ఫుల్‌ జోష్‌లో రాజశేఖర్‌..! | Rajasekhar Kalki Movie Commercial Trailer Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న ‘కల్కి’ కమర్షియల్‌ ట్రైలర్ 

May 9 2019 5:21 PM | Updated on May 9 2019 6:46 PM

Rajasekhar Kalki Movie Commercial Trailer Released - Sakshi

‘గరుడవేగ’ ఇచ్చిన విజయంతో యాంగ్రీ మెన్‌ రాజశేఖర్‌ ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చేశారు. ఈ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాను ఎంచుకునే కథలపై దృష్టి పెట్టారు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కల్కి చేస్తున్న రాజశేఖర్‌.. ఇప్పటికే పోస్టర్స్‌, టీజర్స్‌తో అంచనాలను పెంచేశారు. తాజాగా మరో చిన్న వీడియోను కమర్షియల్‌ ట్రైలర్‌ పేరిట విడుదల చేశారు.

ఈ కమర్షియల్‌ ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో రాజశేఖర్‌ ఫుల్‌ జోష్‌లో నటించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌ స్టార్టింగ్‌లో వచ్చే.. గీతాప్రభోదం.. అటుపై ఆయన మ్యానరిజంలో చెప్పే డైలాగ్‌.. చివర్లో ఆయన స్టైల్‌ డ్యాన్స్‌పై ఫైర్‌ అవ్వడం.. ఈ ట్రైలర్‌లో హైలెట్‌ అయ్యాయి. మొత్తానికి మరో హిట్‌ గ్యారెంటీ అన్న ధీమాలో చిత్రబృందం ఉండగా.. సినీ అభిమానుల్లో సైతం ఈ సినిమా పట్ల ఉత్కంఠనెలకొంది. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement