నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌పై జీవిత రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు.
తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు హాజరు కాకపోవడంతో ఎన్‌ఐ యాక్ట్ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్‌పై ఆమె రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment