
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ అంత బిజీ హీరో మరొకరు లేరేమో. ఎందుకంటే చేతిలో ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా యూఎస్ లో ఓ చోట ఉగాది సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందీప్.. మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')
'ప్రస్తుతం మెక్సికోలో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాం. త్వరలో అక్కడే షూటింగ్ మొదలుపెడతాం' అని సందీప్ వంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ల స్పిరిట్ కూడా లోకల్ పోలీస్ స్టోరీ ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సందీప్.. మెక్సికో అంటుంటే ఫారెన్ పోలీస్ క్యారెక్టరా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసి రెడీగా ఉన్న సందీప్.. ప్రభాస్ సెట్ కి రావడమే ఆలస్యం, షూటింగ్ చకచకా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలో స్పిరిట్ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మే నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
Finally An UGADI Treat 😍
We are Planning to Shoot #Spirit in #Mexico... currently location recce is going on, Shoot Starts Soon 🔥💥- Sandeep vanga#Prabhas pic.twitter.com/3GmsWVhMuX pic.twitter.com/8YKCqCFLnx— PrabhasWarriors𝕏 (@PRABHASWARRlORS) March 30, 2025