యంగ్రీ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడవేగ. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న రాజశేఖర్ తో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ యాంగ్రీ హీరో. అంతేకాదు రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ శేఖర్ సరసన పూజాకుమార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యంగ్ హీరో అదిత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాల్లో కూడా వేగం పెంచారు. ఇప్పటికే పలు టీవీ షోలలో ప్రైవేట్ కార్యక్రమాల్లో సందడి చేస్తున్న చిత్రయూనిట్, శుక్రవారం భారీ ఆడియో రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తోంది.
ఈ కార్యక్రమంలో సన్నిలియోన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుందన్న టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని సన్నీలియోన్ కూడా కన్ఫమ్ చేసేసింది. తాను 27న హైదరాబాద్ వస్తున్నానంటూ వీడియో మేసేజ్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన సన్నీ.. ఎవ్వరూ మిస్ అవ్వొద్దూ అందరూ వచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment