ప్రభాస్ 'స్పిరిట్‌'.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌..! | Rebal Star Prabhas Spirit Movie Update On Diwali Occassion | Sakshi
Sakshi News home page

Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్‌' .. ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిపావళీ అప్‌డేట్‌..!

Published Thu, Oct 31 2024 5:59 PM | Last Updated on Thu, Oct 31 2024 5:59 PM

Rebal Star Prabhas Spirit Movie Update On Diwali Occassion

కల్కి తర్వాత రెబల్ స్టార్‌ ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ది రాజాసాబ్‌ పేరుతో రొమాంటిక్‌-హారర్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్‌ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ మూవీ తర్వాత ప్రభాస్‌.. యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో ప్రభాస్  రోల్‌పై ఇటీవల ఓ ఈవెంట్‌లో సందీప్ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

(ఇది చదవండి: ‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ .. ప్రభాస్‌ కొత్త లుక్‌ అదిరింది!)

ఇవాళ దీపావళి సందర్భంగా స్పిరిట్‌ టీమ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలయ్యాయని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్‌ రామేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సందీప్‌ రెడ్డి వంగా మ్యూజిక్ వింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ జోడీ కరీనాకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement