![Prabhas, Sandeep Reddy's Spirit Movie Team Invite Auditions For Aspiring Actors](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/prabhs.jpg.webp?itok=dIqtNEMk)
ప్రభాస్(Prabhas )ని చూస్తే చాలు అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనతో ఒక సెల్ఫీ దిగితే చాలు..ఇంకేం వద్దు అనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది ప్రభాస్‌తో కలిసి నటించే చాన్స్ వస్తుందంటే.. ఎవరైనా ఊరుకుంటారా? అసలు అలాంటి అవకాశం వస్తుందని కూడా ఊహించరు కదా? ఇప్పుడు అలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చింది ‘స్పిరిట్’(Spirit Movie ) యూనిట్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘యానిమల్’’ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మార్చ్ లో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రభాస్ తన కెరీర్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా..తదితర స్టార్ హీరోయిన్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. వారితో ఎవరూ కూడా ఫైనలేజ్ కాలేదట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా లో కలిసి నటించే సువార్ణావకాశాన్ని కల్పించింది నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్.‘స్పిరిట్’ కోసం నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న పురుషులు, స్త్రీలు అంతా తమ ప్రొఫైల్ పంపించాల్సిందిగా కోరింది. అయితే ఇక్కడ ఓ చిన్న కండీషన్ కూడా పెట్టింది. గతంలో ఫిలిం లేదా థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు మాత్రమే ఇందుకు అర్హులని ప్రకటించింది.
అయితే ఇందుకు 2 ఫొటోలు, 2 నిమిషాల వీడియో రికార్డ్ చేసి..spirit.bhadrakalipichtures@gmial.com పంపించాలని ప్రకటించారు. ఆసక్తి గలవారు ఓ వీడియో రికార్డ్ చేసి, ఈ ఈమెయిల్ కు పంపించాలని ప్రకటించారు. ఈ మేరకు 'కాస్టింగ్ కాల్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా పూర్తి అయినా తరువాత 'స్పిరిట్'సినిమా షూటింగ్ లో పాల్గొన అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment