
పింక్ కలర్ శారీలో అదరిపోయన తమన్నా ఎథ్నిక్ లుక్
అందాల హీరోయిన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎథ్నిక్ వేర్‌లో అందంగా మెరిసిపోతున్న లుక్ ఫ్యాన్స్‌నువిపరీతంగా ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీగా పాపులర్‌అయిన గులాబీ రంగు పువ్వుల డిజైన్‌తో ఉన్న శారీలో అందంగా మారిపోయింది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు.
తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాషన్‌స్టైల్‌ను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా వేసవి వార్డ్‌రోబ్‌లో పూల చీర ఎందుకు అవసరమో తమన్నా లుక్ రుజువు చేసింది. స్టేట్‌మెంట్-మేకింగ్ బోర్డర్ సారీకి మెరిసిపోయేతన లుక్‌తో మరింత సొగసుదనాన్ని జోడించింది. పింక్‌కలర్ శారీలో మెరిసి పోతున్న ఆమెను ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవతలా వుంది, వెరీ ప్రెటీ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!)
అందమైన తన శారీ లుక్‌కు మ్యాచింగ్‌గా ముత్యాల ఆభరణాలను ఎంచుకుంది. రెండు పొరల ముత్యాల చోకర్ , సొగసైన స్టడ్‌లు అతికినట్టు సరిపోలాయి. ప్రొఫెషనల్ లాగా ఆమె ఎథ్నిక్ స్టైల్‌ను పూర్తి చేయడానికి ఓపెన్ వేవ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు.
కాగా అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'ఒడెలా 2' (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతోందంటూ తమన్నా ఇన్‌స్టాలో వెల్లడించింది. తమన్నా ప్రతిసారీ సాధారణం కంటే భిన్నంగా ఉండే దుస్తులతో ఆశ్చర్యపరుస్తుంటుంది. సాంప్రదాయ చీరలో అయినా, మోడ్రన్ దుస్తుల్లో అయినా, తన ఐకానిక్ స్టైల్‌తో ఆకట్టుకోవడం తమన్నా స్పెషాల్టీ.
Comments
Please login to add a commentAdd a comment