Jeevitha Rajasekhar
-
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
రజనీకాంత్ 'లాల్ సలాం' ట్రైలర్ విడుదల
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లాల్ సలాం'. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్‌లో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 9న లాల్ సలాం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమళ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి 'లాల్ సలామ్' చిత్రంలో వినిపించారు. 'తిమిరి ఎళుడా..' అనే ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 'లాల్ సలాం'లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్‌తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్‌లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
'లాల్ సలాం' టీజర్ రిలీజ్.. మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించిన రజినీకాంత్
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా లాల్ సలాం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జైలర్‌తో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ చిత్రంలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్‌తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎందుకు మారాయి..? అనేది కథాంశం. టీజర్లో రజనీ సీరియస్ లుక్‌లో కనిపించగా.. విష్ణు విశాల్ ఏదో గొడవలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్ సలాం విడుదల కానుంది. -
'లాల్ సలాం' హార్డ్ డిస్క్‌లు మాయం.. రజనీ కాంత్‌కు సినిమాకు బ్రేకులు
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' చిత్రం చివరి దశకు చేరుకుంటుండగా.. రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్‌లో కనిపించకుండా పోయాయని ప్రచారం జరుగుతుంది. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీ చిత్రం 'కై పో చే'కి (Kai Po Che) రీమేక్ అని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రజనీ మొయిదీన్ భాయ్‌గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'లాల్ సలామ్' చిత్రీకరణ పూర్తయి చివరి దశకు చేరుకుంటుండగా.. సినిమాలో రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్ నుంచి మాయమైనట్లు సమాచారం. ఎంతో కష్టపడి రజనీ మీద చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కడా హార్డ్ డిస్క్‌లలో కనిపించడం లేదట. ఆ దృశ్యాలను వెలికి తీసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి రేసు నుంచి ‘లాల్ సలామ్ ’ సినిమా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పొంగల్‌కు ఇప్పటికే ప్రకటించినట్లుగా, శివకార్తికేయన్ నటించిన అయాలన్, జయం రవి నటించిన సైరన్ మాత్రమే కోలీవుడ్ విడుదల కానున్నాయి. ‘లాల్ సలాం’లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్‌స్క్రీన్‌పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం.. కృష్ణ-విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవిత-రాజశేఖర్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్‌కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నాగార్జున- అమల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. మహేశ్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్‌గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. నయనతార- విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022, జూన్ 7న విఘ్నేశ్‌తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్‌స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సాయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్ అలీ ఖాన్, దీపికా- రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: కోలీవుడ్ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల -
జీవిత.. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నాతోనే ఉంటానంది: రాజశేఖర్
జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. వీరిద్దరినీ వేర్వేరుగా చూడలేం. అంతలా ముడిపడిపోయిన ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీరి ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాలోలాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. అసలు పరిచయమే ఒక వింత అనుభవంతో జరిగింది. రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జీవితతో ఓ సినిమా చేయాల్సింది. అయితే హీరోయిన్ బాలేదు, మార్చేయండి అని చెప్పాడట. కట్ చేస్తే నిర్మాతలు రాజశేఖర్ స్థానంలో మరో హీరోను పెట్టి సినిమా చేశారు. అలా విచిత్ర సంఘటనతో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరి కూతుర్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ సినీరంగంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ లవ్‌స్టోరీని వెల్లడించారు. ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్ బాగా నచ్చిందని చెప్పింది జీవిత. అయితే రాజశేఖర్‌ను ఒప్పించేందుకు, ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడిందట. ఈ విషయం తెలిసిన రాఘవేంద్రరావు.. రాజశేఖర్ విలన్లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది అని తెలిపాడు. ఈ క్రమంలో జీవిత ఓ సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 'రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఫీలయ్యాను. ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని చెప్తూ ఎమోషనలైంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది, ఆ ప్రేమే నచ్చిందన్నాడు రాజశేఖర్. -
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్‌తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్‌కు ఇలా! ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్‌కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. #LalSalaam - Shoot to start on March 7 in Chennai - @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot - Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI — Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023 -
ఆ విషయం ఇప్పటిదాకా అమ్మానాన్నలకు తెలియదు : శివానీ రాజశేఖర్
శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్‌గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్‌బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది. మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్‌గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్‌తో వినోదాన్ని పంచుతోంది. చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్ -
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
జియో పేరిట జీవితా రాజశేఖర్‌కు టోకరా.. నిందితుడి అరెస్ట్
సినీ నటి జీవితా రాజశేఖర్‌ను టార్గెట్ చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన కేసులో చెన్నైవాసి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ అతడు నటీనటులతో పాటు నిర్మాతలను మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా జీవితకు కొన్నాళ్లక్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనను ఫారూఖ్గా పరిచయం చేసుకున్న వ్యక్తి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అంటూ మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించింది. దీంతో అతడు జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.1.25 లక్షలకే వస్తున్నట్లు తెలిపాడు. ఇది నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలు అతడికి ఆన్లైన్లో పంపారు. తర్వాత అటువైపు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. చదవండి: మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. పవిత్ర లోకేశ్ ఫిర్యాదు అమ్మాయిల పిచ్చి రూమర్‌పై కాంతారావు కూతురు స్పందన -
జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా
-
కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్‌గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్‌ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు. -
సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: సినీ నటి జీవితను టార్గెట్‌గా చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ విషయం చెప్తున్నానన్నాడు. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్లైన్లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య) నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్‌లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గానూ పని చేశాడు. -
ఉద్యామానికి ముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత: జీవిత
-
చెక్‌బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్
చెక్‌బౌన్స్ కేసులో ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ గురువారం తిరుపతి జిల్లాలోని నగరి కోర్టుకు హాజరైంది. గరుడవేగ సినిమా నిర్మాతలు హేమ, కోటేశ్వరరావులకు ఆమె రూ.26 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఆమె బకాయిలు చెల్లించలేదు. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. దీంతో గరుడవేగ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కేసు విచారణలో భాగంగా జీవితా రాజశేఖర్ కోర్టుకు హాజరైంది. చదవండి: ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో -
చెక్‌బౌన్స్ కేసులో నగరి కోర్టుకు హాజరైన సినీనటి జీవిత రాజశేఖర్
-
శేఖర్ మూవీ కోసం రూ.15 కోట్లు పెట్టాను, ఎవరిస్తారు?: నిర్మాత
జీవిత దర్శకత్వంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సమయంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని తాము చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నిర్మాత సుధాకర్ రెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను శేఖర్ సినిమా నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను, కానీ వాళ్లు శేఖర్ సినిమాను చంపేశారు. ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పని చేశాను, ఫైనాన్స్ కూడా ఇచ్చాను. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సినిమాలో శివానీ, శివాత్మికల పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే మా సినిమా ఆగిపోయింది. అసలు శేఖర్ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓలపై న్యాయపోరాటం చేస్తాం. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. నిజానికి నాకు ఆ పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్స్ ఇస్తారా? ఇది రాజశేఖర్ సినిమా కాదు, రాజశేఖర్ నటించిన సినిమా మాత్రమే! అలాగే జీవిత సినిమా కూడా కాదు, కేవలం జీవిత దర్శకత్వం చేసిన మూవీ. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ నా పేరు మీదే ఉంది. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాను. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి 👇 విజయ్, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదు.. నీ బాంచన్, జర ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వరాదే.. -
'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్ కూడా ట్వీట్ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాకు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి #Shekar Thanking our audience for constantly standing by us! pic.twitter.com/9nTE5ulig9 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 23, 2022 -
మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత
రాజశేఖర్ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్‌తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్‌గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను. ఇక ‘శేఖర్’ విషయానికి వస్తే.. రాజశేఖర్‌గారు నా ఫేవరెట్ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్ చేశాను. మలయాళ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్’ చూశాను. నచ్చి ‘శేఖర్’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్‌గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘శేఖర్’ మూవీ రివ్యూ
టైటిల్ : శేఖర్ నటీనటులు : రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, శివాణి, సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాణి రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ దర్శకురాలు: జీవిత రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫి:మల్లికార్జున్ నారగాని విడుదల తేది:మే 20, 2022 యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత ఆయన చిత్రాలకు పెద్ద ఆదరణ దక్కలేదు. ఇక రాజశేఖర్ పని అయిపోతుదన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్‌తో ‘శేఖర్’చిత్రంలో నటించారు. మలయాళం మూవీ జోసెఫ్ చిత్రం రీమేక్ ఇది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్’చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేఖర్(రాజశేఖర్)..ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు శేఖర్ని వెంటాడుతుంటాయి. ఓ రోజు ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘శేఖర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్ చిత్రాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది. 2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం.. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు అన్ని రకాల జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉండడంతో, ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి అందించడం కాస్త కష్టమే. అయితే దర్శకురాలు జీవిత మాత్రం.. కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్, శివాణి) మధ్య వచ్చే సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్డ్ మెడకల్ క్రైమ్’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్‌లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అయితే సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మది సాగడం, ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడం ఈ సినిమాకు మైనస్. మలయాళం మూవీ జోసెఫ్ చూడకుండా, ఈ చిత్రాన్ని చూసే మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటనలో ఇప్పటికి జోష్ తగ్గలేదు. రిటైర్డ్ కానిస్టేబుల్ శేఖర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్ న్యాయం చేశారు. శేఖర్ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిం పెడితే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జీవిత రాజశేఖర్ మహానటి, నోరు అదుపులో పెట్టుకో: నిర్మాతలు
సాక్షి, తిరుపతి: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారు సాక్షితో మాట్లాడుతూ.. 'జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్, సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం' అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు. చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? -
అది జరగపోతే అప్పుల పాలవుతాం: రాజశేఖర్
కోవిడ్ టైమ్‌లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్’అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కెరీర్లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు? ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్ సినిమా సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్‌లో కొత్తగా ఏం ఫీలయ్యారు? ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్, బాధను చూపించడానికి బాగా చేశాను. ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్ గురించి? 55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్ నాది. ఈ క్యారెక్టర్‌కి కొత్త లుక్ ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి.. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో వచ్చాం. ఆ గెటప్ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవిత దర్శకత్వం గురించి? షూటింగ్‌కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. మలయాళం మూవీ జోసెఫ్ మూవీని రీమేక్‌గా ఎంచుకోవడానికి కారణం? నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే జోసెఫ్ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్ చేసి హిట్ కొట్టాను. రీమేక్‌లకు సక్సెస్ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్ని సెలెక్ట్ చేశాం. ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి? మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..) మీ పాత్రలకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు ఉన్నారు కదా? మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్ మూర్తి నా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఎవరు డబ్బింగ్ చెప్పారో ఆడియన్స్ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్ చిత్రానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్లో 27 ఏళ్లు సాయికుమార్, 10 ఏళ్లు శ్రీనివాస్ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. కోవిడ్ టైమ్‌లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేశారు కదా? అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్, డాన్స్‌లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్ రీమేక్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్’ మూవీ చేశాను. నా కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్’మూవీ చాలా స్పెషల్. ఇంత ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ‘శేఖర్’లో ఏమైనా మార్పులు చేశారా? పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్‌కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్‌తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా? లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిగ్ గురించి? ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్ తన మ్యూజిగ్తో ఈ సీన్స్ మ్యానేజ్ చేశారు. కోవిడ్ టైమ్‌లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది? నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్ టైమ్‌లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్ మహేందర్ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్ సత్తారు కూడా గరుడవేగ పార్ట్2లో ఇద్దరు కూతుళ్లను యాడ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..) కొత్త సినిమాలు ఏం ఉన్నాయి? త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాం.