ట్రెండింగ్‌లో ‘స్పిరిట్’.. రూమర్సే నిజమయ్యాయి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన ఒకవైపు ‘రాజాసాబ్’, మరోవైపు ‘ఫౌజీ’సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అటు సందీప్, ఇటు ప్రభాస్ ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుంటే యానిమల్ సినిమాతో సందీప్ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమా సక్సెస్‌లో ఎక్కువ శాతం సందీప్ కష్టమే ఉంది. ప్రభాస్‌తో సందీప్ సినిమా అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్‌తో పాటు సాదారణ సినీ ప్రేక్షకుల్లోనూ ‘స్పిరిట్’పై ఆసక్తి పెరిగింది. ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ పెరిగింది.అప్డేట్ ఇచ్చిన సందీప్స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ గత కొన్నాళ్లుగా రకరకాల కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసుగా నటించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చే కానీ.. మేకర్స్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నాడో చెప్పేశాడు.పోలీస్ స్టోరీతాజాగా ‘పొట్టేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా గెస్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో యాంకర్ సుమ ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరింది. దీంతో సందీప్ పలకపై ‘పోలీస్ స్టోరీ’ అని రాసి చూపించాడు. అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసుగా కనిపించబోతున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సందీప్ ధ్రువీకరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రభాస్ బర్త్‌డే(అక్టోబర్ 23) రోజు స్పిరిట్ అప్డేట్ రావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం స్పిరిట్( #Spirit) ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో పాటు సలార్-2 (#Salaar2), ది రాజాసాబ్( #TheRajaSaab ) హాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి.