warrant issued
-
త్వరలోనే భారత్‌కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్‌రావును దర్యాప్తు బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరగ్గా తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బాలీవుడ్ నటి అమిషా పటెల్‌పై అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ బ్యూటీ అమిషా పటెల్‌పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కింద ఆమెపై 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమిషా, అమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్‌కు వ్యతిరేకంగా సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలు.. అమీషా పటేల్‌కు చెందిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌గా రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్‌ను ఆమె సంప్రదించింది. చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ టీజర్.. హిందీలోనే ఎక్కువ వ్యూస్.. దీంతో అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశాడు. మేకింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఆయన అమిషాను కోరాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆమె 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరాడు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్‌ను ఇచ్చింది. చదవండి: ‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే కానీ, ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై రాంచీ సివిల్ కోర్టులో అమిషా, ఆమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్పై కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణకు అమిషా హజరు కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అలాగే గతంలో రూ. 32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమిషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కోర్టు ధిక్కరణ? నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లికి బిహార్ కోర్టు షాక్!
బాలీవుడ్ దర్శక-నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. వివరాలు.. ఎక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్ట్ సర్విస్‌మ్యాన్ శంబు కుమార్ 2020లో బీహార్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆ సిరీస్‌లో జవాన్ల భార్యలను అవమానపరిచారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సీన్స్ వారి కుటంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. శంబు కుమార్ ఫిర్యాదు మేరకు ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ అంతేకాదు ఈ విషయమై వారు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు తొలగించినప్పటికి, వారు కోర్టు ఆదేశాలని ధిక్కరించారని, నోటిసులు అందిన ఎక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంబు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని ఆయన వెల్లడించారు. కాగా 2020లో ఎక్తా కపూర్ దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌ను తన సొంత ఓటీటీ సంస్థ ఎఎల్టీబాలజీ (బాలజీ టెలిఫిలింస్ లిమిటెడ్) వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఆమె తల్లి శోభ కపూర్ కూడా చూసుకుంటారు. -
అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్
సినీ నటి, దర్శకురాలు జీవితపై నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఆరోపణలపై జీవిత వివరణ ఇచ్చారు. శనివారం జరిగిన శేఖర్ మూవీ ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు జీవిత.. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమే అన్నారు. కానీ తాను అరెస్ట్ కాలేదన్నారు. రెండు నెలలకుపైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు వారు మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదని, ఇంతకు ముందు కూడా తనపై వారెంట్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ కేసు తానే గెలిచినట్లు జీవిత తెలిపారు. రూ. 26 కోట్లు మోసం చేశారని జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్రావు అంటున్నారని, అవి ఏ కోట్లో అర్థం కావడం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అవన్ని తప్పుడు ఆరోపణలని ఆమె స్పష్టం చేశారు. అలాగే కోటేశ్వరావు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని జీవిత ఆరోపించారు. -
Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్
నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌పై జీవిత రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు. తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు హాజరు కాకపోవడంతో ఎన్ఐ యాక్ట్ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్‌పై ఆమె రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: (ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు) -
కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్‌పై అరెస్ట్ వారెంట్
సాక్షి, కోలకతా : కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌పై అరెస్ట్ వారెంట్‌జారీ అయింది. గత ఏడాది (2018, జులై) జరిగిన కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'హిందూ పాకిస్తాన్' అంటూ శశి థరూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తిరువనంతపురానికి చెందిన న్యాయవాది సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు, థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు సమన్లను ఖాతరు చేయకపోవడంతో, ఆయనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపాంజన్ సేన్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సెప్టెంబరు 24కి వాయిదా వేశారు. కోలకతాలో జరిగిన కార్యక్రమంలో థరూర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, దేశాన్ని 'హిందూ పాకిస్తాన్'గా మారుస్తుందని శశి థరూర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి..కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని...అంతిమంగా సరికొత్త ‘హిందూ పాకిస్థాన్’గా దేశాన్ని మారుస్తారంటూ ఘాటుగా విమర్శించారు. థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానంగా 'హిందూ పాకిస్తాన్' అని పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై మండిపడిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి కూడా చేశాయి. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే. -
సానుభూతి కోసం బాబు జిమ్మిక్కులు
నెల్లూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి నాన్‌బెయిలబుల్ వారంట్ ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..సానుభూతి కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు జగన్‌కు అనుకూలంగా వస్తుండటంతో చంద్రబాబు వెన్నులో భయం మొదలైందన్నారు. 2013 నుంచి 13 సార్లు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేస్తూనే ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు 35 సార్లు ఇదే కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని తెలిపారు. బీజేపీతో కలిసి ఉన్నపుడు వారెంట్ వస్తే అప్పుడు మభ్యపెట్టాడని, ఇప్పుడేమో నాన్ బెయిలబుల్ వారంట్ ఇస్తే కుట్ర చేసిందని వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కేసు వేసి కోర్టుకు వెళ్లాడు..అదే వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేసి చట్టాలపై ఆరోపణలు చేస్తాడని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. -
సీఎం అయితే కేసులు పెట్టకూడదా?
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మీద బీజేపీ తెలంగాణ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలను వాడుకోవడంలో, సమస్యలను పక్కదోవ పట్టించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు ఇప్పుడే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని, మోదీ సర్కారు నుంచి బయటికి వస్తే కక్షతో నోటీసులు ఇచ్చారని మాట్లాడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శమని ధ్వజమెత్తారు. ఏపీలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు మోదీ మీద నెపం నెడుతున్నారని మండిపడ్డారు. బాబుపై 17 కేసులు ఉన్నాయని, నాట్ బిఫోర్ మీ అనే పదం వాడి కేసు కొట్టేయించుకున్నాడని ఆరోపించారు. న్యాయవ్యవస్థలను వాడుకోవడంలో బాబు మించినోడు లేరని వ్యాఖ్యానించారు. బాబ్లీ కేసులో ఇదివరకే 37 సార్లు నాన్‌బెయిలబుల్ వారంట్లు ఇచ్చారని, ఇది 38వ నాన్‌బెయిలబుల్ వారంట్ అని వెల్లడించారు. గతంలో 37 సార్లు నాన్ బెయిలబుల్ వారంట్లు తీసుకోకుండా రకరకాల పద్ధతుల్లో ఆపుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ, మోదీలను తిట్టడం కోసం దీన్ని వాడుకుంటున్నాడని చెప్పారు. బాబు ఏపీ సీఎం అయ్యాక, కక్షతో ఏపీలో మా నాయకులు, కార్యకర్తల మీద ఎలా కేసులు పెట్టించారో మాకు తెలుసునని అన్నారు. ఉద్యమాల్లో, నిరసన కార్యక్రమాల్లో కేసులు వెయ్యడం సహజమని, దాన్ని రాజకీయాలకోసం వాడుకోవడం తగదన్నారు. సీఎం అయితే కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలోనే ఉమాభారతితో సహా అనేక మంది సీఎంల మీద కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ, ఇంకా ఉంది అని చెప్పుకోవడం కోసమే ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పారు. కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీని తిట్టడమే నీ(చంద్రబాబు) రాజకీయానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుని చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణాకు అనుకూలం అని ఆయనే అంటాడు..వ్యతిరేకం అని ఆయనే అంటాడు..తెలంగాణాకు, చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. -
ఏదైనా వాడేస్తారంతే..!
-
అరెస్ట్ వారంట్‌తో బాబు కొత్త డ్రామాలు
-
ఈ అరెస్ట్ వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
-
చంద్రబాబు కొత్త డ్రామాలు: కన్నా
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అరెస్ట్ వారంట్ జారీ కావడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారని వెల్లడించారు. కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్ వారెంట్ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు. -
మాజీ ఎమ్మెల్యేలకు అరెస్ట్ వారెంట్లు
సాక్షి, కరీంనగర్ జిల్లా : కరీంనగర్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావులకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 21న వీరిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆందోళన చేయడంతో చంద్రబాబుతో సహా 16 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది. -
సుజనా చౌదరికి వారెంట్ జారీ చేసిన కోర్టు
హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బుధవారం నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆయన వరుసగా మూడు సార్లు కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. సుజనా సంస్థల అధినేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి రూ.106 కోట్లు తమకు ఎగవేశారని ఆరోపిస్తూ... మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.