
ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయాల్సిన ‘స్పిరిట్’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.
(చదవండి: ఆ కారణంతో దిల్ రాజు సినిమాను రిజెక్ట్ చేశా: దుల్కర్ సల్మాన్)
అయితే ప్రభాస్ తర్వాతి చిత్రాలపై ఫిల్మ్‌నగర్‌లో కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాను ప్రభాస్ చేస్తారని, అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీ కూడా ప్రభాస్‌తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్.
(చదవండి: ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం)
మరి... ‘రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్’ చిత్రాల తర్వాత ప్రభాస్ తర్వాతి చిత్రం ఎవరి డైరెక్షన్‌లో ఉంటుంది? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బ్రహ్మరాక్షస’ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇక ఈ సినిమాను రణ్‌వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కొన్ని కారణాల వల్ల ప్లాన్ మార్చి, ప్రభాస్‌తో చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment