
ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల కెరీర్ మహా అయితే రెండు మూడేళ్లు అన్నట్లే సాగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మాత్రం దాదాపు 20 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికీ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతోంది.
కొన్నాళ్ల ముందు వరకు తమన్నా అంటే హీరోయిన్ మాత్రమే. కానీ రీసెంట్ టైంలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. దానికి తోడు ఈమె చేస్తున్న పాటలు యూట్యాబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)
గతేడాది 'స్త్రీ 2' మూవీలో 'ఆజ్ కీ రాత్' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు 'నషా'(Nasha Song) అనే మరో సాంగ్ తో వచ్చేసింది. రైడ్ 2 సినిమాలోనిది ఈ గీతం. హీరోయిన్ గా చేస్తే రూ.4-5 కోట్లు తీసుకునే తమన్నా.. ఐటమ్ సాంగ్ కి కూడా రూ.1 కోటికి పైనే పారితోషికం(Remuneration) అందుకుంటోందట. నషా పాటకు కూడా అలానే తీసుకుందని టాక్.
ఏదేమైనా హీరోయిన్ గా చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ 35 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 అనే తెలుగు సినిమా.. ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో శివశక్తిగా కనిపించనుండటం విశేషం.
(ఇదీ చదవండి: కోట్ల రూపాయలు వదులుకున్న సమంత.. ఎందుకంటే?)