్లాంట్లల్లో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన ప్లాంట్ల నిర్వహణకు తలపెట్టిన టెండర్లను రద్ధు చేయడంతో ఇవి కూడా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లకు కేంద్రంగా ఉన్న నేలటూరు పంచాయతీలోని టైడు వాటర్ ప్లాంట్లు మూతపడడం విశేషం. ఇవి కాకుండా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటైన ఆరు ప్లాంట్లల్లో మూడు మూతపడ్డాయి. మూత పడ్డ ఆర్వో ప్లాంట్లు, ప్రజల కష్టాలు పట్టించుకునే అధికారులు, నాయకులు కరువయ్యారు. తాగునీటి కోసం అల్లాడిపోయే ప్రజలు ప్లాంట్ల పరిస్థితి వివరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మినరల్ వాటర్‌ను తాగేందుకు అలవాటు పడ్డ పేదలు ప్రస్తుతం నీళ్ల క్యాన్లు కొనుగోలు చేయలేక అల్లాడిపోతున్నారు. సీఎస్సార్ నిధుల వ్యయానికి ఫుల్స్టాప్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌లు తమ ఆదాయంలో రెండు శాతం నిధులను ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. సెమ్కార్ఫ్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు రూ.25 కోట్ల మేరకు సీఎస్సార్ నిధులు వ్యయం చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు ఆంక్షలు పెట్టిన తర్వాత నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు రూ.2 కోట్ల సీఎస్సార్ నిధులను ఇటీవల కలెక్టర్‌కు డిపాజిట్ చేశారు. దీంతో చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌కు కనీసం ప్రతిపాదనలు పంపించే అధికారం కూడా తమకు లేదని జెన్కో ఇంజినీర్లు స్పష్టం చేశారు. బడి చుట్టూ ప్రహరీగోడ, స్కూల్ ముందు నీళ్ల బోరు ఏర్పాటు చేసే అధికారం కూడా కోల్పోయామన్నారు. రూ.కోట్లు ఉన్నా..గుక్కెడు నీళ్లు లేవు సామాజిక బాధ్యత నిధులను ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు కలెక్టర్‌కు డిపాజిట్ చేయడంతో తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను రిపేరు చేయించే దిక్కు లేకుండా పోయింది. తాగునీటి కోసం తీరప్రాంత గ్రామాల్లో అలజడి మొదలైంది. పనులు కోసం ప్రజలు పదే పదే కలెక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. స్థానికంగా నెలకొన్న ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేది ప్రశ్నార్థకమైంది. కనీసం తాగునీటి కష్టాలు తొలగించేందుకైనా అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలి. మూతపడ్డ ఆర్వో ప్లాంట్లను తెరిపించాలి. మిగిలిన ప్లాంట్లు మూతపడకుండా చర్యలు తీసుకోవాలి. –నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు ఆర్వో ప్లాంట్లు మూతపడ్డాయి నేలటూరు పంచాయతీలో ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు అన్నీ మూతపడ్డాయి. జెన్కో ఇంజినీర్లకు ఈ సమస్యను తెలియజేశాం. సీఎస్సార్(సామాజిక బాధ్యత) నిధులు కలెక్టర్‌కి ఇచ్చేశాం, రిపేరు చేయించలేము అని ఇంజినీర్లు బదులిచ్చారు. తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. నెల్లూరులో జేసీని కలసి, ఆర్వో ప్లాంట్ల సమస్య చర్చించాం. –ఈపూరు కోటారెడ్డి, నేలటూరు. ప్రాజెక్ట్‌లే ప్లాంట్లు నిర్వహించాలి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయని విషయం సోమవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. సీఎస్సార్ నిధులు కలెక్టరేట్లో డిపాజిట్ చేసినప్పటికీ ఆర్వో ప్లాంట్ల బాధ్యత ప్రాజెక్ట్‌లే నిర్వహించాలని, ప్లాంట్లను రిపేరు చేయించాలని కలెక్టర్ సూచించారు. –మునికుమార్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ -
మైనార్టీ సదస్సు పట్టని నేతలు
అధికార పార్టీ నేతలు జనసమీకరణను తుస్ మనిపించారు. ‘నారా హమారా. టీడీపీ హమారా’ పేరుతో తెలుగుదేశం పార్టీ గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభకు జిల్లా నుంచి జనసమీకరణ చేయటంలో ముఖ్య నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పర్యావసానంగా వందల బస్సులు అని చెప్పి చివరకు పదుల సంఖ్యలో బస్సులు వెళ్లటం, దానిలో కూడా మైనార్టీలతో పాటు పార్టీ కార్యకర్తలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైనార్టీ సదస్సుకు జిల్లా నుంచి జనసమీకరణ, ఇతర బాధ్యతలు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో, మైనార్టీ ఓటింగ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించి అక్కడ సభ పోస్టర్ ఆవిష్కరణలు, సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వారం నుంచి సభకు తరలిరావాలని పిలుపునివ్వటంతో పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అయితే మంగళవారం మాత్రం ఆ మేరకు ఎక్కడా జనం కనిపించని పరిస్థితి. జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ జనసమీకరణను పూర్తిగా గాలికొదిలేశారు. నెల్లూరు నగరం నుంచి మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోవటం గమనార్హం. ఇక జిల్లాలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాత్రం అట్టహసంగా నగరం నుంచే వందకు పైగా బస్సులు, జిల్లా నుంచి 235 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. తీరా జనాలు లేకపోవటంతో 50 బస్సులు కూడా పూర్తిగా వెళ్లని పరిస్థితి. జిల్లాలో మైనార్టీల ఓటింగ్ గణనీయంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌లో అధికంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాలోనూ అధికంగా ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీల ఓటింగ్ ఉంది. ఈ క్రమంలో జిల్లా నుంచి కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా సభకు తరలించాలని పార్టీ రాష్ట్ర నేతల ఆదేశం. అయితే ఈ మేరకు నేతలు ప్రకటనలు చేసి హడావుడి చేశారు కానీ మైనార్టీలను పూర్తిస్థాయిలో రప్పించలేకపోయారు. మంగళవారం ఉదయం నగరంలో వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో బస్సులను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో సగం బస్సులు కూడా నిండని పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో బస్సులను డిపోలకు వెనక్కి పంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొన్ని బస్సులు కదలిని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ మైనార్టీ సదస్సుకు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం గమనార్హం. -
ఆధార్ అవస్థలు
ఆధార్ కార్డులో చిరునామాల మార్పు, తప్పులను సరిచేసుకునేందుకు ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పలు కేంద్రాల వద్ద సర్వర్లు మొరాయిస్తుండటంతో ఆయా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్నారుల ఫింగర్ ప్రింట్స్, ఫొటోల అప్లోడ్ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నెల్లూరు(వేదాయపాళెం): గతంలో ఆధార్, మీ సేవ కేంద్రాల వద్ద ఆధార్ కార్డులో మార్పులు, సవరణలు చేసేవారు. ఆధార్ కేంద్రాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కొంతకాలంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ఆధార్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో కేవలం రెండు మీ సేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ రెండు కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్ చొరవతోనే సాగుతున్నాయి. జిల్లాలోని పలు పోస్టాఫీసులు, పలు బ్యాంక్‌లలో ప్రత్యేకంగా ఆధార్ సేవా విభాగాలను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కేంద్రంలోని గాంధీబొమ్మ సమీపంలో సండే మార్కెట్ వద్ద, నెల్లూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రాలు కొనసాగుతుండేవి. సండేమార్కెట్ వద్ద ఉన్న కేంద్రాన్ని నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న ఆధార్ కేంద్రాన్ని సమీపంలోని ఎస్బీఐలోకి మార్పు చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద మాత్రమే ఆధార్ సేవలు అరకొరగా అందుతున్నాయి. పడిగాపులు బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ విభాగాల వద్ద సర్వర్లు తరచూ మొరాయిస్తుండటంతో అక్కడకెళ్లేవారు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆధార్ సేవలను పొందాలనుకునేవారు 40 నుంచి 50 మంది ఒక్కొక్క కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద 15 దరఖాస్తులు మాత్రమే అందజేసి ఆరోజు వాటా అయిపోయిదంటూ మిగిలిన వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేయించుకోవాలని వచ్చిన వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు ఒకే కుటుంబంలో వారికి రెండు, మూడు దరఖాస్తులు కావాల్సిన వారు పనులను వదులుకుని పదే పదే కౌంటర్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల వివిధ కులాలకు చెందిన వారికి సబ్సిడీ రుణాలను మంజూరు చేశారు. వీరికి ప్రస్తుతం ఉన్న చిరునామాతో ఆధార్ కలిగి ఉండాలి. చాలమందికి గతంలో నివాసం ఉన్న చోటే ఆధార్ ఉంది. ప్రస్తుతం చిరునామా ప్రకారం ఆ«ధార్‌లో సవరణ చేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సకాలంలో సవరణలు జరిగితే తప్ప బ్యాంక్‌లలో డాక్యుమెంటేషన్ కార్యకలాపాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి నగదు, బ్యాంక్‌లలో జమ అయ్యేందుకు అకౌంట్లు ఓపెన్ చేసుకునేందుకు ఆధార్ ఫింగరింగ్ తప్పనిసరిగా మారింది. హైస్కూల్ విద్యార్థులకు ఈ సమస్య ఇబ్బంది కలిగిస్తోంది. చిన్నతనంలో తీసిన ఆధార్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత ఫింగరింగ్ను నమోదు చేయాలనే నిబంధన విద్యాశాఖలో, బ్యాంకుల్లో నెలకొని ఉంది. ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఇద్దరు చొప్పున ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు. ప్రాజెక్టు వర్క్‌ను బట్టి రూ.5 వేలు, రూ.10 వేలు చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ తంతు కొనసాగాలంటే బ్యాంకులలో అకౌంట్లు ప్రారంభించి ఉండాలి. ఆధార్ ఫింగరింగ్ ఉంటే తప్ప బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడం వీలుకాదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. ఆధార్ కౌంటర్ల వద్ద తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అవస్థలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద తమ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకునేందుకు వచ్చే విద్యార్థులు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. మహిళలు చిన్నపిల్లలతో పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. –కె.వెంకటేశ్వర్లు, నెల్లూరు తీవ్ర జాప్యంతో ఇబ్బందులు బ్యాంక్‌లు, పోస్టాఫీ సులవద్ద ఏర్పాటు చే సిన ఆధార్ సేవా కేం ద్రాల వద్ద తరచూ స ర్వర్ డౌన్ కావడంతో కార్డుల్లో మార్పులు చేయించుకునేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. –సైదాపురం సతీష్, నెల్లూరు సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం ఆధార్ కేంద్రాల వద్ద సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. సర్వర్ డౌన్ అనేది మా పరిధిలో ఏమి చేయలేం. కేంద్రాల వద్ద దరఖాస్తులు ఎక్కువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. –డి.హరిత, ఆర్డీఓ, నెల్లూరు -
మంత్రి అండతో కోనేరు ఆక్రమణకు యత్నం
సూళ్లూరుపేట (నెల్లూరు): మండలంలో డేగావారికండ్రిగలో సుమారు 1.36 ఎకరాల కోనేరు, ఆర్అండ్బీ రోడ్డు స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి సిఫార్సులతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన డేగా అనే ఇంటిపేరు కలిగిన జమీందార్లుగా ఉండేవారు. వారి ఇంటిపేరుతోనే ఆ గ్రామానికి కూడా డేగావారికండ్రిగ అనే వచ్చిందని ›గ్రామపెద్దలు చెబుతున్నారు. జమీందార్లకు సంబంధించి భూములను అంతా అమ్ముకుని వెళ్లారని, ప్రస్తుతం గంగమ్మ, వినాయకుడి గుడికి వెళ్లే రోడ్డు ఈ ఆలయాల ముందున్న కోనేరు కూడా తమదేనని డేగా కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి దీన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే చేశారు గతంలో కూడా కోనేరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినపుడు సర్వే కూడా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. సర్వే నంబర్ 157, 157–2ఏ, 157–2బీ, 157–2సీలో సుమారు 1.36 ఎకరాల భూమి దాకా కోనేరు, ఆర్అండ్బీ రహదారి అని రెవెన్యూ రికార్డులో ఉంది. తన వద్ద రికార్డు ఉందని ఈ భూమి తమది అని కరుణాకర్‌రెడ్డి జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, అధికారపార్టీ నేతల అండదండలతో మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు. ఈ వివాదం చాలాకాలంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మంత్రి సిఫార్సులతో రెవెన్యూ «అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఆలోచనలో కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ భూమి డేగా వారిది కాదని, కోనేరు, ఆర్అండ్బీ రహదారికి రికార్డులో నమోదై ఉందని, పైపెచ్చు ఈ ప్రాంతంలో గంగమ్మ ఆలయం, వినాయకుడి గుడి ఉండటంతో ఈ రెండు ఆలయాలకు వెళ్లేందుకు దారి అవసరానికి, అలాగే కోనేరుకు మరమ్మతులు చేయించి బాగుచేస్తే పదిమందికి ఉపయోగపడేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ స్థలం గ్రామానిదే కోనేరు, రోడ్డు స్థలం గ్రామానికి సంబంధించినదే. డేగా వాళ్లు ఈ గ్రామంలో జమీందార్లుగా ఉన్నమాట వాస్తవమే. వాళ్లు ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుని వెళ్లారు. ఈ పొలం తమది అని జమీందార్లు అన్నపుడు దీనిపై సర్వే చేయించాం. అది పూర్తిగా ఆర్అండ్బీ రోడ్డు, కోనేరుకు చెందిన స్థలం అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు స్థలం తనది అని కరుణాకర్‌డ్డి రావడం సమంజసం కాదు. మంత్రి సిఫార్సులతో ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలి. –ఎల్.రమ్మణయ్య, మాజీ సర్పంచ్, డేగావారి కండ్రిగ స్థలాన్ని కాపాడుతూ వచ్చాం చిన్నప్పటినుంచి కోనేరు పక్కనే ఉన్న చెట్టుకు నీళ్లుపోసి కాపాడుతూ వచ్చాం. ఈ పొలం ఏ మాత్రం డేగా వారిది కాదు. వినాయకుడి గుడికి, గంగమ్మ గుడికి వెళ్లే దారి కావడం, దీనికి పక్కనే కోనేరు ఉండటం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కోనేరు గురించి ఆలనా పాలనా చూసుకోకపోవడంతో అది పూడిపోయింది. ప్రస్తుతం దీన్ని స్థలంగా చూపించి అక్రమించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. –పుట్టు వెంకటాద్రి, డేగావారి కండ్రిగ -
వరదలొస్తే ఏం చేస్తారు?
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెన్నానది పక్కనే అపార్టమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఒకవేళ వరదలొస్తే ఏం చేస్తారు?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు’ అని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఆయన నెల్లూరులోని 54వ డివిజన్లో జానర్దన్రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నదికి వరదొస్తే ఎంతమేర తాకిడికి గురవుతుందని అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. నది పక్కనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను çస్టడీ చేసి వరద తాకిడి లేని ప్రాంతంతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సందర్బంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రవాహం వచ్చి వరదల తాకిడికి గురై ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూసార పరీక్షలను ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రయివేట్ సంస్థలతో చేయించారని బుగ్గనకు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు పెన్నానది పరీవాహక ప్రాంతం కాకపోతే పక్కనే నివాసాలు ఏర్పరచుకుని ఉన్న వందలాది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వరదలొస్తే అపార్ట్మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇళ్ల కోసం వినతి జనార్దన్‌రెడ్డికాలనీలో హిజ్రాల సంఘ నాయకురాలు అలేఖ్య సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రవిచంద్రకు ఇళ్ల స్థలాల కోసం వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ 44 మంది పేద హిజ్రాలకు ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఇంకా ఇళ్లు కేటాయించలేదని వారి దృష్టికి తెచ్చారు. ఆదిత్య నగర్లో పర్యటన నెల్లూరు(సెంట్రల్): నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కమిటీలో సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అప్పలనాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులతో ప్రజల అవస్థలు రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు సుదీర్ఘకాలంగా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గుంటలు తవ్వి పూడ్చకుండా పనులు చేస్తుండటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటలు తవ్విన స్థానంలో వేసిన రోడ్లు కూడా ఇళ్లున్న వాటికంటే ఎత్తులో ఉండటంతో వచ్చే సమస్యలను ప్రజలు తెలియజేశారన్నారు. పబ్లిక్‌హెల్త్ అధికారులు ఇటువంటి వాటిని గుర్తించాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో పబ్లిక్‌హెల్త్ అధికారులు పెద్ద నగరాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవగాహనతో పనులు చేయవచ్చన్నారు. అయితే అందుకు భిన్నంగా అధికారులు నెల్లూరులో వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెన్నా నది ఒడ్డునే పెద్ద నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు సంభవిస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అధికారులు చెప్పలేపోవడం దారుణమన్నారు. అనంతరం చైర్మన్ జనార్దన్‌రెడ్డికాలనీలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. దాని పనితీరు, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ (వైఎస్సార్సీపీ), కె.అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా పలు శాఖల అధికారులున్నారు. -
ఫిషింగ్ హార్బర్‌పై.. నయాడ్రామా
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు విషయంలో నాలుగేళ్లపాటు మత్స్యకారులను ఊరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సగం నిధులు మంజూరు చేస్తామన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో హడావుడిగా కేంద్రానికి నివేదికను పంపారు. అయితే దీనిని కేంద్రం తిరస్కరించింది. ‘‘మేము ఎప్పుడు పంపమన్నాం.. మీరు ఎప్పుడు పంపారు.. ఇప్పుడిస్తే నిధులు ఇవ్వం’’ అంటూ డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపేసింది. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారపార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. మత్స్యకారులను మరోసారి మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా హార్బర్‌ను నిర్మిస్తుందన్న కొత్త డ్రామా మొదలెట్టింది. రూ.50 కోట్లతో పనులు ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంది. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. కావలి (నెల్లూరు): సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేట్ పోర్టు నిర్మాణం కోసం తొలగించింది. వేరే ప్రాంతంలో హార్బర్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి స్థల అన్వేషణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గడిపేసింది. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం వద్ద íఫిషింగ్ హార్బర్ నిర్మించాలని, ఏడాదిన్నర క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.244 కోట్లతో తొలి దశలో నిర్మించాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.122 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు ప్రారంభిస్తే మూడేళ్లకు కానీ పూర్తి కాదు. అయితే అధికార టీడీపీ నేతలు ఈ పనులను ఎన్నికల వాతావరణంలో ప్రారంభించేలా చేయడానికి కాలయాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని మత్స్యకారులు అవస్థలు పడుతూ నష్టపోతున్నారు. తరలుతున్న మత్స్యసంపద 169 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న జిల్లాలోని 12 మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులే 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో లక్ష మంది చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ప్రత్యక్షంగా లక్ష మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో లక్ష మందికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. జిల్లాలో మెకనైజ్డ్ బోట్లు అధికారికంగా, అనధికారికంగా కలిపి 7,000 ఉన్నాయి. అలాగే కొయ్య తెప్పలు 4,000, పెద్ద బోట్లు 20 ఉన్నాయి. ఒక్కో దాంట్లో కనీసం ముగ్గురు నుంచి 10 మంది వరకు చేపల వేట చేస్తారు. వీరు ఒడ్డుకు తెచ్చే మత్స్యసంపద ఏడాదికి 75 వేల టన్నులు ఉంటుంది. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే జిల్లాలోని మార్కెట్లకు తరలుతోంది. మిగిలిన మత్స్యసంపద అంతా కూడా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతోంది. అయితే ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో మత్స్య సంపదను తీరంలో దించుకోవడానికి అనువైన ప్రదేశాలు లేవు. అలాగే మంచి ధరలకు అమ్మకాలు చేయడానికి వ్యాపారులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడవలు, బోట్లలను ప్రకాశం జిల్లాలోని వాడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సివస్తోంది. దీని వల్ల సమయం, డీజిల్ ఖర్చు పెరగడం, సొంత ఊర్లకు రావాలంటే బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు తప్పడం లేదు. దీనివల్ల మత్స్యకారులు దళారుల చేతిలో అన్ని రకాలుగా నష్టపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ దమననీతి జిల్లాలోని మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరుతుండడం, కేంద్ర ప్రభుత్వం తన ‘సాగరమాల’ పథకంలో భాగంగా జిల్లాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరుకు పచ్చ జెండా ఊపింది. అయితే సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ‘వాప్కోస్ లిమిటెడ్’ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నివేదికను తయారు చేయించింది. ఆ నివేదికను అధికారికంగా తీసుకున్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదని జిల్లాలోని మత్స్యకారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిఉంటుందని అధికార టీడీపీ నాయకులు భావించారు. అందుకే ఏడాదిన్నర క్రితం ‘వాప్కోస్ లిమిటెడ్’ జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సమగ్ర అధ్యయనంతో కూడిన నివేదికను సిద్ధం చేసినప్పటికీ దానిని గోప్యంగా ఉంచి గత సెప్టెంబర్ నెలలో నివేదిక అందినట్లుగా వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో సమర్పించి నిధులు మంజూరు చేయమని కోరలేదు. నివేదికను సమర్పించగానే కేంద్ర తన వాటా నిధులను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని నివేదికను న్యూఢిల్లీకి పంపలేదు. వచ్చే ఏడాది జనవరి నెల తర్వాత నిధులు మంజూరయ్యేటట్లుగా చేసి, టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికార టీడీపీ నాయకులు తలపోస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడే వేళ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్లుగా జిల్లాలోని మత్స్యకారులను మభ్యపెట్టి ఓట్లు పొందాలనే దమననీతిని అవలంభించారు. అది బెడిసికొట్టింది. అధికార టీడీపీ నాయకుల కుయుక్తుల వల్ల జిల్లాలో మత్స్యకారుల ఆర్థిక ఉన్నతికి దోహదపడే ఫిషింగ్ హార్బర్ అటకెక్కింది. -
వసతి..వ్యథే..!
సంక్షేమ హాస్టలే తమ ఇల్లని సంబరపడ్డారు. అధికారులే తమ సంరక్షకులని భావించారు. హాస్టల్ అధికారులే పెద్ద దిక్కని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. తిండి సరిగా లేదు. ఫ్యాన్ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. ఆరుబయట స్నానాలు, అరకొర అద్దె భవనాలు, మెనూ పాటించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు సంక్షామానికి గురయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. హాస్టళ్ల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం. నెల్లూరు రూరల్: పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్న వాటికి కన్నాలు పడ్డాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇందులో 22 బీసంక్షేమ హాస్టళ్లు చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారు. వసతుల కల్పనలో విఫలం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు అధికారులు విఫలమయ్యారు. చాలీచాలని గదుల్లో విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. కొన్ని కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు గదుల్లోకి చేరుతున్నాయి. కొన్ని గదుల్లో ఫ్యాన్లు ఉన్నా తిరగకపోవడంతో దోమల దాటికి విద్యార్థులకు సరిగా నిద్రపట్టడం లేదు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో జాగారం చేస్తున్నారు. ఇనుపపెట్టెలను 2008వ సంవత్సరంలో అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. ఉన్నవి విరిగిపోయి వంగిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. వాటిలో దుస్తులు కానీ, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారు పాత పెట్టెలలోనే వస్తువులు భద్రపరచుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు. వసతి గృహాల్లో ఎలుకలు వాటిని చిందర వందర చేస్తున్నాయి. ఎలుకల వల్ల కొన్ని వసతి గృహాల్లో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. భద్రత కరువు బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. వాచ్మన్లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంతో పలు హాస్టళ్లలో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలికల హాస్టళ్లలో పురుషులను సిబ్బంది, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదంటూ పలు హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై అగాయిత్యాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే మోనూ ఎలా.. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది. ఇందులో భాగంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తోపాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనంద నిలయాలకు వర్తింపచేశారు. పెంచిన మెస్ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ వడ్డించాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేం చేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు ఇప్పుడు మెస్ చార్జీల పెంపునకు చాలా తేడా ఉంది. ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. ఈ మెనూ అమలు సాధ్యం కాదని అధికారులు, వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. తప్పని ఎక్కిళ్లు.. హాస్టళ్లకు దాతలు ఇచ్చిన ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసుల పంపిణీ లేదు. భోజనం చేసే సమయంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్లేట్లు పగుళ్లిచ్చాయి. ఆరుబయటకే.. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళితే విషపురుగుల బారిన పడుతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పందులు తిరుగుతున్నాయి. దీంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ అంటూ బహిరంగ మలవిసర్జన వద్దని, పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటనలు చేయడం తప్ప సంక్షేమ హాస్టళ్లలో సరిపడిన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల లేమి కారణంగా హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 80 హాస్టళ్లు మూతపడ్డాయి. మౌలిక వసతుల కల్పనకు చర్యలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్టెలు, దుప్పట్లు అందజేశాం. మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. ప్రతి హాస్టల్‌కు వాచ్‌మన్ నియమించడంతోపాటు, బాలికల వసతిగృహాలకు భద్రత పెంచాం. పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన మెనూలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ పూర్తిస్థాయిలో మెనూ అమలు చేయాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. – డి.మధుసూదనరావు, ఉప సంచాలకులు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ -
ఇన్నేళ్లుగా రాని గర్భం ఇప్పుడెలా వచ్చింది?
గూడూరు (నెల్లూరు): ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. తోబుట్టువే చందాలు సేకరించి ఆరేళ్ల క్రితం ఆటోడ్రైవర్‌కిచ్చి వివాహం చేసింది. పెళ్లై ఐదేళ్లు గడిచినా గర్భంరాని నీకు ఇప్పుడెలా వచ్చిందంటూ నిండు గర్భిణిని కొట్టి గెంటివేసిన ఘటన గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎస్కే ఖాదర్‌బాషా, అనూబేగంలకు కుమార్తెలు షబ్బీరా, దిల్‌షాద్‌లతోపాటు మరో కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు గత కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. ఈ మేరకు పెద్ద కుమార్తె షబ్బీరా బంధువులు, స్నేహితుల సాయంతో ఆరేళ్ల క్రితం దిల్షాద్కు వివాహం జరిపించింది. ఈ క్రమంలో దిల్షాద్కు ఐదేళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో భర్త రఫీతోపాటు అత్తమామలైన నూర్జహాన్, మస్తాన్‌బాషాల వేధింపులు పెరిగాయి. ఈ క్రమంలో దిల్షాద్ ఆరునెలల క్రితం గర్భం దాల్చింది. కొన్ని నెలలపాటు అత్తమామలు, భర్త ఇన్నేళ్లు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందంటూ శారీరకంగా హింసించారు. బాధలు పడుతూ వచ్చిన ఆమెను 23వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఈ మేరకు అదే సమయంలో దిల్షాద్ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసే క్రమంలో సృహకోల్పోయి శివాలయం సమీపంలో పడిపోయింది. అదే సమయంలో బీట్ పోలీసులు గుర్తించి దిల్షాద్ను స్థానిక ఏరియా ఆస్పత్రి తరలించారు. పరీక్షలు చేయగా తల్లీబిడ్డ క్షేమమని తెలిసింది. అయితే హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా లేక పోవడంతో హాస్పిటల్ బయటే నిరీక్షించాల్సి వచ్చిందని షబ్బీరా ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరికి న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల చుట్టూ తిరుగుతోంది. -
మా కొడుకునే ప్రేమిస్తావా!
అనుమసముద్రంపేట(నెల్లూరు): విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని కావలియడవల్లి వడ్డెరపాళెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన వల్లెపు మస్తాన్ కుమార్తె వల్లెపు మమత (16) ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి రేణుకమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో మమతను అమ్మమ్మ గ్రామమైన ప్రకాశం జిల్లా చినపావనిలో ఉంచి 10వ తరగతి వరకు చదివించారు. తర్వాత తండ్రి మస్తాన్ ఆమెను ఆత్మకూరులోని కళాశాలలో చేర్పించాడు. సమీపంలో ఉన్న ఓ బాలికల హాస్టల్లో ఉంటూ మమత చదువుకుంటోంది. రెండురోజుల క్రితం ఆరోగ్యం బాగోలేదంటూ ఇంటికి వచ్చింది. శనివారం యువతి ఇంట్లో ఒక్కటే ఉంది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన అంకమ్మ అనే మహిళ వచ్చి మమత తన కుమారుడిని ప్రేమిస్తోందంటూ తిట్టి వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం మస్తాన్ పొలం నుంచి ఇంటికి వచ్చాడు. కుమార్తె కోసం చూసేసరికి బాత్రూంలో ఉరేసుకుని కనిపించింది. దీంతో అతను యువతిని కిందకు దించి సమీపంలోని ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి తీసుకువచ్చి చూపించాడు. అప్పటికే ఆమె మృతిచెందిందని అతను చెప్పాడు. గ్రామస్తుల ద్వారా ఆదివారం ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
నగదు లోడ్ చేసే సిబ్బందే ఏటీఎం లూటీ..!
సాక్షి, నెల్లూరు : ఏటీఎం సెంటర్లలో దొంగతనాలు పెరిగిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి దాటిన తర్వాత ఏటీఎంలలో డబ్బును నింపరాదు అని తాజాగా కేంద్ర హోంశాఖ నిబంధనలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన మనీ లోడింగ్ సిబ్బందే చేతివాటం చూపించారు. ఏటీఎంలలో డబ్బులు లోడ్ చేసే క్రమంలో ఏకంగా 79 లక్షల రూపాయలు నొక్కేశారు. ఈ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. సూళ్లూరుపేట, నెల్లూరు పట్టణంలో నగదు లోడ్ చేసే ‘రైటర్స్’అనే సంస్థలో పనిచేస్తున్న జగదీష్, కోటి, మునుస్వామిలు ఈ చోరీకి పాల్పడ్డారనీ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం!
నెల్లూరు(వేదాయపాళెం): రూరల్ మండలంలోని అంబాపురం అరుంధతీయవాడలో బుధవారం స్థానిక దళితుడైన ఇండ్ల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణయ్యలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు, విశ్రాంత వీఆర్ఓ పల్నాటి రాగపనాయుడు, అతని కుమారులు మస్తాన్‌నాయుడు, మల్లికార్జుననాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు సర్వేనంబరు 105/2లోని 33 అంకణాల నివేశన స్థలాన్ని లఘుసాని వెంకటసుబ్బమ్మ వద్ద గత కొన్నేళ్ల క్రితం ఇండ్ల ప్రసాద్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన స్థలంలో బుధవారం ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా అధికార పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని ఈ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థలానికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రసాద్ తెలపగా అధికార పార్టీ నాయకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. కులం పేరుతో దూషించి ప్రసాద్‌పై దాడి చేశారు. ప్రసాద్ బంధువైన ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని ఇదెక్కడి అన్యాయమని టీడీపీ నాయకులను ప్రశ్నించాడు. అతడిపై కూడా దాడి చేశారు. అధికారం ఉంది ఏమైనా చేస్తాం అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
పులికాట్‌ను మింగేస్తున్న కాలుష్య భూతం
ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి.. అందాల తీరంగా ఉన్న పులికాట్.. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో సహజత్వానికి దూరమవుతోంది. జీవవైవిధ్యాన్ని కోల్పోతోంది. మత్స్య సంపద తగ్గిపోతోంది. సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటం వల్ల మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతుంది. వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో సెలైనిటీ శాతం 65 శాతం దాటిపోతోంది. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉత్పత్తి ఐదువేల టన్నుల నుంచి రెండువేల టన్నులకు పడిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని మత్స్యకారులు జీవన పోరాటం చేస్తున్నారు. సూళ్లూరుపేట (నెల్లూరు) : ఆంధ్రా – తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సు తీరప్రాంతంలోని మత్స్యకారులు నిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 20 వేలకు మందికి పైగా మత్స్యకారులు చేపలవేటే ప్రధానవత్తిగా జీవనం సాగిస్తున్నారు. అంటే దాదాపుగా 20 వేల మందికిపైగా సరస్సు అన్నం పెడుతోంది. 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. గతంలో సుమారు 3 వేల నుంచి 5 వేల టన్నులు చేపలు, రొయ్యలు, పీతలు పట్టేవారు. ప్రస్తుతం రెండు వేల టన్నులు మత్స్యసంపద మాత్రమే దొరుకుతున్నట్లు జాలర్లు లెక్కలు చెబుతున్నాయి. సరస్సు జీవవైవిధ్యాన్ని కోల్పోయి కాలుష్యకోరల్లో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోతుండటంతో మత్స్యసంపద కూడా నానాటికి తగ్గిపోతూ వస్తోంది. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులు, కాలువల నుంచి వచ్చే మంచినీరు, సముద్ర ముఖద్వారాల నుంచి వచ్చే ఉప్పునీరు కలవడంతో ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో పులికాట్ సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటంతో మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతోంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో వర్షాభావంతో మంచినీళ్లు సరస్సుకు చేరడంలేదు. కేవలం ఉప్పునీళ్లు మాత్రం ఉండటంతో సెలైనిటీ 65 శాతం పైగా దాటి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో మత్స్య సంపద వృద్ధి చెందడం లేదని జాలర్లు అంటున్నారు. తరచూ వివాదాలే.. సరస్సులో నీరు తగ్గినప్పుడల్లా సరిహద్దు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ç1983 సంవత్సరం నుంచి వివాదాలున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తరంవైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారింది. దీంతో మన రాష్ట్రానికి చెందిన జాలర్లు ఇక్కడ మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో మత్స్య సంపద దొరుకుతుండటంతో అక్కడికి వెళుతున్నారు. అయితే ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలలు ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులు చూపించమని 1989 నుంచి మత్స్యశాఖ అధికారులు, అందుకు సంబంధించిన మంత్రుల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన జాలర్లు సరిహద్దు వివాదాలతో కుమ్ములాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 1989లో రెండు రాష్ట్రాల మధ్య జాలర్లకు భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. అటు తర్వాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రం ఎంత ఉంది?, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? అనే అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా చెల్లించారు. 1994లో సర్వే చేయాలని మన రాష్ట్ర అధికారులు సిద్ధమవగా తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో ఆగిపోయింది. తర్వాత ఈ వివాదం తరచుగా కొనసాగుతూనే ఉన్నా 2007లో రెండు రాష్ట్రాల మత్స్య శాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలు కార్యరూపంలోకి రాకపోవడంతో వివాదం ఇంకా ఉంది. పూడికతీత పనులు గాలికి.. తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారాన్ని ప్రతిఏటా ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల దక్షిణ భాగం సరస్సు ఎప్పుడూ జలకళతో ఉంటుంది. వాకాడు మండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకుపోవడంతో వేసవి కాలంలో ఉత్తరవైపు సరస్సు ఎడారిలా మారింది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలకు పూడిక తీయించాలని ఆందోళనలు చేశారు. దీనిపై 2007లో కేంద్ర డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఓషన్ టెక్నాలజీ అధికారులు, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు వచ్చి ముఖద్వారాలను పరిశీలించారు. 2007లో మెరైన్ ప్రదేశాల యాజమాన్య సంస్థ దీనిపై బేస్‌లైన్ సర్వే చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లతో అంచనాలు వేసి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. అయితే దీనికి సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇందులో మొదట విడుతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేనెలలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీని తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక మాట కొండెక్కేసింది. పరిశ్రమల కాలుష్యంతోనే.. తమిళనాడు పరిధిలో ఎళ్లావూరు, గుమ్మిడిపూండి, తడమండలం ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు పెరిగిపోయి ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీల నుంచి వ్యర్ధాలుగా వచ్చే నీళ్లు, కాలుష్యం సరస్సుకు వదిలేయడంతో సహజత్వాన్ని కోల్పోతూ వస్తోంది. అదే వి«ధంగా ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పన్నంగాడు సమీపంలో అధికంగా రొయ్యల సాగు చేస్తున్నారు. తీరప్రాంతానికి సుమారు 5 కిలోమీటర్లు మేర రొయ్యలసాగు చేయకూడదనే నిబంధన ఉన్నా వాటిని తమిళనాడుకు చెందిన వారు పట్టించుకోకుండా రొయ్యలు సాగు చేస్తున్నారు. మడఅడవులు అంతరించిపోవడంతో సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయిందని జాలర్లు చెబుతున్నారు. అదే విధంగా శ్రీహరికోట దీవిలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు పులికాట్ సరస్సును రెండుగా చీల్చి రోడ్లు వేయడంతో దీని సహజత్వం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత ప్రజావసరాల నిమిత్తం పేరుతో దొరవారిసత్రం మండలం వేలికాడు, కారికాడుకు రోడ్డు, తడమండలం వేనాడు, సూళ్లూరుపేట మండలం పేర్నాడు, చిట్టమూరు మండలంలో కూడా పలు దీవులకు సరస్సులోనే రోడ్లు వేయడంతో ఉత్తరం వైపు సరస్సు ఐదు చీలికలుగా మారింది. దీంతో ఉత్తరం వైపు భాగమంతా ఎడారిని తలపించే విధంగా ఎండిపోతోంది. దక్షిణం వైపు సరస్సు మాత్రం ఇప్పటికి నీళ్లు తగ్గినా నిండుగా కనిపిస్తుంది. దీంతో జాలర్లకు చేతి నిండా పనిలేకుండా పోయింది. చేపల వేటకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా వారు ప్రత్యామ్నాయ ఉపాధివైపు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రా జాలర్లుకు భృతి అందించాలి పక్కపక్కనే ఉన్న తమిళనాడు పరిధిలో పులికాట్ జాలర్లకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వేటలేని సమయంలో జీవనభృతి కోసం రూ.4 వేలు నగదుతో పాటు నిత్యావసరాలు కూడా అందుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రా జాలర్లుగా ఉన్న మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. గతేడాది నుంచి కరువు పరిస్థితుల నేపథ్యంలో వేటలేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పస్తులతో కాలయాపన చేస్తున్నారు. : స్వామి, కాశింకాడుకుప్పం మహిళల సంపాదనతో.. ప్రస్తుతం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోవడంతో మూడురోజుల పాటు వేటసాగించినా పూటగడవడం లేదు. రొయ్యలు, పీతలు కోసం ఎన్నిరోజులు వలలువేసినా దొరకడం లేదు. దీంతో మా ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చిచేపలు, చెన్నై నుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట – పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా సరస్సులో సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. -కేసీ రమేష్, భీములవారిపాళెం కొత్తకుప్పం -
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
రాపూరు (నెల్లూరు): సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ రాపూరు మండలంలోని గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి(36) మంగళవారం రాత్రి మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి మంగళవారం రాత్రి తన సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు చార్జర్‌ను తీసుకున్నాడు. చార్జర్‌ను విద్యుత్ బోర్డులో పెట్టి పిన్ను సెల్‌ఫోన్‌కు పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మణి కింద పడిపోయాడు. వెంటనే అతని భార్య చార్జర్ వైరును తొలగించి చుట్టుపక్కల వారిని పిలిచి మణిని రాపూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్‌ను, చార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గిలకపాడు ఎస్టీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మణికి భార్య భవాని, పిల్లలు అఖిల్, సురేంద్ర ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నాయుడుపేటటౌన్(నెల్లూరు): ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఆత్మకూరుకు చెందిన చెరువుపల్లి వేణు (33) అనే ప్రయాణికుడు మృతిచెందిన ఘటన నాయుడుపేట మండల అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు చెందిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన షేక్ సుభానీ డ్రైవర్ కమ్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తిరుపతి నుంచి నెల్లూరు వరకు వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో నెల్లూరు నుంచి తిరుపతికి 16 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. బస్సులో ఖాళీగా ఉందని గూడూరు వద్ద ఆత్మకూరు పట్టణానికి చెందిన చెరువుపల్లి వేణు (33) అనే వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అతను డ్రైవర్ ఎడమవైపు కూర్చున్నాడు. జాగ్రత్తగా నడపాలని చెప్పినా.. కాగా డ్రైవర్ కునుకు తీస్తూ బస్సు నడుపుతుండటంతో ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని సూచనలు ఇచ్చారు. బస్సు మార్గమధ్యంలో మండల పరిధిలోని అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద ముందు వెళుతున్న సిమెంట్‌లోడు లారీని వేగంగా ఢీకొంది. దీంతో బస్సు ఎడమవైపు నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరగడంతో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న వేణు ఇరుక్కుని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంకా బస్సులో ఉన్న నాయుడుపేటలోని రజక కాలనీకి చెందిన రమేష్ అనే వ్యక్తితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బస్సు ఎడమ వైపు శకలాల్లో ఇరుక్కున్న మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సల్పగాయాలతో ఉన్న వారిని మరో బస్సులో పంపించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేశారు. వేణు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద విషాదఛాయలు ఆత్మకూరు పట్టణంలో సెలూన్ షాపు నిర్వహించుకునే వేణు దైవదర్శనం చేసుకునేందుకు వెళుతూ మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నాయుడుపేట వైద్యశాలకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి..
బుచ్చిరెడ్డి పాలెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి ఆ తర్వాత తానూ దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా..స్థానికులు గమనించి పార్వతిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఉపాధి’కి లింక్
ఎండనకా, వాననకా ఉపాధి పనులు చేసిన కూలీలు సకాలంలో నగదు అందక అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. గతంలో పే స్లిప్‌లు ఇచ్చి పోస్టాఫీస్‌లో నగదు తీసుకునే సమయంలో బాగుండేదని, ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ పెట్టడంతో ఎక్కడ చెల్లింపులు చేస్తున్నారో తెలియడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. చిల్లకూరు(నెల్లూరు): జిల్లాలోని 46 మండలాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 2016 నుంచి 2018వ సంవత్సరం వరకు జరిగిన పనుల్లో కూలికి వెళ్లిన వారిలో సుమారు 19,440 మంది ఖాతాలు సస్పెన్షన్‌లో ఉండడంతో నగదు చెల్లింపులు జరగలేదు. దీనికి కారణం ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు లింక్ చేయకపోవడమే. కొందరికీ అసలు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో రూ.2.03 కోట్లకు పైగా నగదు ఎక్కడ ఉందనే విషయం తెలియడం లేదు. అలాగే తిరస్కరణ పేరుతో రెండు సంవత్సరాలుగా 22,842 మంది కూలీల నగదు కూడా రూ.35 లక్షలు పైగా ఉంది. 21,173 మంది కూలీలకు సంబంధించి రూ.1.92 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం కూలీలకు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు మాత్రం ఈ పని క్షేత్ర స్థాయిలోనే జరగాలని చెబుతున్నారు. అక్కడి అధికారులు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తప్పించుకుంటున్నారు. అధికారుల తీరే కారణం అధికారులు తీసుకునే నిర్ణయాలు కూలీల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. జాబ్‌కార్డులో కుటుంబంలోని వారిలో ఎవరో ఒకరు పనికి వెళతుంటారు. ఒకరికి ఖాతా ఉంటే వారి ఖాతాలో నగదు చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రతిఒక్కరికీ బ్యాంక్ ఖాతా అవసరమని చెప్పడంతో కొందరికి వేలిముద్రలు సక్రమంగా లేకపోవడంతో ఆధార్ లింక్ కావడం లేదు. దీంతో వారు ఖాతా ప్రారంభంచలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు అనుసంధానం చేయించాల్సిన బాధ్యత అధికారులదే అయినా పట్టించుకోవడం లేదు. ఖాతాలను ఆఖరుగా భారత జాతీయ చెల్లింపుల సంస్థకు అనుసంధానం చేస్తేనే కూలీలకు నగదు చెల్లింపులు జమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందుకు బ్యాంకు అధికారులతో ఉపాధి హామీ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి కూలీలకు నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆధార్ లేక ఖాతా తెరవలేదు ఏడాదిగా ఉపాధి పనికి వెళుతున్నా. అయితే ఒక్క రూపాయి కూడా చేతికందలేదు. ఆధార్ తీయించుకునేందుకు వెళితే వేలిముద్రలు పడలేదని చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతా చేయించుకోలేకపోయా. పనికి వెళుతున్నా డబ్బు అందడం లేదు. – గడ్డం మణెయ్య, కలవకొండ ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నాం జిల్లాలోని ప్రతి ఏపీఓతో సస్పెన్షన్ ఖాతాల విషయంపై రివ్యూ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని ఖాతాలకు సంబంధించిన నగదు చెల్లింపులను 15 రోజుల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు ఆధార్, జాబ్ కార్డు లింక్ చేయాలని ఆదేశించాం. – బాపిరెడ్డి, పీడీ, డ్వామా -
కాలుష్య కాటు
జిల్లాలో ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) లేకుండా పలు ఫ్యాక్టరీలు, మైన్స్, క్వారీల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటిపై అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో యథాప్రకారం నిర్వాహకులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గాలిలో దూళికణాలు గతంలో 66 శాతం ఉండగా ప్రస్తుతం 71 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ 80 నుంచి 100 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. అయితే 500 మైక్రో గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నెల్లూరు(సెంట్రల్): ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మొదట చూసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏర్పాటు చేసే మైన్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. ఏర్పాటు చేసే ఏ చిన్న, పెద్ద పరిశ్రమ అయినా సరే పర్యావరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే జిల్లాలో పలు ఫ్యాక్టరీలకు ఈసీలు లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈసీ లేని మైన్స్, ఫ్యాక్టరీలతోపాటు వాహనాలు తిరుగుతున్నందున వచ్చే కాలుష్యంతో జిల్లాలో పర్యావరణం దెబ్బతింటోంది. 25 వేలకు పైగా ఆటోలు, వెయ్యికి పైగా బస్సులు, 15 వేల కార్లు, రెండు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫ్యాక్టరీలదే అదే వరుస జిల్లాలో రైసు మిల్లులు, క్రషర్స్, పవర్ప్లాంటులు, వివిధ రకాల శబ్దకాలుష్య పరిశ్రమలు విచ్చలవిడిగా వెలశాయి. వీటిలో సగానికి పైగా ఈసీ లేదని తెలుస్తోంది. ఒక వేళ ఈ సీ ఉన్నా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వీటి నుంచి నిత్యం వెలువడే కాలుష్యంతో స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంటలపై కూడా పడుతోంది. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతోంది. అంతే కాకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యల వస్తున్నాయి. దీంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నెల్లూరు చుట్టుపక్కల వెలసిన రైసు మిల్లులు, వివిధ ఫ్యాక్టరీలు, క్రషర్స్‌తో నెల్లూరు పట్టణంపై కూడా పర్యావరణ ప్రభావం పడుతోంది. అధికార పార్టీ అండతో చాలా వరకు పెద్దపెద్ద పరిశ్రమలు, మైన్స్ నిర్వహణ మొత్తం అధికార పార్టీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒక మంత్రికి చెందిన మైన్స్ కూడా ఉన్నాయి. పలు ఫ్యాక్టరీలు, రైసుమిల్లుల విషయం చెప్పనక్కర్లేదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి చెందిన రైసు మిల్లులు, ఆయన అసోసియేషన్‌కు కూడా అధ్యక్షుడిగా ఉండటంతో వాటికి అనుమతి లేకున్నా ఉన్నా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖ, కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏదో మొక్కబడిగా దాడులు చేసి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు వస్తుండటంతో తనిఖీలు చేసిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసీ లేకుండా నిర్వహించే మైన్స్, ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 100 మైన్స్‌కు అనుమతి లేని వైనం ప్రధానంగా జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, గూడూరురూరల్, పెళ్లకూరు మండలాల్లో 170 మైన్స్ ఉన్నాయి. వీటిలో 100 మైన్లకు ఈసీ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇవి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు న్యాయ స్థానం దృష్టికి కూడా పోవడంతో వీటి నిర్వహణపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈసీ లేకుండా నిర్వహించిన యజమానుల నుంచి చట్టం ప్రకారం అపరాధ రుసుం వసూలు చేసి, అనంతరం సర్టిఫికెట్ తీసుకున్న తరువాత పనులు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. దీంతో ఈసీ లేకుండా నిర్వహిస్తున్న మైన్స్ వివరాల సేకరణలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెలలోనే ఈసీ లేని మైన్స్పై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసీ లేని వాటిపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎటువంటి మైన్ లేదా ఫ్యాక్టరీ అయినా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి. ప్రజలకు పర్యావరణం వల్ల ఇబ్బంది కలిగే విధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పలు మైన్స్‌కు ఈసీ లేదు. కొన్ని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుని ఉన్నాయి. అదే విధంగా ఫ్యాక్టరీలు, రైసుమిల్లులు ఈసీ లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. –ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ -
భూములన్నీ బీడు.. ఆశలన్నీ మోడు
‘‘చెరువులన్నీ ఎడారులను తలపిస్తున్నాయి.. సాగు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి..రైతులు కూలీలుగా మారిపోతున్నారు. వెలిగొండ పూర్తయితే ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువుకు ప్రాజెక్టు నుంచి నీరు నింపే అవకాశం ఉంది. తురిమెళ్ళ, రాచర్ల చెరువుల్లాంటి ఎన్నిటినో నీటితో నింపి తాగునీరు ఇవ్వొచ్చు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే వెలిగొండ పూర్తి కాలేదు. ముడుపులు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి తప్ప రైతు సంక్షేమానికి ఉపయోగపడే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర సోమవారం కంభం, అర్ధవీడు మండలాల్లో సాగింది. కంభం/అర్థవీడు(ప్రకాశం) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన రూ.3500 కోట్లతో 75 శాతం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్ల పాలన పూర్తవుతున్నా ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తవ్వలేక పోయారని విమర్శించారు. 2014 నుంచి ఏటా మరో సంవత్సరానికి వెలిగొండను పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా నిదులు కేటాయించ లేదని ఆరోపించారు. ఇటీవల జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ నాటికి వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్లలో జరగని పనులు నాలుగు నెలల్లో ఏవిధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రజాపాదయాత్రలో భాగంగా సోమవారం మండల కేంద్రం కంభంలోని కందులాపురం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని దీంతో పాటు ప్రజలకు తాగునీరు అందుతుందని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు, కంభం మండలంలో 19 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని అన్నారు. కంభం చెరువు 32 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగుల పైన పూడికతో నిండిపోయిందని. కనీసం పూడిక తీత పనులు చేపట్టాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వెలిగొండ పూర్తి చేస్తామని, సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ రహిత సమాజాన్ని రూపొందిస్తామన్నారు. వ్యవసాయాన్ని సస్యశామలం చేస్తామని తెలిపారు . అశోక్‌రెడ్డికి పుట్టగతులు లేకుండా చేయండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతో ఫ్యాను గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయి చంద్రబాబు సంకనెక్కాడని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇలాంటి నాయకులకు పుట్టగతులు లేకుండా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్రాంతికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. సంక్రాంతి తర్వాత నీరు ఇవ్వకపోతే టీడీపీ సర్కారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇంకా 14 నెలల పదవీకాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ఎంపీ పదవిని త్యజించిన గొప్ప నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీరందించాలన్న లక్ష్యంతో కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు 207 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నారన్నారు. ఎన్నికలు నాలుగునెలలు ఉందన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమా తన శాఖ పనికంటే ఇరిగేషన్‌కు చంద్రబాబుకు మధ్య బ్రోకర్ గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీతోనే న్యాయం.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటం ఎనలేనిదన్నారు. వైఎస్సార్ సీపీతోనే పేద ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఫ్యాను గుర్తుపై గెలుపొంది పార్టీ మారిన అశోక్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేందు సిద్ధంగా ఉన్నారన్నారు. కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు.. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో అత్యంత ఆదరణ కనిపిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అన్నారు. సీఎం చంద్రబాబు పట్టిసీమ పేరుతో వేలకోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టులను తయారు చేస్తూ అందులో కమీషన్లు నొక్కుతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక ఎక్కడైనా వర్షాలు కురిశాయా, చెరువులు నిండాయా? అని ప్రజలను ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యాళ్ళూరి వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, కామూరి రమణారెడ్డి, పిడతల అభిషేక్‌రెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కేవీ రమణారెడ్డి, చుండూరు రవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా.చేరెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్నువిజయ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పఠాన్సుభాన్ఖాన్, మండల కన్వీనర్లు లాయర్ శ్రీనివాసులరెడ్డి, బొల్లాబాలిరెడ్డి, పఠాన్ జఫల్లా ఖాన్, బోయళ్ళ జనార్దన్ రెడ్డి, కర్నూలు జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైవీ ఎదుట సమస్యల మొర.. పాదయాత్రగా వస్తున్న వైవీకి స్థానికులు సమస్యలు విన్న వించారు. ప్రధానంగా సూరేపల్లె, కందులాపురం, కంభం గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని, ట్యాంకర్లు వస్తేనే నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వర్షాభావం కారణంగా ఇటుకల పరిశ్రమ మూతపడే స్థాయికి వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేక జీవాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గొర్రెల కాపరులు వాపోయారు. గ్రాసం లేక వందల మైళ్లు వెళ్లి నల్లమల అడవుల్లో గ్రాసం తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హోరెత్తిన హోదా నినాదం.. పాదయాత్రలో ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగాయి. విద్యార్థులు, యువకులు ఫ్లకార్డులు పట్టుకొని యాత్ర కొనసాగించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, వైఎస్సార్ అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆట పాటల ద్వారా కోలాట భజన బృందాలు చేసిన ప్రదర్శనలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. కందులాపురం సెంటర్లోని అంబేడ్కర్, వైఎస్సార్, శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
కనికరించరేమయ్యా!
ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు. మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట) నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి ప్రవాహాన్ని పెంచండి పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. న్యాయ విచారణ జరిపించాలి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు -
పార్టీని నాశనం చేసిందెవరో?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో వర్గవిభేదాలు షరామామూలుగా మారాయి. వేదికలు మాత్రమే మారుతున్నాయి. ప్రతి వేదికపై ఒక వర్గం మరో వర్గంపై పైచేయి సాధించుకునే క్రమంలో ఘాటు విమర్శలకు దిగుతోంది. తాజాగా నెలన్నరగా అధికారపార్టీలో ఆత్మకూరు పంచాయితీ ముగింపు లేని రీతిలో కొనసాగుతోంది. జిల్లా టీడీపీలో ఉన్న గ్రూప్‌లన్నీ ఆత్మకూరులో ఉండడం, ప్రతి ఒక్కరూ అక్కడివారు కావడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సంగం మండలంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి వర్గం పూర్తిగా గైర్హాజరైంది. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం పార్టీలో మళ్లీ చర్చనీయాంశం అయింది. సోమవారం సంగం, ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపేశారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుండాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మరోవైపు ఆదాల వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. -
బడాబాబుల కోసం బంగారు భూముల్లో ..
పెళ్లకూరు మండలం నుంచి నాయుడుపేట మీదుగా పండ్లూరు వరకూ ఆరు లైన్ల బైపాస్ నిర్మిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే సంపన్నుల కోసం ప్లాన్లు మార్చివేశారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తోడవడంతో పేదల ఇళ్లు, పంటలు పండే బంగారు భూములపై పడ్డారు అధికారులు. రోజురోజుకూ అధికారులు హద్దు లు మార్చేస్తూ పెద్దలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం వేసిన హద్దుల్లో బడాబాబులకు చెందిన భవనాలు, అపార్టుమెంట్లున్నాయి. ప్రస్తుతం వేస్తున్న హద్దుల్లో పంట పొలాలు, బోర్లు, పలు దళిత కాలనీలున్నాయి. కొత్త హద్దులను అడ్డుకుంటూ మాకు చావే శరణ్యం అంటున్నారు పేదలు. అయినా అధికారులకు వీరి గోడు పట్టడంలేదు. నాయుడుపేటటౌన్ (నెల్లూర): కేంద్రం ఇటీవల ఏర్పాటుచేసిన 71వ జాతీయ రహదారిపై రేణిగుంట నుంచి (పూతలపట్టు – నాయుడుపేట) మండల పరిధిలోని నాయుడుపేట పట్టణంలోని జీఎన్టీ రోడ్డు మీదుగా తుమ్మూరు, పండ్లూరు గ్రామం వరకు 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ ఆరులైన్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనికితోడు నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సైతం భూసేకరణ పనులు చేపట్టి ఉన్నారు. ఆరులైన్ల నిర్మాణానికి సంబంధించి ఈ జాతీయ రహదారిపై స్వర్ణముఖి నదిపై చాలా పొడవైన బ్రిడ్జి ఉండటం, అంతేకాకుండా మామిడి కాలువ, రైల్వేగేట్లు తదితరాలు అడ్డంకులుగా ఉండడంతో ఈ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) తిరస్కరించింది. ఎన్హెచ్ఏఐ అధికారులు 2017 సంవత్సరం ఆగస్ట్ 3న కొత్తగా మళ్లీ సర్వే చేపట్టారు. దీంతో నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి జాతీయ రహదారి కూడలి సమీపంలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోమతి సర్కిల్ ఆవతల వైపు నుంచి రేణిగుంట వరకు 71వ నంబర్ జాతీయ రహదారిలో ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి ప్రతిపాదనలు (డీపీఆర్) తయారు చేశారు. 20 కిలోమీటర్లకు సంబంధించిన ఆ రిపోర్టును తిరుపతి డివిజన్‌కు చెందిన అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని గోమతి సర్కిల్ నుంచి ఎల్ఏ సాగరం సమీప ప్రాంతాల నుంచి ఎల్ఏ సాగరం చెరువు, జువ్వలపాళెం గ్రామ పొలాల మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారి కూడలి వరకు ప్రత్యేక సర్వే బృందం హద్దులు నాటారు. ఈ హద్దుల్లో గోమతి సర్కిల్ నుంచి జాతీయ రహదారి కూడలి వరకు అనేక భారీ భవంతులతో పాటు పలు అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అందుకు సంబంధించి భూసేకరణకు సైతం శ్రీకారం చేపట్టారు. ఇది అప్పట్లో సంచలనమైంది. అయితే అధికారులు బడాబాబులకు దాసోహమైపోయి హద్దు మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలు ఒత్తిడి కావడంతో హద్దులు మారిపోతున్నాయి. నిరుపేద రైతులు, దళితులు నివాసం ఉండే ప్రాంతాలు, పచ్చని పంట పొలాల్లో హద్దు నాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం జువ్వలపాళెంకు చెందిన దళితులు అధికారులను అడ్డుకున్నారు. అలాగే నాయుడుపేట, పెళ్లకూరు మండలాలకు చెందిన రైతులు సైతం వ్యవసాయ బోర్ల వద్ద ఆందోళనలు చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవసాయ బోర్లు, బంగారు (వరి, చెరుకు) పండించే భూములను సైతం లాక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు రెండు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు కూడా. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు, దళితులు అంటున్నారు. నా దృష్టికి రాలేదు ఎల్‌ఏసాగరం, తదితర ప్రాంతాల్లో రైతుల బోర్లల వద్ద రాళ్లు నాటి విషయమై రైతులు నా దృష్టికి తీసుకురాలేదు. ఆరులైన్ల రోడ్డు కోసం మొదట ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేశారు. తర్వాత రెవెన్యూ అధికారుల సర్వే ఉంటుంది. ఏదైనా సమస్యలుంటే పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తా. -ఎం శ్రీదేవి, ఆర్డీఓ నాయుడుపేట దుర్మార్గపు చర్య జాతీయ రహదారిపై ఆరు లైన్ల నిర్మాణానికి కొత్తగా సర్వే చేస్తూ రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లు, పోలాలతో పాటు దళితులు నివాసాలు సమీపంలో హద్దులు రాళ్లు వేస్తుండటం దారుణం. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ఈ స్థలాలను సేకరించి రహదారి నిర్మాణం చేపడితే అందరికీ సమ్మతమే. – తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, నాయుడుపేట ఆత్మహత్యలే శరణ్యం ఎల్ఏ సాగరంలో మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ బోరు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నాం. తొలుత చేసిన సర్వేలో కొద్దిపాటి పొలం మాత్రమే పొయింది. తిరిగి నాటుతున్న హద్దుల్లో పొలాలతో పాటు బోర్లు ఉన్నాయి. బోర్లు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి. – పుట్ట రాగమ్మ, మహిళ రైతు, తాళ్వాయిపాడు, పెళ్లకూరు మండలం -
ఖరీఫ్ సాగుకు కరువు పోటు
ఖరీఫ్ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న వరి రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. భగీరథ యత్నం డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు. ఎండిపోయిన డ్యామ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్‌లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్ నుంచి ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్‌లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది ఖరీఫ్ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసుకునేం దుకు పైప్‌ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు -
నో గ్రాంట్..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునః ప్రారంభించి రెండు నెలలు దాటినా నేటికీ ఈ ఏడాదికి సంబంధించి పాఠశాలల నిర్వహణకు నిధులను విడుదల చేయలేదు. గత ఏడాది ఖర్చు పెట్టకుండా ఉన్న రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. దీంతో పాఠాలు బోధించేందుకు సైతం చాక్‌పీస్‌లు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నేటికీ అధిక శాతం పాఠశాలల్లో రిజిస్టర్లు నిర్వహించని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుల వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు ఎప్పుడో 2006లో ఇచ్చే గ్రాంట్లను నేటికీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో రిజిష్టర్ల నిర్వహణకు, బోధన సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 3,425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ప్రాథమిక 2,646, ప్రాథమికోన్నత 363, ఉన్నత 416 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,34,609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7వేల వంతున నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీస్‌లు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఇంతే మొత్తాన్ని గత 2006వ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ నిర్వహణా గ్రాంటు కింద మూడు తరగతి గదులు ఉన్న పాఠశాలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు రూ.10వేలు వంతున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో మరుగుదొడ్ల, కుర్చీల రిపేర్లు, వాటర్‌పైపులు తదితర సమస్యల పరిష్కారం కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు ప్రతి టీచర్‌కు రూ.5వేల చొప్పున నిధులును కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ప్రతి కాంప్లెక్స్‌కు రీసోర్స్ సెంటర్‌కు రూ. 22వేలు, మండల రీసోర్స్ సెంటర్‌కు రూ. 80వేలును కేటాయిస్తున్నారు. అయితే రెండేళ్లుగా టీచర్‌కు ఇచ్చే రూ.5వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. గ్రాంట్‌ను పెంచమని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రూ.10.80 కోట్ల నిధులు వెనక్కి ప్రతి ఏటా స్కూల్ గ్రాంట్ నిధులును ఆగస్టులోపు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది కొన్ని పాఠశాలలకు అక్టోబర్, మరికొన్ని పాఠశాలలకు నవంబర్ నెలల్లో నిధులను విడుదల చేశారు. అయితే 2017–18కు సంబంధించి, అంతకంటే ముందు మిగిలి ఉన్న నిధుల్లో ఖర్చు చేయని రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులను సర్వశిక్ష అభియాన్ అధికారులు సకాలంలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల అవసరాలకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్ నిధులు వెనక్కి పోవడంతో చాక్‌పీస్‌లు, రిజిష్టర్, తెల్ల కాగితాలు ఏవైనా కొనాలన్నా, పాఠశాలల్లో మరమ్మతులు నిర్వహించాలన్నా, చీపుర్లు సైతం కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2015 విద్యా సంవత్సరం నుంచి నిధులు కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.1500, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది నుంచి డీఆర్డీఏ ద్వార వేతనాలు అందజేసే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డీఆర్డీఏ వేతనాలను నిలిపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్డీఏ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతుంటే, తమకు సంబంధం లేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. నిధులు దారి మళ్లించడం దారుణం బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులను వెనక్కి తీసుకోవడం, దారి మళ్లించడం చాలా దారుణం. ప్రభుత్వం చర్యలతో పాఠశాలల నిర్వహణ చాలా ఇ బ్బందిగా మారింది. ఉపాధ్యాయుల జేబుల్లో నుం చి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడం లేదు. పాఠశాలల్లో నిర్వహణ సరి గాలేదని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. –మోహన్‌దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ఈ ఏడాది నిధులు విడుదల కాలేదు పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. గత ఏడాది, అంతకు ముందు వివిధ పనులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆయా హెచ్ఎంలు ఖర్చు పెడుతున్నారు. నిధులు వచ్చిన తరువాత వారికి తిరిగి ఇచ్చేస్తాం. –విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి, సర్వశిక్ష అభియాన్ -
శ్రావణ శోభ
నెల్లూరు(బృందావనం): శ్రావణమాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో పూజలను నిర్వహించి నోములను ఆచరించారు. ఆలయాల్లో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గీ నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి లక్షకుంకుమార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో కుప్చచ్చి సుబ్బారావు, ఆలూరు శిరోమణిశర్మ పర్యవేక్షణలో 20 మంది రుత్విక్కులతో కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ మండపంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం విశేషహారతులు, రాత్రి అమ్మవారికి పల్లకీసేవ కనులపండువగా జరిగింది. తీర్థప్రసాదాలకు ఉభయకర్తలుగా సోమవారపు సూర్యనారాయణరావు, విజయలక్ష్మి దంపతులు, గంగాభవాని, మధుకర్ వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్ పర్యవేక్షించారు. రాజరాజేశ్వరి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేషపూజలను నిర్వహించారు. రాత్రి పల్లకీసేవ, ఊంజల్‌సేవను వేడుకగా జరిపారు. ఆలయ అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, తదితరుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. ఈఓ ఆరంబాకం వేణుగోపాల్ పర్యవేక్షించారు. మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహిం చారు. ఉభయకర్తలుగా సూర్యప్రకాశ్‌రావు, విజయశ్రీ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి సాయంత్రం పూలంగిసేవ, చందనా లంకారం, రాత్రి పల్లకీసేవను నిర్వహించారు. ఉభయకర్తలుగా రాజేశ్వరరావు, అరుణ దంపతులు వ్యవహరించారు. ఈఓ వేమూరి గోపీ పర్యవేక్షించారు. పప్పులవీధిలోని మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారికి క్షీరాభిషేకం, రాత్రి ఊంజల్‌సేవను నిర్వహించారు. ఈఓ గుమ్మినేని రామకృష్ణ పర్యవేక్షించారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని పడమటివీధిలో ఉన్న గాంధీ మందిరంలోని జాతిపిత విగ్రహం కిందపడేసి ధ్వంసం చేసి ఉండటాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో మందుబాబులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని స్థానికులు కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఉదయం మందిరంలో గేదెలు ఉండటంతో గాంధీ విగ్రహానికి ఉన్న పూలమాలలను అవి లాగే సమయంలో విగ్రహం కిందపడి ధ్వంసమై ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. కాగా విగ్రహం ధ్వంసమైన తర్వాతే మెడలో ఉన్న పూలమాలలు తినేందుకు గేదెలు వచ్చాయనే వాదన ఉంది. నిగ్గుతేల్చాలి స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న గాంధీ నాయుడుపేటకు వచ్చి పడమటివీధిలో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన నడయాడిన స్థలంలో గాంధీ మందిరాన్ని నిర్మించారు. అప్పటి స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి స్థానికులు గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతో పట్టణంలో కలకలం రేగింది. స్థానికులతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారించి నిగ్గుతేల్చాలని, మహాత్ముడి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారుల పరిశీలన గాంధీ విగ్రహం ధ్వంసమైందని సమాచారం రావడంతో ఆర్డీఓ ఎం.శ్రీదేవి, గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక సీఐ మల్లికార్జునరావు తదితర శాఖల అధికారులు మందిరం వద్దకు వెళ్లి పరిశీలించారు. తొలుత నగర పంచాయతీ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖరరెడ్డి వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని తాత్కాలికంగా మందిరంలో ఉంచి తలుపులకు తాళాలు వేశారు. మందుబాబులకు అడ్డాగా.. గాంధీ మందిరం వద్ద అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటున్నారు. గతంలో అక్కడ కొందరు అతిగా మద్యం సేవించి మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మందుబాబులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. -
జూదాగ్ని
పేకాటతో ఎందరో జీవితాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. జూదం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రనకా పగలనకా భార్యాపిల్లలతో కలిసి కాయకష్టం చేసి, అల్లిన బుట్టలు ఇతర సామగ్రిని ఇతర రాష్ట్రాలకు వెళ్లి విక్రయిస్తూ జీవనం సాగించే వారి జీవితాలు కూడా పేకాట తీవ్రతకు బుగ్గవుతున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారి కుటుంబాలు అప్పుల భారంతో మగ్గుతున్నాయి. పేకాట కోసం చేసిన అప్పులు కట్టలేదని గృహ నిర్బంధం చేసిన ఘటనలు కూడా కోకొల్లలుగానే ఉన్నాయి. గురువారం చిల్లకూరు మిక్స్డ్ కాలనీకి చెందిన సచ్చాల శివ అనే యువకుడు కలెక్టరేట్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనం. గూడూరు: నెల్లూరు జిల్లాలో పేకాట మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా సాగుతోంది. పేకాటకు పేద, మధ్య, ధనికులు బానిసలై జూదాగ్నికి బలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైటెక్ స్థాయిలో పేకాట సాగుతోంది. వీటి స్థావరాలకు కోడ్లు కేటాయించి.. పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా గూడూరు మండలంలోని మేగనూరు గ్రామ పరిసరాల్లో జూదరులు ప్రత్యేకంగా ప్లేస్–1, ప్లేస్–2, ప్లేస్–3 అనే స్థలాలను ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నారు. ఒక రోజు ఆడిన చోట మరుసటి రోజు ఆడకుండా స్థలాలు మార్చుతూ, ప్లేస్ అనే కోడ్‌తో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయం కొందరు పోలీసులకు కూడా తెలుసని సమాచారం. మండలంలోని పురిటిపాళెం సమీపంలోని మామిడిమానును గుర్తుగా చేసుకుని కూడా జూదరులు వాటిని పేకాట స్థావరాలుగా చేసుకున్నారు. మండలంలోని కొండాగుంట సమీపంలో కూడా పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ యువకుడు పేకాట ఆడడంతో పాటు జూదరులకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకుని వాటిని సప్లయ్ చేస్తుంటాడు. అందుకు గాను ఒక్కో ఆటకు ఒక్కొక్కరి వద్ద రూ.1000 వరకూ తీసుకుని, జూదరులకు ఉదయం టిఫిన్ నుంచి రాత్రి పూట చికెన్, మటన్‌తో కూడిన విందు భోజనాలను అందజేస్తుంటాడని తెలుస్తోంది. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకూ మూడు ఆటలు ఆడేలా, అవసరాన్ని బట్టి స్థలాలను మార్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో మనుబోలు మండలం బద్దెవోలు గ్రామానికి వెళ్లే మార్గంలో ఒక చోట ఆడుతుండేవారు. దీనిపై జూదరుల కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చి పేకాటకు అడ్డుకట్ట వేశారు. చిల్లకూరు సమీపంలోని శ్మశాన వాటిక ప్రాంతంలోని పావురాల తోట కూడా పేకాటకు స్థావరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట– పోటుపాళెం మధ్య ఉన్న జామాయిల్ తోటల్లో జూదరులు పేకాట ఆడుతుంటారని సమాచారం. వర్షాలు మొదలైతే ఏకంగా పట్టణంలోని లాడ్జిల్లో రూంలు బుక్ చేసుకునైనా పేకాట ఆడుతుంటారని తెలుస్తోంది. చితికిపోతున్న ఎరుకుల కుటుంబాలు చిల్లకూరు సమీపంలోని మిక్స్డ్ కాలనీలో సుమారు 250 కుటంబాలు ఉండగా వారిలో 50 కుటుంబాలకు పైగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. వీరు భార్యా పిల్లలతో కలిసి బుట్టలు అల్లుకుని వాటిని కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఆ మొత్తంతో అక్కడి నుంచి ఊరకే రాకుండా అక్కడ దొరికే ప్లాస్టిక్ టబ్‌లు, బకెట్లతో పాటు మరికొన్ని వస్తువులను కొనుగోలు చేసి అక్కడ నుంచి తీసుకు వచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తారు. ఇలా వారికి రెండు వైపులా ఆదాయం ఉండడంతో వారి నెల సంపాదన బాగానే ఉంటుంది. అయితే వీరు నిరక్షరాస్యులు కావడంతో ఇప్పటికీ అనాదిగా ఉన్న ఆచారాలను నమ్ముతూ కుల కట్టుబాట్లకు విలువనిస్తూ వాటిని పాటిస్తున్నారు. మాటమీద నిలబడి నమ్మకంతో ఏదైనా తెగనమ్మి అప్పులు కడుతుంటారు. కట్టుబాటు మీరితే సలసలా కాగే నూనెలో చేయి పెట్టాల్సి ఉంది. వారి కుల పెద్దలు మూకుమ్మడిగా శిక్ష విధిస్తారన్న భయంతోనే వీరు పేకాటకు బానిసలవుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న కొందరు మిక్స్డ్ కాలనీలోని పురుషులను పలు రకాల వ్యసనాలకు బానిసలను చేయడమే కాకుండా వారికి అప్పులు ఇస్తూ కట్టు బానిసలుగా చేసి వారిపై పెత్తనం చేస్తున్నారు. దీంతో చిల్లకూరులో ఉన్న 50 కుటుంబాల్లో 30 కుటుంబాల వారు ఒక్కో కుటుంబం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అప్పుల పాలయ్యారు. ఈ అప్పులు తీర్చేందుకు వారు ఇంటిల్లిపాది ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసినా వడ్డీలు కడుతున్నారే తప్ప అసలు మొత్తాలు తీర్చిన దాఖలాలు లేవు. దీంతో వారి అప్పులు యథాతథంగా మిగిలాయి. ఈ విషయాలు బయటకు రాకపోతుండడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఎలాంటి అవకాశాలు ఉండడం లేదు. ప్రస్తుతం రాపూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. అప్పులిచ్చే వారు వాహనాలను పంపి దగ్గరుండి పేకాట ఆడిస్తూ వారి వద్ద రూ.10 వేలకు రూ.2 వేలు పట్టుకుని రూ.8 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా పోగొట్టుకున్న వారికి మళ్లీ అదే తరహాలో అందరికీ అప్పులు ఇస్తూ ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా కూడా ఆ మొత్తం అంతా అప్పులిచ్చే వారి చేతుల్లో ఉంటుంది. ఆడే వారేమో అప్పులతో అల్లాడుతుంటారు. మా కుటుంబాలు చితికిపోతున్నాయి నేను కిడ్నీ వ్యాధిగ్రస్తురాల్ని. నా పెద్ద కొడుకు చంద్ర పేకాటలో రూ.21 లక్షలు పోగొట్టి అప్పుల పాలయ్యాడు. నా చిన్న కొడుకు శివ బుట్టలు అల్లి, ప్లాస్టిక్ సామగ్రి విక్రయించి కొంత అప్పు తీర్చాడు. అది పోను చంద్ర ఇంకా అప్పు ఉన్నాడు. – లక్ష్మమ్మ, శివ తల్లి ఆచారాలతోనే మా కుటుంబాలు నాశనం మా కుల కట్టుబాట్లతో మేము నాశనమైపోతున్నాము. చదువులకు దూరమైపోతున్నాము. మా అన్న చేసిన అప్పులతో 9వ తరగతి వరకూ చదివిన నేను చదువు ఆపేసి చేసిన అప్పులు తీరుస్తున్నాను. అధికారులు మా జీవితాలపై దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు జీవనోపాధి కల్పించాలి. – శివ, (ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ యువకుడు) -
గుట్కా వ్యాపారుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నిషేధిత గుట్కా, ఖైనీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి రహస్యంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో దుకాణదారులకు విక్రయిస్తున్న వారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీఐలు ఎస్కే బాజీజాన్ సైదా, ఒ.దుర్గాప్రసాద్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీ సమీపంలో జాతీయ రహదారి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కొడవలూరు మండలానికి చెందిన గుర్రం వేణుగోపాల్, వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీకు చెందిన ఎస్కే ఖాజారహంతుల్లా అలియాజ్ ఖాజాబాబాను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వీరు నిషేధిత గుట్కాలను అక్రమంగా నెల్లూరుకు తీసుకువచ్చి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి నుంచి 67.190 ప్యాకెట్ల గుట్కా, రాజాఖైనీ, హాన్స్, మీరాజ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని చెప్పారు. వారిపై నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఖాజారహంతుల్లాను గతంలో రెండుసార్లు గుట్కాలను రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గుట్కాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని క్రైమ్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు అభినందించి రివార్డులు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో నవాబుపేట సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై వీవీ రమణయ్య, సీసీఎష్ ఎస్సై ఎస్కే షరీఫ్, హెడ్ కానిస్టేబుల్స్ జె.వెంకయ్య, ఆర్.సత్యనారాయణబాబు, కానిస్టేబుల్స్ విజయప్రసాద్, అరుణ్ కుమార్, నరేష్, సుబ్బారావు పాల్గొన్నారు. -
ఓటుపై వేటు
ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్ కుమార్ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్‌లో బీఎల్ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆధార్, ఫోన్ నంబర్లతో ఓట్ల అనుసంధానం డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి ఓటును ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్‌ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్ నంబర్లు ఉంటాయి. అడ్రస్‌లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్ మారితే.. ఓట్లు అడ్రస్ లేకుండా తొలగిస్తున్నారు. టార్గెట్ వైఎస్సార్ సీపీ కక్ష కట్టి తొలగిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు రాజకీయాలు సరికాదు ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం గ్రామాల్లో లేని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్ఓ -
అమ్మవారి ఆభరణాలు భద్రం
నెల్లూరు(బృందావనం) : నగరంలోని కరెంటాఫీస్ సెంటర్ సమీపంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మాయమైన నగలు ఎట్టకేలకు అమ్మవారి చెంతకు చేరాయి. ఆలయ అర్చకులు, పరిచారికల నుంచి ఆ నగలు మళ్లీ అమ్మవారి ఆలయంలో భద్రపరచనున్నామని దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి, దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, బదిలీపై వెళ్లిన సింగరకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న పులి కోదండరామిరెడ్డి తెలిపారు. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబం ధించి వివరాలను దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి వెల్లడించారు. గత నెల 25వ తేదీన ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి, గతంలో పనిచేసిన కార్యనిర్వహణాధికారి పులి కోదండరామిరెడ్డి ఆభరణాలు అప్పగించేందుకు గుంటూరుకు చెందిన జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి మాధవి పరిశీలన చేశారు. ఆ సమయంలో అమ్మవారికి చెందిన కాంట్రాక్ట్ పరిచారిక ఎ.దిలీప్‌కుమార్, కాంట్రాక్ట్ అర్చకుడు వి.నరసింహారావు చెంత నుంచి 147 గ్రాముల కలిగిన సుమారు రూ.3,67,500 విలువజేసే 110 బిల్వపత్రాలు, 225 గ్రాముల కలిగిన సుమారు రూ.5,58,800 విలువ కలిగిన ఎరుపురంగురాళ్లతోగల 73 çపూలు, 107 చిన్న పూలు, కాంట్రాక్ట్ పరిచారిక కె.హరికృష్ణ నుంచి 48 గ్రాముల కలిగిన 110 తెలుపు, స్టోన్స్, ఒక పెద్ద ఎరుపుస్టోన్, 39 ఎరుపురాళ్లు కలిగిన సుమారు రూ.95వేలు విలువచేసే ఆభరణాలు కనిపించకుండా పోయాయన్నారు. అయితే ఆ ఆభరణాలు ఎక్కడకూ పోలేదని తమ వద్దనే భద్రంగా ఉన్నాయని దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారయంత్రాంగం స్పష్టం చేసింది. అమ్మవారి నగలు భద్రంగానే ఉన్నాయని భావించామన్నారు. అమ్మవారి ఆభరణాలు కనిపించకుండాపోవడంపై అన్ని వర్గాల నుంచి పలు అనుమానాలు తలెత్తాయన్నారు. ఆ అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము నగలను పరిశీలించామన్నారు. ఈ నగలు వారం రోజుల క్రితం ఆలయంలోని ఆభరణాల చెంతనే తమ పరిశీలనలో ఆభరణాలు ఉన్నాయనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారం రోజుల క్రితం ఈ విషయాన్ని బదిలీపై వెళ్లిన పులి కోదండరామిరెడ్డికి తెలిపామన్నారు. ఆయన సింగరకొండ ఆలయంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో వీలుచూసుకుని ఆదివారం రావడంతో ఈ నగలను కోదండరామిరెడ్డి సమక్షంలో ఆయన ద్వారా ప్రస్తుత ఆలయ కార్య నిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించామన్నారు. ఇకపై ఎటువంటి పొరపాట్లు, సందేహాలకు తావివ్వకుండా అమ్మవారికి సంబంధించిన అన్ని ఆభరణాలను సమగ్ర సమాచారంతో రిజిస్టర్లలో నమోదుచేస్తామన్నారు. బదిలీపై వెళుతున్న అధికారుల నుంచి సర్వీసులో ఉండడం వల్ల వారి నుంచి పూర్తి అప్పగింతలు పరిపాలనాపరంగా జరగవన్నారు. అధికారి ఉద్యోగ విరమణ చేస్తే ఆయన నుంచి అప్పగింతలన్నీ నిబంధనల మేరకు జరుగుతాయని వేగూరు రవీంద్రరెడ్డి వివరించారు. పరిశీలనలో వెలుగుచూశాయి ప్రస్తుతం నేను సింగరకొండ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్నా. గత నెలలో జ్యూయలరీ వెరిఫికేషన్ సమయంలో నగలు కనిపించకపోవడంతో నేను ప్రస్తుత కార్యనిర్వహణాధికారికి నగలను అప్పగించలేకపోయా. దేవాదాయ, ధర్మాదాయశాఖ నిబంధనల మేరకు నగలు చూపించలేకపోయిన పరిచారికలకు నోటీసులు ఇచ్చాం. నోటీసులు అందుకున్న పరిచారికలు తిరిగి పరిశీలనచేసిన సమయంలో నగలు కనిపించాయన్న విషయాన్ని నాకు వారం రోజుల క్రితం తెలిపారన్నారు. మా దేవస్ధానంలో జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆదివారం వెసులుబాటుచూసుకుని నెల్లూరుకు వచ్చి ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించా. –కోదండరామిరెడ్డి, బదిలీపై వెళ్లిన కార్యనిర్వహణాధికారి రిజిస్టర్ మెయిన్‌టెయిన్ చేస్తాం అమ్మవారి నగలు నాగు అప్పగించారు. ఇకపై ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఆభరణాలకు సంబంధించిన అన్ని విషయాలను రిజిస్టర్‌గా మెయిన్టెయిన్చేస్తాం. నగలను లాకర్లో భద్రపరుస్తున్నాం. అమ్మవారి నగలు కనిపించడం తిరిగి అమ్మవారి చెంతకు చేర ఆనందంగా ఉంది. –వెండిదండి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం -
కరువు ఛాయలు
జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో రైతుల బాధలు వర్ణనాతీతం. వరుణుడు సైతం కరుణించక పోవడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా సగం కూడా పడక పోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. 2015లో వరదలు వచ్చి వేసిన పంటలు కొట్టుకోని పోయాయి. చెరువులకు గండ్లు పడి చుక్క నీరు లేకుండా పోయింది. 2016లో తీవ్ర అనావృష్టితో రైతులు అవస్థలు పడ్డారు. పెన్నా డెల్టాకింద తప్ప జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం తగ్గింది. 2017లో ఓ మోస్తరు వర్షాలు పడ్డా నీరు భూమిలోకి ఇంకి పోవడంతో నీటి చుక్క ఎక్కడా నిల్వ లేదు. 2015లో 33, 2016లో 27 మండలాలను కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో 15 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ఇప్పటి వరకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కరువు మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సింది పోయి ఇంత వరకు వ్యవసాయ శాఖ తరపున ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది 45 మండలాలు జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 45 మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో జిల్లా మొత్తం కరువు ఛాయల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 173.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. అయితే 77.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. పరిహారం ఎక్కడ? ప్రభుత్వం నుంచి కరువు మండలాల్లోని రైతులకు ఎటువంటి పరిహారం అందిన దాఖలాల్లేవు. నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నా వారికి బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యుల్ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు నీటిమూటలుగా మారాయనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదనే ఆరోపణలున్నాయి. నివేదిక పంపుతున్నాం జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, నమోదైన వర్షపాతం, ఏయే పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. పరిహారం అందించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. –శివనారాయణ, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ సాయం లేదు కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. –కె.వెంకటకృష్ణారెడ్డి, డీసీ పల్లె, మర్రిపాడు నాలుగేళ్లుగా ఇంతే నాలుగు సంవత్సరాలుగా వరిపంట వేసి నీరు లేక ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నేలపాలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణం కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా రుణమాఫీ కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. –పసుపులేటి వెంకటేశ్వర్లు, వెన్నవాడ, ఆత్మకూర -
‘దళితులకు నాయ్యం చేసేందుకే ఢిల్లీ నుంచి వచ్చా’
సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు. -
రాపూరు పీఎస్‌పై దాడి ఘటన: ఎస్ఐ బదిలీ
రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎస్ఐ లక్ష్మణరావును బదిలీ చేశారు. ఈ మేరకు లక్ష్మణరావు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎస్ఐగా చల్లా వాసును నియమించారు. కాగా, శుక్రవారం రావూలో జాతీయ ఎస్.సి, ఎస్.టి కమిషన్ సభ్యుడు రాములు పర్యటించనున్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడితో పాటు దళిత కాలనీని రాములు సందర్శించనున్నారు. గత వారం కొంతమంది పోలీస్ స్టేషన్ గేట్లు ధ్వంస చేసి లోనికి చొరబడ్డ విషయం తెలిసిందే. దళితవాడకు చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించి విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. -
పెన్ను క్యాప్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
-
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నా..
-
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నా..
సాక్షి, నెల్లూరు : దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరముందన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి రావాలని కోరారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైఎస్సార్ సీపీ చేరుతానని వెల్లడించారు. పార్టీ మారే అంశంపై చర్చించడానికి జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో రామ్‌కుమార్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అభిమానులు వైఎస్సార్ సీపీలోకి చేరాలని ఒత్తిడి తెచ్చారు. -
‘ఆర్టీసీ’ ఎన్నికల పోరు నేడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆర్టీసీ యూనియన్ల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 5 గంటల నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోరుగా సాగిన ప్రచారంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు డిపోల స్థాయిలో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించి భారీగా హామీలను ఇచ్చారు. ఆర్టీసీలో ఐదు యూనియన్లకు కార్మిక శాఖ గుర్తింపు ఉంది. ఎన్నికల్లో తమ ప్యానల్‌ను గెలిపించేందుకు ఏ యూనియన్ సొంతగా ప్రయత్నాలు చేయలేదు. రాజకీయ పార్టీల అండతో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కాగడా గుర్తుపై నేషనల్ మజ్దూర్ యూనియన్, బస్సు గుర్తుపై ఎంప్లాయీస్ యూనియన్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. రీజియన్ స్థాయిలో ఎన్నికల కమిటీ ప్రధాన అధికారిగా డిప్యూటీ కమిషనర్ బి.ఏసుదాసును కార్మిక శాఖ నియమించింది. ఎన్నికల సహాయ అ«ధికారిగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకటనారాయణ వ్యవహరిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 12 పోలింగ్ బూత్‌లు జిల్లాలోని పది డిపోల్లో ఒక్కొక్కటి చొప్పున, నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో, పడుగుపాడు వర్క్‌షాపులో ఒకటి వంతున మొత్తం 12 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో 48 ఓట్లు, ఈడీ ఆఫీసులో (వెంకటాచలం ట్రైనింగ్ ఆఫీసు) 52 ఓట్లు, నెల్లూరు డిపో–1లో 638 ఓట్లు, నెల్లూరు డిపో–2లో 532, సూళ్లూరుపేటలో 318, గూడూరు 337, వాకాడు 279 , రాపూరు 311, వెంకటగిరి 319, ఆత్మకూరు 339, ఉదయగిరి 287, కావలి 400, పడుగుపాడు వర్క్‌షాపులో 134, మొత్తం 3,994 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం ఆర్టీసీ గుర్తింపు యూనియన్ల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశాం. పోలింగ్ అయిన అర్ధగంట తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రికల్లా ఫలితాలు వెలువడుతాయి. – బి.ఏసుదాసు, ఎన్నికల ప్రధాన అధికారి -
మినరల్ కాదు.. గరళం
పాలకుల అసమర్థత.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నగర ప్రజలు కాలకూట విషాన్ని తాగుతున్నారు. ప్రాణాధారమైన జీవజలాన్ని అందించలేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రూ.కోట్ల బడ్జెట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు తాగునీటి కోసం అందులో 0.02 శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని నగర పాలక సంస్థ లెక్కలే చెబుతున్నాయి. అధికార పార్టీ నేతలు నగర ప్రజలకు అన్ని ప్రాంతాలకు రెండు పూటలా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రచారం చేసుకున్నారు. వాస్తవంగా చూస్తే అందులో సగం మందికి కూడా నీటి సరఫరా కావడం లేదని నీటి లెక్కలే తేల్చుతున్నాయి. నగరవాసి, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రజలకు మినరల్ వాటర్ ఇస్తామని చెబితే..మేయర్ అబ్దుల్ అజీజ్ ఓజోన్ వాటర్ అందిస్తామని ఇలా నిత్యం గొప్పలు చెబుతున్నారు. వాస్తవంగా కాలుష్యపూరితమైన కోలీఫాం జలాన్ని తాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలో 7 లక్షలు మంది జనాభా ఉండగా, 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 90 నుంచి 100 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా అధికారులు 105 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) వంతున సరఫరా చేయాలని కాకి లెక్కల బడ్జెట్‌ను రూపొందించారు. అయితే నగర పాలక సంస్థ అధికారులు 85 ఎంఎల్డీ వంతున నీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి వనరులు, సరఫరా చేస్తున్న నీటి లెక్కలు తేల్చితే 60 ఎంఎల్డీ వంతున కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది. మొక్కుబడిగా క్లోరినేషన్ నగర ప్రజలకు సరఫరా చేసే నీటిలో క్లోరిన్ కలిపి పూర్తిగా శుద్ధి చేసి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి. అప్పుడే బాక్టీరియా కొంత మేరకు చనిపోయే అవకాశం ఉంది. కానీ అది మొక్కుబడిగా కూడా జరగడం లేదు. ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద ట్యాంకులు శుద్ధి చేయకపోవడం, వచ్చిన నీటిని శుద్ధిచేసి విడుదల చేయడంలేదు. కేవలం అలం, ఆర్ఎస్ఎఫ్, క్లోరిన్ బస్తాలు నీటిలో వేసి నీటిని వదులుతున్నారు. వాస్తవానికి చెరువు నీరు కావడంతో నీటిలో ఎటువంటి మినరల్స్, పోషకాలు ఉండవు. కానీ నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో ఈ కోలిఫాం ప్రబలడానకి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాల్చిన చెట్టు బొగ్గును నీటిలో వేస్తే నీటిని శుభ్రం చేయడంతోపాటు రంగు, రుచిని మార్చే అవకాశం ఉంది. ఇది పూర్తి శాస్త్రీయ పద్ధతి. ఈ ప్రక్రియపై కూడా ఎప్పుడూ అధికారులు దృష్టి సారించలేదు. ప్రధానంగా స్టోరేజీ ట్యాంక్‌లో ఉండాల్సిన క్లోరోమీటర్తో పాటు ఇతర పరికరాలు సైతం తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఏటా తాగునీటి సరఫరా ఖర్చు రూ.2.6 కోట్లే! నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ.1,500 కోట్లని పాలకులు గప్పాలు కొట్టుకుంటున్నా.. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కేవలం రూ.2.6 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే వార్షిక బడ్జెట్లో 0.02 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. వందల కోట్లు వార్షిక బడ్జెట్ ఉన్నా నగరంలో కనీసం అవసరాలకు సరిపడా నీరు ఇవ్వలేని దుస్థితిలో నగర పాలకులు ఉన్నారు. మంత్రి మినరల్ అంటే.. మేయర్ ఓజోన్ నగరంలో 7.5 లక్షల జనాభా ఉంటే కనీసం 3 లక్షల మందికి కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు. అది కూడా పనికి రాని నీటిని తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. నగరానికి చెందిన పి.నారాయణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రిగా, నగర మేయర్‌గా అబ్ధుల్ అజీజ్ ఉన్నారు. ఇద్దరు నగర ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తామని నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఒకరికి ఒకరు పోటాపోటీగా హామీలు ఇస్తున్నారు. మంత్రి నారాయణ అయితే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెబితే, మేయర్ అజీజ్ ఇంకో అడుగు మందుకు వేసి నగరంలో ఓజోన్ ప్లాంట్లు పెట్టి పూర్తిగా ఓజోన్ నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. వారంలో సగటున మూడు రోజులు మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించే ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు కనీసం మెక్కుబడిగా అయినా స్పందిచని పరిస్థితి. గతేడాది నవంబర్ నుంచి నగరంలో కోలిఫాం బాక్టీరియా నీరు సరఫరా అవుతుందని అధికారులు మొదలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వరకు అందరూ చెబుతున్నా చర్యలు తీసుకోకపోవటం నగరపాలక దుస్థితికి నిదర్శనం. తాగునీరు దారుణంగా ఉంది నగరపాలక సంస్థ కుళాయిల నుంచి వచ్చే నీరు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. వచ్చే నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన నీళ్లు కూడా మురికిగా దుర్గంధం భరితంగా ఉంటున్నాయి. దీంతో వాటిని వాడుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. – కుమారి, నెల్లూరు ఇంత దారుణమా మున్సిపల్ నీళ్లు తాగాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది. ఎక్కడ బడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఏ పైపు ఎక్కడ తెగిపోయి, నీటి పైపుల్లో కలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నీటిని వాడితే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – శివప్రసాద్, నెల్లూరు శరీర అవయవాలకు ప్రమాదం కోలిఫాం బాక్టీరియా ఉన్న నీటిని తాగితే శరీర అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బాక్టీరియా ఉన్న నీటిని తాగిన వారికి విరోచనాలు కావడం, జ్వరం రావడం, మలంలో రక్తం పడటం, ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి వస్తుంది. వీటన్నింటిని కలిపి డీసెంట్రీ జబ్బు అంటారు. డీహైడేషన్ వచ్చి కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్య వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాగేనీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగాలి. – డాక్టర్ పీకే రెడ్డి, -
‘తారు’మారు
యాభై ఏళ్ల ఆ గ్రామస్తుల కలలు కల్లలు అయ్యాయి.. ఐదు దశాబ్దాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఇటీవల బీటీ రోడ్డు వేసేందుకు రూ.50 లక్షలు మంజూరు కావడంతో తమ సమస్య పరిష్కారమవుతుందని భావించారు. యాభై ఏళ్లపాటు గ్రావెల్ రోడ్డుపై కష్టాల ప్రయాణం చేసిన పెళ్లకూరు మండలం చవటకండ్రిగ గ్రామస్తులు తమకు మంచిరోజులొచ్చాయని అనుకున్నారు. అయితే బీటీ రోడ్డు పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించక రోడ్డు వేసిన 24 గంటల లోపే పెచ్చులు పెచ్చులుగా లేచిపోతోంది. లేచిపోయిన బీటీరోడ్డుకు మళ్లీ అతుకులు వేస్తున్నారు. బీటీ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతకు పాతరేయడంపై గ్రామస్తులు ఆగ్రహించి పనులను అడ్డుకోవడంతో ఇక్కడ కాకపోతే మరోచోట రోడ్డు వేయిస్తామని సైట్ ఇంజినీరు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. పనులు నాసిరకంగా జరుగుతున్న విషయాన్ని సాక్షి ముందుగానే హెచ్చరిస్తూ గత నెల 7వ తేదీన ‘అర్ధశతాబ్దపు ఆశలపై అవినీతి దారులు’ శీర్షికతో కథనం కూడా ప్రచురించింది. అధికారులను హెచ్చరించింది. అయినా అధికారులు స్పందించలేదు. పెళ్లకూరు(నెల్లూరు): పనులు చేజిక్కించుకున్నామా.. అధికారులకు పర్సంటేజ్‌లు చెల్లించేశామా.. నాసిరకంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకొని దర్జాగా బిల్లులు చేసుకున్నామా అనే తీరులో రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలోని పునబాక పంచాయతీ, చవటకండ్రిగ గ్రామానికి వెళ్లే గ్రావెల్ రోడ్డును రూ.50 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ప్రాథమిక దశ పనులు పూర్తయిన అనంతరం జూలై 27న బీటీ పనులు చేపట్టారు. బీటీ వేసిన రెండు గంటలకే తేలికపాటి సైకిళ్లు, స్కూటర్లు వెళ్లగా రోడ్డు పెచ్చులు, పెచ్చులుగా లేచిపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పనులను అడ్డుకొని నిలిపేశారు. ప్రాథమిక దశ పనుల్లో కూడా నాణ్యత లేని కంకర, సరైన వాటర్ క్యూరింగ్ చేయకపోవడం, రోడ్డు మార్జిన్ పనులు గ్రావెల్‌కు బదులుగా మట్టితో ఏర్పాటు చేయడంలో ఆ శాఖ సిబ్బంది(సైట్ ఇంజినీర్) కీలకపాత్ర పోషించాడని, పనులను నాసిరకంగా చేయిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీటీ పనుల్లో కూడా నాణ్యత, నిబంధనలు పాటించకుండా పనులన్నీ నాసిరకంగా చేయడంతో రోడ్డు పెచ్చులు, పెచ్చులుగా లేచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్‌మిక్చర్ పేరుతో నాసిరకం పనులు ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.50 లక్షల నిధులతో చేపట్టిన బీటీరోడ్డును కోల్డ్‌మిక్చర్ పేరుతో పనులన్నీ నాసిరకంగా చేస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారుకు(హాట్మిక్చర్) బదులుగా కంకరకు ఒక రకమైన ద్రావణాన్ని కలిపి ఎలాంటి యంత్రాలు లేకుండా కూలీలతో రోడ్డుపై పరిచి చేతులతో చదును చేయించి రోలింగ్ చేయించారు. దీంతో రోడ్డంతా ఎత్తు, పల్లాలుగా మారింది. రోడ్డు అంచులు దూది పిందెలు మాదిరి ఊడిపోతూ తేలికపాటి వాహనాలు వెళ్లినా బద్దలుగా పగిలిపోతోంది. రోడ్డు పనులను కళ్లరా చూస్తున్న గ్రామస్తులు ఆగ్రహంతో పనులను అడ్డుకున్నారు. రోడ్డు వద్దని సంతకాలు పెట్టండి నిబంధనల ప్రకారం రోడ్డు పనులు చేయడం లేదని, రోడ్డంతా పెచ్చులుగా లేచిపోతుందని గ్రామస్తులంతా పనులను ఆపేశారు. దీంతో రోడ్డు అవసరం లేనట్లుగా గ్రామస్తులంతా సంతకాలు పెట్టాలని, ఇక్కడ కాకపోతే మరోచోట రోడ్డు వేయిస్తామని సైట్ ఇంజినీరు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు నాసిరకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నిబంధనల మేరకు కోల్డ్మిక్చర్తో పనులు చేయిస్తున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. కోల్డ్‌మిక్చర్ వేసిన 72 గంటలకు గట్టిపడి రోడ్డు పటిష్టంగా మారుతుందని అధికారులు అంటున్నారు. అయితే 13 రోజులు పూర్తయినా రోడ్డు మాత్రం పటిష్టంగా మారకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ పొలాలు ఉండడం వల్ల భవిష్యత్తులో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు ఈ మార్గంలో తిరుగుతాయి. అలాగే చెంబేడు, చెన్నప్పనాయుడుపేట, పునబాక, అర్ధమాల, అర్లపాడు, బంగారంపేట, నందిమాల, మోదుగులపాళెం, ఊడిపూడి తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన పెళ్లకూరుకు చేరుకోవాలంటే ఈ మార్గం బాగా ఉపయోగకరం. అయితే కోల్డ్‌మిక్చర్ పేరుతో నాసిరకంగా వేసిన రోడ్డు ఎంత కాలం ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చవటకండ్రిగ రోడ్డుకు ప్రాథమిక దశ పనులు చేస్తుండగా జూన్ 3న టిప్పర్ అధిక లోడుతో కంకర తీసుకెళుతుండగా వ్యవసాయ కాలువపై నిర్మించిన వంతెన భారీ టన్నేజీ వల్ల కూలిపోయింది. కేవలం రైతుల సౌకర్యార్థం తేలికపాటి వాహనాల్లో ఎరువులు తదితర వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్లేందుకు నిర్మించామని, భారీ వాహనాలు వెళ్లేందుకు కాదని ఇరిగేషన్ అధికారులు సంబంధిత లారీ యాజమాన్యంపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా రోడ్డు పనులు చేయిస్తున్న అధికారులు సైతం కూలిపోయిన వంతెన విషయం పట్టించుకోకుండా వంతెనకు ఇరువైపులా బీటీరోడ్డు పనులు చేస్తుండడం గమనార్హం. తేలికపాటి వర్షానికే కాలువలో నీరు చేరుతుందని, వంతెన కూలిపోవడం వల్ల అత్యవసర సమయాల్లో కష్టాలు తప్పవని గ్రామస్తులు అంటున్నారు. కోల్డ్‌మిక్చర్ పేరుతో పనులను నాసిరకంగా చేపట్టి, కూలిన వంతెన పనులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్ పనులపై పర్యవేక్షించి బీటీరోడ్డుతోపాటు వంతెన పనులు సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆ శాఖ డీఈ చైతన్యకుమార్ని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు వ్యవసాయ కాలువపై నిర్మించిన వంతెన టిప్ప ర్ వెళ్లడం వల్ల కూలిపోయింది. వంతెన పనులు చేయకుండా కేవలం రోడ్డు పనులు పూర్తి చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. – కన్నలి రోశయ్య, చవటకండ్రిగ గ్రామం వర్షాకాలంలో కష్టాలు తప్పవు వర్షా కాలంలో వరద ఉ ధృతి వల్ల వ్యవసాయ కా లువలో వరదనీరు అధి కంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గే వరకు గ్రా మానికి రాకపోకలు ఉండవు. వ్యవసాయ కాలువపై కూలిపోయిన వంతెన పనులు చేపట్టకుండా వదిలేశారు. వర్షాకాలంలో కష్టాలు తప్పవు. – పసల శేఖర్, చవటకండ్రిగ గ్రామం పనులన్నీ నాసిరకం రోడ్డు పనులన్నీ నాసిరకంగా చేస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి సిబ్బందిని ప్రశ్నిస్తే నిబంధనల ప్రకా రం వేస్తున్నామంటున్నారు. తేలికపాటి స్కూటర్ వెళ్లినా రోడ్డు లేచిపోతోంది. ఇంత అధ్వానంగా రోడ్డు పనులు ఎక్కడా చేపట్టి ఉండరు. మేమంతా అమాయకులైన దళితులం కాబట్టి అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. – గంధం వెంకటయ్య, చవటకండ్రిగ గ్రామం -
అమాయకులపై కేసులు పెట్టం
రాపూరు (నెల్లూరు): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి అమాయకులపై కేసులు పెట్టమని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృçష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నిర్దోషులపై కేసులు పెట్టమని, ఎవరూ భయపడొద్దన్నారు. దాడి కేసులో 35 మందిని గుర్తించామని, విచారణలో ఇద్దరు లేరని తెలిసి వారి పేర్లు తొలగించినట్లు చెప్పారు. ఇంకా 33 మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే 22 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హజరుపరిచామన్నారు. మిగిలిన 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. దాడికేసులో ఉన్న వారిపేర్లు శాంతి కమిటీకి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రాపూరులో 144 సెక్షన్ పెట్టలేదన్నారు. దళితవాడకు వందలమంది పోలీసులు వెళ్లలేదన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో కొందరు అసత్య పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రాపూరు పోలీస్‌స్టేçషన్లో మరో ఎస్సైని నియమిస్తామని, అలాగే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అంతకుముందు ఆయన ఎస్సై లక్ష్మణ్‌ను, కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాంబాబు, సిబ్బంది ఉన్నారు. జేసీ విచారణ దాడి కేసుకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం విచారణ చేపట్టారు. ఆమె తొలుత రాపూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ప్రత్యక్షసాక్షులతో మాట్లాడారు. దాడి ఎందుకు జరిగింది?, దాడికి ముందు జరిగిన పరిణామాలు, తొలుత ఎవరు ఎవరిపై దాడి చేశారు?, తదితర విషయాలను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్‌ను విచారించారు. స్టేషన్ బయటకు జేసీ వస్తున్న సమయంలో స్థానికులు రాపూరు ఎస్సైకి మద్దతుగా నినాదాలు చేసి మద్దతు ప్రకటించారు. అనంతరం జేసీ ఎస్సీకాలనీకి చేరుకుని అక్కడి దళిత మహిళలతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. నివేదికను ఆయనకు అందిస్తామని చెప్పారు. జేసీ వెంట ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాంబాబు, తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
యువ సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి
పొదలకూరు (నెల్లూరు): బెంగళూరులో జరిగిన రైలు ప్రమాదంలో మండలంలోని నల్లపాళెంకు చెందిన యువ సాప్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు వివరాలు.. ఆరునెలల క్రితం పార్లపల్లి సుబ్బారెడ్డి (27) బెంగళూరులోని సాప్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఈనెల 1వ తేదీ నుంచి అతను కనిపించడం లేదని కుటుంబసభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. అప్పటినుంచి వారు బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి విచారించడంతో సుబ్బారెడ్డి రైలు ప్రమాదంలో మృతిచెందినట్టు తెలిసింది. వెంటనే బంధువులు, స్నేహితులు మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఒక్కడే కుమారుడు నల్లపాళెంకు చెందిన పార్లపల్లి శేషారెడ్డికి సుబ్బారెడ్డి ఒక్కడే కుమారుడు. గతంలో అతను కేరళలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. తర్వాత ఇంటికి వచ్చేసి మళ్లీ ఆరునెలల క్రితం బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. ఉదయం కంపెనీకు వెళ్లే క్రమంలో లోకల్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయి సుబ్బారెడ్డి మృతిచెందాడు. అయితే రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించినా సరైన వివరాలు లభ్యం కాక వీలుపడలేదు. దీంతో వారు పోస్ట్‌మార్టం నిర్వహించి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. సుమారు వారంరోజులుగా సుబ్బారెడ్డి కనిపించకపోవడంతో స్నేహితులు, కుటుంబసభ్యులు హైరానపడి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా అనుమానించారు. చివరకు అతను మృతిచెందాడని తెలుసుకుని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సుబ్బారెడ్డికి తల్లిలేదు. తండ్రి పెంచాడు. అవివాహితుడైన కుమారుడి మరణవార్త తెలుసుకుని శేషారెడ్డి బోరున విలపిస్తున్నారు. -
తీరంలోనే లంగరు..
ప్రకృతి వైపరీత్యాలు.. పాలకుల నిషేధాజ్ఞలతో జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపల వేట తీరం దాటడం లేదు. సముద్రం నిండుగా చేపలు ఉన్నా.. అందులోకి వెళ్లి వేట చేయలేని దుస్థితి. తీరం వెంబడి సముద్రంలోకి వెళ్లే ముఖద్వారాల వద్ద ఇసుక మేటలతో వేట సాగించే బోట్లు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పూడికతీతకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో గంగపుత్రులు వేటకు దూరం అవుతున్నారు. వాకాడు(నెల్లూరు): జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులకు చేపల వేటకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వేట అంతంత మాత్రంగా సాగుతోంది. దీనికి తోడు పునరుత్పత్తి కాలంగా ఏటా రెండు నెలలు వేటను నిషేధిస్తున్నారు. మిగిలిన కాలంలో సజావుగా వేట సాగించడానికి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు వేటకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి తీర గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి ముఖద్వారాలు ఉన్నాయి. సముద్రంపై సజావుగా వేటసాగాలంటే సాగర ముఖద్వారాలు తెరుచుకుని నిండుగా నీరు ప్రవహించాల్సి ఉంది. మత్స్యకారులు తమ బోట్లను ఎలాంటి ఆటంకం లేకుండా సముద్రంలోనికి తీసుకెళ్లడం, వేట తర్వాత మత్స్య సంపదను తీరానికి చేర్చడానికి వీలు అవుతుంది. కానీ ప్రస్తుతం సముద్రంతీరం ఆటు, పోటుల కారణంగా అన్ని చోట్ల ముఖద్వారాల వద్ద 10 మీటర్లు ఎత్తులో ఇసుక మేటలు వేయడంతో పూడిపోయింది. వేటకు పాట్లు జిల్లాలో 14 చోట్ల సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ముత్తుకూరు, జువ్వలదిన్నె ముఖద్వారాలు మినహా మిగిలిన ద్వారాలు మూసుకుపోవడంతో మత్స్యకారులు వేటకు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని 113 మత్స్యకార గ్రామాలకు చెందిన 6 వేల ఫైబర్ బోట్లపై ఆధారపడిన 60 వేల మంది మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సముద్రుడు కరుణించడంతో మత్స్యకారులకు ఇప్పుడు మత్స్యసంపద దండిగా దొరుకుతుంది. అయితే మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లలేక తమ బోట్లకు తీరం ఇవతలే లంగర్ వేయాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని పాలకులు, అధికారులు మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీతను పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ కాపులు, మత్స్యకారులు సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సభల్లో విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మత్స్యకారులే అప్పులు చేసి ఏటా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ముఖద్వారాల పూడిక తీత పనులు చేయించుకుంటున్నారు. జిల్లాలో వాకాడు, కోట, చిల్లకూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో మత్స్యకారులే చందాలు వేసుకుని ప్రస్తుతం ముఖద్వారాల పూడికలు తీయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాకాడు మండలం కొండూరుపాళెం సముద్ర ముఖద్వారం వద్ద మత్స్యకారులు పూడిక పనులను వేగంగా సాగిస్తున్నారు. నిషేధ కాలానికి పరిహారం.. కాగితాలకే పరిమితం రెండేళ్లుగా వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే సాయం కాగితాలకే పరిమితమైంది. గతంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట విరామం కింద రూ. 2 వేలు సాయం అందించే వారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రెట్టింపు చేసి రూ.4 వేలు సాయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మత్స్యకారుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ రోజులు గడిచే కొద్దీ నిరాశే మిగిల్చింది. వేట విరామం నగదు సాయం కోసం జిల్లాలో అధికారికంగా 3,500 బోట్లు, 21 మర పడవలపై ఆధారపడిన 15 వేల మంది మత్స్యకారులు నమోదు చేసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ విధిగా ఉండాలని మెలిక పెట్టి ఆంక్షలు విధించడంతో రెండేళ్లుగా దాదాపు 10 వేల మందికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వేట విరామంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించి ఉంటే మత్స్యకారులకు కొంత మేర ఉపయోగపడేది. కానీ రెండేళ్లుగా ఒక్కపైసా కూడా అందకపోవడం, వేట సజావుగా సాగకపోవడంతో మత్స్యకారులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తీర గ్రామాల్లోని ముఖద్వారాల వద్ద పూడిక తీత పనులకు చర్యలు చేపట్టాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుచున్నారు. నెల రోజులుగా వేట లేదు సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నెల రోజులుగా వేట చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. తూపిలిపాళెం, కొండూరుపాళెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు చందాలు వేసుకుని రూ. 5 లక్షలు వ్యయంతో పూడిక తీయిస్తున్నారు. – మేలంగారి పోలయ్య, కాపు కొండూరుపాళెం రెండేళ్లుగా డబ్బులు రావడం లేదు రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను అధికారులు తప్పులుగా ఉన్నాయంటూ మెలిక పెట్టి రెండేళ్లుగా వేట విరామం డబ్బు ఇవ్వడం లేదు. నిజంగానే ఆధార్, రేషన్ కార్డులు తప్పులుగా ఉంటే తమకు రేషన్, పింఛన్, బ్యాంక్, తదితర లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షాన ఉన్న అధికారులు ఆడుతున్న నాటకం మాత్రమే. గత ప్రభుత్వంలో వేట విరామం నగదు సకాలంలో అందేది. – కె. రాజు, మత్స్యకారుడు, కొండూరుపాళెం సముద్ర ముఖద్వారాల పూడిక పనులపై ప్రభుత్వానికి నివేదించాం ఇసుక మేటలతో పూడిపోయిన సముద్ర ముఖద్వారాల పూడిక పనుల విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. పూడికతీత పనులు వేల రూపాయలతో జరిగేవి కావు. రూ.లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – కె రమేష్‌బాబు, ఎఫ్డీఓ -
భద్రత నిల్
నెల్లూరు రూరల్ : గురుకుల పాఠశాలల్లో బాలికలకు రక్షణ కరువవుతోంది. ప్రిన్సిపల్స్ తప్ప మిగతా సిబ్బంది, అధ్యాపకులు అవుట్ సోర్సింగ్ కావడంతో వారిలో బాధ్యత కొరవడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. రెగ్యులర్ అధ్యాపక సిబ్బంది లేకపోవడం, అరకొర అద్దె భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కొరతతో పాటు భద్రత కరువవడంతో విద్యార్థినులు క్షణ క్షణం భయంతో గడుపుతున్నారు. నెల్లూరులోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచార సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ..ఈ నేపథ్యంలో గురుకులాల భద్రతపై సాక్షి ప్రత్యేక కథనం..గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గురుకుల పాఠశాల ద్వారా సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయడం లేదు. నేటికీ అద్దెభవనాల్లో చాలీచాలని గదుల్లో నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యంతో గురుకులాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. హాస్టళ్లలోని బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్తకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్నవాటికి కన్నాలు పడి ఉన్నాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం మరిచారు. బాలికల గురుకులాల్లో రక్షణ కరువవుతోది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, రక్షణగా ఉండాల్సిన సిబ్బంది బాలికలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పరువు పోతుందని బాధిత విద్యార్థులను భయపెట్టి దారుణాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకరిద్దరు ధైర్యం చేసి తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారికి న్యాయం జరగడం లేదు. నెల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో గత నెల 21వ తేదీన అత్యాచారం జరిగిందని చిన్నారి టీచర్‌కు, వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణానికి పాల్పడిన వారు దొరికేవారు. బంధువులు కేసు పెట్టినా ఉన్నతాధికారులు రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో గురుకులాల్లోని బాలికలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 43 గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ వెంకటగిరి, ఉదయగిరి, చిలమానుచేను, తుమ్మలపెంట, ఆత్మకూరు, గండిపాళెం, నెల్లూరులోని మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురంలో బాలికల గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల బాలుర గురుకుల పాఠశాలు నడుస్తున్నాయి. అదే విధంగా చెన్నూరు, ఓజిలి, సర్వేపల్లి, నెల్లూరు నగరంతో పాటు మొత్తం 13 మినీ గురుకులాలు గిరిజన కురులకు పాఠశాలలు నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోట, దొరవారిసత్రం, గొలగమూడిలో గురుకులాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కావలి నియోజకవర్గంలోని నార్త్ అమలూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల్లోని బాలికల హాస్టల్స్, సర్వేపల్లి నియోజకవర్గంలోని మహ్మదాపురం, వెంకటగిరి బాయ్స్ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, కుదురు, నాయుడుపేట, కండలేరు, డక్కిలి, ఆదూరుపల్లి, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, కోడూరు, కావలి, ముత్తుకూరులోని బాలికల గురుకులాలు, నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు బాలురు మొత్తం 14 ఎస్సీ, గురుకులాలు నడుస్తున్నాయి. కొడవలూరు: గిరిజన బాలికల కోసం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ఉంది. ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్న పాఠశాలలో 554 మంది బాలికలుండగా, జూనియర్ కళాశాలలో 220 మంది విద్యార్థినులున్నారు. వీరి భద్రత కోసం పాఠశాల, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా కాపాలాదార్లు, ఇద్దరు మహిళా పీఈటీలు రాత్రిళ్లు గురుకులంలోనే ఉండేలా చర్యలు తీసుకొన్నారు. పాఠశాల, కళాశాలకు కలిపి 35 మంది దాకా బోధన సిబ్బంది ఉండగా, వీరందరికీ ఇక్కడే క్వార్టర్ల సౌకర్యం ఉండడంతో రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రాకుండా చూస్తున్నారు. సంగంలో లేదు భద్రత సంగం: సంగంలో నెల్లూరు – ముంబయి జాతీయ రహదారి పక్కన ఉన్న సంగం గురుకుల కళాశాలలోని బాలికల భద్రత అంతంత మాత్రంగానే ఉంది. గురుకుల కళాశాలలో 640 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్యను అభ్యసిస్తున్నారు. 34 మంది టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులు ఈ కళాశాలలో పనిచేస్తున్నారు. కొండకు దిగువ భాగంలో కళాశాల ఉండడంతో పై నుంచి వచ్చే వారు గురుకుల కళాశాలకు ప్రవేశించేందుకు అనువుగా ఉంది. కళాశాలలో మహిళా వాచ్మెన్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఏదైనా జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం గస్తీ నిర్వహించకపోవడంతో విద్యార్థినులు భయాందోళలకు గురవుతున్నారు. గతంలో ఓ యువకుడు గురుకుల కళాశాలలోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి హల్చల్ సృష్టించిన సంఘటన ఉంది. అయినా ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. -
చిక్కుల్లో నేత
అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయి. మగ్గంపై రేయింబవళ్లు కష్టపడినా మూడు పూటలా నోట్లోకి ఐదు వేళ్లు పోవడంలేదు. వీరి కష్టానికి ఖరీదు దక్కడంలేదు. అపర బ్రహ్మలుగా కీర్తించబడుతున్న చేనేతలకు చేయూత ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. వెంకటగిరి (నెల్లూరు): చేనేతల కష్టానికి ఖరీదు అందడంలేదు. చేనేత పరిశ్రమలో ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మాస్టర్ వీవర్లు కార్మికులను దోచుకుంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల్లో దయనీయస్థితి ఏర్పడింది. కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో మగ్గం అటకెక్కింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వెంకటగిరి, చెన్నూరు, ఇందుకూరుపేట, మడమనూరు, దంపూరు, వావిళ్ల, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు, నేదురుమల్లి, కసుమూరు, పాలిచర్లపాడు ప్రాంతాల్లో చేనేత కార్మికులు నివసిస్తున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు మగ్గంలో నలిగిపోతున్నారు. విదేశాల్లో చేనేత వస్త్రాలకు ఆదరణ అభివృద్ధి చెందిన దేశాల్లో చేనేత వస్త్రాలు ధరిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందంతో పాటు దర్పణానికి ప్రతీ కలుగా చేనేత వస్త్రాలు నిలుస్తున్నాయి. చేనేత వస్త్రాలు ఆరో గ్యానికి ఎంతో ఉపయుక్తం కావడంతో ఈ వస్త్రాలకు విదేశాల్లో సైతం డిమాండ్ పెరుగుతుంది. చేనేత వస్త్రాలకు గిరాకీ ఉన్నా చేనేత కళాకారు ల బతుకులు మాత్రం దిగజారిపోతున్నాయి. నేతల బతుకులను రక్షించాల్సిన చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. స్వాతంత్య్రం కోసం ఉద్యమ స్ఫూర్తి ని రగిలించిన ఘనత చేనేత రంగానిదే. ఉద్యమసారథి మహాత్మాగాంధీ విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్త్రాలపై పేటెంట్ హక్కును పొందిన ఘనత చేనేత కళాకారులదీ. కాగా వెంకటగిరి చీరలకు 2009లో జీఐ (జియాలాజికల్ ఐడెంటిఫికేషన్) గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపుతో తమ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి బతుకులు గాడిన పడుతాయనుకున్న నేత కళాకారులకు తొమ్మిదేళ్లుగా ప్రత్యేకంగా ఒరింగిదేమీ లేదు. పరిశ్రమను బతికిస్తున్న సృజనాత్మకత సృజనాత్మకశక్తిని ఉపయోగించి ఎన్నో కొత్త డిజైన్లను సృష్టించడంలో వెంకటగిరి చేనేత కళాకారులు సిద్ధహస్తులు. ఇక్కడి కార్మికుల సృజనాత్మకతో రూపుదిద్దుకున్నదే జాందానీ వర్క్ చీరలు. వెంకటగిరి చీరలకు జింధానీ వర్క్‌తో అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉంది. చీర డిజైన్ నేయడంలో జాందానీ వర్క్ ఉంటే ఇరువైపులా ఒకే రకంగా డిజైన్ కనిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకతతో చీరలు నేయడం దేశంలో ఎక్కడా కనిపించదు. బంగ్లాదేశ్‌లో జాందానీ వర్క్‌తో చీరలు నేస్తారు. ఆ విధానంలో నైపుణ్యతను పెంచుకుని ఇక్కడి కార్మికులు ప్రత్యేకతను చాటుతున్నారు. జాంధానీ వర్క్‌తో మగ్గాల మీదనే నేయడం వలన ప్రత్యేకత ఉంది. జాతీయ అవార్డులు.. మారని బతుకులు రాష్ట్రపతి, ప్రధానిమంత్రి నుంచి జాతీయ అవార్డులు అందుకున్నా.. చేనేతల తలరాతలు మారడం లేదు. 1950లో వెంకటగిరి పట్టణానికి చెందిన బోగా వెంకటసుబ్బయ్య తొలిసారిగా జాతీయ చేనేత పురష్కారం అందుకున్నారు. ఆ తర్వాత గునకుల వెంకటేశు, బత్తిన సుబ్బరాయులు ఈ అవార్డులను అందుకున్నారు. 1987లో దొంతు సంజీవి, 1989లో డక్కిలి మండలం మార్లగుంటకు చెందిన కలవలపూడి వీరా స్వామి, 1996లో కూనా మల్లికార్జున్, 1999లో భో గా రాములు, 2000లో సజ్జావీరయ్య, 2005లో గౌరాబత్తిన రమణయ్య, పట్నం మునిరాజా జాతీ య (రాష్ట్రపతి) అవార్డులు పొందారు. 2014లో వెంకటగిరి పట్టణం బొప్పాపురానికి చెందిన లక్కా శ్రీనివాసులు వెంకటగిరి చీరలో గోవర్ధనుడైన రాధాకృష్ణులను నేసి జాతీయ (రాష్ట్రపతి) అవార్డుకు ఎంపికయ్యారు. 2015లో పట్నం చీరాలరెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది వెంకటగిరి పట్టణం కట్టెలవీధికి చెందిన పట్నం మునిబాబు జాతీయ అవార్డుకు ఎంపికయి మంగళవారం జమ్మూలో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఎంతో మంది ఇక్కడి చేనేత కళాకారుడు జీవిత చరమాంకంలో కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కళాకారులును ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూ త ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేనేతల డిమాండ్లు ఇవీ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు వంటి వాటి ద్వారా చేయూత అందించాలి. నేత కార్మికులకు స్టాండ్ మగ్గాలు అందించాలి. నేత పనులకు అవసరం అయిన నూలు, జరీ, వంటి ముడిసరుకులు సబ్సిడీపై అందించేందుకు చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయాలి. చేనేత ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి. చేనేతను జౌళి శాఖ నుంచి వేరు చేసి బడ్జెట్ నిధుల కేటాయింపులు నేరుగా చేనేతల సంక్షేమానికి వినియోగపడేలా చర్యలు తీసుకోవాలి. చేనేతలకు పింఛన్, పక్కాఇల్లు, ఆరోగ్యబీమా వంటి పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రభుత్వం ప్రోత్సహించకుంటే కనుమరుగే చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుంటే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిల్క్‌సబ్సిడీ రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఇస్తున్న రూ.600 సబ్సిడీని సైతం నిలిపివేసింది. వడ్డీ లేకుండా చేనేతలకు రుణాలు అందించాలి. – కూనా మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డుగ్రహీత, వెంకటగిరి -
50 నెలల తర్వాత హామీలు గుర్తుకొచ్చాయా!
వెంకటాచలం(నెల్లూరు): అధికారంలోకి వచ్చి 50 నెలలైన తర్వాత ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పాలన అవినీతిమయమైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అభివృద్ధి మాటున ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రుణమాఫీ ఇలా ఎన్నో హామీలిచ్చి బాబు ప్రజలను మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులుంటే 12 లక్షల మంది ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి చెందిన వారు మాత్రమే లబ్ధిపడేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు విధానాల కారణంగా రాష్ట్రంలో టీడీపీ ఉనికి దాదాపుగా కోల్పోయిందన్నారు. ధనార్జనే ధ్యేయంగా.. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంజూరైన అభివృద్ధి పనుల్లో రూ.కోట్లు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నీరు–చెట్టు పనులతో సోమిరెడ్డికి ప్రయోజనం చేకూరింది తప్ప రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నిత్యం ఏదోఒక పనిలో కమీషన్ల రూపంలో దోచుకోందే సోమిరెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు. వెంకటాచలం పోలీస్‌స్టేషన్ వద్దకు ఎప్పుడు వెళ్లినా టీడీపీ నాయకుల గ్రావెల్ టిప్పర్లు, జేసీబీలు కనిపిస్తున్నాయంటే మంత్రి అవినీతిని ప్రోత్సహించినట్టు కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కట్టంరెడ్డి విజయ్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, నాయకులు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌నాయుడు, విజయభాస్కర్ నాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చికెన్ లేదు.. గుడ్డూ లేదు
వసతిగృహ విద్యార్థుల్లో కొత్త మెనూ కర్రీల అమలు వర్రీగా మారింది. కొత్త మెనూ ప్రకటించినా..అందుకనుగుణంగా మెస్ చార్జీలు లేకపోవడంతో మెనూకు కొర్రీ పడింది. హాస్టళ్లలో విద్యార్థులకు ఇంటి తరహా భోజనం పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలని చెప్పింది. అయితే అది అమలుకు నోచుకోకపోవడంతో ప్రకటనకే పరిమితమైంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, టమాటా సాంబారు, రసాలతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నెల్లూరు రూరల్: వసతిగృహాల్లో కొత్త మెనూ అమలు కాకుండానే మంగళం పాడేశారు. జూలై 1వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తో పాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనందనిలయాల్లో వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలంటూ కొత్త మెనూ చార్ట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అందు కోసం విద్యార్థులకు మెనూ చార్జీలను కూడా స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోల్చితే మెస్ చార్జీలు నామమాత్రమే పెరిగాయని, దీనికి తోడు మారిన మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని బోలెడంత ఖర్చు అవుతుందని వార్డెన్లు చేతులెత్తేశారు. కోడికూరతో మంచి భోజనం చేయొచ్చని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. సొంత లాభం చూసుకుంటూ వార్డెన్లు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మెనూ అమలు చేయకుండా పేద విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారు. బిల్లులు మాత్రం కొత్త మెనూ ప్రకారం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెనూ అమలులో సందిగ్ధం జిల్లాలో ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టళ్లు 189 ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ పెట్టాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గతంలో ఇచ్చే మెస్ చార్జీలను కళాశాల వసతి గృహాలకు రూ.350, 8, 9, 10 తరగతులకు రూ.400, 3 నుంచి 7వ తరగతి వరకు రూ.250 పెంచింది. స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేంచేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చితే ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్ల వాదన. ధరలు ప్రకటించరేం? మెనూ చార్జీ ప్రకారం ఎంతెంత ధరల్లో కొనుగోలు చేయాలోనన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఉన్న మెనూకు అదనంగా పాలు, పెసరపప్పు, పొంగల్, చికెన్, వేరుశనగ ఉండలు, చెట్నీ, పూరీ, బఠానీ, బంగాళదుంప కుర్మా వంటివి చేర్చారు. కానీ ఈ సరుకులను ఏ ధర పెట్టి కొనుగోలు చేయాలన్న విషయాన్ని తేల్చలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.70పైగా అవుతుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఎంత ఉంటాయోనన్న ఆందోళనలో వార్డెన్లు ఉన్నారు. గురుకులాల్లో అయితే మధ్నాహ్న భోజన పథకం ఉండదు కాబట్టి వీటికి ఇంకా అదనపు ఖర్చు అవుతుందని, కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలేమని చేతులెత్తేస్తున్నారు. సమస్యలు తీర్చకుండానే.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న వసతిగృహాల్లో చాలా చోట్ల ప్లేట్లు లేవు. ఒక్కో వసతిగృహంలో వందకుపైగా విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గ సిబ్బంది లేరు. మరో పక్క వాచ్మన్లు, సహాయకులు, వంట మనుషులు కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. చాలాచోట్ల చాలీచాలని గదుల్లో విద్యార్థులు మగ్గుతున్నారు. ఇన్ని సమస్యలున్నా పట్టించుకోని ప్రభుత్వం అరకొరగా మెస్ చార్జీలు భారీగా పెంచామని ప్రచారం చేసుకుంటుంది. వాటిని అమలు చేసేందుకు వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. పెంచడం సరే ధరలెలా? మెనూ చార్జీలు ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. మాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. ఏ ఐటమ్ ఎంత రేటుకు, ఎన్ని గ్రాములు పెట్టాలనేది స్పష్టత లేదు. ఈ విషయమై రాష్ట్ర డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిని విన్నవించాం. ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఇప్పుడు ఒక్కో విద్యార్థికి రూ.25లకు పైగా అదనంగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం పెట్టే ధరలెలా ఉంటాయో దానిపై అమలు ఆధారపడి ఉంటుంది. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – ఈ.విజయకుమార్ , ఏపీ హాస్టల్ వెల్ఫేర్ అఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
కొడుకుని చూసి వెళుతుండగా..
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గురుకులంలో చదువుతున్న కొడుకుని చూసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ వ్యక్తి మండల పరిధిలోని పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కోట మండలం లక్ష్మయ్యకండ్రిగ గ్రామానికి చెందిన కె.మాతయ్య (35) ఆదివారం తన భార్యతో కలిసి దొరవారిసత్రంలో ఉన్న గురుకులంలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి గ్రామానికి బయలుదేరారు. తాను ఇంటికి మళ్లీ వస్తానని భార్యను నాయుడుపేటలో బస్టాండ్‌లో కోట బస్సు ఎక్కించాడు. అనంతరం మాతయ్య ఒక్కడే బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చేసరికి గుండెనొప్పిగా ఉందని బైక్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాతయ్య మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాతయ్య మృతిచెందినట్లు తెలుసుకున్న భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా?
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గాలో మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని, మరుగుదొడ్లు పరిశుభ్ర పరిచి ఉపయోగంలోకి తెస్తారా లేక తానే శుభ్రం చేయమంటారా అని నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని బారాషహీద్ దర్గా ఆవరణలోని మరుగుదొడ్లు, ఘాట్ పనుల్లో లోపాలను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా నెల్లూరుకు గర్వకారణమన్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాను సందర్శిస్తుంటారని తెలిపారు. రూ.కోట్లు ఖర్చు చేసి మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లులో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. తాను వస్తున్నానని తెలుసుకుని అప్పటికప్పుడు తూతూమంత్రంగా పైపై పనులు చేశారని పేర్కొన్నారు. ఘాట్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తేదీ ఉదయం 10 గంటలలోపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలసి రాజకీయాలకు అతీతంగా గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలుపుతానన్నారు. అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా శుభ్రం చేస్తానని చెప్పారు. మహిళా మరుగుదొడ్లు పక్కన మందు సీసాలు ఉండటం గమనించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరులో భాగంగా పచ్చదనం పెంపొందిస్తామని గోడలపై రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. బారాషహీద్ దర్గాలో చెట్లు ఎండిపోవడంపై ఇదే మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌లు చేస్తున్న స్వచ్ఛ నెల్లూరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, బొబ్బల శ్రీనివాసయాదవ్, అంజా హుస్సేన్, మాళెం సుధీకర్కుమార్రెడ్డి, ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ స త్తార్, రియాజ్, మిద్దె మురళీకృష్ణయాదవ్, సందానీ బాషా, చిన్న మస్తాన్, అలీ నావాజ్, యాకసిరి శరత్చంద్ర, ఎం.శ్రీకాంత్‌రెడ్డి, టీవీఎస్ కమల్, రా మరాజు, మా దా బాబు, జగదీష్, సింహాచలం, మేఘనాధ్‌సింగ్, యనమల శ్రీహరియాదవ్, హ జరత్నాయుడు, తుమ్మల శీనయ్య, తాళ్లూరు సురేష్, కట్టా వెంకటరమణయ్య, ప చ్చారవి, మొయిళ్ల సురేష్, ఆండ్ర శ్రీనివాసులు, పేనేటి సుధాకర్, వే ల్పూలు అజ య్, గజరా నరేష్, కమల్‌రాజ్, హయద్ బాషా, పెద్ద మస్తాన్, తారీఖ్, మందాపెద్దబాబు, దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
నీళ్లో నారాయణా..!
ఓ వైపు కార్పొరేషన్ అధికారులు నీళ్లు ఇవ్వరు.. మరోవైపు భూగర్భజలాలు అడుగంటి బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆరు నెలలుగా నెల్లూరు ప్రజలు గుక్కెడు నీటికోసం కటకటలాడుతున్నారు..నిత్యం 105ఎంఎల్డీ నీటిని నెల్లూరు నగరవాసులకు అందించాల్సి ఉంది. అందులో సగం కూడా సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం కార్పొరేషన్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. సాక్షాత్తూ మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ నివాసం ఉంటున్న నగరంలోనే నిధుల్లేవ్.. నీళ్లు ఇవ్వలేమంటున్నారు అధికారులు. ‘నీళ్లో నారాయణా’ అంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు మున్సిపల్ పైప్లైన్ల ద్వారా వచ్చేనీరు నిలిచిపోవడం.. మరోవైపు భూమిలో నీళ్లు ఇంకిపోవడంతో ఆరు నెలలుగా ప్రజలు నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రోడ్ల తవ్వకాలు జరిపిన సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోతోంది. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లు, 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. సుమారు 7 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు రోజూ 105ఎంఎల్డీ నీటిని అందించాల్సి ఉంది. అయితే కేవలం 85ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 60ఎంఎల్డీ నీటిని కూడా సరఫరా కావడం లేదు. పెన్నానది, బుజ్జమ్మరేవు, సమ్మర్ స్టోరేజీట్యాంకు నుంచి కార్పొరేషన్ తాగునీటిని సరఫరా చేస్తోంది. రోజుకు 85ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. పెన్నానది నుంచి 49 ఎంఎల్డీ, బుజ్జమ్మరేవు నుంచి 6 ఎంఎల్డీ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి 18 ఎంఎల్డీ, మిగిలిన నీటిని బోర్‌వెల్స్ నుంచి 12 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు సార్లు మాత్ర మే నీరు సరఫరా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. తవ్వకాల్లో తుక్కవుతున్న పైప్లైన్లు కార్పొరేషన్ పరిధిలో రూ.1100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎల్ఎండ్టీ, మెగా కంపెనీలు దక్కించుకోగా ఆయా కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాయి. దీంతో సబ్‌కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో వాటర్ పైప్లైన్లు ధ్వంసమవుతున్నాయి. పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు కావడంతో కార్పొరేషన్ అధికారులకు ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో కూడా స్పష్టత లేకుండాపోతోంది. కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్ల తవ్వకాల్లో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ దెబ్బతింటుండడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటర్ పైప్‌లైన్ ఎక్కడ పగిలిందో తెలుసుకునేందుకే కార్పొరేషన్ అధికారులు వారాలపాటు సమయం తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు అవస్థ తప్పడం లేదు. 150 అడుగులు బోర్లు వేయాల్సిందే.. నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, ఎన్టీఆర్నగర్, మైపాడుగేటు. కిసాన్‌నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, జండావీధి, ఫత్తేకాన్‌పేట తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం వరకు 50 అడుగుల లోతులో బోర్లు వేస్తే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం పెన్నాకు సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సైతం 100 అడుగులు పైనే బోర్లు వేయాల్సి వస్తోంది. ఇక పొదలకూరు రోడ్డు, దర్గామిట్ట, అయ్యప్పగుడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 150 అడుగుల వరకు బోరు వేయాల్సి వస్తోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్‌లో నీటికి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ► జూన్ నెలలో స్టౌన్‌హౌస్‌పేటలోని జలకన్య బొమ్మ వద్ద ఓ పైప్‌లైన్ పగిలింది. దీంతో బాలాజీనగర్‌లోని దాదాపు 5000 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్ అధికారులు వారం రోజులపాటు ఎక్కడ సమస్య ఉందో తెలుసుకునేందుకు అన్వేషించాల్సి వచ్చింది. అయితే ఓ కంపెనీ జరిపిన రోడ్ల తవ్వకాల్లో పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు తెలిసింది. లెక్కల్లోనే ట్యాంకర్ నీరు సరఫరా పొదలకూరురోడ్డు, చంద్రబాబునగర్, భగత్‌సింగ్‌కాలనీ, సమతానగర్, నాగమ్మకాలనీ, ఆర్టీసీ కాలనీ, రామ్‌నగర్, కొత్తూరు, వేదాయపాళెం, బుజబుజనెల్లూరు తదితర శివారు ప్రాంతాలకు 22 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 117 ట్రిప్పులు నీరు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే ప్రతి రోజూ నీటి ట్యాంకర్ రాకపోవడంతో నీటి కోసం ఆ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. మురుగునీరు సరఫరా.. 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారానే కార్పొరేషన్ నగర ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది. పాత పైప్‌లైన్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌కు రంధ్రాలు ఏర్పడి మురుగునీరు సరఫరా అవుతోంది. మరోవైపు భూగర్భడ్రైనేజీ పనుల కారణంగా కార్పొరేషన్ వాటర్ పైప్లైన్లు దెబ్బతింటున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలకు మురుగునీరే దిక్కైంది. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, స్టౌన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, కోటమిట్ట, మన్సూర్‌నగర్, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాలాజీనగర్‌లో వారం రోజులుగా నీరు రావడం లేదు. పైప్‌లైన్ పగలడం కారణంగా వారం రోజులుగా దాదాపు 20 వేల మంది తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు ► మూలాపేటలోని నీలగిరి సంఘం ప్రాంతాల్లో ఇటీవల తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తున్న సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో మూలాపేటలోని వందల ఇళ్లకు వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులకు చెప్పినా మరమ్మతులు చేస్తున్నామని, పని పూర్తయ్యే వరకు వేచి చూడాలని సూచన ఇవ్వడం గమనార్హం. ► స్టౌన్‌హౌస్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పనుల నేపథ్యంలో వాటర్ పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో 20 రోజులపాటు మురుగునీరు సరఫరా అయ్యాయి. కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
నెల్లూరు(క్రైమ్): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ పాతదొంగను నెల్లూరు సీసీఎస్, సంతపేట పోలీసులు «శుక్రవారం అరెస్ట్ చేశారు. నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. సంతపేట ఈద్గామిట్టకు చెందిన ఎస్కే అక్బర్ పాతనేరస్తుడు. గతంలో పలుమార్లు దొంగతనం కేసుల్లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్, సంతపేట పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, బి.పాపారావులు నిందితుడిపై నిఘా ఉంచారు. శుక్రవారం పోలీసులు ములుముడి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అక్బర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారించగా పలు దొంగతనాలు చేసినట్టు నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.2 లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలియజేశారు. నేరాలివే.. 2017 జూలైలో కుక్కలగుంటలో, అదే ఏడాది నవంబర్‌లో మన్సూర్‌నగర్‌లో, 2018 జనవరిలో పాతమున్సిప ల్ క్వార్టర్స్ వద్ద, మార్చిలో మన్సూర్‌నగర్‌లో, జూన్‌లో కుక్కలగుంట ప్రాంతంలో అక్బర్ దొంగతనాలు చేశా డు. నిందితుడిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాŒసైదా, బి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.మురళీప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, ఎం.మహేశ్వరరావు, కానిస్టేబుల్స్ జి.ప్రభాకర్, సీహెచ్ శ్రీనివాసులు, పి.సాయి ఆనంద్‌లను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేతుల మీదుగా వారికి రివార్డులు అందిస్తామన్నారు. -
రాపూరులో టెన్షన్..టెన్షన్
రాపూరు(ప్రకాశం): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగి మూడురోజులు అవుతున్నా పోలీస్ పికెట్ శుక్రవారం కూడా కొనసాగింది. దాడి చేసిన వారిని ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాడికి సంబంధించిన వారందరనీ అరెస్ట్ చేసే వరకు పోలీస్ పికెట్ కొనసాగుతుందని తెలుస్తోంది. దళిత వాడలో ఇప్పటికి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దళితవాడలో సాయుధ బలగాలతోపాటు మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అలాగే రాపూరు ముఖ్యకూడళ్లలో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత మంది పోలీసులను చూడని స్థానిక ప్రజలు ఇప్పడు పట్టణంలో తిరుగుతుండటం చూస్తుండటంతో భయాం దోళనకు గురవుతున్నారు. గూడూరు డీఎస్పీ రాంబా బు రాపూరులోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. దాడికి సంబంధం లేని వారిని విడిచిపెట్టాలి పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన సంఘటనలో దాడికి సంబంధంలేని వారిని వెంటనే విడిచిపె ట్టాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, గూడూరు, వెంకటగిరి నియోజవర్గ కార్యదర్శులు కుమార్, చెంగయ్య కోరారు. ఈ మేరకు రాపూరు పో లీసులకు శుక్రవారం వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దాడికి సంబంధంలేని వెంటనే విడుదల చేసి దాడికి పాల్పడినవారిని శిక్షించాలని కోరారు. -
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు
-
రాపూర్ పోలీస్‌స్టేషన్ దాడి కేసులో పురోగతి
-
నెల్లూరు జిల్లా కలువాయి పీఎస్‌ను ముట్టడించిన గ్రామస్థులు
-
బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం
తోటపల్లిగూడూరు( నెల్లూరు): మండలంలోని కోడూరు బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బుధవారం బయటపడింది. ఎవరో చంపి మృతదేహాన్ని ఇసుకలో కప్పిపెట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడూరు బీచ్ కుడివైపున, ఏపీ టూరిజం రిసార్ట్స్ ఎదురుగా ఉన్న ఇసుక దిబ్బల్లో ఇసుకతో కప్పబడిన ఓ మృతదేహాన్ని బుధవారం స్థానిక మత్స్యకారులు గుర్తించారు. వారి సమాచారంతో నెల్లూరు రూరల్ డీఎస్సీ రాఘవరెడ్డి, ఎస్సై శివకృష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొండం మొత్తం ఇసుకలో కప్పబడి తల మాత్రమే పైకి కనిపిస్తున్న మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది వెలికితీశారు. సుమారు పది రోజుల క్రితం యువకుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి తల పూర్తిగా కుళ్లిపోయి ఉండగా తల వెనుకభాగాన గట్టి దెబ్బ ఉన్నట్టు గుర్తించారు. యువకుడు బ్లూ జీన్స్ ప్యాంట్, నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడు. అలాగే చేతి వేలికి లవ్ గుర్తు రింగ్ ఉంది. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కావలిలో యువకుడి దారుణ హత్య
-
పల్లె పాలన..ఇక ప్రత్యేకం
నెల్లూరు(అర్బన్): పల్లె పాలన..ఇక ప్రత్యేకం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరన్నారు. జిల్లాలో 940 మంది సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ముందుగా ఊహించినట్టుగానే ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం జీఓ నంబర్ 269ను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచ్‌లు మాజీలయ్యారు. పల్లెపాలన సాగేందుకు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ తదితర క్యాడర్ కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిబంధనలు ఉండటంతో ఆ దిశగా కలెక్టర్, డీపీఓ చర్యలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ఇక ప్రత్యేక పాలనే అంటూ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించింది. ఈ విధివిధానాల ప్రకారమే అధికారులు పారిశుద్ధ్యం, కార్మికుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా, పైపులైను మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్లు, పబ్లిక్ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే జరిమానా సైతం విధించవచ్చు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ సభల తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు జరిగేవి. ఇప్పుడు గ్రామ సభల తీర్మానాలు అవసరం లేదు. ప్రత్యేకాధికారులే అభివృద్ధి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన పర్ కాపిటా(తలసరి నిధులు), ఎస్డీఎఫ్ (రాష్ట్రాభివృద్ధి నిధులు) వంటి నిధులను సైతం కొన్నేళ్లుగా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చే నిధులపైనే పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోనున్నాయి. దీంతో అభివృద్ధి పనులకు నిధుల గండం పొంచి ఉంది. దీంతో అభివృద్ధి కుంటుపడనుంది. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా పంచాయతీ అ«ధికారి సత్యనారాయణను వివరణ కోరగా గురువారమే నియమిస్తామని తె లిపారు. పాలన యథావిధిగా జరుగుతుందన్నారు. -
ఇంజినీరింగ్ పల్టీ
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆశలు, కలలు, ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయి. గత రెండు.. మూడేళ్లుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లా మొత్తంగా ఉన్న కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా, రెండు కళాశాలల్లో ‘0’ శాతం, మరో రెండు కళాశాలల్లో 4 శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరాల్లో భర్తీ కానీ సీట్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): ఒకప్పుడు విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో అయినా పర్వాలేదు సీటు దొరికితే చాలు అదృష్టంగా భావించే వారు. అప్పట్లో కళాశాలల యాజమాన్యం చెప్పిందే వేదం. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒక్క విద్యార్థి దొరికితే చాలు కళాశాలను నడుపుకుందామనే ధోరణిలో పలు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆయా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్ సమయంలో 106 మంది జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 56.56 శాతం భర్తీ ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ గత నెల 31తో ముగిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. కావలి ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రం 90.82 శాతం సీట్లు భర్తీ అయి ప్రథమ స్థానంలో, ఆ తర్వాత 88.62 శాతం భర్తీతో నారాయణ రెండో స్థానంలో నిలిచాయి. 87.04 శాతంతో శ్రీవెంకటేశ్వర మూడో స్థానం, 85.98 శాతంతో గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల నాలుగో స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,245 సీట్లు ఉన్నాయి. వాటిల్లో మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 3,538 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,707 సీట్లు మిగిలి పోయాయి. జిల్లాలో రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో జీరో శాతం అడ్మిషన్లు ఉండగా, మరో రెండు కళాశాలల్లో 4 శాతం లోపు అడ్మిషన్లు ఉండటం గమనార్హం. 20 శాతం లోపు 2 కళాశాలలో 50 శాతం లోపు 6 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్ ఇంజినిరింగ్‌లో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే సీఎస్ఈ, ఈఎస్ఈ బ్రాంచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ రెండు బ్రాంచ్‌ల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరవచ్చన్న భావనలో విద్యార్థులు ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన బ్రాంచ్‌లను పరిశీలిస్తే సీఎస్ఈలో 70.20 శాతం సీట్లు భర్తీ కాగా ఈసీఈలో 65.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.4 శాతం, ట్రిపుల్ ఈ లో 41.1 శాతం, మెకానికల్‌లో 50.2 శాతం, ఐటీ 34.5 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. మూత దిశగా కొన్ని కళాశాలలు ఇంజినీరింగ్‌లో ఆశించిన మేర విద్యార్థులు చేరక పోవడంతో కొన్ని కళాశాలలు మూత పడే దిశలో ఉన్నాయి. గత ఏడాది అనుభావాలను దృష్టితో ఈ ఏడాది సుమారు 2 వేలు సీట్లను వదులుకున్నారు. ప్రధానంగా జిల్లాలో చదివిన విద్యార్ధులు ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన చేయిస్తున్నారన్న ప్రచారం ఉంది. -
ప్రియురాలి కుమారుడు చేతిలో దారుణ...
దాంపత్య బంధాలు నానాటికి బలహీనపడుతున్నాయి. అక్రమ బంధాలు బలపడి బరితెగిస్తున్నాయి. వీడలేక..విడిపోలేక.. వదిలించుకునే క్రమంలో ప్రతీకారేచ్చకు తెగబడుతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు వంటి కిరాతకాలకు దారితీస్తున్నాయి. ఈ తరహా దారుణాలు ఇటీవల కాలంలో జిల్లా మితిమీరాయి. నెల్లూరు (క్రైమ్): ‘మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడూ.. మచ్చుకైనా కానరాడే మానవత్వమున్నవాడు..’ అని ఒక సినీ కవి రచించిన గేయం జిల్లాలో అక్షరసత్యంగా మారింది. జిల్లాలో జరుగుతున్న ఘటనలు చూస్తే మానవత్వం మరుగున పడి కిరాతకం పైచేయి సాధిస్తున్నట్లుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నం, నిత్యకృత్యంగా మారాయి. మహిళలకు, చిన్నారులకు ఇంటా బయట రక్షణ కొరవడింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబ సభ్యులే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న వివాహేతర సంబంధం నేపథ్యంలో సర్వేపల్లి కాలువకట్ట రాజీవ్‌గాంధీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ప్రియురాలి కుమారుడు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 28న రంగనాయకులపేట ఉప్పరపాళెంలో దుర్గ అనే మహిళపై ఆమె ప్రియుడు కిశోర్ హత్యాయత్నం ఏప్రిల్ 4న పొదలకూరు మండలం పొట్టేళ్ల కాలువ వద్ద వివాహేతర సంబంధం వద్దన్నాడని ఓబుల్‌రెడ్డిపై ఇద్దరు యాసిడ్ దాడి చేశారు. మే 3న వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వేధింపులు తాళలేక బీవీనగర్‌కు చెందిన రవితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 9న ప్రియురాలిని కలిసేందుకు అడ్డుగా ఉన్నాడని ఆమె భర్త శ్రీధర్‌పై ఆటోడ్రైవర్ చిట్టిబాబు హత్యాయత్నం చేశాడు. జూలై 4న ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్టలో తన భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో ఉండటాన్ని చూïసి జీర్ణించుకోలేని భర్త హరిబాబు ఇంటికి నిప్పం టించాడు. దీంతో అతని భార్య, ప్రియుడు సజీవదహనమయ్యారు. ∙జూలై 11న వివాహేతర సంబంధం నేపథ్యంలో శివాజీకాలనీకి చెందిన సిసింద్రీ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙తాజాగా కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన రత్తమ్మ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతను గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉండటం తో జీర్ణించుకోలేక ఆమె ప్రియుడి నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి గోనె సంచిలో పెట్టి తన ఇంట్లోనే దాచి పెట్టింది. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వివాహేతర సంబంధాలతో జీవితాలు నాశ నం చేసుకుంటున్నారు. తాళి కట్టి వివాహం చేసుకున్న భార్యను మోసం చేయడం, భర్త కళ్లు గప్పి తప్పుడు ఆలోచనలతో పెడదారి పట్టడం మనల్ని మనం మోసం చేసుకోడమే అవుతుంది. పి. శ్రీధర్, మహిళా డీఎస్పీ -
నెల్లూరు జిల్లా రాపూర్‌లో పోలీసులపై దాడి
-
రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి
రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. దళితవాడకు చెందిన కొందరు పోలీస్‌స్టేషన్ గేట్లు ధ్వంసం చేసి, లోపలికి జొరబడ్డారు. పోలీసులపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించారు. అక్కడ కనిపించిన పోలీసులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. ఇతర సిబ్బంది గాయపడ్డ ఎస్ఐని, కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌పై దళితవాడకు చెందిన వ్యక్తులు దాడిచేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మమ్మల్ని అమానుషంగా కొట్టారు పోలీసులు తమను విచారణ కోసం పిలిపించి మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా కొట్టి గాయపరిచారని, కులం పేరుతో దూషించారని దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ ఆరోపించారు. తమతోపాటు పెంచలయ్య అనే యువకుడిని కూడా పోలీసులు కొట్టారని చెప్పారు. ఎస్ఐ తలకు బలమైన గాయం: డీఎస్పీ దళితవాడ వాసుల దాడిలో గాయపడ్డ రాపూరు ఎస్ఐ, కానిస్లేబుళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించామని డీఎస్సీ రాంబాబు చెప్పారు. ఎస్ఐ తలకు బలమైన గాయం అయిందని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజి వద్ద ఉద్రిక్తత
-
చంద్రబాబు అసమర్థుడు
పెళ్లకూరు(నెల్లూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థుడని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు విమర్శించారు. వైఎస్సార్సీపీ పెళ్లకూరు మండల కన్వీనర్, పుల్లూరు సర్పంచ్ మారాబత్తిన సుధాకర్‌కు మంగళవారం పుల్లూరులో పదవీ విరమణ సన్మానసభ జరిగింది. ఇందులో వెలగపల్లి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి సీటు కోసం బాబు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి తెలుగు ప్రజలను మోసం చేశాడన్నారు. నాలుగన్నరేళ్లు బీజేపీతో కలిసుండి ఎన్నికలొస్తున్న తరుణంలో అన్న క్యాంటీన్ అంటూ మరోమారు ప్రజలను మోసం చేస్తున్న బాబుకు సిగ్గు లేదని దుయ్యబట్టారు. భారత చట్టానికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలను నియమించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దర్మార్గుడని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకుని తెలుగుజాతిని తలదించుకొనేలా చేశాడన్నారు. పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంటే అధికార టీడీపీ హంగులు, ఆర్భాటాలు ఎలా చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్ధికి భరోసా అని స్పష్టం చేశారు. అనంతరం సుధాకర్‌ను స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి వారు ఘనంగా సన్మానించారు. -
ఇక ప్రత్యేక పాలనే?
నెల్లూరు(అర్బన్): గ్రామాల్లో ప్రజాప్రతినిధిలుగా ఓ వెలుగు వెలిగిన పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవుతుందని భయపడింది. ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐదేళ్లు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హోదా ఉన్నవారంతా మాజీలు కానున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రత్యేక అధికారుల పాలన ఉండటంతో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్లో సైతం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగిస్తారని కొంతమంది ఆశావహులైన సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. ఇతర జిల్లాలో ఓ సర్పంచ్ మరొక ముందడుగు వేసి ఏకంగా కోర్టుకెళ్లాడు. ఎన్నికలు జరిగే వరకు తమను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని కోరాడు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలన వైపే మొగ్గు చూపింది. విధివిధానాలు సిద్ధం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు సిద్ధం చేసింది. ఉన్న నిధుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాలకు 30శాతం, నీటిసరఫరా కోసం 15 శాతం, పారిశుద్ధ్య నిర్వహణకు 15 శాతం, వీధి దీపాల నిర్వహణకు 15శాతం, అంతర్గత రోడ్లు, మరమ్మతుల కోసం 20 శాతం, సమావేశాలు, మిసిలేనియస్ ఖర్చుల కోసం ఐదు శాతం నిధులు వినియోగించుకోవాలి. ప్రత్యేక అధికారులు నిర్వర్తించాల్సిన విధులు తాగునీటి సరఫరాలో పరిశుభ్రత, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయింపు, ట్రేడ్ లైసెన్స్‌లు, దుకాణాలు, వాణిజ్య–వ్యాపార అనుమతులు జారీ చేయడం, గ్రామ రికార్డులు అప్‌గ్రేడ్ చేయడం, తాగునీటి పైపుల లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలకు పన్నులు వసూళ్లు చేయడం, ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం తదితర విధులను అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే తాగునీటిలో క్లోరినేషన్, తడిచెత్త–పొడిచెత్తను నిర్వహించడం, ప్రభుత్వ స్థలాలు, బడుల్లో మొక్కలు నాటడం, రోడ్లును ఊడ్చడం, కాల్వలను క్లీన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. నిధులు వాడు కోవచ్చు పంచాయతీకి సంబంధించిన వేతనాలు, ఖర్చుల కోసం ని«ధులు విడుదల చేసే అ««ధికారాన్ని ప్రత్యేక అధికారులకు కల్పించారు. ఏదైనా సంస్థలకు అప్పు ఉంటే చెల్లించవచ్చు. ఉత్సవాల నిర్వహణకు, ప్రజల వినోదం, గ్రామంలోని పేదలను ఆదుకునేందుకు వీలు కల్పించారు. ∙జరిమానా విధించవచ్చు ∙గ్రామాల్లో ఖాళీ, పబ్లిక్ స్థలాలను రోడ్లను ఆక్రమిస్తే జరిమానా విధించవచ్చు. ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ 90శాతం గ్రామాలు కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడి అభివృద్ధి పనులు సాగిస్తున్నాయి. ఎన్నికలు జరపనందున న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం 14తో పాటు రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా ఆపేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనందున కేంద్రం ఇలాగే నిధులు ఆపేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయిన సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ దఫా టీడీపీ ప్రభుత్వంలో అవే ఇబ్బందులు తలెత్తనున్నాయి. పల్లె ప్రగతికి ఆటంకం ప్రత్యేక అధికారుల (స్పెషల్‌ఆఫీసర్లు) పాలన రానుండటంతో పల్లె ప్రగతికి ఆటంకం ఏర్పడనుంది. నెల్లూరు జిల్లాలో 940 పంచాయతీల్లో 22 లక్షల మంది నివసిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిదీపాలు వెలగకపోయినా, ఇతరత్రా గ్రామ తక్షణ అవసరాలకు సర్పంచ్‌లు మొదట తమ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టేవారు. తరువాత నిదానంగా బిల్లులు పెట్టుకుని డ్రా చేసేవారు. ప్రత్యేక పాలనలో ఆస్వేచ్ఛ ఉండదు. నిబంధనల ప్రకారం జరగాల్సిందే. కార్యదర్శి, ప్రత్యేకాధికారి సంయుక్త సంతకాలతో ఫైళ్లు నడవాలి. ఈ తంతు జరగాలంటే కొంత అలస్యం తప్పదు. ప్రజలు ఇబ్బందులు పాలు కాక తప్పదు. -
కుట్ర రాజకీయం
కుట్ర రాజకీయాలకు అధికార పార్టీ తెరతీసింది. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దర్పంతో పల్లెల్లో విషసంస్కృతికి బీజం వేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని పోలీసు బలప్రయోగంతో అణిచివేసే కార్యక్రమాలకు పూనుకుంది. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తోంది. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోనూ, ఇటీవల కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో కూడా ఇదే తరహా తతంగం నడిపారు. దీనికి స్పందించి కనీసం మాట్లాడాల్సిన ఉన్నతాధికారులు కూడా మంత్రుల ఒత్తిడితో ముఖం చాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సర్పంచ్ల పదవీ కాలం చివరిరోజు కావడంతో పూర్తయిన పనులు అన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేతో ప్రారంభింపజేసేందుకు అంతా సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించడంతోపాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.అయితే ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆదివారం సాయంత్రం అధికారపార్టీ నేతలు వ్యూహం రచించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారుల అనుమతిలేదని, ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులకు లేఖ ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇదేమని అడిగేందుకు యత్నించినా ఫోనుకు సైతం అందుబాటులోకి లేకుండా పోయాడు. పోలీస్ బలగాలతో అడ్డగింత ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వెళ్లే క్రమంలో డీఎస్పీ రామాంజనేయులురెడ్డి భారీగా పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. ప్రారంభోత్సవాలు చేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదని చెప్పి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే తాను పర్యటించటానికి కూడా ఆంక్షలు విధించడం సరికాదంటూ ఎమ్మెల్యే గట్టిగా చెప్పి గ్రామంలో పర్యటించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గ్రామం కావడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అడ్డుకునే యత్నం చేశారు. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, ఇతర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రారంభోత్సవాలకు ప్రజాప్రతినిధిని పోట్రోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిఉంది. అయితే అంతా చేసి అనుమతి లేదని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు స్థానిక సర్పంచ్‌లే చేయాలనే నిబంధన ఉంది. అలాగే తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిధులు రూ.14 లక్షలతో నిర్మించిన 11 కేవీ సబ్‌స్టేషన్‌ను, రూ.5 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించకుండా ముందే అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే రాజకీయ కుట్ర గడిచిన నాలుగేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా అధికార పార్టీ ఆత్మకూరులో గందరగోళంగా ఉండటంతో మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, కన్నబాబు ఇలా అందరూ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి పేరు రాకుండా అడ్డుకునే కుట్రకు తెరతీశారు. మంత్రి నారాయణ నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లు రావడం, కార్యక్రమం సిద్ధం చేసిన అధికారులతోనే ఫిర్యాదు ఇప్పించి హక్కుల్ని కాలరాశారు. సర్పంచ్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసిన క్రమంలో తమ హయాంలో చేసిన పనులు కూడా తాము చేశామని చెప్పుకోవటానికి వీలు లేకుండా ఇన్చార్జ్ మంత్రులు, మంత్రి నారాయణ ప్రారంభించాలనే నెపంతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య సొంత గ్రామం కావడంతోనే ఈ తతంగం అంతా నడిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో పర్యటించకుండా గత నెల రోజులుగా పోలీసుల బలప్రయోగంతో వేధిస్తున్నారు. అధికార పార్టీ నేతలు బీద సోదరుల స్వగ్రామం కావడంతో అక్కడ పర్యటించకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటానికి సన్నద్ధమవుతోంది. -
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
చేజర్ల (నెల్లూరు): ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజాసేవకే అంకితమై సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తనను టీడీపీ అధికార దర్పంతో, బెదిరింపులతో, పోలీస్ అరెస్ట్‌లతో ఆపలేదని, ప్రజాదీవెనే తనకు కొండంత అండ అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డిని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులురెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బృందాలు మోహరించి ఎమ్మెల్యే కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినని, గ్రామంలో పర్యటించి తీరుతానని, తనను అడ్డగిస్తే చూస్తూ ఊరుకోబోనని ఎమ్మెల్యే ముందుకుసాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హిట్లర్ పాలన కొనసాగిస్తూ నియంతగా వ్యవహరిస్తోందన్నారు. సాక్షాత్తు అధికారులే గ్రామంలో ప్రోటోకాల్ ప్రకారం శిలాపలకాలు వేయించి ప్రారంభం తేదీ నిర్ణయించిన తరువాత అధికారపార్టీ నాయకులకు తలొగ్గి తిరిగి వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పర్యటనను అడ్డుకోవాలని చెప్పడం దారుణమన్నారు. అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం 14వ ఆర్థిక సంఘం నిధులతో మామూడూరు నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు కూడా సర్పంచ్‌లతో ప్రారంభించకుండా అధికారులు అడ్డుపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం టీడీపీ హయాంలో సర్పంచ్‌లను ఉత్సవమూర్తులుగా చేసి జన్మభూమి కమిటీ సభ్యులతో గ్రామాల్లో అధికారపార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని, సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయకుండా వారి అనుచరులకే ఇస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, తాను ప్రజాసేవ చేసేందుకు తనకిష్టమొచ్చిన ప్రాంతంలో పర్యటిస్తానని, అడిగే హక్కు ఎవరికీ లేదని అన్నారు. శిలాపలకాలపై పేర్లు వేయించుకోవడం కాదని, నాయకులు ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకోవాలని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ సాకుతో ఈ విధంగా చేయడం, భారీగా పోలీసులు మోహరించడం సరికాదని, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని అన్నారు. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకముందని, రాజ్యాంగాన్ని, వ్యవస్థను ధిక్కరించి తామెప్పుడూ ఏ కార్యక్రమాలకు హాజరుకాలేదని అన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రామంలో ఇలా అలజడి సృష్టించారన్నారు. తనపైన, తమ భర్త బాలిరెడ్డి సుధాకర్రెడ్డిపైన గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, గ్రామాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని బెదింపులకు పాల్పడినా బెదిరేది లేదని, మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. సాక్షాత్తు అధికారులే ప్రోటోకాల్ ప్రకారం శిలాపలకాలు తయారుచేయించి ప్రారంభం తేదీ నిర్ణయించి తిరిగి అధికారులే ఇలా అడ్డుకోవడం సరికాదని, ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారన్నారు. ఇకనైనా అధికారపార్టీ నాయకులు తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో గ్రామ ప్రజల ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, సంగం మండల కన్వీనర్ కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఏఎస్‌పేట మండల మహిళా కన్వీనర్ బోయళ్ల పద్మజారెడ్డి, ఆత్మకూరు యువత అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి, ఎంపీటీసీలు గిరిధర్‌రెడ్డి, గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు పూనూరు బాలకృష్ణారెడ్డి, బోయళ్ల చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాçస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, రఫీ, రమణయ్య, కోటయ్య, వెంకటేశ్వర్లురెడ్డి, కృష్ణారెడ్డి, వేణు, జయంతిరెడ్డి, యానాదిరెడ్డి, ప్రసాద్, పాపిరెడ్డి, కాలేషా తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల మోత
వెంకటగిరి రాజావీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం స్థలం గరిష్టంగా రూ.9500 ఉండగా తాజాగా భూముల విలువ పెంపుతో రూ.10,000 దాటనుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.1600 మించని చదరపు గజం విలువ తాజా పెంపుతో రూ.1700 పై చిలుకుగా మారనుంది. గతంలో కట్టడాల రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ.900 ఉండగా తాజాగా రూ.950కి చేరనుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పరిధిలోని సర్వేనంబర్లు, డి నంబర్ల ఆధారంగా భూములు, స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువలను సమీక్షిస్తున్నారు. వెంకటగిరి (నెల్లూరు): భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో పట్టణ ప్రజలకు మరోసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీల షాక్ తగలనుంది. వెంకటగిరి ప్రాంతంలో మన్నవరం భెల్ పరిశ్రమ ఏర్పాటుతో పెరిగిన రియల్‌భూమ్ ఆ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పూర్తిగా పడిపోయింది. రెండేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయపన్ను శాఖ నోటీసులతో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఇప్పుడిప్పుడే రియల్ఎస్టేట్ రంగం కోలుకుంటున్న తరుణంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంపు కలకలం రేపుతోంది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టణ రేపటి నుంచి స్థిరాస్తి విలువలు పెంపు నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పట్టణాల పరిధిలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్థిరాస్తి విలువలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థిరాస్తి విలువ 0– నుంచి 5 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన స్థిరాస్తి విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో పెంచడం లేదన్నారు. మిగిలిన నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పెంచుతున్నట్లు తెలిపారు. అందు కోసం కావాల్సిన వాటిని తయారు చేసే పనిలో సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం -
ఆత్మకూరు టీడీపీలో హైడ్రామా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వారం రోజులుగా సాగుతున్న ఆత్మకూరు పంచాయితీకి సోమవారం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం, జిల్లా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు. పార్టీ నేత కన్నబాబు దీక్ష విరమించడం, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించడం రెండూ జరిగిపోయాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సాగిన ఆత్మకూరు హైడ్రామా ఎపిసోడ్ చివరకు జిల్లా మంత్రుల మెడకు చుట్టుకుంది. జిల్లాలో ఇంత జరుగుతున్నా కనీసం మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోలేదని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కన్నబాబుకు మొదటి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి మరో మంత్రి పి.నారాయణ సహకరిస్తుండడంతో ఇద్దరు మంత్రుల తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆదివారం రాత్రి కన్నబాబుతో మొదలైన మంతనాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇరువర్గాల మధ్య రాజీ చర్చలు సాగించారు. ఉదయం మంత్రి నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో భేటీ అయి మంతనాలు జరిపారు. ఈక్రమంలో పార్టీ ముఖ్యులు కన్నబాబును కూడా కలుపుకొని ముందుకెళదామని ప్రతిపాదించడం, దానికి ఆదాల అంగీకరించడంతో ఆ తర్వాత బీద రవిచంద్ర, రామకృష్ణ కన్నబాబుతో మాట్లాడి అంగీకరింపజేశారు. చివరకు మంత్రి నారాయణ వచ్చి కన్నబాబుతో ఆపిల్ తినిపించి దీక్ష విరమింపజేశారు. అక్కడి నుంచి మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, బీద రవిచంద్ర, కన్నబాబు అందరూ కలిసి వెళ్లి ఆత్మకూరులో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కూడా కన్నబాబు సభాధ్యక్షత వహించి నేతలందరినీ ఆదాల ప్రభాకరరెడ్డికి పరి చయం చేశారు. దీంతో వివాదాన్ని తాత్కాలికంగా ముగించారు. అయితే తెర వెనుక భారీ మంతనాలు మాత్రం కొనసాగడంతో వర్గపోరులో ఆధిపత్యం కోసం మంత్రి సోమిరెడ్డి వర్గం, మాజీ మంత్రి ఆదాల వర్గం తీవ్రంగా కసరత్తు చేశాయి. ఆదాల డౌన్ డౌన్ అంటూనే.. కన్నబాబు ఆమరణ దీక్ష పూర్తి సారాంశం పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వాలని, అందరినీ కలుపుకొని పోవాలనే అజెండాతో దీక్ష చేశారు. అయితే దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆదాల నాయకత్వాన్ని వ్యతిరేకించడమే అజెండాగా కనిపించింది. సేవ్ టీడీపీ, ఆదాల డౌన్‌డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. కానీ చివరికి ఆదాలతో కలిసి ఆత్మకూరు వెళ్లటం గమనార్హం. పార్టీ ముఖ్యలపై అధిష్టానం సీరియస్ పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహించడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుని కన్నబాబు తీరుపై మండిపడినట్లు సమాచారం. జిల్లాలో ఇదంతా జరుగుతున్నా సమన్వయం చేయాల్సిన మంత్రులు ఇలా చెరో గ్రూప్‌లో ఉంటూ రాజకీయం చేస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవçహారం జరగుతున్న క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలో ఆదాల ప్రభాకరరెడ్డి జిల్లాలో పార్టీ ముఖ్యనేత ఇదంతా చేస్తున్నాడని మళ్లీ పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మంత్రి నారాయణ ఆదివారం నుంచి నెల్లూరు నగరంలోనే ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయినట్లు సమాచారం. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
కలిగిరి (నెల్లూరు): మండల కేంద్రమైన కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెం ఎస్సీకాలనీలో కట్టా మమత (20) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్సీకాలనీకి చెందిన కట్టా నాగేశ్వరరావు కుమారుడు సూర్యకు రాయచోటికి చెందిన బండ్ల కుమార్, రమణమ్మల కుమార్తె మమతకు ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహమైంది. భర్త వేధింపులు అధికంగా ఉన్నాయని గతంలో మమత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను జైలులో ఉండి వచ్చాడు. నెలరోజుల క్రితం పెద్దలు సర్దుబాటు చేసి ఆమెను జిర్రావారిపాలెంలోని భర్త ఇంటికి పంపారు. సోమవారం ఉదయం సూర్య తన భార్య ఇంట్లోని వంటగదిలో ఉరి వేసుకుందని స్థానికులకు తెలిపాడు. ఆమెను కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మమత మృతదేహన్ని ఇంటి వద్దకు తీసుకువచ్చి సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మమత బంధువులు గ్రామానికి చేరుకుని సూర్య వేధింపుల కారణంగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆగ్రహం తహసీల్దార్ సి.ఉష ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మమత మృతదేహాన్ని, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న చున్నీని పరిశీలించారు. ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేశారు. సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్సై పి.చినబలరామయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం
-
ఆలస్యంగా వాస్తవంలోకి వచ్చారు
కావలి (నెల్లూరు): నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ పట్టించుకోకుండా, ఇప్పుడు రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి ఉన్న సానుకూలతలను అంగీకరించి, పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారని రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి చైర్మన్, వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న సాధన సమితి కమిటీ సభ్యులు కావలిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రామాయపట్నంలో ఓడరేవును నిర్మిస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎన్ని రకాలుగా చెప్పినా పట్టించుకోలేదన్నారు. సాంకేతిక నిపుణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రామాయపట్నంలో ఉన్న అన్నిరకాల సానుకూలతలతో అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకుని నిర్మాణం జరిగేలా చేయమన్నా దురుద్దేశాలు అంటగట్టారని గుర్తు చేశారు. ఎంపీలుగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీని కోసం పలు ఉద్యమాలు చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రామాయపట్నంలోనే భారీ ఓడరేవు నిర్మిస్తామని ప్రకటించడం శుభపరిణామమన్నారు. సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ వింతా కృష్ణారెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక్క కావలిలోనే కాకుండా, ప్రకాశం జిల్లాలోనూ ఆందోళనల్లో పాల్గొని పోర్టు సాధనకు కృషి చేశారన్నారు. చంద్రబాబు అన్ని హామీలు, ప్రకటల లాగానే ఈ పోర్టు శంకుస్థాపన కూడా ఉత్తుత్తి కాకుండా, కార్యరూపం దాల్చేలా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాధన సమితి ప్రధాన కార్యదర్శి సురే మదన్‌మోహన్‌రెడ్డి, కోశాధికారి తన్నీరు మాల్యాద్రి, కార్యదిర్శి, జె.మల్లికార్జునరావు, సభ్యులు తలమంచి రవి, ఆకుమళ్ల శీనుబాబు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఎదుట కన్నీరుమున్నీరైన మహిళలు
కావలి (నెల్లూరు): పోలీసులపై దాడి చేసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మత్స్యకార గ్రామమైన కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. పోలీసులపై దాడి చేసిన ఘటనలో 60 మందిపై కేసులు నమోదు కావడం, గ్రామంలోని యువకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు గాలిస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భీతిల్లుతున్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన తప్పులకు గ్రామంలోని ప్రజలందరూ బాధ్యత వహించాల్సి వస్తోందని, పోలీసులు ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను అకారణంగా ఇబ్బంది పెడతారేమోనని మహిళలు భీతిల్లుతున్నారు. ఇదే విషయాన్ని అదివారం ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకుని కన్నీంటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన ఎమ్మెల్యే సమస్యను పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. చట్టాలను అమలు పరచడానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసులు ఆహోరాత్రులు శ్రమిస్తుంటారని, అలాంటి పోలీసులు మన గ్రామాలకు వచ్చినప్పుడు వారిని గౌరవించాలని పేర్కొన్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన చర్యల వల్ల గ్రామస్తులందరూ బాధ పడుతున్నారన్నారు. ప్రశాంతంగా జీవించే మత్స్యకారులు ఇలాంటి దుర్ఘటనల్లో చిక్కుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా బాధగా ఉందన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి తెలియజేస్తే, పోలీసులకు నచ్చచెప్తానన్నారు. అనంతరం మహిళలతో పాటు గ్రామస్తులను వెంట బెట్టుకుని కావలి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మత్స్యకారులను డీఎస్పీ కె.రఘుతో మాట్లాడించిన ఎమ్మెల్యే అమాయకులను ఇబ్బంది పెట్టవద్దని డీఎస్పీ ని కోరారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి వచ్చిన పోలీసులపై దాడులు చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను గ్రామస్తులే గుర్తించి, పోలీసులకు అప్పగించి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నాయకులు జంపాని రాఘవులు, కొమారి రాజు, పామంజి నాగమణి, ఆవుల దుర్గారావు, ఎల్లంగారి రమణయ్య, బుచ్చింగారి తిరుపతి, కాటంగారి చిట్టిబాబు, వావిల పోతయ్య, ఎల్లంగారి జయరాం, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
యువత జగన్ వెంటే నడవాలి
సూళ్లూరుపేట రూరల్ (నెల్లూరు): గ్రామీణ యువత ఎప్పుడూ యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో గోపాలరెడ్డిపాళెం దళితవాడకు చెందిన యువత 25 మంది పురపాలక సంఘ సభ్యుడు పాలా మురళి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువత సహకారంతోనే తాను ఇది వరకు ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ఆ యువతకు తోడు మరికొంతమంది చేరడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డిపాళెం దళితవాడ యువత చెప్పిన సమస్యలపై సంజీవయ్య వెంటనే స్పందించారు. కొత్త దళితవాడకు దారి కోసం, దళిత కాలనీలో విద్యుత్ స్తంభాలు లేకపోవడంపై సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. వచ్చే ఆదివారం గ్రామానికి విచ్చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఎం.బాలు, టి.నవీన్, టి.శరత్, బి.రాజేష్, ఎం.రామకృష్ణ, కె.సుబ్రమణ్యం, కె.అజయ్, ఎం.చిన్నరాజ, టి.ప్రసన్నకుమార్, ఎం.జానీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గండవరం సురేష్‌రెడ్డి, తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, తిరుమూరు రవిరెడ్డి, నరేష్‌రెడ్డి, బుంగా చెంగయ్య, ఆలీభాయ్, శరత్‌గౌడ్, యుగంధర బాబురెడ్డి, కన్నంబాకం శరత్, కుట్టి, రాఘవ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన ఆత్మకూరు రాజకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా వారం నుంచి అధికార పార్టీ ఆత్మకూరు రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా వర్గపోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆది వారం పరిస్థితి తీవ్రమై గత ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది. మరోవైపు సోమవారం మంత్రి నారాయణ, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కన్నబాబు దీక్షకు దిగటం, భవిష్యత్తు పరిణమాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ సాగుతుంది. అధికార పార్టీలో ఆత్మకూరు ఇన్చార్జి చిచ్చు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు మరింత ముదిరి రచ్చకెక్కాయి. ఈ వ్యవహారంలో జిల్లాలో ఇద్దరు మంత్రలు రెండు గ్రూప్‌లుగా మారి రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆత్మకూరు ఇన్చార్జి నియామకంపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, అమర్నా«నాథ్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చర్చించారు. అయితే మంత్రులు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరులో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇన్చార్జి పదవి ఆశిస్తున్న మంత్రి సోమిరెడ్డి వర్గీయుడు కన్నబాబు తన అనుచరులతో సమావేశానికి వచ్చి ఒక్కరినే ఇన్చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నేత మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో సమావేశానికి గైర్హాజరై నిరసన తెలపారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారాన్ని సీఎం నిర్ణయానికి వదిలేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆదాలను తాత్కలిక ఇన్చార్జిగా నియమించాలని పార్టీ ఆదేశించింది. దీంతో మరుసటి రోజునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వర్గీయుడు కన్నబాబుతో కలిసి ఆత్మకూరులో పర్యటించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, చేజర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయంగా మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు వైరం ఉన్న క్రమంలో సోమవారం ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కలిక ఇన్చార్జి హోదాలో సోమవారం మంత్రి నారాయణతో కలిసి ఆత్మకూరులో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆత్మకూరు టీడీపీ నేతలు కొందరు ఆదాలను కలిసి అభినందించారు. దీనిని కన్నబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆమరణ దీక్ష ఈ క్రమంలో ఆదాల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నబాబు పార్టీ రాజీనామా చేస్తారని బలంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా ఆత్మకూరు టీడీపీ నేతలు, కొందరు కార్యకర్తలతో కలిసి నగరంలో ఆయన మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరిగా పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆమరణదీక్షను ఆదివారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించి సేవ్ టీడీపీ అంటూ నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన పార్టీ మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర నేతలు ఎవరూ పట్టించుకోకపోవటంతో పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కన్నబాబుతో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కన్నబాబుతో దీక్ష విరమించాలని కోరినా ఫలితం లేదు. -
ప్రజాస్వామ్యం ఖూనీ!
నెల్లూరు(సెంట్రల్): ‘ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గ్రామస్తుల కోరిక మేరకు ఒక ఎమ్మెల్యే పాదయాత్రగా ప్రజల మధ్యకు వెళ్లాలనుకుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయని’ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. నెల్లూరులోని మాగుంటలే అవుట్లో ఉన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మత్స్యకారులతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. నెల రోజులుగా కావలి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ప్రజలు చూస్తున్నారన్నారు. తీర ప్రాంత ప్రజల ఇబ్బందులు, కష్టాలు తెలుకోవాలని, అక్కడ ఏమి అభివృద్ధి చేయాలో తెలుసుకునేందుకు తాను తీర ప్రాంత సేవా సంకల్ప పాదయాత్ర చేస్తున్నానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో 50 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి గొడవలు, శాంతిభద్రతలు తలెత్తలేదన్నారు. చట్టసభకు ప్రతినిధిని.. గ్రామంలోకి వెళ్లనివ్వరా కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి.. చట్ట సభకు ప్రతినిధిని చేసిన ప్రజల బాగోగులు తెలుసుకోవడం నా ధర్మం. ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు.. గ్రామంలోకి వెళ్తుంటే.. పోలీసులు నిలువరించడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మత్స్యకారుల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక ఉన్నారని తెలిపారు. టీడీపీ నేతలు బీద సోదరులు స్వగ్రామం ఇస్కపల్లి పంచాయతీ పరిధిలో మత్స్యకారుల భూములు ఆక్రమించి వారిని మత్స్యకారులను దోచుకుంటున్నారు. తానే ఆ గ్రామాలకు వెళ్తే వీరి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే తనను మూడు మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లనివ్వకుండా అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని చెప్పారు. గతంలో కొంది మంది అల్లరి మూకలతో బీద సోదరులు అల్లరి చేయించి, దీన్ని గ్రామ ప్రజలందరి వివాదంగా చెబుతుండడం సిగ్గు చేటన్నారు. ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా పోలీసులకు తెలిపామన్నారు. గతంలో పలుమార్లు ఆ గ్రామాలకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. అప్పుడు ఎటువంటి గొడవలు జరగనవి ఇప్పుడు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఒత్తిడితోనే తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతమనడం హాస్యాస్పదం శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే.. ప్రజాప్రతినిధిగా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తానంటే శాంతిభద్రతలకు విఘాతం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులు రక్షణ కల్పించలేమని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అధికార టీడీపీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితోనే పోలీసులు ఈ విధంగా చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. గ్రామస్తులు సైతం ఎటువంటి విఘాతం కల్పించరని చెబుతున్నా పోలీసులు వినకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చేతులెత్తేసిన పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే తాము భద్రత కల్పించలేమని నగర డీఎస్పీతో పాటు నగరంలోని పలు స్టేషన్ల సీఐలు ఎమ్మెల్యేకు చెప్పడం గమనార్హం. పోలీసులే ఈ విధంగా చెప్పడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పోలీసులు మాత్రం తామే ఏమి చేయలేమని చెబుతూ ఎమ్మెల్యేను, ఆయనతో పాటు మత్స్యకారులను బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. -
కోర్కె తీర్చమని వేధింపులు!
నెల్లూరు(క్రైమ్): కోర్కె తీర్చలేదని ఓ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించిన ఓ యువకుడిపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. కొండాయపాళెంకు చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుకుని ఇంటి వద్దనే ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ బస్సుడ్రైవర్ షేక్ హుస్సేన్‌తో పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను మందలించడంతో ఆమె హుస్సేన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్ ఆమెను తనతో మాట్లాడమని, తన కోర్కె తీర్చమని ఫోన్ చేసి వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే యువతి తమ్ముడిని సైతం చంపుతామని బెదిరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో వేధింపులను అధికం చేశాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున దగ్ధమైంది. దీంతో బాధిత యువతి శనివారం హుస్సేన్ వేధింపులపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్‌ను సైతం హుస్సేనే దగ్ధం చేసి ఉండటాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఎస్సై ఐ. మస్తానయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదేందయ్యా..సోమిరెడ్డీ..!
వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెంలో పంచాయతీ కార్యాలయాన్ని..కమ్యూనిటీ భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. సరిగ్గా 24 గంటలు గడవలేదు. హంగూ..ఆర్భాటాలు..మందీ మార్బలంతో వచ్చి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మళ్లీ వాటిని ప్రారంభించారు. ఇది చూసి జనం అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి ఆయనకు పరిపాటే అంటున్నారు స్థానికులు. మత్స్యకారులకు వలలు ఇస్తామని ప్రలోభపెట్టి కండువాలు కప్పడం.. సైకిళ్ల పంపిణీ కోసం తీసుకెళ్లి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం టీడీపీ నాయకులకే చెల్లుతోందని గుసగుసలాడున్నారు. వెంకటాచలం: మండలంలోని తాటిపర్తిపాళెంలో గేట్‌వే కంపెనీ ఏర్పాటుకు పంచాయతీ సహకరించడంతో ఆ కంపెనీ యాజమాన్యం గ్రామంలో తమవంతు సహకారంగా గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు కమ్యూనిటీ హాల్, పాఠశాలకు ప్రహరీ ర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలు పూర్తికావడంతో అధికారికంగా గురువారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సమక్షంలో పంచాయతీ కార్యాలయాన్ని, కమ్యూనిటీ హాల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ డేగా శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ గ్రామంలో చాలా బలహీనంగా ఉందనే విషయం స్పష్టమైపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌ను 24 గంటల వ్యవధిలో మంత్రి సోమిరెడ్డి చేతుల మీదుగా మళ్లీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గురువారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారనే విషయం తెలిసినా మంత్రి సోమిరెడ్డి అవేమీ తనకు పట్టవన్నట్లు మళ్లీ ప్రారంభించడాన్ని చూసి గ్రామస్తులు నవ్వుకున్నారు. సర్పంచ్ ప్రారంభించిన కార్యాలయాన్ని మంత్రి మళ్లీ ప్రారంభించడం ఏమిటని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కున్నారు. వెంకటాచలం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో దిక్కుతోచక తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నవ్వులపాలవుతోందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్‌ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్‌ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అధికారుల్ని అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పాత నేతల్ని కలుపుకోకుండా పనిచేయడం వంటి ఘటనలపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గురువారం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, తహసీల్దార్‌పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో రాస్కెల్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో ఉంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. పద్ధతి మార్చుకోండి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న తరుణంలో వాటిని సరిదిద్దుకోకుండా కొత్త వివాదాలు తీసుకు వచ్చి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపైనా సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జెడ్పీటీసీ సభ్యుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి, పోలంరెడ్డికి మధ్య వివాదం నెలకొని ఉంది. కోవూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరిపాకన పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి చేజర్ల వర్గానికి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించి ఆయన సొంత మనుషులను నియమించుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమానికి పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీనిపై చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సీఎంతో పాటు పార్టీ ముఖ్యులు అందరికీ ఫిర్యాదు చేశారు. దీంతో బూత్ కమిటీలు అన్నింటిని రద్దు చేశారు. ఎమ్మెల్యే వ్యవహర శైలి సీఎం వద్ద చర్చ సాగిన క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీరు మార్చుకుని అందర్నీ కచ్చితంగా కలుపుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఆత్మకూరు రగడపై సీఎంకు నారాయణ ఫిర్యాదు మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గ రగడపై మంత్రి పి. నారాయణ సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని పార్టీ నేతలు చర్చించుకుని సీఎం ఆమోద ముద్రతో ప్రకటించారు. మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అక్కడి స్థానిక నేత కన్నబాబు వీటితో నిమిత్తం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మద్దతుగా ఉన్నారు. కొందరు నేతలు ఆత్మకూరులో పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నారని నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
నెల్లూరు జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
-
మామూళ్ల కిక్
జిల్లాలో ఎక్సైజ్ శాఖ మూమూళ్ల మత్తులో తూలుతోంది. జిల్లాలో కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటి మూలంగా ఎంతో మంది ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీని, ఛీప్ లిక్కర్‌ను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మొక్కుబడి చర్యలకే పరిమితం అయింది. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యానికి బలయ్యారు. మద్యం బాటిల్ మూత తీయకుండానే విషపూరిత పదార్థాలు కల్తీ చేయడం మూలంగానే వీరు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీన్ని బట్టి మద్యం బాటిళ్లలో ఏ స్థాయిలో కల్తీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో 349 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉన్నాయి. వీటిలో అధికశాతం దుకాణాలు, బార్లలో కల్తీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం సీసామూతలను చాకచక్యంగా తొలగించి అధికంగా అమ్ముడుపోయే బ్రాండ్ల (ఛీప్‌లిక్కర్)లో కల్తీకి పాల్పడుతున్నారు. క్వార్టర్ బాటిల్లో 30 ఎంఎల్ మద్యాన్ని తీసివేసి నీటిని కలుపుతున్నారు. పెద్దపెద్ద బ్రాండ్లలో నీటికి బదులు ఛీప్లిక్కర్ను కలిపి విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల మం దుబాబులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. మద్యం వ్యాపారులు «ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నా.. ఎక్సైజ్‌శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి మద్యం దుకాణం, బార్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. దుకాణంలోని ప్రతి బ్రాండ్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలి. కల్తీని కనుగొనేందుకు అవసరమైతే పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాలి. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో నామమాత్రంగానే జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రపు దాడులు కల్తీ విక్రయాలపై క్రమం తప్పకుండా ఎక్సైజ్‌శాఖ తనిఖీలు నిర్వహించి విక్రయాలకు పాల్పడే దుకా ణాలపై కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు మందలిస్తేనో? ఏవైనా ఫిర్యాదులు అందితేనో దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలోని వింజమూరు, రాజుపాళెం, ఆదూరుపల్లి, కావలి తదితర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కల్తీ విక్రయాలను గుర్తించారు. ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేసి సరిపెట్టుకున్నారు. మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు జరపకూడదనే నిబంధన ఉన్నా.. అనేక మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిని నియంత్రించడంలోనూ ఎక్సైజ్‌శాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. తాజా ఘటనతో కదలిక బుచ్చిరెడ్డిపాళెం మండలంలో బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన విషయం విది తమే. ఈ ఘటన జిల్లాలో తీవ్రకలకలం రేకెత్తించిం ది. ఈ పరిణామాలతో ఎక్సైజ్ శాఖ సైతం ఉలిక్కిపడింది. ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీయడంతో ఎక్సైజ్ శాఖలో కదలిక మొదలైంది. దీనికి కారణ మైన మద్యం దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తని ఖీ చేశారు. మృతులు తాగిన మద్యం సీసాను స్వాధీ నం చేసుకున్నారు. ఆ మద్యం ఏ దుకాణం నుంచి కొనుగోలుచేశారనే వివరాలు సేకరిస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు తాజా ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్నీ మద్యం దుకాణాలు, బార్లలో తనిఖీలు నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. దీంతో జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్తీ విక్రయాలను గుర్తిస్తే వెంటనే సంబంధిత దుకాణంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మొత్తం మీద మందుబాబుల ప్రాణాలు హరీ అంటే గాని ఎక్సైజ్ శాఖలో కదలికలు లేకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి దాడులు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆరుబయటే అంతా!
ఆరుబయటే చదువులు..భోజనాలు..స్నానాలు కూడా. అధ్వానంగా ఉన్న వంటశాలలు, పడక గదుల్లోనే పాఠాలు, ఉపాధ్యాయుల కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు. ఇక మెనూ నిర్వాహకుల ఇష్టం. నీళ్ల చారు, ఆకుకూర పప్పు. వారు పెట్టిందే పరమాన్నం. ఇదీ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో దుస్థితి. ఇక్కడ చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమాన్ని పాలకులు మరిచారు. అభివృద్ధి అంతా ఆర్భాటపు ప్రకటనలే. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. గురువారం జిల్లాలోని గురుకులాలను సాక్షి బృందం పరిశీలించింది. వాటి దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు రూరల్ : జిల్లాలో గురుకుల పాఠశాలల్లో వసతులు, నిర్వహణ అధ్వానంగా ఉన్నాయి. గురుకులం అంటే కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్య అనే భావన ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక గురుకుల వ్యవస్థనే భ్రష్టుపట్టింది. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను రద్దు చేసి, వాటినే గురుకులాలుగా మార్చేసి వసతి గృహాలను మాదిరిగా నడుపుతోంది. జిల్లాలో 43 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ వెంకటగిరి, ఉదయగిరి, చిలమానుచేను, తుమ్మలపెంట, ఆత్మకూరు, గండిపాళెం, నెల్లూరులోని మైనార్టీ గురుకులాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురంలో బాలికల గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల బాలుర గురుకుల పాఠశాలు నడుస్తున్నాయి. చెన్నూరు, ఓజిలి, సర్వేపల్లి, నెల్లూరు నగరంతో పాటు మొత్తం 13 మినీ గిరిజన గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోకోట, దొరవారిసత్రం, గొలగమూడిలో గురుకులాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కావలి నియోజకవర్గంలోని నార్త్అమలూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల్లోని బాలికల హాస్టల్స్, సర్వేపల్లి నియోజకవర్గంలోని మహ్మదాపురం, వెంకటగిరి బాయ్స్ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, కుదురు, నాయుడుపేట, కండలేరు, డక్కిలి, ఆదూరుపల్లి, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, కోడూరు, కావలి, ముత్తుకూరులోని బాలికల గురుకులాలు, నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు బాలురు మొత్తం 14 ఎస్సీ, గురుకులాలు నడుస్తున్నాయి. వసతులు శూన్యం గురుకులాల్లో సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయట పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూళ్ల పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య జిల్లాలో ఏకైక ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలను నగరంలోని ఆటోనగర్‌లో 2008లో ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడం, మంచినీటి సమస్య, చుట్టూ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పడిపోతోంది. ప్రారంభంలో 480 మంది ఉన్న విద్యార్థులు రాను రాను 246 మందికి తగ్గిపోయారు. నేలమీదే చదువులు, శిథిలావస్థకు చేరుకున్న భవనం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియక విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. అక్కచెరువుపాడులో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించి, రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల నత్తనడకన జరుగుతున్నాయి. ప్రకటనలు..పునాదులకే పరిమితం సర్వేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు స్థలం కేటాయింపు జరగకపోవడంతో నగరంలోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలోని గిరిజన వసతిగృహంలో నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో 200 సీట్లకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. భవనానికి రూ.2.40 కోట్లు నిధులు మంజూరైనప్పటికీ స్థలం కేటాయింపు ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇక్కడ సరిపడా గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు బకెట్లతో నీళ్లు మోసుకెళ్లే దృశ్యాలు, తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా మెనూ అమలు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులు నీళ్ల చారు, ఆకుకూర పప్పుతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. భవనం లేకపోవడంతో హాస్టల్లోనే క్లాసులు విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో హాస్టల్లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాం. నూతన భవవనానికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నాం. స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. – పి.దేవసహాయం, ప్రిన్సిపల్, బాలికల గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఆటోనగర్‌లో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల భవనాన్ని మార్చాల్సి ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకుంది. చుట్టూ ఉన్న వర్కషాపులు, పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వల్ల విద్యార్థులకు మంచి వాతావరణం లేదు. స్కూల్ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్చేందుకు సుముఖత చూపడం లేదు. స్కూల్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అనుమతి రాగానే స్కూల్‌ను వేరే ప్రాంతానికి మార్చుతాం. –పి.బ్రహ్మయ్య, ప్రిన్సిపల్, మైనార్టీ గురుకుల పాఠశాల -
నెల్లూరులో కాటేసిన కల్తీ మద్యం
-
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
నెల్లూరు(సెంట్రల్): నగరంలో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా కార్పొరేషన్ అధికారులకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు. స్థానిక 46వ డివిజన్లోని ఆచారివీధి, దేవిరెడ్డివారి వీధి, కాపు వీధి, ముత్తరాజువారివీధి, మంగళవీధి ప్రాంతాల్లో కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నర్తకీ సెంటర్, కాపువీధి ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య అధికంగా ఉందని, కాలువల్లో దుర్గంధం వెదజల్లుతోందని చెప్పారు. నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్తున్నారని, అయితే పారిశుధ్యానికి సంబంధించి విఫలమయ్యారని ఆరోపించారు. నగరంలోని కాలువలను సక్రమంగా శుభ్రం చేయడంలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వివిధ పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారని, శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వేలూరు మహేష్, వేలూరు రఘు, రామ్‌లక్ష్మణ్, అరవింద్, నారాయణరెడ్డి, కుమార్, అశోక్, సుబ్బారావు, జయకృష్ణ, రాజా, సుదర్శన్, రమేష్, మురళి, వెంకటేశ్వర్లు, నీలి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనను అంతమొందిద్దాం
కావలి (నెల్లూరు): అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ, గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోలతో ఉత్తుత్తి సినిమా చూపించి దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు పరిపాలనను అంతమొందించేందుకు అందరం పోరా టం చేద్దామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు, తెలుగు యువత పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి వల్లెపు కిషోర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీకి చెందిన పలువురు పెద్దఎత్తున ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక మానస సెంటర్లోని కళుగోళమ్మ దేవాల యం నుంచి భారీ ఎత్తున మహిళలు, యువకులు ర్యాలీగా బయలుదేరారు. బాణసంచా పేలుళ్లు, జై జగన్ నినా దాల మధ్య వడ్డిపాలెంలోని రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. అయి తే చంద్రబాబు పార్టీని అక్రమార్కులు, నేరస్తులు, దోపిడీదారులతో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బీసీలు, దళితులను అన్ని రకా లుగా అణచివేస్తున్నారని చెప్పారు. కిషోర్‌తో పాటు పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం అధికారం చేతిలో ఉందని టీడీపీ కార్యకర్త నుంచి, నియోజకవర్గంలో పెత్తనం చేసే నాయకుడిగా చెలామణి అవుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు జగన్ ముఖ్య మంత్రి కావాలని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సీఎం అయ్యేవరకు తాము విశ్రమించమన్నారు. ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుతండటంతో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అయినా తాము భయపడమని చెప్పారు. కేవలం ఎనిమిది నెలలు ఆగితే వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, నిధులు, స్వాహా చేసిన వారిని చట్టం బోనులో నిలబెడతామన్నారు. -
మంత్రి సోమిరెడ్డికి ఝలక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు ఇన్చార్జి వ్యవహారంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సోమిరెడ్డి తన అనుచరుడు కన్నబాబును ఇన్చార్జిగా చేయాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమించింది. ఇప్పటి వరకూ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి కోసం నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ అనుచరులకు ఇన్చార్జి పదవి కట్టబెట్టాలని పోటీ పడ్డారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా నెల్లూరు పార్లమెంట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆదాల ప్రభాకరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి పూర్తిగా నియోజకవర్గం కొత్త కావటంతో పార్టీ అంతర్గత విషయాల్లో సమన్వయం చేసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ఆదేశిచింది. ఈ క్రమంలో సోమవారం మంత్రులతో కలిసి ఆదాల ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా అధికార పార్టీలో ఆత్మకూరు నియోజకవర్గ వ్యవహారం రగడ కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో పోటీచేసి ఓడిపోయిన కన్నబాబుకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డి బలంగా ప్రయత్నించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టకూరు ధనుంజయరెడ్డికి ఇప్పించాలని ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రయత్నించి చివరికి ఆయన కూడా కన్నబాబుకే మద్దతు పలికారు. మరికొందరు పదవి ఆశించారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారంపై గత శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయకమిటీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆత్మకూరు ఇన్చార్జిని కాకుండా ఐదుగురు సభ్యులతో సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి నిరసనగా డీసీసీ బ్యాంకు చైర్మన్ ధనుంజయరెడ్డి గైర్హాజరు కావటం, హాజరైన కన్నబాబు ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో నేతల మధ్య వివాదం సాగుతున్న క్రమంలో చివరకు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తాత్కాలిక ఇన్చార్జిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడిపై పరిశీలకుడు ఫిర్యాదు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రపై పార్టీ జిల్లా పరిశీలకులు ఎరిక్సన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలు చర్చించటానికి, ఇతర పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎరిక్సన్ బాబు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
బలికొడవలూరు: విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని ఆలూరుపాడు మజరారెడ్డిపాళెంలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొల్లు గోపాల్ (58) తన సొంత పొలంలో గడ్డి కోసేందుకు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. గడ్డి కోస్తుండగా పొలంలోని విద్యుత్ మోటార్‌కు నేలపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగ దట్టంగా పెరిగిన పచ్చికలో కనిపించలేదు. ఈ క్రమంలో తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనతోపాటే వచ్చిన గ్రామానికి చెందిన మరో రైతు గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా గోపాల్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గంట ముందే ఇంటి నుంచి గడ్డి కోసం వెళ్లిన భర్త కళ్ల ముందే విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయిన మృతుడి భార్య రాజమ్మ లబోదిబోమని ఏడుస్తుండటం అందర్నీ కలచివేసింది. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనాథ్ తెలిపారు. -
ప్రజలను మోసం చేసిన టీడీపీ, బీజేపీ
ఉదయగిరి (నెల్లూరు): ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుంటే టీడీపీ హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని నాలుగేళ్లు కాలం వెళ్లదీసి మళ్లీ యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చేసే పన్నాగం పన్నుతోందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అ«ధిష్టానం పిలుపుమేరకు ఉదయగిరిలో మంగళవారం ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైఖరికి నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వచ్చి అధిక సంఖ్యలో కర్మాగారాలు నెలకొల్పబడి యువతకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి విభిన్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో హోదాపట్ల విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకొని హోదా కోసం నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజాభిమానం పొందారన్నారు. టీడీపీ ఎంపీలు దొంగ నాటకాలాడుతూ రాజీనామాలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. 600 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే వైస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. -
హోదా బంద్ విజయవంతం
వెంకటాచలం(నెల్లూరు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో హోదా కోసం మంగళవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మోటారు బైక్‌ను నడుపుతూ ముందుకు సాగగా ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారుబైక్లలో బయలుదేరారు. ఈ ర్యాలీ కసుమూరు రోడ్డు మీదుగా టోల్‌ప్లాజా వరకు సాగి అక్కడ నుంచి సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వరకు జాతీయ రహదారిపై సాగింది. వైఎస్సార్సీపీ నాయకులు ‘‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, హోదాకు చంద్రబాబే అడ్డు’’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారంగా నిలబడి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం సొంతపూచీకత్తు మీద వదిలేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్‌లో వైఎస్ఆర్సీపి జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రౌతు మల్లికార్జున, పార్టీ మం డల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, మం డల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, జిల్లా, మండల కో–ఆçప్షన్ సభ్యులు అక్బర్‌బాష, హుస్సేన్, వైఎస్సార్సీపీ నాయకులు మోహన్‌నాయుడు, వెలి బోయిన వెంకటేశ్వర్లు, సుమంత్‌రెడ్డి, నాటకం శ్రీని వాసులు, ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, పోచారెడ్డి సుధాకర్‌రెడ్డి, షాజహాన్, నరసయ్య, కోసూరు సుబ్బయ్యగౌడ్, డక్కిలి రమణయ్య, మందా కృష్ణ పాల్గొన్నారు. -
హోదా బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతం అయింది. పది నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొని బస్టాండ్లను ముట్టడించాయి. నిరసన ర్యాలీలు చేపట్టాయి. బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసుల ద్వారా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో వందల సంఖ్యలో నేతలు, కార్యకరలను అరెస్ట్ చేశారు. అయినా చాలా ప్రాంతాల్లో బంద్ సాయంత్రం వరకు సంపూర్ణంగా కొనసాగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంతో పాటు జిల్లాలో వ్యాపార, ఇతర వాణిజ్య సముదాయాలు, కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన బంద్ విజయవంతం అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నేతలు కేంద్రం అనుసరిస్తున్న తీరు, చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి జిల్లాలో పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపి హోదా నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి, సర్వేపల్లి నియోజవర్గంలో జరిగిన బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో బంద్‌లో భాగంగా కార్యకర్తలు కొందరు అర గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గూడూరు పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీ ప్రజలకు పూలు ఇచ్చిన బంద్‌కు మద్దతు పలకాని కోరారు. 40 కేసులు 777 మంది అరెస్ట్ తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్. కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేరిగ మురళీతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మొత్తం కలిపి 40 కేసులు నమోదు చేసి 777 మందిని అరెస్ట్ చేసి సొంత పూచికత్తు బెయిల్‌పై విడుదల చేశారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ తెల్ల వారుజాము న ఆత్మకూరు బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలి పారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో నగరంలో ర్యాలీ నిర్వహించి హోదా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి. రూప్కుమార్యాదవ్తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి నుంచే బంద్ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారం నగరంలోని దూరదర్శన్ కేంద్రాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సర్వేపల్లిలో పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తీరుపై కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరులో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. కావలిలో పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. కావలి పట్టణంలో బంద్ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. సూళ్లూరుపేటలో తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెలగపల్లి, ఎమ్మెల్యే సంజీవయ్య సీఎం చంద్రబాబు యూటర్న్‌తో రాష్ట్రం అధోగతి పాలవుతోందని మండిపడ్డారు. వెంకటగిరిలో పార్టీ సమన్వయకర్త జెడ్పీ చైర్మన్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటగిరి పార్టీ పట్టణ అధ్యక్షుడు డి.ఢిల్లీబాబు పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి బస్‌డిపో వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయగిరిలో పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బంద్ నిర్వహించారు. ఉదయగిరి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వరికుంటపాడులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడూరులో పార్టీ సమన్వయకర్త మేరిగ మురళి నేతృత్వంలో బంద్ కొనసాగింది. పార్టీ రాష్ట్ర నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. -
లారీని ఢీకొన్న కారు
నాయుడుపేటటౌన్: ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని పండ్లూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెట్టచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన ఆత్మకూరు పూర్ణచంద్రరావు (55) అతని భార్య నాగలక్ష్మి, సమీప బంధువైన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి పూర్ణశంకర్, అతని తల్లి రామకోటమ్మ, నర్సారావుపేటకు చెందిన కుక్కర్ల నర్సింహులు, అతని భార్య విజయలు కారు తీసుకుని రెట్టచింతల గ్రామానికి చెందిన పోలిశెట్టి నాగరాజు అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకుని సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాల్వాయి గ్రామం నుంచి తిరుమలకు బయలుదేరారు. నెల్లూరుకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తుగా ఉందని చెప్పాడు. దీంతో వారు మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణం ఉందని, దైవదర్శనం చేసుకునేందుకు సమయం ఉందని తొందర పడవద్దని చెప్పి నెల్లూరులో గంటపాటు డ్రైవర్‌ను నిద్రపోమని చెప్పి విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమలకు వెళుతుండగా మార్గమధ్యలో మండలంలోని పండ్లూరు వద్ద రోడ్డుపక్కనే నిలబెట్టి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న ఆత్మకూరు పూర్ణచంద్రరావు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మిగిలిన ఐదుగురురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌కు గాయలు కాలేదు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదంలో పూర్ణచంద్రరావు మృతిచెందిన విషయం మధ్యాహ్నం వరకు అతని భార్య నాగలక్ష్మీకి తెలియనివ్వలేదు. సమాచారం తెలుసుకుని మృతుడి బంధువులు నాయుడుపేట వైద్యశాల వద్దకు చేరుకోవడంతో ఆమెకు విషయం తెలిసింది. దీంతో ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గాయపడిన వారు కూడా ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. -
నీటి కష్టాలు వీడితే ఒట్టు!
సూళ్లూరుపేట: పట్టణంలో ప్రతి కుటుంబం తాగునీరు కొనుగోలు చేసి తాగాల్సిందే. పేట జనాభా సుమారు 48 వేలమంది. 15 వేల కుటుంబాలున్నాయి. జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. మొత్తం పది ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి. ఇందులో కొన్ని శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చివేశారు. అధికారుల సమాచారం ప్రకారం సమ్మర్ స్టోరేజీ నుంచి, ఇతరవాటి నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్లు ఇవ్వాలి. ఈ లెక్కన 48 వేల మందికి సుమారు 34 లక్షల లీటర్లు ఇవ్వాలి. అయితే 10 లక్షల లీటర్లు కూడా అందించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెనీరు అందడం గగనంగా మారింది. కొనాల్సిందే.. పట్టణంలో ప్రస్తుతం నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. మున్సిపాలిటీ 30 ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తోంది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తుంటే ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కళాక్షేత్రలో స్వజలధార కింద మున్సిపల్ స్థలంలో మున్సిపాలిటీ వనరులు, నీరు వాడుకుంటూ డాక్టర్స్ వాటర్ అనే సంస్థ నీటి వ్యాపారం చేస్తోంది. బిందెనీటిని రూ.4కు, 20 లీటర్ల క్యాన్‌ను రూ.15 విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా ప్రకటనలకే పరిమితమైంది. 1వ వార్డు, 15వ వార్డు, 13వ వార్డుల్లో ప్లాంట్స్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో క్యాన్‌ను రూ.20కు, బిందెనీటిని రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. ఓ అంచానా ప్రకారం నెలకు రూ.కోటి పైనే నీటి వ్యాపారం జరుగుతోంది. -
ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధర్నా
నెల్లూరు రూరల్: విభజన హామీలను అమలు చేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టిన టీడీపీ సర్కార్ ఇప్పుడు హోదా ఉద్యమం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి మునీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శీనయ్య, నగర సమితి సభ్యులు సిరాజ్, షానవాజ్, అన్వర్, అహ్మద్, అజీజ్, షబ్బీర్, నాసిర్, శీనయ్య, గఫూర్, సర్తాజ్, తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రోజుకు లారీల సమ్మె
నెల్లూరు(టౌన్): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల అసోసియేషన్ చేపట్టిన బంద్ నాలుగో రోజుకు చేరుకుంది. జిల్లాలో 10 వేలకు పైగా లారీలు నిలచిపోయాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం ద్వారా రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో లారీల యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. పై రాష్ట్రాల నుంచి జాతీయ రహదారిపై లోడుతో వస్తున్న వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం ఆ లారీలను అక్కడ నుంచి పంపించి వేశారు. జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి నారాయణ బంద్‌ను ఉధృతం చేస్తామని తెలిపారు. యజమానుల సమస్యలను పరిష్కరించే వరకు బంద్‌ను విరమించేది లేదని చెబుతున్నారు. -
అర్ధరాత్రి అలజడి
నెల్లూరు (క్రైమ్): బ్యాంక్‌లో దొంగలు పడ్డారని అర్ధరాత్రి ఆటోమెటిక్ మెసేజ్‌లు బ్యాంక్ ఉన్నతాధికారులకు వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాంటిదేమి లేదని తెలియడంతో వెనుదిరిగారు. ఈ ఘటన కేవీఆర్పెట్రోల్ బంకు సమీపంలోని ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కేవీఆర్ పెట్రోల్‌బంకు సమీపంలో స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ఉంది. బ్యాంకు అధికారులు దొంగతనాలు నియంత్రణకు బ్యాంక్ లోపల క్యాష్చెస్ట్ల వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు, ఆటోమెటిక్ మెసేజ్ (వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్), కాల్ సెండింగ్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. క్యాష్‌చెస్ట్ వద్దకు ఎవరైనా వెళ్లినా, దొంగతనానికి యత్నించినా, లేదా దాని ముందుగా ఏదైనా (గాలికి పేపర్లు పడినా, ఎలుకలు తదితరాలు వెళ్లినా) కదలికలు జరిగినా వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌కు సమాచారం వెళుతుంది. ఫోను సైతం మోగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లో దొంగలు ఉన్నారన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అకౌంట్స్ సుజాతకు, చీఫ్ మేనేజర్ వివేకానందకు మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో వారు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. రాత్రి జనరల్ చెకింగ్ విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసాచారికి డయల్ 100 సిబ్బంది సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన రాత్రి విధుల్లో ఉన్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డితో పాటు నగరంలోని సిబ్బందిని, అన్నీ పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లను అప్రమత్తం చేశారు. వేమారెడ్డిని, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని హుటాహుటిన బ్యాంక్ వద్దకు రమ్మని ఆదేశించి విషయాన్ని జిల్లా ఎస్పీ పీహె చ్‌డీ రామకృష్ణ, క్రైం ఓఎస్డీ టీపీ విఠలేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంక్ ఉద్యోగులతో కలిసి బ్యాంకు తాళాలను తెరిపించారు. బ్యాంక్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లోపల ఎవరూ లేకపోవడం, క్యాష్ చెస్ట్ వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడాన్ని గుర్తించారు. ఎలుకలు అటుగా వెళ్లడం ద్వారా మెసేజ్ వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే నగరంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ అనుమానాస్పదంగా తారసపడిన వ్యక్తులను ఆపి వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులు డీఎస్పీ కె. శ్రీనివాసాచారి సూచించారు.