
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?
గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.
రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.
(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!)
Comments
Please login to add a commentAdd a comment