
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’(Spirit Movie)అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తయింది. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం..షూటింగ్ స్టార్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ని సరికొత్తగా చూపించబోతున్నాడట సందీప్. తొలిసారి పూర్తి స్థాయి పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రభాస్‌కి సందీప్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం.
షూటింగ్ కోసం నాన్‌స్టాఫ్‌గా 65 రోజుల కాల్షిట్లు ఇవ్వాలని, గ్యాప్ లేకుండా రావాలని ప్రభాస్(Prabhas)కి చెప్పాడట. అలాగే ఇంకో పెద్ద కండీషనే ప్రభాస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా కోసం డూప్ ని వాడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పాడట. ప్రతి షాట్ ప్రభాస్‌తోనే చిత్రీకరించాలని కండీషన్ పెట్టాడట.
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ డూప్‌ని సెట్ చేసుకుంటున్నారు. యాక్షన్ సీన్స్‌తో పాటు చాలా సన్నివేశాలను డూప్‌తోనే కానిస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే..లాంగ్ షాట్‌లు, బ్యాక్ షాటులు, క్లోజ్‌లు మినహా మిగతాదంతా డూప్‌తో ముగించాలని కండీషన్స్ పెడుతున్నారు.
ప్రభాస్ గత సినిమాల్లో కూడా బాడీ డబుల్స్(డూప్) వాడారు. అయితే సందీప్ మాత్రం సినిమాలోని అన్ని షాట్స్ హీరోనే డైరెక్ట్‌గా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్‌ని జూన్ రెండు వారంలో ప్రారంభించాలనుకుంటున్నారట. నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి..వచ్చే సంక్రాంతికి స్పిరిట్‌ని బరిలోకి దింపాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment