Prashanth Varma
-
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
నెగటివ్ షేడ్స్‌లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ భారీ ప్లాన్!
ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయాల్సిన ‘స్పిరిట్’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. (చదవండి: ఆ కారణంతో దిల్ రాజు సినిమాను రిజెక్ట్ చేశా: దుల్కర్ సల్మాన్)అయితే ప్రభాస్ తర్వాతి చిత్రాలపై ఫిల్మ్‌నగర్‌లో కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాను ప్రభాస్ చేస్తారని, అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీ కూడా ప్రభాస్‌తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్.(చదవండి: ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం) మరి... ‘రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్’ చిత్రాల తర్వాత ప్రభాస్ తర్వాతి చిత్రం ఎవరి డైరెక్షన్లో ఉంటుంది? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బ్రహ్మరాక్షస’ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇక ఈ సినిమాను రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కొన్ని కారణాల వల్ల ప్లాన్ మార్చి, ప్రభాస్‌తో చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. -
ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. (చదవండి: జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ డేట్స్ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే. (చదవండి: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు)ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్ డేట్స్ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. మరి... ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రూమర్‌గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
మోక్షజ్ఞ ఎంట్రీ షురూ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎం తేజస్వినీ నందమూరి సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు (సెప్టెంబర్ 6) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాపై, నా కథపై బాలకృష్ణగారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మన ఇతిహాసాల నుండి పొందిన స్ఫూర్తితో ఈ కథ ఉంటుంది’’ అన్నారు. ‘‘మోక్షజ అరంగేట్రానికి సరి΄ోయే కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారు. ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్స్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్నారు’’ అని సుధాకర్ చెరుకూరి అన్నారు. -
హనుమాన్ సీక్వెల్ కి కోలీవుడ్ స్టార్..
-
మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఇతనేనా!
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన డెబ్యూ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఇస్తాడని ఓ సినిమా వేడుకలో బాలయ్య చెప్పాడు. దీంతో ఈ నందమూరి హీరోని వెండితెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు యువ దర్శకులు మోక్షజ్ఞ కోసం కథలు సిద్ధం చేశారట. కొంతమంది అయితే బాలయ్యకు కథలు కూడా వినిపించి.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. మోక్షజ్ఞ బర్త్‌డే(సెప్టెంబర్ 6, 2024) నాడు సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. తన పాత్ర కోసం మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడట. గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ..ఇటీవల బాగా సన్నబడ్డారు. స్టైలిక్ లుక్‌తో ఫోటో షూట్ నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోన్నారని సమాచారం. -
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్‌లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్‌కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్‌ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్‌గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను పక్కనపెడుతున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఇదేనా?
భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. 'హనుమాన్' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్ చేసి పెండింగ్‌లో ఉన్న మరో ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఆక్టోపస్' సినిమాపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌తో తెరకెక్కనుందని టాక్. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి 'ఆక్టోపస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రమైన బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్లో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్‌లు వచ్చే ఛాన్స్ ఉంది. -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్‌కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్‌పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్‌మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
ఫ్యాన్స్‌కు హనుమాన్ టీం సర్ప్రైజ్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్ ఛానెల్లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్‌తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺 16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh — Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024 -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్‌కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్‌లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ విజువల్స్ చూస్తే అందుకు అయిన ఖర్చు రూ. 100 కోట్లు ఉంటుందేమో అని ఎవరైనా చెప్తారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ఈ సినిమాను క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కోసం నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా తన వంతుగా ఎంత చేయాలో అంత చేశారని గతంలో ప్రశాంత్ కూడా తెలిపారు. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాత, దర్శకుడి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. హనుమాన్కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్ గొడవ పడ్డారని పలు వెబ్‌సైట్స్‌లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్లు తనకు షేర్‌గా ఇవ్వాలని నిర్మాతపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి : సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'జై హనుమాన్'కు సంబంధించి కొంత అడ్వాన్స్‌తో పాటుగా లాభాల్లో వాటా కావాలని ముందే ఆయన అడిగినట్లుగా వైరల్ అయింది. తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్ కోసం పనిచేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ సరదాగా ఉన్నారు. తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చారు. తాము హనుమాన్ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఒక్క పోస్ట్‌తో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న వీరిద్దరి మధ్య ఇలాంటి వార్తలో చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేశారో తెలియాల్సి ఉంది. Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH — Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024 -
బిగ్గెస్ట్ మార్క్‌కు చేరుకున్న 'హనుమాన్' కలెక్షన్స్
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్‌బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్‌లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
హను-మాన్ ఎఫెక్ట్.. ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్?
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి, మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా ‘హను-మాన్’ టీమ్ ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన ‘హను-మాన్’.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్‌తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ. 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్లో చిన్న దర్శకుల లిస్ట్‌లో ఉన్న ప్రశాంత్..ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్‌కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు..ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హను-మాన్’ తర్వాత నాకు రూ.100, 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు రూ. 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. హను-మాన్ మూవీ చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. చెప్పిన బడ్జెట్లో సినిమా తీసే డైరెక్టర్ని కాదు నేను. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను. నేను ఒక 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే..దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే..దాన్ని రూ.150 కోట్ల సినిమాలా తీస్తాను. మార్కెట్‌ను అంచనా వేసుకొని సినిమాను తెరకెక్కిస్తాను’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రూ.1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మకు అంత పెద్ద ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్‌తో సినిమా తీస్తే..అది కచ్చితంగా రూ.2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఆ పాత్రలకు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్!
హనుమాన్ మూవీతో బ్లాక్బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోరులో మరో చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ జై హనుమాన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడి పాత్రలకు ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాత్రలకు స్టార్ హీరోలు నటించే అవకాశముందని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది. ఈ చిత్రంలో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్‌లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు. మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. రాముడిగా నా మనసులో ఉన్న నటుడైతే మహేశ్‌బాబు. ఎందుకంటే సోషల్‌మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన మహేశ్ బాబు ఫొటోలను చూశా. మా ఆఫీస్‌లో కూడా ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూశాం' అని అన్నారు. అంతే కాకుండా జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. -
ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?
'హనుమాన్' సినిమా రచ్చ బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. మూడోవారంలోనూ థియేటర్లలో ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అదలా ఉండగా ఇప్పుడు 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్న హీరోగా మారిన తేజ సజ్జా.. 'హనుమాన్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్నిచోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో థియేటర్ల సమస్య వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని చోట్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. ప్లాన్ ప్రకారం 5-6 వారాల్లోపే ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు ఇంకా వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి తొలి రెండు వారాల్లో రావొచ్చని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?) -
'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్'.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇంకా ఊపు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో కనిపించారు. అయితే ఇదే వేడుకలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన 'అ!' మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రంతోనే విషయమున్నుడని ప్రూవ్ చేసుకున్నాడు. దీని తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' లాంటి చిత్రాలతో మనోడిలో విషముందని అందరూ అనుకునేలా చేశాడు. ఇక 'హనుమాన్'తో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని షేక్ చేసి పడేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ప్రశాంత్ వర్మని చూస్తే యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఇంకా సింగిల్ ఏమోనని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అంటే లాక్డౌన్ టైంలో పెళ్లి అయిపోవడం, అప్పటికి ఇతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికీ తెలీదు. తాజాగా 'హనుమాన్' సక్సెస్ ఈవెంట్లో స్పీచ్ మొదలుపెట్టడమే.. తనకు అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్ చెప్పడంతో షురూ చేశాడు. అలా ప్రశాంత వర్మకు పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అందరికీ తెలిసింది. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ వర్మ.. పెద్దల కుదిర్చిన సంబంధంతోనే సుకన్యని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు తప్పితే ఈమె గురించి పెద్దగా విషయాలేం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
రాజమౌళిపై కోపం వచ్చింది.. ఎందుకంటే: హనుమాన్ డైరెక్టర్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమాను తీశారంటూ ప్రశాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'ఆయన మేకింగ్ విధానం చాలా ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇంజినీరింగ్‌లో ఉండగానే ఆయనకు చాలాసార్లు మెయిల్స్ పంపించా. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో నాకు ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా' అని అన్నారు. అంతే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. వారితో సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. అలాంటి వారికోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ టామ్ క్రూయిజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ అన్నారు. -
జై హనుమాన్ లో రామ్ చరణ్ పాత్ర అదేనా..?