సానుభూతి కోసం బాబు జిమ్మిక్కులు | Kakani Govardhan Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సానుభూతి కోసం బాబు జిమ్మిక్కులు

Published Sun, Sep 16 2018 11:51 AM | Last Updated on Tue, Oct 30 2018 6:08 PM

Kakani Govardhan Reddy Slams Chandrababu Naidu - Sakshi

సర్వేపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

ఇప్పటి వరకు 35 సార్లు ఇదే కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారని తెలిపారు.
 

నెల్లూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..సానుభూతి కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు జగన్‌కు అనుకూలంగా వస్తుండటంతో చంద్రబాబు వెన్నులో భయం మొదలైందన్నారు. 2013 నుంచి 13 సార్లు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేస్తూనే ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు 35 సార్లు ఇదే కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారని తెలిపారు.

బీజేపీతో కలిసి ఉన్నపుడు వారెంట్‌ వస్తే అప్పుడు మభ్యపెట్టాడని, ఇప్పుడేమో నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ ఇస్తే కుట్ర చేసిందని వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తనపై కేసు వేసి కోర్టుకు వెళ్లాడు..అదే వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేసి చట్టాలపై ఆరోపణలు చేస్తాడని ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement