Tamannaah Bhatia's Remuneration, Net Worth 2023 - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: భారీగా సంపాదిస్తున్న తమన్నా, వంద కోట్ల పైచిలుకు ఆస్తి..

Published Wed, Aug 16 2023 11:24 AM | Last Updated on Wed, Aug 16 2023 11:46 AM

Tamannaah Bhatia Remuneration, Net Asset Value 0f 2023 - Sakshi

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు తమన్నా భాటియా. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటింన జైలర్‌ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక్క పాటతో రిలీజ్‌కు ముందే ఆ చిత్రానికి వీరలెవల్‌లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. 2005లో వెండితెరపై రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ గత 17 ఏళ్లుగా పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ మూవీ నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత నటించిన కల్లూరి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదన
ఆ తర్వాత వరుసగా కోలీవుడ్‌ ధనుష్‌, విజయ్, అజిత్‌.. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా జైలర్‌ చిత్రంలో ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించినప్పటికీ సినిమా సక్సెస్‌లో క్రెడిట్‌ కొట్టేసింది. ఐటమ్‌ సాంగ్స్‌లోను నటించడానికి వెనుకాడని తమన్నా కళ్లు చెదిరే ఆస్తులను కూడబెట్టిందంటూ తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అందులో ఈ మిల్కీబ్యూటీ ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈమె ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్లు సమాచారం.

అదేవిధంగా ఐటెం సాంగ్‌ కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌. సినిమాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్‌గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐపీఎల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమని మెరిసినందుకుగానూ రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్డుమెంట్‌ ఖరీదు రూ.16 కోట్లు అని సమాచారం. అదేవిధంగా లేడ్రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్యూ సహా నాలుగు ఖరీదైన కార్లను తమన్నా వాడుతోంది. అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాపును నిర్వహిస్తోంది. మొత్తం మీద తమన్నా ప్రస్తుతం రూ.120 కోట్లకు అధిపతి అని ప్రచారం జరుగుతోంది..

చదవండి: చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్‌.. బుద్ధుండక్కర్లా? అంటూ ట్రోలింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement