Tamannaah Bhatia
-
పరమశివుడే నాతో ‘ఓదెల 2’ కథ రాయించాడు: సంపత్ నంది
‘‘నాలుగైదేళ్ల క్రితం భక్తి భావంలేని నేను ‘ఓదెల 2’( Odela 2 Movie) కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడు. స్క్రీన్‌పై నంది, శివుడు విజువల్స్ కనిపించినప్పుడు ప్రేక్షకులు ఫీలైన విషయాన్ని నాకు ఫోన్ చేసి, చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరివాళ్లు ఫోన్ చేసి, ‘ప్రైడ్ ఆఫ్ ఓదెల’ అని చెబుతుంటే అద్భుతంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది’’ అన్నారు దర్శకుడు సంపత్ నంది. తమన్నా ప్రధాన పాత్రలో, వశిష్ఠ, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆల్రెడీ ‘ఓదెల 2’ సక్సెస్‌బాటలో వెళ్తోంది. ఈ సినిమా అనుకున్నప్పుడే తమన్నాగారిని అనుకున్నాం. ఆమె అద్భుతంగా నటించారు. ‘ఓదెల 2’లోని సమాధి శిక్ష, సైకిల్ ఎపిసోడ్, క్లైమాక్స్... వీటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో ఉన్న మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి’’ అన్నారు. ‘‘సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. కానీ కొంతమంది క్రిటిక్స్ మాత్రం నెగటివ్‌గా రాశారు. వారికంటే మాకు ప్రేక్షకుల ఫీలింగే ముఖ్యం’’ అని తెలిపారు నిర్మాత డి. మధు. ‘‘మా ‘ఓదెల 2’కు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. కలెక్షన్స్ పెరుగుతున్నాయి’’ అని అన్నారు అశోక్ తేజ. -
దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?
35 ఏళ్లొచ్చినా సరే గ్లామరస్ పాత్రలు చేస్తూ అలరిస్తున్న తమన్నా(Tamannaah Bhatia).. తొలిసారి డిఫరెంట్ గా కనిపించిన సినిమా ఓదెల 2(Odela 2 Movie). శివశక్తిగా నటించిన తమన్నా ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లు ముంబై, హైదరాబాద్ లో తిరుగుతూ గట్టిగానే ప్రమోట్ చేసింది. మరి ఈ మూవీకి ఇప్పటివరకు వసూళ్లు ఎంతొచ్చాయ్?తమన్నా, వశిష్ట సింహా నటించిన ఓదెల 2 మూవీ.. రీసెంట్ గా ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రెండు రోజుల్లో రూ.2-3 కోట్ల మాత్రమే వచ్చాయనే టాక్ వినిపించింది. కానీ తాజాగా మూవీ టీమ్.. ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. వసూళ్లని(Movie Collection) అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)మూడు రోజుల్లో రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత సంపత్ నంది.. విడుదలకు ముందే ఈ చిత్ర బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ వసూళ్లు చూస్తుంటే మొత్తానికి మొత్తం రాబడతాయా అనే సందేహం కలుగుతోంది. ఈ వీకెండ్ గడిచిన తర్వాత ఓదెల 2 అసలు సంగతేంటనేది తెలుస్తోంది. వచ్చేవారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చేమో చూడాలి.ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత) -
మరో శ్రీదేవి కావాలంటే తమన్నా ఇంకో జన్మ ఎత్తాలి: ఖుషి కపూర్
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి ఒక ఊపు ఊపిన కధానాయికల్లో నెం.1 స్థానంలో ఉంటారు శ్రీదేవి (Sridevi). భారతీయ సినిమాకు ‘మొదటి మహిళా సూపర్ స్టార్‘గా శ్రీదేవి మూస పద్ధతులను బద్దలు కొట్టారు. కామెడీ నుంచి ట్రాజెడీ వరకు వైవిధ్యమైన శైలిలో విస్తృతమైన పాత్రలను పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషా చిత్రాలతో ఆమె కెరీర్ నలుదిశలా విస్తరించింది.సౌత్.. నార్త్.. అన్నింటా తనదే హవాదక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో విజయాలు ఒకెత్తయితే బాలీవుడ్లో మరో ఎత్తు. ‘మిస్టర్ ఇండియా,‘ ‘సద్మా,‘ ‘హిమ్మత్వాలా,‘ ‘ఖుదా గవా,‘ ‘‘లాడ్లా,‘ ‘జుదాయి,‘ ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ వంటి సూపర్ హిట్స్‌తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల కలలరాణిగా కళకళలాడారు. ఆమె చివరి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘మామ్' 2017లో విడుదలైంది. ఇది అందరికీ తెలిసిన శ్రీదేవి.. అయితే తెలియని శ్రీదేవి గురించి ఎలా తెలుస్తుంది?శ్రీదేవి బయోపిక్‌లో నటించాలనుంది: తమన్నాఇప్పుడు బయోపిక్‌ల శకం నడుస్తోంది. సిల్క్ స్మిత నుంచి శ్రీదేవి దాకా తారల జీవితాలను తెరకెక్కించాలని సినిమా పరిశ్రమ ఉవ్విళ్లూరుతోంది. గత కొంత కాలంగా శ్రీదేవి జీవిత కథను సినిమాగా రూపొందించాలన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది? అనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో దివంగత తార శ్రీదేవి ‘‘సూపర్ ఐకానిక్’’ కాబట్టి తెరపై ఆమె పాత్రను పోషించాలనుకుంటున్నట్లు నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘శ్రీదేవి, మేడమ్. సూపర్ ఐకానిక్ ఆమె నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వ్యక్తి ఆమె‘ అని తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరుమరి నిజంగా తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించి మెప్పించే స్థాయి ఉందా? ఈ ప్రశ్నకు సినీ పండితుల నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ.. శ్రీదేవి చిన్న కుమార్తె నుంచి పదునైన సమాధానమే వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుషి కపూర్ (Kushi Kapoor)... తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. ఆమెలా చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం. అద్వితీయమైన ప్రతిభను ఎవరూ ప్రతిబింబించలేరని ఆమె స్పష్టం చేశారు.తను ప్రత్యేకమైన సృష్టిఇతరులకే కాదు తమకి కూడా అమ్మ స్థానం అసాధ్యమని ఆమె పరోక్షంగా తేల్చేశారు. తనపై ఆమె సోదరి జాన్వీపై శ్రీదేవి చూపిన ప్రభావం సాధారణమైనది కాదన్నారు. అయినప్పటికీ ‘రాబోయే 100 ఏళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె వేరే... ప్రత్యేకమైన సృష్టి‘ అంటూ తన తల్లిలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా స్పష్టం చేశారు.చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!
బాలీవుడ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్లో తమన్నా (Tamannaah Bhatia)కు ఎంట్రీ లభించిందని సమాచారం. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రధారులుగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ బడ్డీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘నో ఎంట్రీ’. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ సినిమా తీస్తున్నారు అనీస్ బాజ్మీ, బోనీ కపూర్. నలుగురికి పైగా హీరోయిన్లు..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు పైగా నటిస్తారని టాక్. వీరిలో ఇప్పటికి తమన్నా, అదితీ రావ్ హైదరీలను సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ కథానాయికలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వీలైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ టాక్. ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.చదవండి: నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘ఓదెల 2’ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మొన్న బ్రేకప్.. ఇప్పుడేమో పెళ్లి గురించి అడిగితే?
హీరోయిన్లు ప్రేమ-పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందేమోనని భయం, కొన్నిసార్లు బ్రేకప్ వల్ల కూడా పెళ్లి చేసుకోవడం చాలా లేటు చేస్తుంటారు. మొన్నీమధ్య బ్రేకప్ అయిన తమన్నాని ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే ఏం సమాధానమిచ్చిందో తెలుసా?దాదాపు 20 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న తమన్నా.. దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు-ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని తెగ రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్లు కలిసి చాలాసార్లు కనిపించారు.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)మరి ఏమైందో ఏమో గానీ కొన్నిరోజుల క్రితం వీళ్ల బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది. అది నిజమేనని కొన్ని సంఘటనల ద్వారా క్లారిటీ వచ్చింది. తాజాగా ఓదెల 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నాని పెళ్లెప్పుడు అని అడిగితే.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పింది.తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. మరి ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పిందా? లేదంటే మొత్తానికి ఒంటరిగా ఉండిపోతుందా అని అభిమానులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?
ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల కెరీర్ మహా అయితే రెండు మూడేళ్లు అన్నట్లే సాగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మాత్రం దాదాపు 20 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికీ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతోంది.కొన్నాళ్ల ముందు వరకు తమన్నా అంటే హీరోయిన్ మాత్రమే. కానీ రీసెంట్ టైంలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. దానికి తోడు ఈమె చేస్తున్న పాటలు యూట్యాబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) గతేడాది 'స్త్రీ 2' మూవీలో 'ఆజ్ కీ రాత్' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు 'నషా'(Nasha Song) అనే మరో సాంగ్ తో వచ్చేసింది. రైడ్ 2 సినిమాలోనిది ఈ గీతం. హీరోయిన్ గా చేస్తే రూ.4-5 కోట్లు తీసుకునే తమన్నా.. ఐటమ్ సాంగ్ కి కూడా రూ.1 కోటికి పైనే పారితోషికం(Remuneration) అందుకుంటోందట. నషా పాటకు కూడా అలానే తీసుకుందని టాక్.ఏదేమైనా హీరోయిన్ గా చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ 35 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 అనే తెలుగు సినిమా.. ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో శివశక్తిగా కనిపించనుండటం విశేషం.(ఇదీ చదవండి: కోట్ల రూపాయలు వదులుకున్న సమంత.. ఎందుకంటే?) -
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా (Tamannaah Bhatia)- విజయ్ వర్మ (Vijay Varma) కొంతకాలం క్రితమే బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు షాకయ్యారు. అయితే ఈ బ్రేకప్ను బాహాటంగా ప్రకటించమని మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.చిరంజీవి సలహారిపబ్లిక్ వరల్డ్ కథనం ప్రకారం.. ఈ ఏడాది తమన్నా- విజయ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి తండ్రి ఆరా తీయగా తమన్నా నిరాసక్తత చూపించింది. తనకు ఇష్టం లేదని తెలిపింది. విజయ్ తనకు కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. అతడి ఒత్తిడి వల్లే మీడియా ముందు పలుమార్లు జంటగా కలిసి కనిపించామని బాధపడింది. మరి.. ఈ బ్రేకప్ వార్తను జనాలకు ఎలా చెప్పగలవు? అని పేరెంట్స్ అడగ్గా.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకుని బ్రేకప్ న్యూస్‌ను మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.చిరంజీవి జోక్యం నిజమా?ఇది చూసిన నెటిజన్లు.. వాళ్లిద్దరి మధ్యలో చిరంజీవి ఎందుకు జోక్యం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మేట్లుగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో బ్రేకప్ను దాచడం వల్ల ఒరిగేదేముంది.. ఉన్న విషయం బయటకు చెప్పమని చిరు సలహా ఇచ్చినట్లున్నాడు.. అందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి -
ఎండల్లో చెప్పులు లేకుండా తమన్నా నటించారు: డి. మధు
‘‘ఓదెల 2’ చిత్రకథ వినగానే తమన్నా ఎగ్జైట్ అయ్యారు. తొలిసారి ఆమె నాగసాధువు పాత్ర చేశారు. అద్భుతంగా నటించడంతో పాటు ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారామె. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనూ చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొన్నారు. సరైన టైమ్‌లో సరైన కథ తమన్నా దగ్గరకెళ్లిందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత డి. మధు అన్నారు. తమన్నా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, హిందీలో విడుదలవుతోంది.ఈ సందర్భంగా డి. మధు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఓ రోజు సంపత్ నందిగారు ‘ఓదెల 2’ కథని నాకు చెప్పడం... చాలా నచ్చడంతో ఈప్రాజెక్టు మొదలైంది. ‘ఓదెల 2’ కథ లాజికల్‌గా ఉంటుంది. అశోక్ తేజ చక్కగా తీశారు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేస్తాయి.అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. సౌందర్ రాజన్‌గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వశిష్ఠ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా పటేల్ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని, అలాగే మంచి సక్సెస్ అందుకోవాలనే ప్యా షన్తో బడ్జెట్ గురించి ఆలోచించకుండా ‘ఓదెల 2’ని గ్రాండ్‌గా తీశాం. ఇక భావోద్వేగాలున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ కథలంటే నాకు ఇష్టం’’ అన్నారు. -
మరో ఐటం సాంగ్‌లో మెరిసిన తమన్నా..
మిల్కీ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే మహా ఇష్టం. అందుకే ఐటం సాంగ్స్ ఆఫర్ వచ్చినప్పుడు డ్యాన్స్‌కు స్కోప్ ఉంటోందని వెంటనే ఓకే చెప్పేస్తోంది. అలా జైలర్‌లో నువ్వు కావాలయ్యా.., స్త్రీ 2లో ఆజ్ కా రాత్.. పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. తాజాగా రైడ్ 2లోని నషా పాటకు చిందేసింది. రైడ్ 2లో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఐటం సాంగ్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫోటోలు లీకయ్యాయి.మరో ఐటం సాంగ్..దీంతో చిత్రయూనిట్ ఎలాంటి సస్పెన్స్‌లు లేకుండా నషా పాటను విడుదల చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆజ్ కీ రాత్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. రైడ్ 2 విషయానికి వస్తే.. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రైడ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా, వాణీ కపూర్ హీరోయిన్గా నటించారు. రితేశ్ దేశ్‌ముఖ్ విలన్‌గా యాక్ట్ చేశారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి: ఆస్కార్‌లో కొత్త విభాగం.. ఆర్ఆర్ఆర్ విజువల్‌తో అనౌన్స్మెంట్ -
ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం సందర్శించిన ‘ఒడెలా 2’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఓదెల 2'. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఏప్రిల్ 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)ట్రైలర్ బట్టి చూస్తే.. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి (తమన్నా) ఈ ఊరికి వస్తుంది. తర్వాత దెయ్యాల ఆట ఎలా కట్టించింది అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.తమన్నా తప్పితే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేనప్పటికీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం డివోషనల్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. చూస్తుంటే ఓదెల 2.. బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. అశోక్ తేజ దర్శకుడు కాదా.. సంపత్ నంది మిగతా విషయాలన్నీ చూసుకున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి) -
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తేజ డైరెక్షన్లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ముంబయిలోనే ఉంటోంది. బాలీవుడ్లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసిన తమన్నా.. ప్రముఖ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాదు..వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తరచుగా బీటౌన్‌లో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తుంటారు. అలా వీరిద్దరి స్నేహం బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రషాతో మీకు స్నేహమేంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.(ఇది చదవండి: ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా)తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన తమన్నా ఈ విషయంపై స్పందించింది. ఈ మధ్య కాలంలోనే నేను రషా తడానీని కలిసినట్లు తమన్నా చెప్పుకొచ్చింది. ఇద్దరు కలిసి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశామని.. డ్యాన్స్ కూడా చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత నుంచి మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగినట్లు మిల్కీ బ్యూటీ పేర్కొంది. మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.. వయసుతో మాకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించింది. ఎందుకంటే మా రిలేషన్లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు.. కేవలం నచ్చిన వారితో కొద్ది సమయం ఎంజాయ్ చేస్తామని అంటోంది తమన్నా. కాగా.. ఇటీవల తమన్నా భాటియా బాలీవుడ్ చిత్రనిర్మాత ప్రగ్యా కపూర్‌తో స్నేహంగా ఉంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఇటీవల హోలీ పార్టీలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) పేరు చెప్పగానే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు గుర్తొస్తాయి. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తాజాగా నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 (Odela 2 Movie).. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)'ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. ఎంతో సంతోషంగా ఉంది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంతవరకు వస్తానని అనుకోలేదు. అయితే నాకు 21 ఏళ్లున్నప్పుడు జరిగిన సంఘటనని మాత్రం అస్సలు మర్చిపోలేను. పుట్టినరోజు అని ఇంట్లోనే ఉన్నా. అలా న్యూస్ పేపర్స్ తిరగేస్తుంటే.. తమిళంలో నం.1 నటి అనే నా గురించి ఆర్టికల్ ఉంది. ఇది చూసేసరికి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాను. నటించడం ఓ బాధ్యతగా తీసుకున్నాను. ఈ స్థాయికి చేరుకున్నాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వ పర్యవేక్షణలో తీసిన ఓదెల 2 సినిమాలో శివశక్తి పాత్రలో తమన్నా నటించింది. ఏప్రిల్ 17న రిలీజయ్యే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మిల్కీబ్యూటీ హిట్ కొడుతుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
తమన్నా స్పెషల్ రైడ్
స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్ తమన్నా సమ్‌థింగ్ స్పెషల్. హీరోయిన్గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా...’, రాజ్‌కుమార్ రావు–శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కా రాత్’ సాంగ్స్‌లో తమన్నా నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్ కీ రాత్..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ‘రైడ్ 2’లోని స్పెషల్ సాంగ్‌కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్ 2’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్’కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది. -
బ్రేకప్ రూమర్స్.. స్టార్ ప్రొడ్యూసర్‌తో తమన్నా హాట్ ఫోటో షూట్
తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవల విడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పలు ఈవెంట్స్, వెకేషన్లలో కలిసి కనిపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫోటోలు షేర్ చేసేవారు. కానీ ఇటీవల వీరిద్దరు విడివిడిగా కనిపించడం..సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించడంతో బ్రేకప్అయినట్లు రూమర్స్ వచ్చాయి. అవి నిజమే అన్నట్లుగా అటు తమన్నా, ఇటు విజయ్‌ల మాటలు ఉన్నాయి. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి, అప్పుడే సంతోషంగా ఉంటారని విజయ్ అంటే.. ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయని తమన్నా అంటోందీ. పెళ్లి విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.హాట్ ఫోటోలతో హల్చల్బ్రేకప్ రూమర్స్‌పై తమన్నా, విజయ్‌లలో ఒకరు కూడా స్పందించలేదు. పైగా వీరిద్దరు కూడా విడివిడిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే వరుస సినిమాలతో పాటు పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్‌తో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. బ్రేకప్ తర్వాత తమన్నా మరింత సంతోషంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాల విషయాకొస్తే.. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 లో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మల మధ్య బ్రేకప్ అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయ్ వర్మ (Vijay Varma) తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. "రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి. అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు" అని విజయ్ పేర్కొన్నారు.మరోవైపు, తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే, వీరు విడిపోయారనే వార్తలు నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అంతేకాక, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ, ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బ్రేకప్ గురించి వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్
అందాల హీరోయిన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎథ్నిక్ వేర్లో అందంగా మెరిసిపోతున్న లుక్ ఫ్యాన్స్నువిపరీతంగా ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీగా పాపులర్అయిన గులాబీ రంగు పువ్వుల డిజైన్‌తో ఉన్న శారీలో అందంగా మారిపోయింది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు.తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాషన్స్టైల్ను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా వేసవి వార్డ్‌రోబ్‌లో పూల చీర ఎందుకు అవసరమో తమన్నా లుక్ రుజువు చేసింది. స్టేట్మెంట్-మేకింగ్ బోర్డర్ సారీకి మెరిసిపోయేతన లుక్‌తో మరింత సొగసుదనాన్ని జోడించింది. పింక్కలర్ శారీలో మెరిసి పోతున్న ఆమెను ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవతలా వుంది, వెరీ ప్రెటీ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అందమైన తన శారీ లుక్కు మ్యాచింగ్‌గా ముత్యాల ఆభరణాలను ఎంచుకుంది. రెండు పొరల ముత్యాల చోకర్ , సొగసైన స్టడ్లు అతికినట్టు సరిపోలాయి. ప్రొఫెషనల్ లాగా ఆమె ఎథ్నిక్ స్టైల్‌ను పూర్తి చేయడానికి ఓపెన్ వేవ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు. కాగా అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'ఒడెలా 2' (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతోందంటూ తమన్నా ఇన్‌స్టాలో వెల్లడించింది. తమన్నా ప్రతిసారీ సాధారణం కంటే భిన్నంగా ఉండే దుస్తులతో ఆశ్చర్యపరుస్తుంటుంది. సాంప్రదాయ చీరలో అయినా, మోడ్రన్ దుస్తుల్లో అయినా, తన ఐకానిక్ స్టైల్‌తో ఆకట్టుకోవడం తమన్నా స్పెషాల్టీ. -
ఐపీఎల్ కోసం దిశా.. ఓదెల కోసం తమన్నా!
ఐపీఎల్ కోసం హాట్ గా ముస్తాబైన దిశా పటానీఓదెల 2 మూవీ ఈవెంట్ లో చీరలో తమన్నాచీరలో అందాల జాబిలిలా ప్రియాంక మోహన్నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరికూతురితో ఆడుకుంటున్న హీరోయిన్ ప్రణీతబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిమనాలిలో సురేఖావాణి.. కూతురు సుప్రీత కూడాఆఫ్రికన్ డ్యాన్స్ చేసిన టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sushanth (@isushanthreddy) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది. A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi @dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16 @neeta_lulla@madhucreations9 pic.twitter.com/ihUozJX6Rt— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025 చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే -
తమన్నా- విజయ్ నాకు దేవుడిచ్చిన పేరెంట్స్..: రవీనా టండన్ కూతురు
తమన్నా భాటియా (Tamannaah Bhatia)- విజయ్ వర్మ (Vijay Varma).. ప్రేమకబుర్లు చెప్పుకున్నారు. పెళ్లి కోసం కలలు కన్నారు. వాటిని కలగానే మిగుల్చుతూ విడిపోయారు. పెళ్లి ముఖ్యమా? కెరీర్ ముఖ్యమా? అంటే కెరీరే కావాలని విజయ్ అన్నాడని.. అందుకనే విడిపోయారన్న ప్రచారమూ జరిగింది. ముచ్చటైన జంట అనుకునేలోపే ప్రేమ బంధాన్ని ముక్కలు చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం!ఇటీవల ముంబైలో జరిగిన హోలీ ఈవెంట్‌కు వీరిద్దరూ విడివిడిగా హాజరయ్యారు. రవీనా టండన్ కూతురు రాషా (Rasha Thadani)తో కలిసి హోలీ ఆడారు. తమన్నా, విజయ్ అంటే రాషాకు బోలెడంత ఇష్టం. దాని గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లాను. అక్కడ తమన్నా కూడా ఉంది. ఓ సింగర్ పాడుతూ ఉంటే స్టేజీ ముందు డ్యాన్స్ చేస్తున్నాను. తమన్నా కూడా అక్కడే స్టెప్పులేస్తోంది. ఒకరినొకరం చూసుకున్నాం. కలిసి డ్యాన్స్ చేశాం. అలా పరిచయం ఏర్పడింది. చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం.వీళ్లిద్దరూ నా గాడ్పేరెంట్స్తను లేకపోతే ఏం చేయాలో కూడా తోచదు. తమన్నా, విజయ్ వర్మ.. వీరిద్దరూ నాకు అంత బాగా క్లోజ్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన పేరెంట్స్ అయ్యారు అని చెప్పుకొచ్చింది. రాషా.. ఇటీవలే 20వ పడిలోకి అడుగుపెట్టింది. తన బర్త్‌డే పార్టీకి తమన్నా కూడా హాజరైంది. ఇదిలా ఉంటే రాషా ఈ ఏడాదే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రం ఆజాద్. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య -
పలుచని వైట్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ 'తమన్న' (ఫోటోలు)
-
విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్.. అలా అనిపిస్తేనే చెబుతా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు. -
హోలీ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ .... ప్యాచప్ అయ్యారా?
-
Tamannaah Bhatia: ఫ్యాషన్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు (ఫోటోలు)
-
సింగిల్‌గా కంటే ప్రేమలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నా..: తమన్నా
హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia), నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుని జంటగా ఒక్కటవుతారనుకుంటే అంతలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని తెలుస్తోంది. ప్రేమికులుగా కాకుండా ఇకపై స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ బ్రేకప్ రూమర్స్ తమన్నా, విజయ్ ఎవరూ స్పందించనేలేదు.రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దుతాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమకు ఎలాంటి షరతులు ఉండకూడదు. ఇది కేవలం ప్రేమజంటకే కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు.. ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. నీ పార్ట్‌నర్‌పై నువ్వు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావడంటే అప్పుడా బంధం బిజినెస్‌గా మారుతుంది. నేనిలా అనుకుంటే నువ్విలా చేశావ్.. నేను చెప్పినవాటిలో కొన్నే చేశావ్.. ఇలా లిస్టు తయారుచేసుకోవాల్సి వస్తుంది.వ్యాపార లావాదేవిగా మార్చొద్దుప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంది. ప్రేమ పుట్టాకే రిలేషన్షిప్ మొదలవుతుంది. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి. కొన్నిసార్లు అది ఏకపక్షం కూడా కావచ్చు. అయితే నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే! నేను ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను. వారికి నచ్చినట్లుగా బతకనిస్తాను.తెలివిగా ఆలోచించండిసింగిల్గా ఉన్నప్పటి కంటే రిలేషన్లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఒక తోడు దొరికితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవర్ని ఎంచుకుంటున్నావన్నది ముఖ్యం.. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి అని చెప్పుకొచ్చింది.చదవండి: ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్ -
మ్యారేజ్ కి నో చెప్పిన వర్మ.. బ్రేకప్ చెప్పేసిన తమన్నా..!
-
పెళ్లికి నో చెప్పిన విజయ్.. తమన్నా బ్రేకప్‌కి కారణం ఇదేనా?
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia )... గత కొంత కాలంగా ప్రముఖ నటుడు, విలన్ క్యారెక్టర్స్‌కి పేరొందిన విజయ్ వర్మ( Vijay Varma) తో డేటింగ్లో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారన్నది కూడా తెలిసిన విషయమే. తమన్నా విజయ్ వారి తల్లిదండ్రుల అంగీకారంతో ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారనీ ఈ జంట వివాహానంతరం వారి నివాసం కోసం ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్ వెతకడం కూడా పూర్తయిందని ఈ ఏడాది మొదట్లోనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఒక ఇంటర్వూలో సైతం తమన్నా త్వరలో తమ పెళ్లి జరుగనున్నట్టు చెప్పింది.‘పెళ్లికి నా కెరీర్‌కి మధ్య ఎటువంటి సంబంధం లేదు. వివాహం తర్వాత నటనను కొనసాగిస్తాను’ అని కూడా చెప్పింది. కట్ చేస్తే..ఇప్పుడు వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. తమ ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టేసి..మంచి స్నేహితులుగా ఉండటానికి ప్లాన్ చేసుకున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వారిద్దరు విడిపోవడానికి గల కారణాలపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కెరీర్, పెళ్లి విషయంలో వీరిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని.. అందుకే విడిపోయారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్‌లో పదుస సంఖ్యలు సినిమాలు చేసింది. ఇక సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని తమన్నా భావిస్తోందట. అందుకే చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే విజయ్‌కి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. కెరీర్ పరంగా ఇంకా ఎదగాలని.. కొన్నాళ్ల పాటు సినిమాలపైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగి.. చివరకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.హ్యాపీడేస్ తో సినీరంగానికి పరిచయమైన తమన్నా భాటియా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హాట్ గా కనిపించడానికి, ఎక్స్‌పోజింగ్‌కు సైతం తమన్నా సై అంటుండడంతో ఇప్పటికీ ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన స్త్రీ 2లోని తమన్నా ఐటమ్ సాంగ్ ఆజ్ కీ రాత్... ఉత్తరాదిని ఊపేసింది. ఇక మన హైదరాబాద్‌కు చెందిన నటుడు విజయ్ వర్మతో 2023లో లస్ట్ స్టోరీస్ 2లో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అప్పటికే ఇద్దరూ డేటింగ్ చేస్తుండడంతో...ఆ లస్ట్ స్టోరీస్‌లో తమన్నా తొలిసారి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది కూడా. ఆ తర్వాత వారిద్దరూ తమ సంబంధాన్ని పబ్లిక్‌గా మార్చారు. అనేక పబ్లిక్, రెడ్ కార్పెట్ ప్రదర్శనలు, విహారయాత్రలు జంటగా కొనసాగించారు, వవృత్తిపరంగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడమే కాకుండా చాలా మందికి అభిమాన జంటగా ఎదిగారు. అలాంటి వీరిద్దరూ అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పుకోవడం అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది. -
సరిగ్గా మ్యారేజ్ కు ముందు తమన్నా బ్రేకప్..?
-
పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు) -
మిల్కీ బ్యూటీ కాదు... పాలరాతి శిల్పంలా... వైట్ డ్రెస్‌లో తమన్నా ఫోటోలు
-
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది. తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తెరకెక్కుతోన్న ఓదెల-2 మూవీలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.టఅయితే తాజాగా మిల్కీ బ్యూటీపై క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో పాత్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న కథనాలపై తమన్నా స్పందించింది. రూ. 2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. తనకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొంది. తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది.తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా. అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించింది.అసలేం జరిగిందంటే?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది. -
జీవితంలో ఒక్కసారే ఇలాంటి చాన్స్ వస్తుంది: తమన్నా
‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్ నంది విజన్‌ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్‌తేజ. ‘‘ఇది థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు. -
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
'ఆంటీ అన్నా ఫర్వాలేదు'.. స్టార్ కూతురితో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ ప్రియులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో మొదలైట్టిన తమన్నా పలు సూపర్ హిట్ చిత్రాలో నటించింది. హ్యాపీ డేస్, అల్లు అర్జున్ బద్రీనాథ్, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, ఎఫ్2, రచ్చ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. అయితే గతేడాది జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది.తాజాగా బాలీవుడ్లో ఓ థియేటర్ వద్ద మెరిసింది. రవీనా టాండన్ ముద్దుల కూతురు రషా తడానీ నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది. తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తమన్నా భాటియా- రషా తడానీ రిలేషన్..కాగా.. బాలీవుడ్ భామ రషా తడానీ (19), తమన్నా భాటియా (35) చాలా మంచి స్నేహితులు. గతంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్నాను గురించి చెప్పమని రషాను అడిగినప్పుడు తాను నాకు మరో అమ్మలాంటి వ్యక్తి అని చెప్పింది. తమన్నా, విజయ్ వర్మ తనను దత్తత తీసుకున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani - Great Gesture From Tammu 😳😳😳😳😳pic.twitter.com/qJjC0iHLbh— GetsCinema (@GetsCinema) January 21, 2025 -
ఎరుపు రంగు లెహంగాలో మిల్కీ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్..! (ఫోటోలు)
-
13 ఏళ్లకే నటన.. లైఫ్ మార్చిన కాలేజీ సినిమా.. తమన్నా గురించి ఇవి తెలుసా? (ఫోటోలు)
-
లేడీ టైగర్‌లా యానిమల్ ప్రింట్ డ్రెస్‌లో తమన్నా (ఫోటోలు)
-
'జైలర్' పాట విషయంలో ఇప్పటికీ ఆ బాధ ఉంది: తమన్నా
బహుభాషా కథానాయకి తమన్నా భాటియా. అయితే ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. చిత్రానికి అవసరం అయితే ఎంత గ్లామరస్గానైనా నటించడానికి ఆమె సై అంటారు. కాగా తమన్న ప్రత్యేక పాటలో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అలా తమన్న నటించిన చిత్రాల విజయంలో ఆమె భాగం చాలానే ఉంటుంది. అందుకు నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఒక ఉదాహరణ. అందులో 'నువ్వు కావాలయ్యా..' అనే పాట కుర్రకారును ఉర్రూతలూరించిందనడం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అనిరుద్ సంగీతాన్ని అందించిన ఆ పాటలో నటుడు రజనీకాంత్ కూడా ఒక సహాయ నటుడిగా కనిపించారు. మరో విషయం ఏమిటంటే ఆ పాటలో నటి తమన్న డ్రస్, ఆమె స్టెప్స్‌కు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అలాంటి పాటలో తన నటన గురించి తమన్న ఇటీవల తన సోషల్ మీడియాలో పేర్కొంటూ జైలర్ చిత్రంలోని పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు. ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన హిందీ చిత్రం స్త్రీ 2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' అనే పాటలో నటించాననీ, ఆ పాటలో నటన సంతృప్తి కలిగించిందని చెప్పారు. ఆ పాటలో నటన గురించి ఆ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్ స్పందిస్తూ ఆజ్ కీ రాత్ పాటకు నటి తమన్నా ఆ పాత్రగానే మారారని చెప్పడమే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాగా నటుడు రజనీకాంత్ త్వరలో జైలర్– 2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ తమన్నాకు ఐటమ్ సాంగ్ ఉంటుందేమో చూడాలి. -
దొంగగా కనిపించడం ఆనందం
‘‘నా పదిహేనేళ్ల వయసులోనే నటిగా నా కెరీర్ మొదలైంది. ప్రేక్షకులకు వీలైనంత చేరువ కావాలని కథల ఎంపికలో ఎప్పటికప్పుడు నేను జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ఇప్పటివరకు ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను. కానీ ఇప్పటివరకూ దొంగ పాత్రలో మాత్రం నటించలేదు. ఈ పాత్ర చేయాలనే నా ఆకాంక్ష ‘సికందర్ కా ముఖద్దర్’ చిత్రంతో నెరవేరినందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఈ పాత్ర నాకెంతో స్పెషల్’’ అని తమన్నా అన్నారు.జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సికందర్ కా ముఖద్దర్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చేసే పాత్ర చిన్నదా? పెద్దదా అనేది నాకు ముఖ్యం కాదు. ఆ కథను ఎంత ప్రభావితం చేస్తుందన్నది ముఖ్యం.పెద్దా చిన్నా తేడాల్లేకుండా వచ్చిన అవకాశాలతో ప్రేక్షకులను మెప్పించడమే నా లక్ష్యం. అలాగే ఒకే రకంగా ఉండే స్ట్రాంగ్ ఉమన్ రోల్స్ కాకుండా... కొత్త తరహా ఉమన్ రోల్స్ చేయా లని ఉంది’’ అని పేర్కొన్నారు. -
బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే!
సినిమా సూపర్‌డూపర్ హిట్టయితే సెలబ్రిటీలకు ఓపక్క సంతోషంతోపాటు మరోపక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విజయాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కష్టపడుతుంటారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఏం చేయాలో అర్థం కాలేదంటోంది హీరోయిన్ తమన్నా భాటియా.సక్సెస్ అందుకున్నా, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ... వయసులో నాకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు తెలుగు, తమిళం రెండూ వచ్చు. నేను కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను కానీ నటిగా ఇంకా విభిన్న పాత్రలు చేయాలన్న ఆకలి మాత్రం ఇంకా ఉంది.బాహుబలి గేమ్ ఛేంజర్నిజానికి కమర్షియల్‌గా సక్సెస్ అయిన తర్వాత ఛాలెంజింగ్ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. బాహుబలి విషయానికి వస్తే పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అందరికీ ఓ గేమ్‌ఛేంజర్ వంటిది. అయితే ఈ సినిమా చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు.అర్థం కాని పరిస్థితినెక్స్ట్ ఏం చేయాలి? బాహుబలి కంటే పెద్ద సినిమా చేయాలా? ఇంతకంటే పెద్దది ఎలా చేస్తా? పోనీ నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవాలా? అన్న ప్రశ్నలతో సతమతమయ్యాను అని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కా ముఖద్దర్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.చదవండి: హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
నిర్మాత నైట్ పార్టీలో తమన్నా-కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
‘దో పట్టి’ మూవీ సక్సెస్ పార్టీలో తారల సందడి (ఫొటోలు)
-
తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి
మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్‌లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
తమన్నా తస్సాదియ్యా.. వయసుతో పాటే అందాన్ని పెంచుతూ (ఫొటోలు)
-
మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..
టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్లు తీసుకుంటుందట. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. (చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!) -
మనీలాండరింగ్ కేసులో తమన్నా?
-
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
ఓదెల మల్లన్న క్షేత్రంలో...
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన హిట్ మూవీ ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలో జరుగుతోంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. కాశీలో ప్రారంభమైన ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. ఓదెల మల్లన్న ఆలయంతో పాటు గ్రామంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ తదితరులు షూట్లో పాల్గొంటున్నారు. తన కెరీర్లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
కబాలినే టెన్షన్ పెడ్తున్న హీరోయిన్స్...
-
వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి!
వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు గ్రాండ్ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా సందడి చేసింది.ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్ ష్రాఫ్‌లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు. గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్‌కుమార్‌రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోవడం పై.. తమన్నా షాకింగ్ కామెంట్స్
-
పుష్ప 2లో మిల్కీ ఎంట్రీ ...
-
అందాల రాధగా తమన్నా..ట్రెడిషన్ లుక్ అదుర్స్!
కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్ కరణ్ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు. ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్’లో ఉంది. ఈ లెహెంగా సెట్ “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్" ఫ్యాబ్రిక్. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్ డబ్కా వర్క్, మోతీ గోల్డ్ సీక్విన్స్, సిగ్నేచర్ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్ పూర్తి పర్పుల్ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్ అత్యంత అద్భుతంగా ఉంది. View this post on Instagram A post shared by T O R A N I (@toraniofficial) (చదవండి: మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి) -
అంతకుమించి వేదా ఉంటుంది
‘‘వేదా’ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లానే ఈ కాన్సెప్ట్ ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసి ఇతర సినిమాలతో ‘వేదా’ ని ΄ోల్చకండి. యాక్షన్ చిత్రాలకు మించి మా ‘వేదా’ ఉంటుంది’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా భాటియా. జాన్ అబ్రహాం హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా భాటియా, శార్వరీ వాఘ్, అభిషేక్ బెనర్జీ నటించారు. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత జాన్ అబ్రహాం, నిఖిల్ అద్వానీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూ΄÷ందింది. జాన్ అబ్రహాం, మోనీషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న హిందీతో ΄ాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఇటీవల ముంబైలో ‘వేదా’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ΄ాల్గొన్న తమన్నా ‘వేదా’ మూవీపై స్పందించారు. ‘‘మన దేశంలోని గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహాం ఒకరు. ఆయన ‘వేదా’ వంటి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు తమన్నా భాటియా. -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'వేదా' ట్రైలర్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం- తమన్నా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘వేదా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ మరో హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. భారీ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా రిలీజ్ అవుతుంది. -
బోనాల పండగలో...
బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్ రోల్లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్విజన్లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021) సినిమాకి సీక్వెల్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.భారీ మల్లన్న టెంపుల్ సెట్లో క్లైమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌రాజన్. -
ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!
తమన్నా మంచి యాక్టర్. కానీ ఈమెలో అంతకు మించిన మంచి డ్యాన్సర్ కూడా ఉంది. ఎంతలా అంటే ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాల్లో బెస్ట్ ఏంటో చెప్పమంటే తడబడతారు. కానీ డ్యాన్సర్‌గా తమన్నా చేసిన పాటలు చెప్పమంటే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే సౌత్‌లో 'స్వింగ్ జరా', 'కావాలయ్యా' లాంటి సాంగ్స్ వేరే లెవల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)రీసెంట్గా 'స్త్రీ 2' అనే హిందీ సినిమా 'ఆజ్ కీ రాత్' అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో తమన్నా వేసిన స్టెప్పులు ఆ మూమెంట్ చూస్తుంటే మళ్లీ 'కావాలయ్యా' సాంగ్ వైబ్స్ వస్తున్నాయి. ఒరిజినల పాటలో ఏమో గానీ తాజాగా ఇదే గీతానికి ప్రాక్టీస్ చేసిన మిల్కీ బ్యూటీ, ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇదైతే ఒరిజినల్ సాంగ్ కంటే బాగుందా అనే రేంజులో ఉంది.మరీ ముఖ్యంగా తమన్నా చేస్తుంటే ఆ స్టెప్స్‌లో రొమాన్స్ కనిపిస్తోంది. మొన్నటివరకు హీరోయిన్గా ఛాన్సులు తగ్గాయి కదా, తమన్నా ఇప్పుడేం చేస్తుందని అనుకున్నారు. కానీ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా స్పెషల్ సాంగ్స్ కూడా అలరిస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. త్వరలోనే వీళ్ల పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నాకు తప్పుగా అనిపించలేదు.. ఆ డ్రస్ వేసుకోవడంపై అమలాపాల్ వివరణ) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
మిల్కీ దెబ్బకు పాన్ ఇండియా షేక్..
-
స్త్రీ-2 : రెడ్ థీమ్ సారీలో తళుక్కుమన్న తమన్నా, ఖరీదు ఎంతంటే!
2018లో వచ్చిన బాలీవుడ్ హారర్ మూవీ స్ట్రీ కి సీక్వెల్‌గా వస్తున్న స్ట్రీ 2 ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నూతన దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా అతిధి పాత్రలో కనిపించనుంది. ఆజ్‌కీ రాత్ అంటూ ఒక ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసింది. తనదైన స్టయిల్‌తో, స్టెప్పులతో దుమ్మరేపింది.ఈ సాంగ్ లాంచింగ్ ప్రమోషన్లో భాగంగా తమనా తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. రెడ్ తోరణి చీరలో మిల్కీ బ్యూటీ మెరిసిపోయింది. కార్సెట్ బ్లౌజ్‌తో కూడిన తోరణి చీరను ఎంచుకుంది. వేలాడా జుంకీలతో సహా రెడ్ థీమ్‌ను ఫాలో అయిన తమన్నా తన లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ చీర ధర 1.26 లక్షలుగా తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.తమన్నాతో పాటుగా, శ్రద్ధా కపూర్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేసింది. పొడవాటి జడ, రెడ్థీమ్ అనార్కలీలో అందంగా మెరిసింది. దీని ధర రూ. 1.29 లక్షలని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
జైలర్ తర్వాత మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో అలరించిన భామ.. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తోనే మెప్పిస్తోంది. తాజాగా స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ మూవీ నుంచి ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో తమన్నా భాటియా తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేసింది. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని హారర్-కామెడీ చిత్రంగా తెరకెక్కిచారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నన్ను క్షమించండి: పార్తిబన్
హీరోయిన్ తమన్నాకు తమిళ నటుడు–దర్శక–నిర్మాత పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా డ్యాన్స్ గురించి పార్తిబన్ చేసిన కామెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు కోరారు. ఆ ఇంటర్వ్యూలో పార్తిబన్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా? లేదా అన్నది ప్రేక్షకులు చూడటం లేదు.హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది’’ అన్నారు. పార్తిబన్ మాటలను పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. దాంతో పార్తిబన్ స్పందిస్తూ– ‘‘సినిమా ఇండస్ట్రీ వారిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అన్నారు. ఇక తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో పార్తిబన్ నటించిన విషయం తెలిసిందే. -
ఏంటి బాబోయ్ ఈ అందం..చూపులతోనే కట్టిపడేస్తున్న తమన్నా (ఫొటోలు)
-
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్‌లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్‌లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
వారం ఆలస్యంగా...
సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి. -
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. పాటలో డోస్ పెంచిన బ్యూటీస్
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్కు వారిద్దరూ గ్లామర్‌తో మ్యాజిక్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్ భారీ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్‌గా ఏప్రిల్ 26న ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. -
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్‌చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
గ్లామర్‌కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట!
గ్లామరస్‌గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్‌నే నమ్ముకున్నారని చెప్పవచ్చు. నువ్వు కావాలయ్యా.. అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్ క్వీన్‌గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైండ్‌సెట్ మారాలి ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్‌గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్‌ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్‌ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారాలన్నారు. జైలర్ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్ -
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
Tamannaah Bhatia: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిల్కీ బ్యూటీ (ఫొటోలు)
-
సినిమా ఏదైనా గ్లామర్ ఉండాల్సిందే!
సినిమా జానర్ ఏదైనా గ్లామర్ తప్పని సరిగా మారుతోందిప్పుడు. దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో కామెడికీ, గ్లామర్‌కు కొదవే ఉండదు. అలా సుందర్.సీ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్మణై చిత్రం. దీన్ని ఆయన సతీమణి, నటి కుష్బూ నిర్మించారు. హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా మరో రెండు సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. అవీ హిట్ కావడంతో తాజాగా నాలుగో సీక్వెల్‌ను తెరకెక్కించారు. దీని పేరు అరణ్మణై 4. హారర్ + కామెడీ సుందర్.సీతో పాటు తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో కోవైసరళ, గరుడ రామ్, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిహ్ హాప్ తమిళా సంగీతం, ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందించారు. దీనికి బెంజ్ మీడియా అధినేత ఏసీఎస్ అరుణ్‌కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇది కూడా గత సీక్వెల్స్ మాదిరిగానే హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఆ ఇద్దరే హైలైట్ ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. Some say this Mansion is very chill, and some say it is very chilling 👻 This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills... So are you ready? A Film by #SundarC A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024 చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
తమన్నా.. పెళ్లి ఎప్పుడు?
-
పింక్ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు!
మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకి ఇప్పటికీ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. ఒకప్పుడూ ఆమె టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆ టైంలో ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హిరోలతో కూడా నటించేది ఈ భామ. అయితే ఆమె కెరీర్లో హిట్ల కంటే ప్లాప్లే ఎక్కువ ఉన్నాయి. అయితేనేం ఆమె అందం, పర్సనల్ ఇమేజ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి వివిధ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్‌లో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. తమన్నా ధరించిన ఈ డ్రెస్ లగ్జరీ వర్సెచె బ్రాండ్‌కి చెందింది. డ్రస్ ధర ఏకంగా రూ. 4.2 లక్షలు. ఈ పింక్ కలర్ లగ్జరియస్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబంధించని ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. వీటికి ఓన్లీ ఫ్లవర్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింద. ఈ పింక్ డ్రస్‌లో తమన్నా ఫోటోలకు ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?) -
తమన్నా..పెళ్లెప్పుడో?
తమిళసినిమా: అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ.. అంటూ నటి తమన్నా ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడిపాడిన విషయం తెలిసిందే. ఆ పాటకు తగ్గట్టుగానే 36 ఆరేళ్ల వయస్సు మీద పడినా తరగని అందాలతో యువత గుండెల్ని కొల్లగొడుతున్న నటి తమన్నా. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కా వాలయ్యా అంటూ ఆడి దుమ్మురేపిన ఈ మిల్కీబ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా క్రేజ్ మాత్రం అలాగే మెయిన్టైన్ చేస్తోంది. ప్రస్తుతానికి అరణ్మణై 4 చిత్రం మాత్రమే తమిళంలో ఈమె చేతిలో ఉంది. అయితే హిందీలో అవకాశాలు వరిస్తున్నాయట. ఇకపోతే బాలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్‌వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా ఆయనతో డేటింగ్లో ఉన్నారు. అయితే పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. కాగా తాజాగా పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్‌ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్‌తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్‌కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్‌కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించడానికి నెల్సన్ రెడీ అవుతున్నారు. కాగా నటి తమన్న తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసినట్టు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్ చిత్రం అంత సంచలన హిట్‌కు కారణం రజనీకాంత్ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో తమన్న నటించిన నువ్వు కావాలయ్యా అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన కర్రకారును విపరీతంగా అలరించింది. చిత్రం విడుదలైన తరువాత ఎక్కడ విన్నా 'నువ్వు కావాలయ్యాస పాటనే. అయితే ఆ పాట హిట్ అయినా, తమన్నకు మాత్రం ఇక్కడ మరో అవకాశం రాలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రాలతోనే సరి పెట్టుకుంటున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వరించింది. అది మినహా దక్షిణాదిలో ఒక్క చిత్రం కూడా లేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్న త్వరలో అతగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్ చిత్రం హిట్‌కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. -
Odela 2 Movie: ‘ఓదెల 2’లో మిల్కీ బ్యూటీ.. కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ (ఫోటోలు)
-
కాశీలో క్లాప్
ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు? అనే ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. 2022లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పై డి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేటర్‌గా ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్‌ని కూడా కాశీలోనే ఆరంభించారు. తొలి సీన్‌కి సంపత్ నంది క్లాప్ కొట్టారు. ‘‘ఓదెల 2’ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ చిత్రకథ ఉంటుంది. క్యాస్టింగ్, కథ, వీఎఫ్ఎక్స్.. టోటల్‌గా మేకింగ్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్. ఎస్. -
బాహుబలిలో నన్ను ఎందుకు తీసుకున్నారో..?
-
పేరు మార్చుకోవడంపై తమన్నా కామెంట్స్.. కారణం అదేనంటూ!
మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ లేపుతోంది. వయసు పెరుగుతున్నా సరే గ్లామర్ మెంటైన్ చేయడంలో వారెవ్వా అనిపిస్తోంది. నటిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తుంది. అయితేనేం ఇప్పటికీ సినిమాలు-సిరీసులు లాంటవి చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తమన్నా పేరు ఇది కాదని, మార్చుకుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టింది. తమన్నా అంటే 'కోరిక' అని అర్థమట. 8-9 ఏళ్ల వయసున్నప్పుడే నటి కావాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్సయిందట. అప్పుడు అనుకోవడం ఏమో గానీ టీనేజ్‌లోకి వచ్చేసరికి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 2005లో ఒకేసారి తెలుగు, హిందీ సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళ, కన్నడలోనూ నటించింది. అయితే తమన్నా.. తెలుగులోనే కొన్నేళ్ల పాటు వరస చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) సినిమాల్లో ఎంట్రీ ఇద్దామని తమన్నా అనుకున్నప్పుడు.. ఒకాయన ఈమెని కలిసి పేరులో మార్పు చేసుకోమని చెప్పాడు. ఇంగ్లీష్‌లో అదనంగా a,h జోడీంచమని సలహా ఇచ్చాడు. అలానే నా పేరు Tamannaah అయిందని ఈ బ్యూటీ చెప్పింది. ఈ పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని, కెరీర్ పరంగానూ కలిసొచ్చిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. గత రెండేళ్ల నుంచి వీళ్లిద్దరూ జంటగా చాలాసార్లు కనిపించారు. పెళ్లి గురించి సరిగా క్లారిటీ ఇవ్వడం లేదు గానీ ఈ ఏడాది తమన్నా-విజయ్ ఒక్కటైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే ఏడ్చేసిన నటి) -
'విజయ్' సినిమాను ఏకి పారేసిన తమన్నా
చిత్రాల జయాపజయాలను ఎవరు ఊహించలేరు. తమ చిత్రాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే ఫలితం మాత్రం ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పైనే ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను వారు ఆదరిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక్కోసారి మంచి కథ అనుకున్న చిత్రాలు కూడా ఆదరణకు దూరం అవుతుంటాయి. కర్ణుడి చావుకు కారణాలు పదివేలు అన్న చందంగా చిత్రాల జయాపజయాలకు కారణాలు చాలానే ఉంటాయి. అలానే నటుడు విజయ్ నటించిన సురా చిత్రం విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటి తమన్నా కథానాయకిగా నటించారు. అందులో విజయ్ సరసన నటించే అవకాశం రావడంతో చంకలు గుద్దుకున్న ఈ బ్యూటీ చిత్రం పరాజయం పొందడంతో చాలా రోజుల తర్వాత దానిపై విమర్శలు గుప్పించారు. అదొక చిత్రమా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ చిత్రంలో నటించి తాను పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సురా చిత్రం వర్కౌట్ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించానని చెప్పారు. అయినా అందులో నటించాల్సిన పరిస్థితి అని తమన్నా అన్నారు. దక్షిణాదిలో టాప్ మోస్ట్ హీరోయిన్గా వెలిగిపోయిన తమన్నా ఇక్కడ విజయ్, అజిత్, సూర్య, ధనుష్, కార్తీ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఇక ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి జైలర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా నువ్వు కావాలయ్యా అన్న ఒక్కపాటతో ఆ చిత్రాన్ని కమ్మేశారు. అయినా ఆ తర్వాత తమన్నాకు ఇక్కడ అవకాశాలు దక్కకపోవడం గమనార్హం. -
టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్న తమన్నా
-
పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?
తెలుగు హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు సడన్‌గా పూర్తి భక్తి మోడ్‌లో కనిపించింది. దీంతో ఈమె పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్) 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితోనూ పనిచేసింది. హీరోయిన్ అనే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. గతేడాది రిలీజైన 'జైలర్'లో ఈమె చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే ఈమెకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఓ తమిళ చిత్రం మాత్రమే చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఈమెనే స్వయంగా వెల్లడించింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం తమన్నా క్లారిటీగా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం దేవాలయాల సందర్శనలో బిజీగా ఉంది. తాజాగా గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని.. తన తల్లిదండ్రులతో కలిసి సందర్శించింది. అక్కడ స్పెషల్ పూజలు నిర్వహించింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖమంతా కుంకుమ పూసుకుని పూలమాలతో చేతిలో పూజా సామగ్రితో ఈమె.. తమన్ననేనా అన్నంతగా కనిపించింది. అయితే ఇవన్నీ కూడా పెళ్లి కోసమే చేస్తుందని, త్వరలోనే ఆ శుభవార్త వినిపించనుందని సమాచారం. (ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన) -
అలాంటి డ్రస్‌లో విష్ణుప్రియ.. తమన్నాని ఇలా చూస్తే అంతే!
వయ్యారంగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ రష్మిక హాట్ లుక్‌తో పిచ్చెక్కిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా చాలీచాలని డ్రస్‌లో టెంపరేచర్ పెంచేస్తున్న నిక్కీ తంబోలీ సిల్క్ డ్రస్‌లో అందంగా మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ బికినీలో బోటుపై కేక పుట్టిస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రస్‌లో జిగేలు మంటున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి చీరలో మహాలక్ష్మిలా అందంగా కనిపిస్తున్న రాశీఖన్నా జీన్స్ ప్యాంట్లో ఉంగరాల జుత్తు చిన్నది.. చూస్తే తట్టుకోలేరు! View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా రొమాంటిక్ ఫోటోలు
-
తమన్నా మాములుగా లేదు భయ్యా.. చీరలో ఈషా అలా కనిపించేసరికి!
టైట్ పింక్ డ్రస్‌లో తమన్నా పరువాల విందు డిమ్ లైటింగ్‌లో శ్రుతిహాసన్ విచిత్రమైన పోజులు పెళ్లయి ఏడాది.. భార్యతో కలిసి హీరో నాగశౌర్య సెలబ్రేషన్స్ చీరకట్టి మరీ టెంప్ట్ చేస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా వంగి మరీ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్ 'బలగం' బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్ కిర్రాక్ స్టిల్స్ సౌత్ కొరియా టూర్లో హీరోయిన్ నివేతా పేతురాజ్ శివలింగానికి అభిషేకం చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ క్యూట్ పోజుల్లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
ఆ ప్రాబ్లం వల్ల పెళ్లికి తొందర పడుతున్న తమన్నా
-
పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!
హీరోయిన్ తమన్నా గురించి కొత్తగా చెప్పేదేముంది. 2005 నుంచి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది. స్టార్ హీరోల్లో దాదాపు అందరినీ కవర్ చేసింది. ఇన్నేళ్లలో ఈమె ఫలానా వాడితో ప్రేమలో పడింది లాంటి రూమర్స్ పెద్దగా రాలేదు. అలాంటిది ఈ ఏడాది న్యూయర్ సందర్భంగా తమన్నా లవ్ మేటర్ బయటపడింది. నటుడు విజయ్ వర్మ ఈమె లవర్ అని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) అయితే న్యూయర్ సందర్భంగా తమన్నా-విజయ్ వర్మ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. దీన్ని వీళ్లు దాచలేదు. ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్‌లో కలిసి నటించారు అనడం ముద్దులు, రొమాన్స్‌తో రెచ్చిపోయారు. దీంతో ఆటోమేటిక్‌గా పెళ్లి టాపిక్ వచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్ ఉండకపోవచ్చు అన్నట్లు తమన్నా ఓ సందర్భంలో చెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. తమన్నా తల్లిదండ్రులు పెళ్లి విషయమై ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట. వయసు కూడా పెరిగిపోతుందని, త్వరలో పెళ్లి చేసేసుకుంటే ఓ పనైపోతుందని అంటున్నారట. దీంతో మిల్కీబ్యూటీ కూడా వివాహానికి ఓకే చెప్పేసిందట. అయితే తమన్నా, విజయ్ చేతిలో ప్రస్తుతం కొన్ని మూవీస్ ఉన్నాయి. అయితే వాటిపై వర్క్ చేస్తూ, వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరిలో తమన్నా పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) Here comes the most explosion Diwali patakha💣💣 💥💥🔥🔥#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/qxoMw121gw — Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) November 11, 2023 -
మాలీవుడ్‌లో దడ పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ
తమన్నా.. ఇది ఇప్పుడు పేరు కాదు. గ్లామర్‌కు బ్రాండ్. అదీ హైపర్ బ్రాండ్. ఎక్కడైనా, ఎప్పుడైనా తన ప్రత్యేకతను చాటుకోవాల్సిందే, వార్తల్లో మారుమోగాల్చిందే. దట్ ఇస్ మిల్కీ బ్యూటీ. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో విజృంభించి అందాలను ప్రదర్శించిన తమన్నకు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. కాగా ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిగా తన సత్తాను చాటుకున్న తమన్న తాజాగా తన పేరును మాలీవుడ్ కు విస్తరింపచేసుకుంది. అక్కడ పాదం మోపింది లేదో మాలీవుడ్ హీరోయిన్లకు దడ పుట్టించింది. నటుడు దిలీప్ కథానాయకుడుగా నటించిన బాంద్రా అనే చిత్రంతో తమన్నా కథానాయకిగా మలయాళం చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్ లో నటుడు దిలీప్ పేర్కొంటూ ఈ చిత్ర కథ పూర్తి అయిన తర్వాత ఇందులో ఇప్పటివరకు మలయాళంలో నటించని, తనతో జతకట్టని నటిని హీరోయిన్గా నటింపజేయాలని భావించారన్నారు. దీంతో చాలా గట్స్ కలిగిన ఈ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని అనిపించిందన్నారు. దర్శకుడు అరుణ్ గోపీ ఎలాగో తమన్నాకు కథ వినిపించి ఆమె అనుమతి పొందారన్నారు. అయితే చిత్ర ప్రారంభోత్సవ పూజ వరకు ఆమె ఇందులో నటిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో తమన్నా కాకుండా మరో ముఖ్యపాత్ర ఉందని ఆ పాత్రలో నటింప చేయడానికి పలువురు నటీమణులను సంప్రదించగా, తమన్నా ఉంటే చిత్రంలో తాము కనిపించమని భావించి ఇందులో నటించడానికి నిరాకరించారన్నారు. ఇలా తొలి చిత్రంతోనే మిల్కీ బ్యూటీ మాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో దడ పుట్టించిందన్నమాట. అయితే నటి మమతా మోహన్ దాస్ ఆ చిత్రంలో మరో పాత్ర నటించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిందట. : -
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్‌లలో అదరహో (ఫోటోలు)
-
కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు
జైలర్.. సినిమాయే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. అందులో తమన్నా ఆడిపాడిన నువ్వు కావాలయ్యా సాంగ్‌కు జనాలు థియేటర్లలో, సోషల్ మీడియాలో అలిసిపోయేదాకా స్టెప్పులేశారు. ఈ పాట తమిళ వర్షన్‌కు 75 మిలియన్స్ (ఏడున్నర కోట్లు), తెలుగు వీడియో సాంగ్‌కు 20 మిలియన్స్ (రెండు కోట్లు) వ్యూస్ వచ్చాయి. ఒక్క వీడియో సాంగ్‌కు కోట్లల్లో వ్యూస్ వచ్చాయంటే అది ఏ రేంజ్లో హిట్టయిందో తెలుస్తోంది. దరిద్రంగా హుక్ స్టెప్.. అయితే ఈ పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. తను నటించిన సరకు సినిమాలో సెన్సార్‌వాళ్లు చాలా సన్నివేశాలను కత్తిరించేశారట. శనివారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరీ అంత అవసరం లేదులే సెన్సార్ సభ్యుల తీరే అర్థం కావట్లేదు' అని మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'తన సినిమాలో కొన్ని సీన్లు సెన్సార్ బోర్డు ఎత్తేసినందుకు బాధపడటంలో తప్పు లేదు కానీ, అవతలి వారి సినిమాల్లో తప్పులను ఎత్తి చూపడం దేనికి' అని ప్రశ్నిస్తున్నారు. 'సినిమాను ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలేగానీ.. ఇలా ప్రతిదాన్ని భూతద్దంలో చూడనవసరం లేదు. ఈయన అలా మాట్లాడటం సరికాదు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Highly condemn #Leo actor Mansoor Ali Khan's disrespectful speech about actress Tamannaah's #Jailer Kaavaalaa song in yesterday's press meet. This not the right way to… pic.twitter.com/mrOzPMUfQ1 — Manobala Vijayabalan (@ManobalaV) October 21, 2023 చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్ -
Shiseido: మహాలక్ష్మి మహా ఘనత
‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన తమన్నా భాటియా ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ‘మిల్కీ బ్యూటీ’గా పేరు గాంచింది. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలో వీర వెంకట సత్య సాయి నాగ దుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి’ పాత్రతో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసింది. తాజాగా మన మహాలక్ష్మి సరికొత్త రికార్డ్ సృష్టించింది. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ‘షిసైడో’కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘనత గురించి తమన్నాను ఆకాశానికి ఎత్తుతూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘అందంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది తమన్నా. ఆమె విజయపరంపరకు ఇదే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. -
పెళ్లి బిజీలో కీర్తి సురేశ్.. తమన్నా హీటెక్కించే లుక్
గ్లామర్ బెండు తీసేలా పోజులిచ్చిన కాజల్ అగర్వాల్ ఫ్రెండ్ పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేశ్ పసుపు పచ్చ డ్రస్ లో కేక పుట్టిస్తున్న శ్రీలీల మైండ్ పోయే లుక్‌లో కనిపించిన తమన్నా హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తడి అందాల విందు క్యూట్ వీడియోతో వావ్ అనిపిస్తున్న దివ్యభారతి ఒంపుసొంపులతో మైండ్ డ్యామేజ్ చేస్తున్న అన్వేషి జైన్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. భారత్‌లోనే
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్‌ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించింది. షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది. -
ఆ సినిమాల్లో నటించకపోవడమే మంచిది.. తమన్నా సంచలన వ్యాఖ్యలు
తమిళసినిమా: కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఒడ్డు దాటేవరకు ఓడన్నా, దాటిన తర్వాత బోడన్నా అన్న సామెతలా ఉంది. దక్షిణాది చిత్రాల్లో అవకాశాల కోసం పాకులాడి దర్శక నిర్మాతల ఆసరా, ప్రేక్షకుల ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ఇక తమకు అవకాశాలు రావని తెలియడంతో, ఇక ఆచిత్ర పరిశ్రమతో పనిలేదు అన్నట్లుగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. ఆమధ్య నటి ఇలియానా, తాప్సి వంటి వారు దక్షిణాది చిత్రాలతో ఎదిగి డబ్బు కూడబెట్టుకుని ఆ తర్వాత ముంబైకి మకాం మార్చి దక్షిణాది చిత్ర పరిశ్రమను కించపరిచేలా విమర్శలు చేసి ఆ తర్వాత నాలుక కరచుకుని అలా అనలేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 18 ఏళ్లు తెలుగు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ మిల్కీబ్యూటీని దక్షిణాది ప్రేక్షకులు ఇప్పటికీ నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం ఇటీవల విడుదలైన జైలర్ చిత్రమే నిజానికి. ఈ చిత్రంలో తమన్నా పెద్దగా నటించిందేమీ లేదు. ఒక్క పాటలో అంగాంగ ప్రదర్శన చేయడం తప్పా. అలాంటిది ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాల్లో కమర్షియల్ అంశాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని చిత్రాలు అయితే తన పాత్రను కథకు సంబంధం లేకుండానే ఉంటున్నాయని చెప్పారు. దర్శకులకు ఆ కొరతను సరి చేయమని చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. అందుకే అలాంటి చిత్రాల్లో నటించడం ఇష్టం లేక తప్పుకున్నానని చెప్పారు. దక్షిణాది భాషా చిత్రాల్లో హీరోలను సహించలేనంతగా ఆదరించేంతగా కథ చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. అలాంటి చిత్రాల్లో నటించకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే నటించడం అంటే తనకు ఇష్టమని, జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోనని తమన్నా భాటియా అన్నారు. -
టాలీవుడ్ పై తమన్నా వివాదాస్పద వ్యాఖ్యలు
-
మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం - సినీ నటి తమన్నా
-
టైట్ డ్రస్‌లో తమన్నా.. ఆ హాట్ బ్యూటీ ఏమో అలా!
స్కిన్ ఫిట్ డ్రస్‌లో తమన్నా సోయగాలు మాల్దీవులు వెకేషన్లో చిల్ అవుతున్న సోనాల్ సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ చిత్రాంగద మెరుపుల డ్రస్‌తో మైమరపిస్తున్న నిధి అగర్వాల్ చీరకట్టులో 'చంద్రముఖి 2' బ్యూటీ అందాల విందు విచిత్రమైన గెటప్‌లో హీరోయిన్ శ్రుతిహాసన్ మోడ్రన్ ఔట్ఫిట్తో కేక పుట్టిస్తున్న 'బిగ్‌బాస్' దివి అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ పాయల్ ఘోష్ డిమ్ లైట్లో నవ్వుతూ లైటింగ్ తెప్పించిన మీనాక్షి View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Subiksha krishnan 💙 (@subikshaoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Payal Ghosh (@iampayalghosh) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Imthias Kadeer (@chathan__) -
స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఇటీవలే నటిగా 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నట జీవితం చాలా సంతృప్తిగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఒక్క పాట, రెండు సన్నివేశాల్లో నటించి చిత్రానంతా ఆక్రమించేసిందనే చెప్పాలి. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జైలర్ చిత్రంలోని నువ్వు కావాలయ్యా.. పాట తమన్నాను ఒక్కసారిగా మళ్లీ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!) అయితే పెళ్లిని కూడా వాయిదా వేసుకునే పరిస్థితికి తీసుకెళ్లిందనే భావన తమన్నా మాటల్లో వ్యక్తం అవుతోంది. ఈమె బాలీవుడ్ నటుడు విజయ వర్మ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగానే వెల్లడించింది. వీరిద్దరూ ఇప్పటికే చెట్టా, పట్టాలేసుకొని తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లి ఎప్పుడు అని ఓ ఒక ఇంటర్వ్యూలో తమన్నాకు ప్రశ్న ఎదురైంది. దీనిపై మాట్లాడుతూ..' వివాహ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. ఒక దశలో వివాహం చేసుకోవాలని భావించా. అయితే ప్రస్తుతం అలాంటి మానసిక స్థితి లేదు. నటన జీవితం ప్రస్తుతం బాగా సాగుతోంది. దీంతో దానిపై మాత్రమే దృష్టి సారించా. వైవిధ్య భరిత కథలో నటించే అవకాశాలు వస్తున్నాయని అలాంటి వాటిని ఆనందంగా అంగీకరిస్తున్నా. షూటింగ్ స్పాటే ప్రస్తుతం తనకు ఆనందాన్ని ఇచ్చే ప్రాంతం'. అని తెలిపింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని కాబట్టి.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నటి తమన్న స్పష్టం చేసింది. (ఇది చదవండి: 1980ల్లో స్టార్ హీరోయిన్.. మద్యానికి బానిసై కెరీర్ నాశనం!) -
నా గ్లామర్ రహస్యం ఇదే: తమన్నా
తమిళసినిమా: అందం తిన్నానండి. అందుకే ఇలా ఉన్నాయండి అని ఒక పాటలో తన అందం గురించి తానే పొగుడుకున్న నటి తమన్నా భాటియా. అది నిజం కాకపోయినా ఈమె అందగత్తె అన్నది ముమ్మాటికీ నిజం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న తమన్నా వయసు 33 ఏళ్లు. నటిగా గత 18 ఏళ్లుగా తన అందాలను రకరకాల కోణాల్లో తెరపై ఆరబోస్తూనే ఉన్నారు. ఇటీవల నటించిన జైలర్ చిత్రంలో కూడా తాజా అందాలతో మెరిసిపోయి, ప్రేక్షకులను మైమరిపించారు. అంతగా అభిమానులకు కిక్ ఇస్తున్న తన అందం రహస్యాన్ని తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్నెస్గా ఉండడం చాలా అవసరం అన్నారు. అందుకు శారీరక కసరత్తులు ఎంత ముఖ్యమో, ఆహారపు అలవాట్లు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఆహారపు అలవాట్లకు ప్రాముఖ్యతనిస్తానన్నారు. ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుని తింటానని చెప్పారు. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 డిన్నర్ ముగించేస్తానని, ఆ తరువాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని చెప్పారు. ఇలా 12 గంటలు తినకుండా ఉంటానన్నారు. దీంతో చర్మం కాంతులీనుతుందని చెప్పారు. ఇక గ్రీన్ టీ, ఆమ్లాజ్యూస్ వంటివి తన ఆరోగ్య రహస్యం ఒక భాగం అని మిల్కీ బ్యూటీ పేర్కొన్నారు. -
ఏదైనా ఆలోచించకుండా నమ్మేస్తాం.. అదే..: తమన్నా
‘‘నువ్వు కావాలయ్యా..’’ పాట అందరినీ ఓ ఊపు ఊపేస్తోంది. సాధారణ జనాన్నే కాదు.. ఇతర రంగాల్లోని ప్రముఖులు ఈ పాటకు అడిక్ట్ అయిపోతున్నారు. దీనికి కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ అయితే, ముఖ్య కారణం నటి తమన్నా అనే చెప్పాలి. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలోనిది ఈ పాట. ఈ ఐటమ్ సాంగ్‌లో తమన్నా తన డ్యాన్సుతో ఉర్రూతలూగించింది. ఈ పాటలో తమన్నా డ్యాన్స్, అందం, అభినయం, కవ్వింపుతనం కుర్రకారును పిచ్చెక్కిచ్చింది. చిత్ర వర్గాలు ఈ పాటనే ఎక్కువగా ప్రమోషన్‌కు వాడుకుంటున్నారు. ఇప్పటికే ఆ పాట కోట్లాది సంగీత ప్రియులను అలరించిందని గణాంకాలు చెబుతున్నాయి. యూట్యూబ్‌లోనే 100 మిలియన్ల వీక్షణలను అధిగమించిందట. అంతేకాదు, తమన్నా పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో కావాలయ్యా ఈ రేంజ్లో సక్సెస్ కావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒక మహిళ అబలగా ఉంటే అది ఆమెను ఆత్వవిశ్వాసం లేకుండా చేస్తుందని, అదే ఆత్వవిశ్వాసం కలిగి ఉంటే ఆదే ఆమెకు మరో సొత్తు అవుతుందని పేర్కొంది. మహిళలు స్వతాహాగా కొన్ని మానసిక భావాలు కలిగి ఉంటారని, అదే తమ ప్రకృతి స్వభావం అని పేర్కొంది. తాము ఏ విషయానైనా ఆలోచించకుండా నమ్మేస్తామంది. అయితే వాటికి తమ ప్రతిభను కలిపితే అంతకంటే శక్తి మరేమీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తమన్నా. చదవండి: హరీశ్ శంకర్ ట్వీట్‌పై ట్రోలింగ్.. అసలు నువ్వెలా డైరెక్టర్ అయ్యావ్..? -
తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు, ఎక్కడా తగ్గట్లేదుగా!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు తమన్నా భాటియా. రజనీకాంత్ కథానాయకుడిగా నటింన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక్క పాటతో రిలీజ్‌కు ముందే ఆ చిత్రానికి వీరలెవల్లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. 2005లో వెండితెరపై రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ గత 17 ఏళ్లుగా పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ మూవీ నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత నటించిన కల్లూరి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదన ఆ తర్వాత వరుసగా కోలీవుడ్ ధనుష్, విజయ్, అజిత్.. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా జైలర్ చిత్రంలో ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించినప్పటికీ సినిమా సక్సెస్‌లో క్రెడిట్ కొట్టేసింది. ఐటమ్ సాంగ్స్‌లోను నటించడానికి వెనుకాడని తమన్నా కళ్లు చెదిరే ఆస్తులను కూడబెట్టిందంటూ తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఈ మిల్కీబ్యూటీ ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈమె ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఐటెం సాంగ్ కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. సినిమాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్‌గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమని మెరిసినందుకుగానూ రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్డుమెంట్ ఖరీదు రూ.16 కోట్లు అని సమాచారం. అదేవిధంగా లేడ్రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్యూ సహా నాలుగు ఖరీదైన కార్లను తమన్నా వాడుతోంది. అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాపును నిర్వహిస్తోంది. మొత్తం మీద తమన్నా ప్రస్తుతం రూ.120 కోట్లకు అధిపతి అని ప్రచారం జరుగుతోంది.. చదవండి: చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. బుద్ధుండక్కర్లా? అంటూ ట్రోలింగ్.. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ స్టిల్స్
-
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. -
తమన్నా వయ్యారాలు, మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో చూశారా?
► బ్లూ కలర్లో ఉన్న బార్బీని అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ► మందు తాగుతూ చిల్ అవుతున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ► మెరిసిపోతున్న కృతీ శెట్టి ► శ్రద్ధాదాస్ కొత్త సెల్ఫీ ► పరికిణీలో శ్రీసత్య వయ్యారాలు ► తన అందంతో కుర్రకారును ఖైదీ చేస్తున్న తమన్నా ► పేరెంట్స్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మంచు లక్ష్మి View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
తమన్నాకి ఉపాసన రెండు కోట్ల డైమండ్ గిఫ్ట్
-
అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాను: తమన్నా
తమిళసినిమా: తమన్నా భాటియా.. ఈ పేరు ఇప్పుడూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గుజరాతీ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఈమె తమిళంలో రజనీకాంత్ సరసన నటించిన జైలర్ ఆగస్టు 10న విడుదలకు ముస్తాబవుతోంది. అరణ్మణై –4 చిత్రం చేతిలో ఉంది. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ గురించి బహిరంగంగా ప్రకటించడంతో ఆ టాపిక్ కొంత వాడివేడిగా సాగింది. ఇక హిందీలో నటిస్తున్న జీ కర్దా వెబ్ సీరీస్నే ఇప్పుడు వార్తల్లోకి నెట్టింది. జీ కర్దా వెబ్ సీరీస్ తమన్నా లిప్‌లాక్, హద్దులు మీరిన బెడ్రూమ్ సన్నివేశాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. గత 2016లో ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని ప్రకటించిన తమన్నా ఇప్పుడు అలాంటి సన్నివేశాలు శ్రుతిమించి నటించడంతో ఈమెపై నెటిజన్లు దాడి పెరుగుతోంది. ఈమె నటించిన లస్ట్ స్టోరీస్–2 సీరీస్ గురువారం నెట్‌ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇప్పుడు తన లిప్‌లాక్, బెడ్రూమ్ సన్నివేశాల గురించి తెగ విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొంది. కథకు అవసరం అనిపించడంతో తాను ఆ సన్నివేశాలు అలా నటించానని చెప్పింది. 2023లో కూడా ఇంకా బెడ్రూమ్ సన్నివేశాల గురించి విమర్శించడం ఏమిటని ప్రశ్నించింది. మొన్నటి వరకు ఇంకా పెళ్లి కాలేదని విమర్శించిన వాళ్లు ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రకటించడంతో ఈ విషయంపై విమర్శిస్తున్నారని, అసలు ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది అంటూ తన శ్రుతిమించిన శృంగార భరిత నటనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. -
లస్ట్ స్టోరీస్-2 ప్రీమియర్‌లో తళుక్కుమన్న తమన్నా, విజయ్ వర్మ (ఫోటోలు)
-
Tamannaah Bhatia: ప్రియుడు విజయ్ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు!
తమన్నా భాటియా అంటే చాలామందికి గుర్తొచ్చేది డ్యాన్సే! ఆ ఎనర్జీ, ఆ గ్రేస్.. చూడటానికి రెండు కళ్లు చాలవని అంటుంటారు అభిమానులు. కానీ ఇప్పుడదే కళ్లతో ఘోరం చూడాల్సి వస్తోందని వాపోతున్నారు ఫ్యాన్స్. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్లో తమన్నా హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోయింది. బోల్డ్ పాత్రలో అశ్లీల సన్నివేశాల్లో నటించింది.తాజాగా ఈ సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమన్నా. 'లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ప్రేక్షకులు ఇలాంటి వాటినే చూస్తున్నారు. ఇలాంటివి చూడటం నిషిద్ధమనో లేదంటే ఇలాంటివి చూసేందుకు సిగ్గుపడే ధోరణి నెమ్మదిగా మాయమవుతోంది. కాలంతో పాటు మనం కూడా మారుతున్నాం. నాకు తెలిసిన వారంతా కూడా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ చూశారు. అంతేనా.. చూసి ఎంజాయ్ చేశారు కూడా!నన్ను జనాలు ఇంతవరకు ఎలాగైతే చూడలేదో దాన్ని ప్రజెంట్ చేయడం కూడా నటిగా నాకు అవసరమే! నటిగా నేను ఏదైనా చేయగలను అని నిరూపించాలన్న ఆకలితో ఉన్నాను. ఇప్పటివరకు నేను శృంగార సన్నివేశాలకు ఓకే చెప్పలేదు. కానీ ఇది కూడా ఇతర సన్నివేశాలలాంటిదేనని ఆలస్యంగా తెలుసుకున్నాను. అది కూడా కొరియోగ్రఫీ చేసిందే కదా! అయినా శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు భయం వేయలేదు. నా ప్రియుడు విజయ్ వర్మ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు' అని చెప్పుకొచ్చింది తమన్నా.చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే నిజమే అనుకున్నా: శోభిత -
Tamannaah Bhatia : తమన్నా మెల్టింగ్ పోజులు.. చూస్తే మతిపోవడం గ్యారంటీ! (ఫొటోలు)
-
ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా, ఈ జంటను ఇలా చూశారా? (ఫొటోలు)
-
30 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేద్దామనుకున్నా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా- బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ డేటింగ్లో ఉంటున్నారని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో జంటగా కనిపించడం, విజయ్ వర్మకు ముద్దు పెడుతున్న వీడియో వైరల్ అవడం, ఆ తర్వాత కూడా పలుమార్లు వీరు జంటగానే కెమెరాలకు చిక్కడంతో ఈ లవ్ మ్యాటర్ నిజమే అనుకున్నారంతా! కానీ తమన్నా మాత్రం అంత సులువుగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు. పైపెచ్చు.. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం.. అంతమాత్రానికే డేటింగ్ అనేస్తున్నారేంటి? అని ఫైర్ అయింది. అయినా అభిమానులకు మాత్రం తమన్నా నిజంగానే ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తోందే అని అనుమానించారు. చివరికి వారి డౌటే నిజమైంది. ఈ మధ్యే గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తోన్న తన ప్రేమాయణాన్ని అందరికీ చెప్పేసింది తమన్నా. విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నానని ఒప్పేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో మహా అయితే హీరోయిన్ 8-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలదు అనుకునేదాన్ని. ఈ లెక్కన 30 ఏళ్లు వచ్చేసరికి నటిగా నా కెరీర్ ముగిసిపోయి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేస్తా అనుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు మీద పడ్డప్పటికీ అప్పుడే పుట్టినట్లుగా అనిపిస్తోంది. నాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది. పెళ్లనేది మనకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు, బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అంతే తప్ప పెళ్లీడు వచ్చిందనో, ఎవరో అన్నారనో వివాహానికి ఒప్పేసుకోవద్దు' అని చెప్పుకొచ్చింది తమన్నా. చదవండి: సమంత లెవలే వేరు.. వెబ్ సిరీస్ కోసం ఎంత పారితోషికం తీసుకుంటుందంటే? -
ఎంతో కష్టపడ్డా.. అయినా బాహుబలితో అంత గుర్తింపు రాలేదు
పాన్ ఇండియా సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇటువంటి సినిమాలు క్లిక్ అయితే కథానాయకులు పాన్ ఇండియా హీరోలైపోతారు. మరి హీరోయిన్స్? వారికి కూడా పేరొస్తుంది కానీ హీరోకు వచ్చినంత గుర్తింపు మాత్రం రాదు. ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్తోంది తమన్నా భాటియా. 'యాక్షన్ చిత్రాల్లో క్రెడిట్ అంతా హీరోలకే ఇస్తారు. బాహుబలి సినిమా క్రెడిట్ అంతా ప్రభాస్, రానాల ఖాతాలోకే వెళ్లిపోయింది. వాళ్లు కష్టపడ్డారు కాబట్టి ఆ క్రెడిట్ వారికి దక్కడం నాకు సమంజసంగానే అనిపించింది. ఈ సినిమా కోసం నేనెంతో కష్టపడ్డాను. కానీ నాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇందులో నా రోల్ అతిథి పాత్రలాగే ఉండిపోయింది' అని చెప్పుకొచ్చింది తమన్నా. కాగా బాహుబలి చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో మెరిసింది. మొదటి భాగంలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ రెండో భాగంలో మాత్రం తక్కువ నిడివికే పరిమితమైంది. ఇదిలా ఉంటే తన లవ్ లైఫ్‌పై మిల్కీ బ్యూటీ నోరు విప్పిన సంగతి తెలిసిందే! నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్నట్లు ఒప్పేసుకుంది. 'విజయ్ వర్మతో నా బంధం చాలా సహజంగా మొదలైంది, ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురుచూశాను. జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్ వర్మను ఉద్దేశించి) దొరికాడు. అతడు చాలా కేర్ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది' అని పేర్కొంది. విజయ్, తమన్నా లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఉండొచ్చని తెలుస్తోంది. చదవండి: రెండుసార్లు పెళ్లి, విడాకులు.. ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడ్డ బిగ్‌బాస్ బ్యూటీ -
బాలీవుడ్ నటుడితో ప్రేమ.. ట్రెండింగ్‌లో తమన్నా.. (ఫొటోలు)
-
తమన్నా నా చెంప పగలగొడుతుందేమో!: బాలీవుడ్ నటుడు
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? ఈ ప్రశ్నకు ఆవిడే సమాధానం చెప్పాలి. కానీ అంతవరకు ఆగలేని జనాలు సోషల్ మీడియాలో తమన్నా, విజయ్ వర్మతో క్లోజ్‌గా కనిపించడంతో ఆవిడ లవ్‌లో మునిగి తేలుతోందని ఫిక్సయ్యారు. ఇంతలో విజయ్ వర్మ స్నేహితుడు గుల్షన్ దేవయ్య.. నా తమన్నాతో తిరుగుతున్నావంటూ విజయ్ను ఆటపట్టించడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. తాజాగా తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చాడు గుల్షన్. బర్త్‌డేకు గోల్డ్ గిఫ్ట్.. 'ద గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్'తో సినీ కెరీర్‌ను ప్రారంభించిన గుల్షన్ దేవయ్య ఆదివారం(మే 28) 45వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన గురించి విజయ్-తమన్నాల రహస్య రిలేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'బర్త్‌డే అంటే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ ఉండదు. హాయిగా రోజంతా నిద్రపోతే బాగుండనిపిస్తుంది. కానీ బోలెడన్ని మెసేజ్‌లు వస్తుండటంతో వాటన్నింటికీ రిప్లై ఇవ్వాల్సి వస్తోంది. కొందరైతే బంగారు, వజ్రాభరణాలు సైతం పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నా మాజీ భార్య కలిరోయ్ జియాఫెటా నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నన్ను కొడుతుందేమో! విజయ్ వర్మ, తమన్నా రిలేషన్పిల్లో ఉన్నారా? లేదా? అనేది నాకు తెలియదు. వారిద్దరూ కలిసున్న రెండు,మూడు ఫోటోలు చూశాను. ఆమెను నేనెప్పుడూ కలవలేదు, కనీసం తనెవరో కూడా తెలియదు. నేను వాగింది చూసి ఆమె నన్ను కొట్టినా కొడుతుందేమో! నా గురించి నోటికొచ్చింది వాగుతున్నావేంటి? అని నా చెంప చెళ్లుమనిపిస్తుందేమో(నవ్వుతూ)! ఇప్పటికే ఆమె ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారనుకోండి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని తమన్నా అభిమానులు తిట్టారు. సీరియస్‌గా చెప్పాలంటే వారి మధ్య ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదు. అది వారి పర్సనల్ లైఫ్. విజయ్ను ఏడిపించడానికి ఆ సందర్భాన్ని వాడుకున్నానంతే! ఇకపోతే సౌత్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సాయిపల్లవి నా క్రష్' అని చెప్పుకొచ్చాడు గుల్షన్. View this post on Instagram A post shared by : ̶G̶u̶l̶s̶h̶a̶n̶ ̶D̶e̶v̶a̶i̶a̶h̶ (@gulshandevaiah78) చదవండి: పవన్ కల్యాణ్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
వధువు కావలెను అంటూ నటుడి ప్రకటన.. తమన్నా ఉందిగా భయ్యా!
విజయ్ వర్మ.. ఇంతకుముందు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలుసో లేదో కానీ తమన్నాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాక ఇక్కడివారికీ సుపరిచితుడయ్యాడు. ఇకపోతే అతడు ప్రధాన పాత్రలో నటించిన దహాద్ వెబ్ సిరీస్ మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సిరీస్ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చింది చిత్రయూనిట్. ఇందులో ఇండియాలోనే నెంబర్ 1 బ్యాచిలర్ అంటూ విజయ్ వర్మ ఫోటో ఉంది. దాని కింద వధువు కావలెను అని రాసి ఉంది. అలాగే అబ్బాయి గురించి కొన్ని వివరాలను అక్కడ పొందుపర్చారు. అయితే పేపర్లో ఈ యాడ్ చూసిన విజయ్ వర్మ తల్లి తల పట్టుకుంది. ఈ ఫోటోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'హ్యాపీ మదర్స్ డే అమ్మా.. క్యాంపెయిన్ బానే ఉంది కానీ ఈ వధువు కావలెను అన్న ప్రకటన గురించి అమ్మకు ఎలా వివరించి చెప్పాలి?' అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియోను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన ప్రైమ్.. 'మేము ఆమెకు సాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాం' అని రిప్లై ఇచ్చింది. నెటిజన్లు మాత్రం 'అలా అంటావేంటి భయ్యా.. నీకు తమన్నా ఉందిగా!', 'టైం వేస్ట్ చేయకుండా అమ్మకు అసలు విషయం చెప్పేసి నీ కల నెరవేర్చుకో', 'వధువు కావలెను అంటావేంటి? నీ కోసం అక్కడ తమన్నా ఉంటే!' అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విజయ్ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తమన్నా, విజయ్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. దహాద్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే విజయ్ వర్మ.. ఆనంద్ స్వర్నాకర్ అనే సీరియల్ కిల్లర్ పాత్రను పోషించాడు. సోనాక్షి సిన్హ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించింది. గుల్షన్ దేవయ్య, సోహమ్ షా ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by ̶V̶i̶j̶a̶y̶ ̶V̶a̶r̶m̶a̶ (@itsvijayvarma) చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి -
డబుల్ హ్యాపీనెస్లో తమన్నా, ఎందుకంటే?
తన పదిహేనో ఏటనే కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసిన ఉత్తరాది బ్యూటీ తమన్నా భాటియా. మొదట బాలీవుడ్లో పరిచయమైన ఈ లక్కీ బ్యూటీని ఆదరించింది మాత్రం దక్షిణాది సినిమానే. ఆదిలో తన లేలేత అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, ఆ తరువాత మాత్రం తనలోని నటనా కౌశల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గత 18 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తోంది. మధ్యలో తనదైన స్టైల్లో ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతోంది. ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగానే ఉంది. అయితే దక్షిణాదితో పాటు హిందీలోనూ ఈ అమ్మడు సరైన విజయాన్ని అందుకొని చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ తమిళంలో రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో జైలర్ చిత్రంలోనూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశాలను అందుకోవడం గొప్పే. మరో విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడానికి సిద్ధం కావడం. జైలర్ ఆగస్టు 10వ తేదీన భోళాశంకర్ ఆగస్టు 11వ తేదీన తెరపైకి రానున్నాయి. దీంతో నటి తమన్నా తెగ సంతోషపడిపోతోంది. తాను నటించిన రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల కానుండడంపై ఆనందం వ్యక్తం చేసింది. కాగా తమన్న వీరితో పాటు తమిళంలో అరణ్మణై–4, మలయాళంలో బాంద్రా అనే చిత్రం, బాలీవుడ్లో బోల్ చుడియన్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. చదవండి: యాంకర్ ఝాన్సీతో విడాకులు, పాప కోసం అల్లాడిపోయిన జోగి నాయుడు -
Tamannaah Bhatia Photos: చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న తమన్నా
చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న తమన్నా -
బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన తమన్నా..!, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట మాత్రం తమ రిలేషన్‌షిప్‌ని బయటపెట్టడం లేదు. అలా అని దూరంగానూ ఉండటం లేదు. కలిసి తిరుగుతున్నారు. లాంగ్‌డ్రైవ్, డిన్నర్ పార్టీలంటూ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహమేనా లేదా ఇంకేమైనా ఉందా అనే అనుమానం అభిమానులకు కలుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ పార్టీకి వెళ్తూ కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. బయటకు వెళ్లేందుకు కారు దగ్గరకు రాగా.. మీడియా కెమెరాలతో రెడీగా ఉంది. అయినా కూడా ఈ జంట గతంలో మాదిరి ముఖం చాటేయలేదు. హాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. (చదవండి: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్.. ‘మంగళవారం’ ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్) ఈ ఏడాది జరిగిన న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తమన్నా, విజయ్‌ల రిలేషన్షిప్ బయటపడింది. ఈ వేడుకల్లో తమన్నా .. విజయ్‌కి లిప్‌లాక్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తమన్నా మాత్రం అదేం లేదని కొట్టిపారేసింది. కానీ వీరిద్దరి వాలకం చూస్తుంటే రేపో మాపే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్‌తో పాటు రజనీకాంత్ జైలర్ చిత్రంలోనూ నటిస్తోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఐపీఎల్ కోసం గుజరాత్ పయనమైన రష్మిక, వీడియో వైరల్
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి.. ఇది చిరంజీవి సినిమాలోని పాట. ఈ పాటను అక్షరాలా నిజం చేసేందుకు క్రికెటర్లు రెడీ అయ్యారు. ఐపీఎల్ వేదికపై తమ సత్తా ఏంటో చూపించేందుకు సై అంటున్నారు. క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ఐపీఎల్‌ను ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నాలను రంగంలోకి దింపింది. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఈ ఇద్దరు హీరోయిన్లు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకోసం ఇప్పటికే రష్మిక అహ్మదాబాద్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మిక పర్ఫామెన్స్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ విషయానికి వస్తే.. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ ఐకానిక్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ 16వ సీజన్ ప్రారంభం కానుంది. రష్మిక విషయానికి వస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వరుసగా బాలీవుడ్ సినిమాలు చేసింది. కానీ ఏదీ అంతగా కలిసిరాలేదు. అమితాబ్‌తో చేసిన గుడ్‌బై, ఓటీటీలో రిలీజైన మిషన్ మజ్ను కూడా రష్మికకు హిట్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం ఆమె హిందీలో యానిమల్ సినిమా చేస్తుండగా ఇది ఆగస్టు 11న విడుదల కానుంది. మరోవైపు తెలుగులో నితిన్, వెంకీ కుడుముల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. View this post on Instagram A post shared by IPL (@iplt20) Rash 😍 #rashmikamandanna papped at Mumbai airport off to ahemdabad for #ipl opening ceremony#telugucinecraft #telugu_cinecraft @TCinecraft #Trending #TCinecraft @iamRashmika @Geethamadam @RashmikaTrends pic.twitter.com/WsgPoaCZ66 — Telugu cinecraft (@TCinecraft) March 30, 2023 -
తమన్నాతో కలిసి భారీ స్కెచ్ వేసిన రష్మిక.. ప్లానింగ్ మామూలుగా లేదుగా!
మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ హీరోలు కలిసి నటించటం కామన్ అయిపోయింది. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయి చేస్తున్నారు. ఇక ఈ ఫార్మూలను హీరోయిన్ల విషయంలో కూడా అప్లై చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత టి.టౌన్ బ్యూటీస్ కి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చింది. దీంతో నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న ఇద్దరు భామలు కలిసి వరల్డ్ వైడ్ గా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. బాహుబలి తో తమన్నా...పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోయారు. రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మికకి ఆ సినిమా అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఓటిటి లో రిలీజైన మిషన్ మజ్ను కూడా రష్మికకి హిట్ ఇవ్వలేకపోయింది. ప్రజెంట్ రష్మిక సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తుంది. రణవీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాపై రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది. ఇక తెలుగులో నితిన్ -వెంకీ కుడుముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక...తమన్నాతో కలిసి ఓ భారీ స్కెచ్ వేసింది. బాహుబలితో తమన్నా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియాలో రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత తమన్నా బి.టౌన్ పై కన్నేసింది. ఓటిటిలో వెబ్ సిరీస్ లు చేస్తూనే...హిందీ మూవీ ఆఫర్స్ కోసం గట్టిగానే ట్రై చేసింది. ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌవుట్ కాలేదు. ఇప్పుడు రష్మిక తో కలిసి వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపేందుకు రెడీ అయింది. ఈ నెల 31నుంచి ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభం కానుంది. గత నాలుగేళ్లుగా కరోనా సందర్భంగా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీ జరగటం లేదు. ఈ ఏడాది ఇండియాలో జరిగే ఈ ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ వేడకను గ్రాండ్ నిర్వహించేందుకు బిసిసిఐ ప్లాన్ చేసింది. 2018లో ఓపెనింగ్ సెరిమనీ జరింగింది అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ లో ఓపెనింగ్ సెరిమనీ జరగలేదు. 2018లో జరిగిన ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ లో పరిణీతి చోప్రా, వరుణ్ ధవన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ పెర్ఫార్మ్ చేశారు.ఈ ఇయర్ జరగబోయే ఐపీఎల్ సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ అంతకు మించి అనేలా ప్లాన్ చేసింది బిసిసిఐ. ఇప్పటి వరకు ఈ వేదిక బాలీవుడ్ స్టార్స్ మాత్రమే సందడి చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి ఈ వేదిక పై ఫస్ట్ టైమ్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు నేషనల్ క్రష్ రష్మిక, మిల్కీబ్యూటీ తమన్నా.. ఇప్పటికే వీరితో బిసిసిఐ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక వీరు కూడా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీలో డ్యాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక ఈ వేదిక పై ఫుష్ప లోని సామీ సామీ పాటకి డ్యాన్స్ చేసే అవకాశం వుంది. తమన్నా ఏ పాటకు డ్యాన్స్ చేస్తుందనే డీటైయిల్స్ ఇంకా తెలియలేదు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీలో దిశా పటాని, టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమీ జాక్సన్, శ్రద్ధా కపూర్ వంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ మాత్రమే పెర్ఫార్మ్ చేశారు. ఈ లిస్ట్ లో తమన్నా, రష్మిక మందన్న చేరటంతో వారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. -
మేమిద్దరం కలిసి ఓ సినిమా చేశాం, మా పెళ్లి చేశారు!: తమన్నా
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. 'మేమిద్దరం(విజయ్ను ఉద్దేశిస్తూ..) కలిసి ఓ సినిమా చేశాం. అప్పటినుంచి మా రిలేషన్షిప్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఈ అంశంపై నేను ఇంతకుమించి చెప్పాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. అయినా హీరోయిన్స్ గురించి ఇలాంటి అవాస్తవాలు ఎలా తెరపైకి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ నుంచి బిజినెస్మెన్ వరకు నాకు తెలియకుండానే కొందరు ఇప్పటికే నా పెళ్లి చాలాసార్లు చేశారు(వ్యంగ్యంగా)' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే! -
ఆధ్మాత్మిక సేవలో తరిస్తున్న తమన్నా, వీడియో..
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి తమన్నా భాటియా. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందింది. ఇటీవల బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసింది. వాటిలో పేరు వచ్చినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. దక్షిణాదిలోనూ ఒకటీ, అర చిత్రాల్లో నటిస్తున్నా అదే పరిస్థితి. ఇటీవల తనకూ ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ అతనితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకి ఎక్కింది. ఈమెకు ఇప్పుడు పెళ్లిపై దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది. కారణం ఇటీవల ఎక్కువగా ఆలయాలు తిరుగుతూ.. పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక బాట పట్టింది. షూటింగ్‌లు లేని సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటోంది. కొన్ని నెలల క్రితం హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా ఈశా యోగా ప్రాంగణానికి కాషాయ దుస్తుల్లో వెళ్లి అక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంది. దీని గురించి ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యారని చెప్పింది. లింగ భైరవి దేవిని దర్శించుకోవడం ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని పేర్కొంది. అంతేకాకుండా జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతోందని చెప్పింది. లింగభైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంది. అక్కడి పరిసరాలు, లింగ భైరవి మూర్తీభం చూడగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్, తమిళంలో రజనీకాంత్ సరసన జైలర్ చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: ఫుల్ ఖుషీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ -
జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్!
దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్‌లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత బయోపిక్ హిందీలో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొందించారు. సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్‌లో హీరోయిన్ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుర్తుందా శీతాకాలం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. రిలీజ్‌కు ముందు పాజిటివి బజ్ క్రియేట్ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి అప్డేట్ లేకుండా డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
తమన్నా- విజయ్ డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు
విజయ్ వర్మ, తమన్నా భాటియా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఏ ఈవెంట్లో చూసినా వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ముద్దు పెడుతున్న వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనూ దర్శనమిచ్చింది. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి సందడి చేయడంతో మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. తన రాబోయే ప్రాజెక్ట్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' డైరెక్టర్ సుజోయ్ ఘోష్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే నా అసలు లంచ్ డేట్ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్, తమన్నా డేటింగ్ వార్తలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. My lunch date🤷🏻♂️@sujoy_g https://t.co/I9jT7gupzV pic.twitter.com/nKKW8S0vkH — Vijay Varma (@MrVijayVarma) January 17, 2023 -
Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు
నటి తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడి పేరే మారుమోగుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఆ తర్వాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ నటి అయ్యింది. అయితే తెలుగులో కొంచెం ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. అయితే బాహుబలి, సైరా వంటి కొన్ని చిత్రాలు ఈమె నటన సత్తాను చాటిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకు ఉదాహరణ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి వంటి చిత్రాలే. అయితే ఈమె అందాల ఆరబోసిన చిత్రాలు మాత్రం బాగానే సక్సెస్ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్స్‌లో తమన్నా ఇరగదీసింది. హీరోలతో సన్నిహితంగా నటించడం గురించి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ ఇప్పుడు చిత్రాల్లో అంతరంగిక సన్నివేశాలను ఎవరు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చింది. అయినా నిజం చెప్పాలంటే సన్నిహిత సన్నివేశాల్లో నటించేటప్పుడు హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు గమనించానని పేర్కొంది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామని భావించడమే వారిలో దడకు కారణం కావచ్చునంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్‌తో పాటు హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఆ మధ్య రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటించనుందనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. కాగా ప్రస్తుతం ఈమె తన బాయ్‌ఫ్రెండ్ విజయవర్మతో షికార్లు కొడుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. చదవండి: (పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం) -
Tamannaah Bhatia: యువరాణిలా తమన్నా
పదిహేనేళ్లకు పైగా అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న తమన్నా తొలిసారి ఓ మలయాళ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘రామ్‌లీల’ (2017) తర్వాత హీరో దిలీప్, దర్శకుడు అరుణ్ గోపీ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా తెరకెక్కుతోంది. ‘బాంద్రా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె కెరీర్లో ఇదే తొలి మలయాళ సినిమా. కాగా కొచ్చిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో తమన్నా పాల్గొననున్నారు. ఈ నెల 20 నుంచి తమన్నా ఈ సినిమా షెడ్యూల్లో జాయిన్ అవుతారట. ఆ తర్వాత ముంబై లొకేషన్స్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో తమన్నా యువరాణి తరహా పాత్ర చేస్తున్నారని టాక్. ఈ పాత్ర మలయాళం, హిందీ భాషలు మాట్లాడుతుందట. కొచ్చితో పాటు ముంబై నేపథ్యంలోనూ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త సంవత్సరాన్ని ఈ ఇద్దరూ గోవాలో జరుపుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త గురించి ఇటు తమన్నా కానీ అటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు. -
గోవా వీడియో లీక్ తర్వాత తొలిసారి కనిపించిన తమన్నా- విజయ్
హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఇంతవరకు తమన్నాపై ఎలాంటి రూమర్స్ లేవు. అలాంటిది నటుడు విజయ్ వర్మను ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలో ముద్దు పెట్టుకుంటూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ పుకార్లపై విజయ్, తమన్నాలు స్పందించలేదు. ఇదిలా ఉంటే న్యూఇయర్ సెలబ్రేషన్స అనంతరం వీరిద్దరూ ముంబైకి చేరుకున్నారు. మొదటగా ఎయిర్‌పోర్టుకు తమన్నా రాగా, ఆ వెంటనే విజయ్ కూడా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇక నా పని అయిపోయిందనుకున్నా... అదే నా కోరిక : తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాది నటిగా రెండు దశాబ్దాల పయనం. ఈ సుదీర్ఘ పయనంలో కథానాయకిగా తమన్నా అన్ని రకాల పాత్రలను చేశారు. నట ప్రయాణం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 35 ఏళ్ల ఈ బ్యటీ ఇప్పటికీ వెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. కాగా ఇటీవల పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తమన్నా భాటియా ఒక భేటీలో పేర్కొంటూ తాను ముంబయిలో ప్లస్–2 చదువుకుంటున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. అప్పుడు తన వయసు 15 ఏళ్లని, మొదటిగా సాంద్ సా రోషన్ షహానా అనే హిందీ చిత్రంలో నటింనట్లు పేర్కొన్నారు. అది ప్లాఫ్ అయ్యిందని, ఆ తరువాత అదే ఏడాది తెలుగులో నటింన శ్రీ చిత్రం కూడా సక్సెస్ కాలేదని చెప్పారు. దీంతో తన పని అయిపోయిందని భావించానన్నారు. అలాంటి సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రం ఘన విజయంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయన్నారు. అలా తెలుగు, తమిళం భాషల్లో పలు ప్రముఖ హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. మధ్యలో ఐటెం సాంగ్స్‌లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇంకా మంచి మంచి కథా పాత్రల్లో నటించి అభిమానులను సంతోషపరచాలన్నదే తన కోరికని తమన్నా పేర్కొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - తమన్నా
-
స్టేజీపై భార్యను పరిచయం చేసిన సత్యదేవ్
కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'లవ్ మాక్‌టైల్' సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. సినిమాలో నీకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, మరి నీ రియల్ హీరోయిన్ను పరిచయం చేయొచ్చుగా అంటూ సత్యదేవ్‌ను కోరింది. ఆమె కేవలం మీకు స్టైలింగ్ మాత్రమే చేయలేదు. మీ ప్రధాన బలం కూడా ఆవిడేనని తెలుసంటూ ఆమెను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి సత్యదేవ్ బేబీ అంటూ తన భార్య దీపికను స్టేజీపైకి ఆహ్వానించాడు. అతడి భార్యాకొడుకు స్టేజీపైకి రాగానే వారిని సరదాగా పలకరించింది తమన్నా. తన భార్య గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ అంతా దీపికానే చేసిందంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా సత్యదేవ్, దీపికది ప్రేమ వివాహం. సత్యదేవ్ సినిమాలకు దీపిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలితో పోల్చడం హ్యాపీగా ఉంది: తమన్నా -
వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ
తమన్నా పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అది ఒట్టి పుకారేనని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా ప్రేమలో ఉందని, త్వరలోనే అతనితో కలిసి ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్నా స్పందించింది. గుర్తుందా సీతాకాలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..‘కొంతమంది నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. ఒకసారి డాక్టర్.. మరోసారి బిజినెస్ మెన్ అంటూ.. ఏవేవో కథనాలు అల్లారు. అవన్ని పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే.. అందరితో నేనే షేర్ చేసుకుంటాను. జనరల్‌గా అందరి ఇళ్లల్లో అమ్మాయిలకు ఉన్నట్లే మా ఇంట్లో కూడా నా పెళ్లిపై ప్రెజర్ ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్. నటించడం అనేది నా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ని సీరియస్‌గా తీసుకొను’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. -
శీతాకాలంలోనే వస్తున్న "గుర్తుందా శీతాకాలం" మూవీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు విడుదలకాకుండా వాయిదా పడుతూ వచ్చింది. శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్‌లో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్ అని ఈ సినిమా ట్రైలర్లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్ లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్‌కి జస్టిఫికేషన్ గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది అంటూ మూవీ టీం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
త్వరలో వివాహబంధంలోకి మిల్కీ బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?
మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తమన్నా. అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ముద్ర వేసిన తమన్నాపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపైనే నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. (చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో) తమన్నా భాటియా త్వరలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తలను ఆమె ఇప్పటివరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెబుతూ వస్తోంది మిల్క్ బ్యూటీ. ముంబైకి చెందిన తమన్నా భాటియా.. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్లో నటించిన చిత్రాల్లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆమె కెరీర్లో భారీహిట్‌గా నిలిచిన చిత్రం 'బాహుబలి'. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా భాటియా పెళ్లికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కాగా.. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ కనిపించనుంది. -
అందాలతో రచ్చ చేస్తున్న హీరోయిన్ తమన్నా (ఫొటోలు)