
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్ చిత్రాన్ని డైరెక్షన్ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్’ చిత్రానికి పూరి జగన్నాథ్ డైలాగులు అందించబోతున్నారని టాక్.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్’ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్‌కు సందీప్ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
సందీప్ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్‌తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment