![Garuda Vega Movie Producers Hema, Koteswara Raju Fire On Jeevitha Rajasekhar - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/20/jeevitha.jpg.webp?itok=HktAatKX)
సాక్షి, తిరుపతి: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
వారు సాక్షితో మాట్లాడుతూ.. 'జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్, సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం' అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు.
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment