
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.
ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.
(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)
టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment