Kalki
-
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
ఇఫీలో కల్కి... 35: చిన్న కథ కాదు
ఒక భారీ చిత్రం... ఒక చిన్న చిత్రం... తెలుగు పరిశ్రమ నుంచి ఈ రెండు చిత్రాలు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శితం కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి’, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శిల కాంబినేషన్లో నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా నిర్మించిన చిన్న చిత్రం ‘35: చిన్న కథ కాదు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి.దేశ వ్యాప్తంగా పోటీలో నిలిచిన 384 ఫీచర్స్ ఫిల్మ్స్‌లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో 5 చిత్రాలను, ఇండియన్ పనోరమా విభాగంలో 20 చిత్రాలను... మొత్తంగా 25 చిత్రాలను ఎంపిక చేశారు. ఇక నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచిన 262 చిత్రాల్లో 20 చిత్రాలను ఎంపిక చేశారు. ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శితం కానున్న 5 చిత్రాల్లో ‘కల్కి’, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న 20 చిత్రాల్లో ‘35: చిన్న కథ కాదు’ ప్రదర్శితం కానున్నాయి.మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఇక కురుక్షేత్ర యుద్ధంతో మొదలై, అక్కణ్ణుంచి 6 వేల సంవత్సరాల తర్వాతి కథతో దాదాపు రూ. 600 కోట్లతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి’ హాలీవుడ్ సినిమాని తలపించి, భారీ వసూళ్లను రాబట్టి, ఘనవిజయం సాధించింది. ఇక కుమారుడు పాస్ మార్కులు తెచ్చుకోవాలని ఓ తల్లి పడే తపనతో రూపొందిన ‘35: చిన్న కథ కాదు’ ఎమోషనల్‌గా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ప్రారంభ చిత్రంగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ ఇండియన్ పనోరమా విభాగంలోప్రారంభ చిత్రంగా హిందీ ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ని ప్రదర్శించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను రణ్‌దీప్ హుడా పోషించారు. అది మాత్రమే కాదు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఒక రచయితగా, ఓ నిర్మాతగానూ వ్యవహరించారు రణ్‌దీప్.ముందు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఆరంభమైంది. అయితే క్రియేటివ్ పరంగా ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత రణ్‌దీప్ దర్శకత్వ బాధ్యతను నిర్వర్తించారు. ఈ చిత్రంలో చరిత్రను ఏకపక్షంగా చూపించారంటూ కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ నటీనటుల నటనకు ప్రశంసలు లభించాయి. రణ్‌దీప్ టైటిల్ రోల్లో అంకితా లోఖండే, అమిత్ సాయి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దక్షిణాది ప్రముఖులకు జ్యూరీలో చోటు లేదు‘ఇఫీ’ ఉత్సవాల్లో మొత్తం 25 ఫీచర్ íఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ íఫిల్మ్స్ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జ్యూరీలో ఉంటారు. ఫీచర్ ఫిల్మ్స్ ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కోసం ఆరుగురు సభ్యు లతో కూడిన జ్యూరీ సినిమాలను ఎంపిక చేసింది. అయితే దక్షిణాదికి చెందిన ప్రముఖులు ఎవరూ జ్యూరీలో లేకపోవడం గమనార్హం. ఇక గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఈ 55వ ‘ఇఫీ’ వేడుకలు నవంబరు 20న ఆరంభమై 28న ముగుస్తాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాల్లో బెంగాలీ చిత్రం ‘మొనిహార’ ఒకటి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న సుభాదీప్ బిస్వాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మొనిహార కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్‌గా రూపొందిన ‘అపార్, ‘నవాబీ శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. ఇంకా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన పట్నాల పై అన్వేష్ తీసిన డాక్యుమెంటరీ బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. -
'కల్కి' నిర్మాతలకు రామ్‌చరణ్ సర్ప్రైజ్.
-
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
ఓటీటీలో కల్కి.. బీటీఎస్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
షారుఖ్ ను వెనక్కి నెట్టేసిన ప్రభాస్..
-
Kalki Bujji: 'బుజ్జి' సందడితో.. యువత సెల్ఫీలు!
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి’ కారు వరంగల్ నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం హనుమకొండలోని ఏషియన్ మాల్లో ‘బుజ్జి’కారును బుధవారం ప్రదర్శనకు ఉంచారు.దీనిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బుజ్జితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని సంబురపడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
కల్కి నిర్మాతలు సంచలన నిర్ణయం..
-
'కల్కి' ఖాతాలో మరో సరికొత్త రికార్డ్!
-
అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టిన ప్రభాస్..
-
కల్కి సినిమా నుంచి అశ్వత్థామ సాంగ్.. వీడియో వైరల్
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా కల్కి సినిమా నుంచి పాటలను విడుదలను కూడా విడుదల చశారు. 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో కేశవ, మాధవ పాటను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న విడుదలైన కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. సంతోష్ నారాయాణ్ పాడిన ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
'కల్కి'లో చూపించిన కాశీ ఇదే.. సెట్ ఇలా ఉందా? (ఫొటోలు)
-
కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.కల్కి చిత్రం పార్ట్-2లో మహేశ్ బాబు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు? దీనిపై మీరేమంటారు? అని నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'ఇప్పుడైతే మేం మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోలేదు.. ఈ సినిమాలో కాకుండా.. వేరే ఏదైనా చిత్రంలో ఆయన చేస్తే బాగుంటుంది' అని అన్నారు. అయితే కల్కి పార్ట్-2లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా హీరో నాని, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ.. వాళ్లద్దరిని తీసుకోవడం ఈ చిత్రంలో కుదరలేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే వాళ్లను అక్కడ పెట్టేస్తాను' అని అన్నారు. -
కల్కి మేకర్స్‌పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.అయితే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాజాగా కల్కి మూవీ వీక్షించిన ముకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. కల్కి చిత్రంలోని విజువల్స్, నటనను ప్రశంసించినప్పటికీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.ముఖేశ్ మాట్లాడుతూ.. "నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వథామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వథామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి' అని అన్నారు.అనంతరం ముకేశ్ మాట్లాడుతూ..'నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి కారణం. కృష్ణుడు భవిష్యత్తులో తనను రక్షించమని కల్కిలో అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అంత శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు.. తనను రక్షించమని అశ్వత్థామను ఎలా అడగుతాడు? ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్‌కి మన సంప్రదాయాలపై ఎక్కువ గౌరవం ఉందని అనుకుంటున్నాం? కానీ రామాయణం, గీత, ఇతర పౌరాణిక అంశాలతో రూపొందిస్తున్న చిత్రాలను పరిశీలించాలి. అవసరమైతే సినిమా స్క్రిప్ట్ పరిశీలనకు కమిటీని వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా.. మహాభారత్ సీరియల్లో భీష్ముని పాత్రలో ముకేశ్ ఖన్నా కనిపించారు. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
నేను కోరుకుంది ఇది కాదు: కల్కి హీరోయిన్
అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ ఊహించలేం. అయితే ఏది జరిగినా మన మంచికే అని పాజిటివ్‌గా తీసుకోవడంలోనే మానసిక ప్రశాంతత ఉంటుంది. సినిమా రంగం విషయానికి వస్తే చాలా మంది డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయినవారూ, ఇంజినీర్ కావాలనుకున్న వారు నటులు, దర్శకులు, దర్శకులవ్వాలని ఆశించిన వారు నటులు అవుతుంటారు. నటి దిశాపటానీ ఈ కోవకు చెందిన∙ నటేనట. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ నటించి ఇండియన్ నటిగా రాణిస్తున్నారు. తాజాగా కంగువ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. గ్లామర్ క్వీన్‌గా ముద్రవేసుకున్న దిశా పటానీ.. కల్కి చిత్రంలో హీరోయిన్గా మెరిశారు. అలాగే వెల్ కమ్ టు ది జంగిల్ అనే హిందీ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు ఉత్తరాది, దక్షణాది చిత్రాలన్న తారతమ్యాలు లేవని, అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కల్కి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పించి, ఆయనే స్వయంగా వడ్డించేవారని చెప్పారు. కోలీవుడ్‌లో నటుడు సూర్య సరసన కంగువ చిత్రంలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి పోలీస్ అధికారి అని, తల్లి ఆరోగ్యశాఖలో ఇన్స్పెక్టర్గా బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. ఇక తన సహోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ట్నెంట్ కల్నల్ అని, తనకు యుద్ధ విమాన పైలట్ కావాలని కోరుకున్నానని, అయితే ఆ కలను ఫలింపజేసుకోకుండా నటిగా మారానని చెప్పారు. ఇందుకోసం తాను డాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ కళలో శిక్షణ పొందినట్లు నటి దిశాపటానీ చెప్పారు. -
యూత్‌కి పిచ్చిగా నచ్చేసిన 'కల్కి' బుజ్జి.. ఐమాక్స్‌లో స్పెషల్ అట్రాక్షన్..(ఫోటోలు)
-
కల్కి కథలో రహస్యం
-
Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా, అమితాబ్,కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది.మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌నే నాగ్ అశ్విన్ తీసుకొని దానికి సాంకేతిక జోడించి, సినిమాటిక్‌గా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా.కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. అయితే ఇందులో ‘కల్కి’ ఎవరు? ‘కలి’ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు. హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు ‘భైరవ’. అశ్శత్థామగా అమితాబ్ నటించాడు. కమల్ పోషించిన పాత్ర పేరు ‘సుప్రీం యాస్కిన్’ అని వెల్లడించారు. ఇక గర్భిణీ ‘సమ్-80’ గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్. సుప్రీం యాస్కిన్ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కమల్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది. భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. డైరెక్టర్ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్ 27 రిలీజ్)ఆగాల్సిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరదా.. సరదాకే..
ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్ రెడ్డి మల్గి...సరదాగా డబ్స్మాలతో మొదలై ప్రభాస్ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం.. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బిటెక్ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్‌లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్‌లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్‌స్మాష్‌లను నేను సరదాగా చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చే«శాను. దీంతో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్బిస్కట్లో యాక్టర్‌గా కొన్ని స్కెచ్ విడియోస్ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్‌రెడ్డి మల్గి. లాక్డౌన్లో యాక్టింగ్‌పై మరింత ఆసక్తి... లాక్డౌన్లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్’ సినిమాలో మెయిన్ రోల్ చేశాను. థియేటర్లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్‌కుమార్, లూసర్ వెబ్‌సీరిస్‌లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు. కల్కిలో అవకాశం... సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్ రాలేదు. ఓ డిఫరెంట్ రోల్లో చేయాలనుకునే సమయంలో మెయిల్ చిత్రం ప్రొడ్యూసర్ స్వప్నదత్ ప్రభాస్‌తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్అశి్వన్ మెయిల్ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా సెలెక్ట్ చేశారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఓ డిఫరెంట్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో రిలీజ్ అయ్యే నా మొదటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్‌తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోగా రాణిస్తా... ప్రేక్షకులను అలరిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. నా డ్రీమ్‌రోల్ సూపర్‌హీరో రోల్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్‌తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్ తీసుకొని తరచూ జిమ్ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా... -
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా..? లేదా
-
Kalki 2898 AD Hyderabad Event: గ్రాండ్‌గా ప్రభాస్ కల్కి ఈవెంట్.. బుజ్జి లుక్ రివీల్ చేసిన మేకర్స్ (ఫొటోలు)
-
ఆ టైమ్ కి కల్కి రిలీజ్ అవుతుందా..?
-
కల్కి వర్సస్ భారతీయుడు-2..రిలీజ్ గ్యాప్ రెండు వారాలే
-
18 ఏళ్ల నిరీక్షణకు తెర.. కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
‘తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని’ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని మోదీ పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో పది గర్భాలయాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు. #WATCH | At the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal, Uttar Pradesh CM Yogi Adityanath says, "In the last 10 years, we have seen a new Bharat... The country is moving ahead on the path of development in the new Bharat..." pic.twitter.com/fjSfnwyLpa — ANI (@ANI) February 19, 2024 -
నేడు కల్కిధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖలో తెలియజేసింది. -
కల్కి 2 అప్డేట్! గెట్ రెడీ
-
'ప్రభాస్ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు
-
కల్కి'లో బిగ్ స్టార్స్..!
-
కలెక్షన్స్ వేటలో హనుమాన్..!
-
కల్కికి కష్టం.. పోటీగా హాలీవుడ్ మూవీ
-
కల్కి రిలీజ్ డేట్ వెనుక పెద్ద ప్లానే ఉందిగా..!
-
కల్కి విడుదల తారీకు ప్రకటన రాబోతుందా ?
-
కల్కి రిలీజ్ ఆరోజే! ప్రభాస్ ప్లానింగ్ అదుర్స్..!
-
అశ్వవాహనంపై కల్కి అవతారంలో కొలువుదీరిన శ్రీవారు!
తనువును పులకరింపజేసే మలయమారుతాలు.. మనసుని పరవశింపజేసే గోవిందనామాలు.. ఆధ్యాత్మికానుభూతిని ఇనుమడింపజేసే జీయ్యంగార్ల గోష్టిగానాలు.. శ్రవణానందకరంగా మంగళవాయిద్యాలు.. కనులపండువగా కళాబృందాల నృత్యాభినయాలు.. ఠీవిగా ముందుకేగుతున్న గజరాజులు.. అడుగడుగునా కర్పూరహారతుల నడుమ ఉభయదేవేరీ సమేతంగా మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై దివ్యతేజోవిరాజితంగా దేవదేవుడు విహరిస్తూ భక్తులకు సకల శుభాలను అనుగ్రహించారు. కలి దోషాలను నివారించే కల్కి అవతారంలో అశ్వవాహనం అధిరోహించి సమస్త జీవకోటిని కటాక్షించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ మాడవీధుల్లో విహరించారు. ఈ క్రమంలోనే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కనులపండువగా అశ్వవాహన సేవ నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకారంలో అశ్వంపై కొలువుదీరి భక్తజనులను అనుగ్రహించారు. వాహనసేవల్లో టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రసాన్నం, రాత్రి ధ్వజారోహణంతో పరిపూర్ణంకానున్నాయి. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వరాహస్వామివారి ఆలయం వద్ద పుష్కరిణిలో ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం జరిపించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. (చదవండి: మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!!) -
ప్రభాస్ 'కల్కి' సీక్రెట్స్ బయటపెట్టిన కమల్ హాసన్
-
జగదేకవీరుడు సినిమా ప్రభాస్ కల్కి రిలీజ్ కి లింక్ ఏంటి?
-
ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాం!
‘‘ఈ వయసులో మనం చేయలేని యాక్షన్ సీన్స్ చేయగలుగుతున్నామే... అని హ్యాపీ ఫీలయ్యాను. చేయలేకేం కాదు. యాక్షన్ సీన్స్‌ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. సినిమాలో ప్రస్తావించిన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను’’ అన్నారు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన ‘కల్కి’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్‌తో పాటు ఆయన సతీమణి జీవిత చెప్పిన సంగతులు. నటన, లుక్స్, మేనరిజమ్.. ఇలా అన్ని అంశాల్లో ‘కల్కి’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్స్ పరంగా 60–70 శాతం మార్కులే వచ్చాయి. థియేటర్లో 100 పర్సెంట్ కలెక్షన్ లేదు. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాం. ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకోవాల్సి ఉంది. మొత్తంగా ‘కల్కి’ నేను అనుకున్న స్పీడ్ అందుకోలేదు. త్వరలో అందుకుంటాను. వదలను. మా సినిమాకు కొన్ని బ్యాడ్ రివ్యూస్ రాశారని తెలిసింది. మంచి సినిమాపై బ్యాడ్ రివ్యూస్ ప్రభావం చూపలేవు. స్క్రీన్‌ప్లే ఇంకా ఫాస్ట్ అండ్ గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే వంద మార్కులు సాధించి ఉండేవారమని నా అభిప్రాయం. సినిమాలో ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ అనే డైలాగ్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ చెప్పినప్పుడు బాగా రాశారన్నాను. ఈ విషయం జీవితతో చెబితే... ఈ డైలాగ్ మీదే కదా అని చెప్పింది. నాపై వేసిన కామెడీ డైలాగ్ నాదే అని కూడా తెలియకుండా నటించాను. ఆ తర్వాత ఏవో కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా (ఈ డైలాగ్ ఉన్న సినిమా) చూడలేదు. విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ రొటీన్‌గా ఉండేవి చేయాలనుకోవడం లేదు. మా ఇద్దరు కూతుర్లు మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకుంటారనే మాటలు వినిపించడం హ్యాపీగా ఉంది. ఓ సందర్భంలో నేను, శివానీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. నేను, జీవిత, శివానీ, శివాత్మిక కలిసి భవిష్యత్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదే కాదు నా పిల్లలతో ఎన్ని సినిమాలు వచ్చినా చేస్తాను. కొడుకులే చేస్తారు? కూతుళ్లు అంతగా చేయలేరు? అనుకున్న నాకు నా కూతుళ్లు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ‘కల్కి 2’ ఉండొచ్చు కానీ ఎప్పుడన్న విషయం గురించి స్పష్టంగా చెప్పలేను. మరోవైపు ప్రవీణ్ సత్తారు ‘గరుడ వేగ 2’ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. జీవిత అవుట్‌లైన్ విన్నారు. అయితే నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని ఇంకా అనుకోలేదు. ఇన్వాల్వ్మెంట్ కాదు... కేరింగ్ ‘‘కల్కి’ సినిమా డైరెక్షన్లో జీవిత లీనమయ్యారనే వార్త అక్కడక్కడా వినిపిస్తోంది. దీని గురించి జీవితా రాజశేఖర్‌లు ఈ విధంగా స్పందించారు. జీవిత: ఈ సినిమా బడ్జెట్ దాదాపు 23 కోట్లు అయ్యింది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసేప్పుడు కరెక్ట్‌గా వస్తుందా? రాదా?.. అంటే యూనిట్లో మేం ఒక 10 మెంబర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉంటాం. ఈ పదిమందికి ముందు నచ్చాలి కదా. రిలీజ్ తరవాత పదికోట్లమందికి నచ్చుతుందా? లేదా అన్నది తర్వాతి విషయం. ప్రశాంత్ వర్మకు ఇది రెండో సినిమా. పెద్ద సినిమా చేస్తున్నాం. మనం షూట్ చేసిన రషెస్ పరిశీలించుకున్నప్పుడు అవసరమైతే టీమ్ అందరితో కలిసి చర్చించుకోవాలి కదా. అలా చేయడం ఇంటర్ఫియరెన్స్ అవుతుందా? లేక ప్రాజెక్ట్‌పై మేం తీసుకునే కేర్ అవుతుందా? రాజశేఖర్: డైరెక్షన్లో కాదు జీవిత డిస్కషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కేర్‌ను ఇంటర్ఫియరెన్స్ అంటే బాధగా ఉంటుంది కదా. జీవిత: ఇటీవల ‘డిగ్రీ కాలేజీ’ సినిమా ప్రెస్మీట్లో టీజర్ అసభ్యకరంగా ఉందని నా అభిప్రాయం చెప్పాను. సినిమాలో అవసరమైన చోట రొమాన్స్ అవసరం. నేనూ నటించాను. మా కూతుళ్లూ నటిస్తున్నారు. ఒక కిస్సింగ్ సీనో... ఒక హగ్గింగ్ సీనో కథ డిమాండ్ చేస్తేనే పెట్టాలి. మణిరత్నంగారు ఎంతో రొమాన్స్ చూపిస్తారు. కానీ వల్గర్‌గా అనిపించదు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు, బాపుగారి సినిమాల్లో రొమాన్స్ ఉంటుంది. కానీ చూపించాల్సిన విధానంలోనే ఉంటాయి. ఒక సెన్సార్ మెంబర్‌గా ఆర్సీ (రివైజింగ్ కమిటీ) నా దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే... ఏడవాలో నవ్వాలో తెలియదు. అదేదో ‘ఏడుచేపల కథ’ అని ఒక సినిమా ఉంది. అందులో అనవసరమైన రొమాన్స్ ఉన్నట్లు ఉంది. ఇలాంటివి వద్దు అని చెబుతున్నాను. వెంటనే జీవితగారు తన పాత సినిమాల్లో చేయలేదా? రేపు ఆమె కుమార్తెలు ఎవర్నీ ముట్టుకోరా? రాజశేఖర్‌గారు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదా? అంటే నేనిప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. రొమాన్స్, లవ్ సీన్స్ లేకుండా సినిమాలు తీయలేం. కానీ కావాలని అలాంటివి పెట్టొద్దన్నది నా అభిప్రాయం. ఇక ‘కల్కి’లో 30 శాతం అంశాలు కొందరికి నచ్చలేదు. వాటినే పట్టుకుని రాయొద్దని కోరుకుంటున్నాను. ఎఫ్డీసీ (ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి నాకు ఇవ్వబోతున్నారన్న వార్తలు కేవలం పుకార్లే. వైఎస్ జగన్‌గారి కోసం మాకు దొరికిన తక్కువ సమయంలో చేయగలిగిన ప్రచారం చేశాం. ఆయన గెలిచినందుకు హ్యాపీగా ఉంది. ప్రజలకు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ పోయినట్లు ఉంది. ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు అనే ఫీలింగ్ ఉండేది సైకలాజికల్‌గా. ఇప్పుడు ఇద్దరు సీయంలు (ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్) మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు కనిపిస్తోంది. – జీవిత -
అలాంటి పాత్రలైతే విలన్‌గా చేస్తా : రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా రాజశేఖర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్... అన్ని బాగున్నాయని అంటున్నారు. మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు? క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. ‘సార్... ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం మళ్లీ వెళుతున్నాం, సార్... ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం’ అని ఫోనులు చేస్తుంటే... నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది. సినిమాలో మీ స్టైలింగ్ మీద చాలా కాన్సంట్రేట్ చేసినట్టున్నారు? పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తే చాలు... నేను డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫిట్నెస్ మీద దృష్టి పెడతా. ఇన్‌షర్ట్ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో కాస్త ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం? నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు? సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు? వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి... ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు ధీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదా శర్మతో నా పెయిర్ సూపర్ ఉందని మా అమ్మాయిలు చెప్పారు. రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా? స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారు. మీరు, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది! చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. విలన్‌గా చేయడానికి సిద్ధమేనా? నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు... ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా. ‘దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా? ఉంది. అయితే... ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, దొరసాని కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది. నిన్న విడుదలైన దొరసాని ట్రైలర్ చూసి సావిత్రిగారితో కొందరు పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా? ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు గారు గరుడవేగ 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
‘ఆ డైలాగ్ ఐడియా నాదే’
'అ!' చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. 'అ!' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా, మాస్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? దర్శకుడిగా నా తొలి సినిమా 'అ!' ఏ సెంటర్ సినిమా అయితే... 'కల్కి' బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ. రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది! అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే... సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో. (చదవండి: ‘కల్కి’ మూవీ రివ్యూ) 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది? నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత... ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని... రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు. తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు? అవును. అయితే... అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు. సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు తెరపై చాలా పేర్లు పడ్డాయి. వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం. తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట. అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు? నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా. సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట? అవునండి. క్లైమాక్స్ యే కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత... స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా. 'అ!', 'కల్కి'... రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో? నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా? ఒక్కటి మాత్రం నిజం... తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్ లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది. నెక్స్ట్ సినిమా ఏంటి? ఏమో... రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం. మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా? ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి. -
ఇప్పుడు ఆ భయమే లేదు
‘‘సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎంతసేపు?’ అని ఆలోచించే యాక్టర్‌ని కాదు నేను. మనకిచ్చిన రోల్లో, మనకున్న స్క్రీన్ టైమ్‌లో ఒప్పుకున్న పాత్రకు, ఆ సినిమాకు మనమేం కొత్తదనం తీసుకురాగలం అని మాత్రమే ఆలోచిస్తాను. యాక్టర్‌గా చేసే ప్రతిదీ ఫుల్ లెంగ్త్ రోల్ అయ్యుండాలనీ సినిమా మొత్తం కనిపించాలనీ అనుకోను’’ అన్నారు అదా శర్మ. రాజశేఖర్, అదా శర్మ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అదా శర్మ పలు విశేషాలు పంచుకున్నారు. ► ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ‘అ!’ సినిమా నచ్చింది. తనతో సినిమా చేయాలనుకున్నా. ప్రశాంత్ ‘కల్కి’ కథ చెప్పగానే నచ్చింది. హీరోయిన్ పాత్రలను ఆయన విభిన్నంగా రాస్తారు. ఈ సినిమాలోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిసారి డాక్టర్ పాత్ర చేశా. ఈ పాత్ర అన్నీ కళ్ల ద్వారానే వ్యక్తపరుస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాను నేను. అందుకే ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి రిఫరెన్స్ కోసం కొన్ని పాత సినిమాలు చూశాను. అప్పటి హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలను గమనించాను. పాత తరం నటీమణుల్లో వహీదా రెహమాన్, వైజయంతి మాల నాకు ఇష్టమైన హీరోయిన్లు. ► రాజశేఖర్గారిలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ తొలి సినిమా చేస్తున్న హీరోకి ఉండే ఎగై్జట్‌మెంట్‌తో ఈ సినిమాకు వర్క్ చేశారాయన. తను సీనియర్, నేను జూనియర్ అనే ఫీలింగ్ సెట్లో ఎప్పుడూ లేదు. చాలా పాజిటివ్ పర్సన్. ► ‘క్షణం’ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. తెలుగు సినిమాలు వరుసగా ఎందుకు చేయడం లేదని తెలుగు ఫ్యాన్స్ అడుగుతుంటారు. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. సో.. హిందీలో వరుసగా రెండు సినిమాలు చేస్తే తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా చేయాలి, ఆ తర్వాత హిందీ సినిమా చేయాలి అనే స్ట్రాటజీతో ప్లానింగ్ చేయలేను. ► ప్రస్తుతం హిందీలో ‘కమాండో 3’, మ్యాన్ టు మ్యాన్’ సినిమాలు కమిట్ అయ్యాను. ‘కమాండో’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాల్లో హీరోయిన్స్‌ను మారుస్తారు. కానీ మూడో సినిమాలోనూ నేనే హీరోయిన్‌గానే కొనసాగుతున్నాను. ‘మ్యాన్ టు మ్యాన్’లో అబ్బాయిగా నటిస్తున్నాను. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్, రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నాను. ► నా వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే యాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. కొందరు వాళ్ల ప్రొఫెషన్ని ఇష్టపడరు. ఉదయాన్నే లేచి అబ్బా.. ఇవాళ కూడా ఆఫీస్‌కి వెళ్లాలా? అని బాధపడతారు. నేను మాత్రం వీకెండ్స్ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అందరికీ హీరోయిన్ అయ్యే చాన్స్ రాకపోవచ్చు. మనకి వచ్చిన చాన్స్‌ని కష్టపడి నిలబెట్టుకోవాలి. అందుకే నా జాబ్‌ను లక్కీగా ఫీల్ అవుతాను. ► ఏ కథ అంగీకరించినా అది నా నిర్ణయమే. ‘క్షణం’ ఓకే చేసినప్పుడు చిన్న సినిమా ఎందుకు? అన్నారు. కానీ నా నిర్ణయాలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్ కార్పెట్ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది. -
‘కల్కి’ మూవీ రివ్యూ
-
‘కల్కి’ మూవీ రివ్యూ
టైటిల్ : కల్కి జానర్ : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కల్కి. రాజశేఖర్‌ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మరి ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్‌తో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకున్నాడా..? కథ : కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తారు. కొల్లాపూర్ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : గరుడ వేగ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్ మోడ్‌లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్ టైమింగ్‌తో మెప్పించాడు. విలన్‌గా అశుతోష్ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్, సిద్దు జొన్నలగడ్డ, చరణ్‌దీప్, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్ థ్రిల్లర్‌ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్ ఫార్మాట్ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్ నేపథ్యం సంగీతంతో వావ్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్ తీసుకురావటంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్‌తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం క్లైమాక్స్ ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : హీరోయిన్ పాత్ర స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
బాలయ్య ‘అ’ దర్శకుడితోనా!
తన చర్యలతో అభిమానులకు షాక్ ఇచ్చే నందమూరి బాలకృష్ణ, అప్పుడప్పుడూ సినిమాల విషయంలోనూ అలాంటి షాక్లే ఇస్తుంటాడు. ఎవరూ ఊహించని కాంబినేషన్లో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసి అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు బాలయ్య. తాజాగా మరోసారి అలాంటి క్రేజీ కాంబినేషన్ తెరమీదకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. శుక్రవారం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ వర్మ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపారు. గతంలో అ! సినిమా ప్రమోషన్ సమయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశాడు ప్రశాంత్. దీంతో బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలెక్కే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి. శివాని, శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే లాంటి డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై హైప్ మరింత పెంచాయి. రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. గరుడవేగ తర్వాత కల్కితో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణాలు కీలక పాత్రల్లో నటించారు. -
కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారమే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్లోనే సినిమా లైన్ ఎంటో చెప్పేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు హత్య కేసు చుట్టూ తిరుగుతుంది కల్కి కథ. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా రాజశేఖర్, జర్నలిస్ట్‌గా రాహుల్ రామకృష్ణలు కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్, స్కార్లెట్ మెలిష్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు
‘‘ఒకప్పుడు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి.. లాంటి దర్శకులు నాకు ఇచ్చిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’తో మా ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు. ‘కల్కి’ సినిమాతో దాన్ని అందుకుంటామనే నమ్మకముంది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. ‘కల్కి’ మూవీ హానెస్ట్ ట్రైలర్‌ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథలతో కొత్త దర్శకులు నన్ను సంప్రదించొచ్చు. సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడవేగ–2’ తెరకెక్కబోతోంది. చిరంజీవిగారి సినిమాలను కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నట్టు నా సినిమాలకు నా కూతుర్లు సపోర్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘1983 నేపథ్యంలో సాగే పీరియాడికల్ చిత్రమిది. కొత్త ఫార్మాట్లో ఉంటుంది. సాయితేజ కథ ఇచ్చాడు. ఎవరి కథనీ కాపీ కొట్టలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ఓ సాధారణ ప్రేక్షకుడిలా క్లైమాక్స్ కోసం ఉత్కంఠగా చూశాను. థియేట్రికల్ రైట్స్ ఒక్కరే తీసుకోవడం విశేషం. రిలీజ్‌కి ముందే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు సి.కళ్యాణ్. ‘‘గరుడవేగ’ కన్నా ‘కల్కి’ పెద్ద విజయం సాధిస్తే.. దీన్ని మించి ‘గరుడవేగ–2’ తీస్తాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?
‘గరుడవేగ’ విజయవంతం అయ్యే సరికి యాంగ్రీస్టార్ రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌కు ఈ చిత్రం ఘన విజయాన్ని ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో మళ్లీ అదే ఎనర్జితో సినిమాలను చేస్తున్నారు. యంగ్ టాలెంటెండ్ ప్రశాంత్ వర్మతో తీస్తున్న ‘కల్కి’ చిత్రం ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ విడుదల చేయడంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయాల్సిన ట్రైలర్‌ను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సాంకేతికలోపం తలెత్తడంతో ఇప్పటికీ విడుదల చేయలేకపోయింది చిత్రబృందం. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ఇంకెంతసేపు ఎదురుచూడాల్సి వస్తుందో మరి. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత, పూజిత పొన్నాడ, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారు. -
ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం
‘‘కల్కి’ మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి. ఆ క్రేజ్, కంటెంట్ చూసి ఈ సినిమాను పంపిణీ చేస్తున్నాం’’ అని నిర్మాత కె.కె. రాధామోహన్ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల హక్కులను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని, విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే ‘కల్కి’ని విడుదల చేస్తున్నాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా మెయిన్ ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
జూన్ 28న రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. మధుర మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా కల్కి. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి తగ్గ విధంగా, కొత్త తరహా సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి’ అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు కల్కి అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు’ అని అన్నారు. -
ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!
హీరో రాజశేఖర్‌గారి మేనరిజమ్స్‌ని ఇప్పటివరకూ చాలామంది ఇమిటేట్ చేశారు. అయితే తన మేనరిజమ్స్‌ని రాజశేఖర్‌గారే ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ‘ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!’ డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాని ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కమర్షియల్ ట్రైలర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని ‘మహర్షి’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చాలా బావుందని, చాలా ఎంజాయ్ చేశామంటూ చాలా మంది ఫోన్లు చేశారు.. మెసేజ్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘కల్కి’ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్‌గారు నేను అడిగినది కాదనకుండా చేశారు. ఆయన మేనరిజమ్స్ ఆయనే ఇమిటేట్ చేయడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. సి. కళ్యాణ్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘రాజశేఖర్ డెడికేషన్, ప్రశాంత్ వర్మ హార్డ్ వర్క్‌తో సినిమా బాగా వచ్చింది’’ అని సి. కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
ఫుల్ జోష్‌లో రాజశేఖర్..!
‘గరుడవేగ’ ఇచ్చిన విజయంతో యాంగ్రీ మెన్ రాజశేఖర్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేశారు. ఈ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాను ఎంచుకునే కథలపై దృష్టి పెట్టారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి చేస్తున్న రాజశేఖర్.. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్‌తో అంచనాలను పెంచేశారు. తాజాగా మరో చిన్న వీడియోను కమర్షియల్ ట్రైలర్ పేరిట విడుదల చేశారు. ఈ కమర్షియల్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో రాజశేఖర్ ఫుల్ జోష్‌లో నటించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్‌లో వచ్చే.. గీతాప్రభోదం.. అటుపై ఆయన మ్యానరిజంలో చెప్పే డైలాగ్.. చివర్లో ఆయన స్టైల్ డ్యాన్స్‌పై ఫైర్ అవ్వడం.. ఈ ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. మొత్తానికి మరో హిట్ గ్యారెంటీ అన్న ధీమాలో చిత్రబృందం ఉండగా.. సినీ అభిమానుల్లో సైతం ఈ సినిమా పట్ల ఉత్కంఠనెలకొంది. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
‘కల్కి’కి భారీ ఆఫర్స్!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 40 శాతం ఎక్కువగా ఆఫర్ చేసిన ప్రముఖ నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మూడు బడా చానల్స్ పోటి పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన కల్కి, రిలీజ్ తరువాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు... బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్లో ఒక్క డైలాగ్ లేకపోవడం విశేషం. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్‌గారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
‘కల్కి’ టీజర్ వచ్చేసింది!
‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. అందులో భాగం ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రేపే ‘కల్కి’ టీజర్
‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ సక్సెస్‌ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్స్‌తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it. April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019 -
‘కల్కి’ టీజర్ : అదరగొడుతున్న రాజశేఖర్!
‘గరుడవేగ’ ఇచ్చిన సక్సెస్‌తో హీరో రాజశేఖర్లో మంచి జోష్ కనబడుతోంది. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది. నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్‌ను రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ టీజర్‌తో అదరగొట్టేస్తున్నాడు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్ బ్యాగ్రౌండ్లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు రాజశేఖర్. సి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. -
‘కల్కి’ టీజర్ విడుదల
-
అంతకుమించిన సంతోషం లేదు
‘‘లోకంలో ఎవరికైనా పని దొరకడమన్నదే గ్రేట్. దానికంటే సంతోషమైన విషయం ఏదీ ఉండదు. నాకు పని కల్పించి, నాతో పని చేయించుకుంటూ సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అని రాజశేఖర్ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయికలుగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ సినిమా టీజర్ విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ సినిమా తర్వాత ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించి, ఈ కథ ఓకే చేశాం. ‘గరుడవేగ’ కి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ప్రశాంత్ వర్మతోనూ అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘శేషు’ తర్వాత రాజశేఖర్‌గారితో నేను చేస్తున్న చిత్రమిది. నేను చిన్న సినిమాలు చేసేటప్పుడు లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని, నన్ను నిర్మాతను చేశారు జీవిత–రాజశేఖర్ దంపతులు’’ అన్నారు. ‘‘అ!’ చిత్రానికి ముందే ‘కల్కి’ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, కుదరలేదు. ఒక ఫ్రాంచైజీ తరహాలో ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. అన్నీ కుదిరితే రాజశేఖర్‌గారి తర్వాతి బర్త్ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్‌గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను ‘యాంగ్రీ స్టార్’ అనే బిరుదు ఇస్తున్నా’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘గరుడవేగ’ కి ముందు మళ్లీ సక్సెస్‌లోకి వస్తామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనుక ఎన్ని కోట్లు ఉన్నా కెరీర్‌ని కొనలేం. అటువంటి సమయంలో ‘గరుడవేగ’ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా మాట్లాడుతుండటంతో సంతోషంగా ఉంది’’ అన్నారు జీవిత. శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రపాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
రేపు ‘కల్కి’ టీజర్ విడుదల
‘గరుడవేగ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను ఈ మూవీతో సాధించారు రాజశేఖర్. మళ్లీ ‘కల్కి’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా మంచి పేరును సంపాదించాడు. తన తదుపరి చిత్రంగా.. 1980 నేపథ్యంలో సాగే డిఫరెంట్ స్టోరీతో కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌తోనే ఆకట్టుకుంది. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
35ఏళ్లు వెనక్కి!
‘పి.ఎస్.వి. గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నారు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ‘కల్కి’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో స్టైల్‌గా కూర్చుని ఉన్న రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటోంది. 1983 నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందట. మరి.. 35 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అశుతోష్ రానా, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వైరల్ అవుతోన్న ‘కల్కి’ మోషన్ పోస్టర్!
‘గరుడవేగ’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు డా.రాజశేఖర్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో రాజశేఖర్ హవా మళ్లీ మొదలైంది. యాంగ్రీ యంగ్‌మెన్‌గా రాజశేఖర్ ఎన్నో మరుపురాని హిట్స్ ఇచ్చారు. అయితే గరుడవేగ రిలీజై చాలా రోజులవుతున్నా.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘అ!’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. మంచి ప్రయత్నంగా మిగిలినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. అయితే రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. -
నేను క్షేమంగా ఉన్నా : హీరో రాజశేఖర్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో పది రోజుల కిందట రాజశేఖర్ గాయపడ్డారు. అయితే చాలా మంది నటీనటులు కాంబినేషన్లో షూటింగ్ ఉండటంతో రెస్ట్ తీసుకోకుండానే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కొద్ది రోజుల గ్యాప్ తరువాత ప్రస్తుతం మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కులుమానాలీ వెళ్లారు. అయితే అక్కడ మరోసారి రాజశేఖర్ ప్రమాధానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హీరో రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.‘చిన్న అడ్డంకి కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైంది అంతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. కులుమనాలీలో జరగబోయే షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాను. నా క్షేమాన్ని కోరుతూ ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశారు. The rumours are little too spiced, here’s what actually happened. Dear media, please don’t attach my old accident pictures to the recent news.😊 pic.twitter.com/NUImzNcvhB — Dr.Rajasekhar (@ActorRajasekhar) 22 November 2018 -
రిస్కీ స్టంట్స్ చేస్తున్న సీనియర్ హీరో
చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో ప్రయోగం చేస్తున్నారు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారట. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘కల్కి’కి జోడిగా అదా, స్కార్లెట్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు రాజశేఖర్. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో రాజశేఖర్‌కు జోడిగా ఇద్దరు అందాల భామలు కనిపించనున్నారట. తెలుగు హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తో పాటు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్ విల్సన్ లు హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాతో రాజశేఖర్ తన ఫాంను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. -
కల్కి షురూ
పవర్ఫుల్ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు కథానాయకుడు డా. రాజశేఖర్. గతేడాది ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తర్వాతి చిత్రం ఉంటుందని రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ‘కల్కి’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది. -
‘అ!’ అనిపించేలా ‘కల్కి’
నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్ ఈజ్ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైటిల్ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
కల్కిని నేను.. ఆఫీసుకు రాను..!
అహ్మదాబాద్: ‘విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిని నేను. ప్రపంచాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. అందుకే ఆఫీసుకు రావట్లేను. నా యజ్ఞం వల్లే ఇరవయ్యేళ్లుగా దేశంలో పుష్కలంగా వానలు కురుస్తున్నాయి’ అంటూ గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు ప్రకటించుకున్నారు. రమేశ్చంద్ర ఫెఫర్(55) అనే ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులకు పరిహారం అందించే శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఆరు నెలలుగా ఆఫీసుకు రావట్లేదు. అధికారులు మూడు రోజుల క్రితం ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న రమేశ్చంద్ర..‘కల్కి అవతారంలో ఈ లోకాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. ఆఫీసులో యాగం చేయడం కుదరదు. అందుకే ఇంట్లో చేస్తున్నా. యాగం ఫలించి 19ఏళ్లుగా దేశంలో సమృద్ధిగా వానలు పడుతున్నాయి’ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌కోట్‌లో మాట్లాడారు. ‘ఆఫీసులో కూర్చుని కాలక్షేపం చేయటం ముఖ్యమా లేక దేశాన్ని కరువు నుంచి కాపాడటం ముఖ్యమా అనేది పైఅధికారులే నిర్ణయించాలన్నారు. -
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'
-
ఆ....ఒక్కటి అడక్కండి!
గ్లామర్ పాయింట్ కేవలం నటించడం కోసం నటించడం అని కాకుండా ఎప్పటికప్పుడు నటనలో కొత్తదనం చూపుతుంది కల్కి. తాజాగా ఆమె నటించిన ‘మార్గరీటా విత్ ఏ స్ట్రా’ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెరెబ్రల్ పాల్సికి గురై వీల్‌చైర్‌కు పరిమితమైన అమ్మాయిగా కల్కి నటనకు ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రేక్షకులు, సినీవిమర్శకులే కాకుండా సాటి నటులు కూడా కల్కిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదిసరేగానీ, తన టీనేజి లవ్ స్టోరీ గురించి చెప్పి ఒక సమావేశంలో అందరినీ నవ్వించింది కల్కి. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఏ అబ్బాయి తన వైపు చూసినా, టక్కుమని ప్రేమలో పడేదట. పెళ్లి కూడా చేసుకోవాలనుకునేదట. అంతేనా... పొయెట్రీ కూడా రాసేదట. ఆనాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతున్న కల్కిని ఒక విలేఖరి- ‘‘అనురాగ్ కాశ్యప్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?’’ అని అడిగితే ఆమె ముఖంలో నవ్వు మాయమై కోపం ప్రత్యక్షమైంది. ఆ ఒక్కటి అడక్కండి అని ఆమె ఎన్నిసార్లు చెప్పిందో కదా! -
పాపం.. కల్కి!
కల్కి.. 40 ఏళ్ల ఈ హిజ్రాను తమిళనాడులోని రాజకీయ పార్టీలు నిరాశపరిచాయి! విళుపురం జిల్లా కొట్టాక్కరైలో నివసించే ఈమె పుదుచ్చేరి నుంచి లోక్‌సభకు పోటీచేసేందుకు ఉత్సుకత చూపించినా ఏ పార్టీ టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ‘సహోదరి’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్న కల్కి.. గత పదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తమిళనాడులో ఒక హిజ్రా పోటీచేసేందుకు ముందుకు రావడం ఇదే ప్రథమం. ‘‘ఏదైనా పార్టీ నుంచి పోటీచేయాలని భావించా కానీ కుదరలేదు. ఇక ఏదో ఒక పార్టీలో చేరి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తా..’’ అని కల్కి చెప్పింది.