Garuda Vega
-
జీవిత రాజశేఖర్ మహానటి, నోరు అదుపులో పెట్టుకో: నిర్మాతలు
సాక్షి, తిరుపతి: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారు సాక్షితో మాట్లాడుతూ.. 'జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్, సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం' అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు. చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? -
మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా?
వరుణ్‌తేజ్ పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సర్‌గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాక్సీఫీస్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో వరుణ్ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితులు కొంచెం సద్దుమణిగాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్‌తో ప్రాజెక్టు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చదవండి : దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా మరోసారి జంటగా నటించనున్న వరుణ్‌తేజ్, సాయిపల్లవి ? -
‘కల్కి’కి భారీ ఆఫర్స్!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 40 శాతం ఎక్కువగా ఆఫర్ చేసిన ప్రముఖ నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మూడు బడా చానల్స్ పోటి పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన కల్కి, రిలీజ్ తరువాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. -
రేపే ‘కల్కి’ టీజర్
‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ సక్సెస్‌ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్స్‌తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it. April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019 -
ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల
గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు. తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో బిజీ అయ్యాడు. సడన్‌గా ఇప్పుడు అర్జున తెర మీదకు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇదే జోరులో రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి. కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
అదా సంగతి
‘గరుడవేగ’ వంటి హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించనున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అదా శర్మ నటించనున్నారు. 2016లో విడుదలైన ‘క్షణం’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు అదా. తాజాగా రాజశేఖర్‌తో నటించే చాన్స్ అందుకున్నారామె. నిజానికి హీరోయిన్ల లిస్టులో పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా అదా శర్మను ఖరారు చేశారు. ఈ పాత్రకు ఆమె అయితే కరెక్టుగా సరిపోతారని చిత్రవర్గాలు భావించి, అదాను సంప్రదించగా వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మించనున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో 1983 నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక పాటతో అలరించనున్నారు. నవంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
48 ఏళ్లు వెనక్కి!
రాజశేఖర్ టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పనున్నారు. అది కూడా ఏ పదేళ్లో.. పాతికేళ్లో కాదు.. ఏకంగా 48ఏళ్లు.. ఎందుకిలా వెనక్కి వెళుతున్నారంటే ఆయన నటించనున్న తాజా చిత్రం కోసమట. ‘గరుడవేగ’తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తన తర్వాతి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ మధ్య ఓ హింట్ ఇచ్చారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది అద్భుతంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఏంటంటే.. ‘అ’ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఆగస్టులో ఈ మూవీ స్టార్ట్ కానుంది. -
రాజశేఖర్ ‘అ’సమ్!
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తాను చేయబోయే సినిమాపై ఈ యాంగ్రీ హీరో ఓ హింట్ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్ (AWEsome) గా ఉండబోతోంది’. అంటూ తన ట్విటర్ పేజ్‌లో కామెంట్ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వర్మ ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్ తెరకెక్కుతున్న క్వీన్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్ సినిమా పనులు ప్రారంభించనున్నారు. Well.. all I can say about my next project is that, it’s going to be AWEsome! — Dr.Rajasekhar (@ActorRajasekhar) 28 June 2018 -
ఐశ్వర్య డైరెక్షన్లో రాజశేఖర్!
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్ కెరీర్ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్. ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రవీణ్ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్వర్మతో కూడా రాజశేఖర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. -
భలే చాలెంజ్!
ఏంటి? ఏను? ఎక్కడ? అల్లి... ఏంటీ తికమకగా ఉందా? ఇప్పటినుంచి కొన్ని నెలల పాటు శ్రద్ధా దాస్ ఇలా తెలుగు, కన్నడ మాట్లాడబోతున్నారు. ఎందుకు? అంటే.. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమా అంగీకరించారామె. తెలుగులో సీన్ తీసిన వెంటనే కన్నడంలో అదే సీన్ తీసేలా షూటింగ్‌ని ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు సునిల్‌కుమార్ దేశి. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’తో ఓ హిట్ అందుకున్నారు శ్రద్ధా. ఆ జోష్‌తో ఈ ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. కన్నడ వెర్షన్‌కి ‘ఉద్గర్శ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇంకా తెలుగు చిత్రానికి పేరు పెట్టలేదు. ‘‘ఉద్గర్శ’ సినిమాలో మోస్ట్ గ్లామరస్ గర్ల్‌గా నటిస్తున్నా. కన్నడ– తెలుగు డైలాగ్స్‌ను బ్యాక్ టు బ్యాక్ చెప్పడం చాలెంజింగ్‌గా ఉంది. బట్ ఈ చాలెంజ్ భలేగా ఉంది’’ అన్నారు శ్రద్ధాదాస్. -
ఆ సినిమా అద్భుతం : మహేష్ బాబు
సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడ వేగ. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. చాలా కాలం తరువాత ఓ సూపర్ హిట్ తో అలరించిన హీరో రాజశేఖర్‌కి సినీ ప్రముకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా గరుడ వేగ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ‘గొప్ప స్క్రిప్ట్, మంచి నటన, పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే. పీవీయస్ గరుడ వేగ అద్బుతం. హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు లకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. రాజశేఖర్ ఎన్ఐఏ ఏజెంట్ గా నటించిన గరుడ వేగ సినిమా తొలి వారంలోనే 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సత్తా చాటింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ సరసన పూజ కుమార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అదిత్ అరుణ్, శ్రద్ధా దాస్, కిశోర్, చరణ్‌దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Great script... Good performances... Slick screenplay... #PSVGarudaVega is stunning... Amazing work by the entire team. Take a bow @ActorRajasekhar & director @PraveenSattaru ! — Mahesh Babu (@urstrulyMahesh) 11 November 2017 -
రాజశేఖర్ నా కూతుర్ని కాపాడారు : సునీల్
గరుడ వేగ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మూవీ టీం ప్రస్తుతం సక్సెస్‌ను ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు. తాజాగా క్రిస్టమస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్లో హీరో సునీల్‌తో పాటు గరుడ వేగ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ ఆసక్తిరమైన విషయాన్ని వెల్లడించారు. గరుడ వేగ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన సునీల్. గతంలో తన కూతురికి ఆరోగ్యం బాగోలేని సమయంలో రాజశేఖర్ వైద్యం చేసి కాపాడారన్నారు. అందుకే సినీ హీరోగానే కాక వ్యక్తిగతంగానూ ఆయనంటే నాకు ఎంతో అభిమానమన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ కుమార్, శ్రద్దాదాస్, కిశోర్, చరణ్ దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చాలాకాలం తరువాత రాజశేఖర్‌కు దక్కిన విజయం కావటంతో యూనిట్ సభ్యులు ఈ సక్సెస్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. -
జీవిత ఇచ్చిన గిఫ్ట్ గరుడవేగ – రాజశేఖర్
‘‘గరుడవేగ’ సినిమా కథని ప్రవీణ్‌గారు ఏ ముహూర్తంలో రాశారో కానీ, నా కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘అంకుశం’ కంటే ఈ చిత్రం పెద్ద సక్సెస్. అందుకు ప్రవీణ్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ ఇటీవల విడుదలై హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘జీవిత వల్లనే ‘గరుడవేగ’ పూర్తయింది. తను ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చారని చెప్పొచ్చు. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ విడుదలైన తొలి ఆట నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అదే రోజు సాయంత్రానికి సక్సెస్ రేంజ్ మాకు అర్థమైపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని కొందరు, సరికొత్త రాజశేఖర్‌ని చూశామని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమదిగా భావించారు. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అమెరికాలోనూ వసూళ్లు ఇక్కడిలాగా బాగున్నాయి’’ అన్నారు. ‘‘మానవత్వం చాలా తక్కువమందిలో ఉంటుంది. అటువంటి వారిలో ప్రవీణ్ ఒక్కరు. తనకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. బాలకృష్ణగారు, రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మి ప్రమోషన్‌కి సహకరించారు. చిరంజీవిగారు, మహేశ్‌గారు, రాజమౌళిగారితో పాటు ఇండస్ట్రీ అంతా సినిమా హిట్ అయినందుకు అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు జీవిత. -
జక్కన్న ట్వీట్‌తో మరింత హ్యాపీ
సీనియర్ హీరో రాజశేఖర్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను గరుడ వేగ సినిమాతో అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గరుడ వేగ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో యాంగ్రీ హీరో సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు చిత్రయూనిట్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో రాజశేఖర్‌తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు సరదాగా డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. రాజశేఖర్ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, కిశోర్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ రావటంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్లకు ఎలాంటి డోకా లేదు. అయితే గరుడ వేగ టాక్‌పై స్పందించిన రాజమౌళి ఆదివారం సినిమా చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలిపారు. అంటే ఆదివారం రాజమౌళి గరుడ వేగ సినిమాపై తన మార్క్ రివ్యూ ఇస్తే సోమవారం కలక్షన్లు ఊపందుకునే అవకాశం ఉంది. Congratulations team PSV Garuda Vega.. Film carrying quite a positive buzz.. Booked our tickets for Sunday.. — rajamouli ss (@ssrajamouli) 3 November 2017 -
అమ్మానాన్నలకు ప్రామిస్ చేశా!
‘నేను ఫస్ట్ టైమ్ నా సినిమా చూస్తే... అందులో నేను చేసిన తప్పులే కనిపిస్తాయి. మూడు, నాలుగుసార్లు చూస్తే సినిమా అర్థమవుతుంది. కానీ, ఈ సిన్మా ఫస్ట్ కాపీ చూశా. బాగుంది. ‘డై హార్డ్, బార్న్ ఐడెంటిటీ, లీథల్ వెపన్’ వంటి ఇంగ్లీష్ సిన్మాల తరహాలో ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ చెప్పిన సంగతులు... దేశం కోసం ఓ ఎన్ఐఏ ఆఫీసర్ ఏం చేశాడనేది చిత్రకథ. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశానని ప్రవీణ్ చెప్పినప్పుడు పెద్ద అవార్డు వచ్చినట్టు ఫీలయ్యా. బౌండ్ స్క్రిప్ట్‌తో, పర్ఫెక్ట్ప్లానింగ్తో 90 రోజుల్లో సినిమా తీశాడు. యాక్షన్ ఫిల్మ్ అయినా... వృత్తిపర, వ్యక్తిగత జీవితాల మధ్య ఎన్ఐఏ ఆఫీసర్ పడే సంఘర్షణను మంచి వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు.నా గత సినిమాలకు భిన్నంగా తక్కువ మాటలు, ఎక్కువ యాక్షన్‌తో... కమర్షియల్ హంగులతో సినిమా ఉంటుంది. నేనయితే కథ మొత్తం చెప్పేసేవాణ్ణి (నవ్వుతూ). మా దర్శకుడుఇంతకు మించి చెప్పొద్దన్నారు. థియేటర్లో చూస్తే మీకు మంచి ఫీల్ కలుగుతుంది.ఎన్ఐఏ ఆఫీసర్ కదా! మంచి ఫిట్నెస్తో కనిపించాలని ముందు వర్కౌట్స్ గట్రా చేశా. షూటింగుకి సరిగ్గా నెల రోజుల ముందు ప్రతిరోజూ ఛాతీలో నొప్పి వచ్చేది. హాస్పిటల్‌కి వెళితే.. ‘హార్ట్ఎటాక్’ అన్నారు. స్టెంట్ వేశారు. మినిమమ్ సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు. దాంతో అనుకున్న టైమ్ కంటే పది రోజులు లేటుగా షూటింగ్ స్టార్ట్ చేశా. ఇంకా రెస్ట్ తీసుకుంటే మిగతాఆర్టిస్టుల డేట్స్ డిస్ట్రబ్ అవుతాయి. అది నాకిష్టం లేదు. దేవుడి దయవల్ల షూటింగ్ హ్యాపీగా జరిగింది. ‘రాజశేఖర్... నీకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది’ అని షూటింగులో నాజర్‌గారు అన్నారు. టీజర్, ట్రైలర్స్ చూసిన చాలామంది అభిప్రాయమిదే. కానీ, ఈ సినిమా ప్రారంభానికి ముందు నామార్కెట్ బాగోలేదు. సొంతంగా సినిమాలు నిర్మించి బోలెడు డబ్బులు పోగొట్టుకున్నా. అప్పుడు మా అమ్మ బాధపడ్డారు. నేను ఏమవుతానోనని ఆందోళన పడితే... ఇకపై సినిమాలునిర్మించనని అమ్మానాన్నలకు ప్రామిస్ చేశా. ప్రవీణ్ ఆరేడు కోట్లు బడ్జెట్ అవుతుందన్నారు. అప్పుడు నాన్నగారి స్నేహితుడు కోటేశ్వర్రాజుగారు గుర్తొచ్చారు. ఆయన నాతో సినిమాచేయాలనుకుంటున్నారని ఎప్పట్నుంచో నాన్న చెబుతుంటే... నా డిప్రెషన్ పోగొట్టడానికి చెబుతున్నారనుకున్నా. కానీ, కథ విని 25 కోట్లు ఖర్చు చేశారు.చిరంజీవిగారిని ప్రీమియర్ షోకి ఆహ్వానించడానికి వెళితే.. ‘మా ఆఫీసులో మీ ట్రైలర్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. పెద్ద హిట్టవుతుంది’ అన్నారు. ప్రచార చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ అదే మాట చెబుతున్నారు. ‘గరుడవేగ’ హిట్టయితే... సక్సెస్ క్రెడిట్ అంతా నాన్న, ప్రవీణ్, కోటేశ్వర్‌రాజు, జీవితలకు చెందుతుంది. షూటింగులో ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురైనా.. జీవిత చక్కగా హ్యాండిల్ చేసింది. ఓ రకంగా జీవిత నాకిస్తున్న బహుమతి ఇది. రామ్‌చరణ్ ‘ధృవ’లో అరవింద్‌స్వామి చేసినటువంటి విలన్ రోల్స్ వస్తే నటిస్తా. అంతే కానీ... జస్ట్.. విలన్ ఫర్ విలన్ రోల్స్ వస్తే చేయను. -
గరుడ వేగ ప్రీ రిలీజ్ వేడుక
-
సన్నీ సందడి చేయనుంది..!
యంగ్రీ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడవేగ. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న రాజశేఖర్ తో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ యాంగ్రీ హీరో. అంతేకాదు రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ శేఖర్ సరసన పూజాకుమార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యంగ్ హీరో అదిత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాల్లో కూడా వేగం పెంచారు. ఇప్పటికే పలు టీవీ షోలలో ప్రైవేట్ కార్యక్రమాల్లో సందడి చేస్తున్న చిత్రయూనిట్, శుక్రవారం భారీ ఆడియో రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సన్నిలియోన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుందన్న టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని సన్నీలియోన్ కూడా కన్ఫమ్ చేసేసింది. తాను 27న హైదరాబాద్ వస్తున్నానంటూ వీడియో మేసేజ్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన సన్నీ.. ఎవ్వరూ మిస్ అవ్వొద్దూ అందరూ వచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది. -
నవంబర్ 3న గరుడ వేగ
సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన గరుడవేగ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిచ్.. స్టైలిష్.. గరుడవేగ
సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా గరుడవేగ టీజర్ పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి విడుల చేశారు. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిచ్.. స్టైలిష్.. గరుడవేగ
-
ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. గరుడవేగ టీజర్ ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మీ, తాప్సీ పన్నులు ఒకేసారి తమ సోషల్ మీడియా పేజ్ లలో ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మరింతగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. -
జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం' సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్లోనే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌తో తొలిసారిగా ఈ సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది. శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జర్నలిజం స్టూడెంట్ కావడంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
తెరంగేట్రానికి సిద్ధం..!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని.. త్వరలో గరడువేగ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నాడు రాజశేఖర్. ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు శివానిని ఇంట్రడ్య్సూ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. జీవితా రాజశేఖర్‌లు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని కన్ఫామ్ చేసినా.. అది ఎప్పుడన్నది చెప్పలేదు. అయితే ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. గ్లామరస్ లుక్‌లో హీరోయిన్‌కు కావాల్సిన అన్ని ఫిచర్స్‌తో అదరగొడుతుంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా అంటున్నారు సినీ జనాలు. లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్న శివానీ నటిగానూ ఆకట్టుకుంటే స్టార్ స్టేటస్ అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు. -
ముంబైలో ఆటా పాటా
పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలంటే యాంగ్రీ మేన్ రాజశేఖర్‌కు కొట్టిన పిండే. ‘అంకుశం, ఆగ్రహం, మగాడు’ వంటి చిత్రాల్లో ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకులను అలరించారాయన. తాజాగా ‘గరుడ వేగ’ చిత్రంలో మరోసారి రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా నట విశ్వరూపం చూపించనున్నారు. ఇందులో ఆయన సై్టలిష్‌గా కనిపించనున్నారు. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాగా, మనోజ్ హీరోగా రూపొందిన ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్ ‘గరుడ వేగ’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం భారీ సెట్ వేశారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. -
యాంగ్రీ హీరోతో సన్నీ
చాలా కాలంగా వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గరుడ వేగ. గుంటూరు టాకీస్తో మంచి విజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజశేఖర్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌ను బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీలియోన్‌తో చేయిస్తున్నారు. భారీ మొత్తం ఆఫర్ చేయటంతో సన్నీ కూడా వెంటనే ఒప్పేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు రెడీ అవుతోంది. -
'గరుడ వేగ'గా సీనియర్ హీరో
కొంత కాలంగా సరైన హిట్స్ లేక కష్టాల్లో పడ్డ సీనియర్ హీరో, మరోసారి తన ట్రేడ్ మార్క్ సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వరుసగా యాంగ్రీ రోల్స్ లో సక్సెస్ లు సాధించిన రాజశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత అదే తరహా పాత్రలోకనిపించనున్నాడు. ఇటీవల విలన్ రోల్స్ కూడా సై అన్న రాజశేఖర్ హీరోగా ఫాంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రాజశేఖర్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు(శుక్రవారం) రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పిఎస్వి గరుడ వేగ 128.18ఎమ్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎమ్ కోటేశ్వర రాజు నిర్మిస్తున్నారు. -
'గరుడ' సంక్రాంతి ఆఫర్లు
న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రముఖ కొరియర్ సంస్థ గరుడ వేగ.. కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలతో సహా సుమారు 200 దేశాలకు తమ సేవలను విస్తరించిన గరుడ వేగ.. విదేశాల్లోని భారతీయులు, పండుగ సందర్భంగా ఇక్కడున్న తమ వారికి పంపే గిఫ్టులు.. తమవారి నుంచి అక్కడకు చేర్చాల్సిన పండగ రుచులను చేరవేయడానికి భారీ ఆఫర్లను ప్రకటించింది. గరుడ బజార్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ బ్యాంగిల్స్ లో ప్రత్యేకమైన వాటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ప్రత్యేక స్వీట్లు ఇప్పుడు ఎక్కువమంది విక్రేతల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా 20 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించడమే కాకుండా పొంగల్ కూపన్ కోడ్ ద్వారా మరో 5 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.