ప్రభాస్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా? | Pan India Star Prabhas To Collaborate With Director Prashanth Varma, Check Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?

Oct 20 2024 9:06 AM | Updated on Oct 20 2024 10:48 AM

Pan India Star Prabhas To Collaborate With Prashanth Varma

హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్‌ కూడా వినిపిస్తోంది.  

(చదవండి: జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)

అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్‌ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్‌ చేశాడు. అలాగే తన సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్‌ డేట్స్‌ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే.  

(చదవండి: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు)

ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్‌’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్‌’ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్‌ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్‌ డేట్స్‌ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్‌ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్‌ లేదు. మరి... ప్రభాస్‌ అండ్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? లేదా రూమర్‌గానే మిగిలిపోతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement