
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది.
సినిమా బడ్జెట్ 40 శాతం ఎక్కువగా ఆఫర్ చేసిన ప్రముఖ నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మూడు బడా చానల్స్ పోటి పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన కల్కి, రిలీజ్ తరువాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment