Ethnic wear
-
ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి. టాప్ డిజైన్స్‌లో మార్పులు ఈ డ్రెస్ సెట్లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు. డిజైన్స్ కూడా సులువే! టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్ని ఎంచుకోవచ్చు. ఆహ్లాదకరమైన రంగులు ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది. -
Kalyani Priyadarshan Latest Photos: సాంప్రదాయ దుస్తులలో ఊరిస్తున్న కోలీవుడ్ బ్యూటీ.. (ఫోటోలు)
-
వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే!
లక్నో: సాధారణంగా షాపింగ్ మాల్స్‌లు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్ సేల్స్, గిప్ట్ కూపన్స్, వన్ ప్లస్ వన్ ఇలా అనేక మార్గాల్లో కస్టమర్లను తమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో మాల్స్‌ల మధ్య విపరీత పోటీ పెరిగింది. అయితే, కొత్త పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి మాల్స్ నిర్వాహకులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం కస్టమర్లు తమ వైపునకు తిప్పుకోవడమే. తాజాగా, కోల్‌కతాకు చెందిన ‘సుల్తాన్’ అనే ఒక షాపింగ్ మాల్ నిర్వాహకులు కాస్త వెరైటీగా ఆలోచించారు. ఈ షాపింగ్ మాల్ షేర్వాణి, వివాహ వేడుకల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు పెట్టింది పేరు. ఇక్కడ సంప్రదాయ దుస్తులు అనేక వెరైటీల్లో లభిస్తాయి. వీరు స్థానికంగా ఒక పత్రికలో వెరైటీ యాడ్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా తప్పిపోతే బాధితుల తరుపు వారు మిస్సింగ్ (కనబడుట లేదు) అనే ప్రకటన ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా షాప్ నిర్వాహకులు కూడా ‘మజ్ను మిస్సింగ్’ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే.. ‘ మజ్ను.. మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ వివాహం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎంతగానో మెచ్చే ‘సుల్తాన్’ షాపింగ్ మాల్లోనే మీ పెళ్లి వేడుక కోసం షాపింగ్ చేద్దాం. ఎప్పటిలాగే షాపింగ్ మాల్స్‌లో అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్ సదుపాయానికి కూడా ఎలాంటి ఇబ్బందిలేదు. మీకు నచ్చిన షేర్వాణి కొనుక్కుందామంటూ ప్రకటనలో పొందుపర్చారు. అయితే, ప్రకటన పూర్తిగా చదివితేనే ఈ యాడ్ అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా చదవని వారు మాత్రం ఎవరో కనిపించకుండా పోయారని భావిస్తారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. మీ క్రియేటివిటీకి హ్యట్సాఫ్..’, ‘ఎలా వస్తాయ్ బాబు... ఇలాంటి ఐడియాలు..’, ‘ ఇదో రకం మార్కెటింగ్ స్ట్రాటజీ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Such an amazing ad! 😂😂😂 pic.twitter.com/g1fcE0WsJB — meghnad 🔗 (@Memeghnad) December 27, 2021 చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా -
సంప్రదాయ దుస్తులు ధరించారని..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హై క్లాస్ రెస్టారెంట్లో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రాధారణలో రెస్టారెంట్‌కు వెళ్లినా ఆమెను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని పాత్‌వేస్ సీనియర్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సంగీత కె నాగ్ ఇటీవల కైలీన్ మరియు ఐవీ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టారెంట్ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని లోనికి అనుమతించకపోవడంతో.. అందుకు సంబంధించిన ఓ వీడియోను సంగీత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎథినిక్ వేర్ ధరించినందుకు మాల్‌లోకి ప్రవేశించకుండా చేశారు. భారత్‌లోని ఓ రెస్టారెంట్.. విదేశీ వస్త్రధారణకు విలువ ఇస్తుంది. ఏది ఎమైనా ఒక ఇండియన్‌గా నేను గర్వపడతాను’ అని సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో సదరు రెస్టారెంట్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్ చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడింది. సంగీతకు క్షమాపణలు చెపుతు రెస్టారెంట్ యాజమాన్యం ఓ సందేశాన్ని పంపింది. తాత్కాలిక ఉద్యోగి వల్ల ఈ పొరపాటు జరిగినట్టు పేర్కొంది. ఈ విషయంపై లోతుగా విచారిస్తామని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని తెలిపింది. అలాగే తమ క్షమాపణను అంగీకరించాల్సిందిగా సంగీతను కోరారు. Thank you for reaching out to apologise for the incident last evening @KhanijoSaurabh pic.twitter.com/NyEh3gusVz — Sangeeta K Nag (@sangeetaknag) March 11, 2020 -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి జేపోర్ బ్రాండ్
ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) కంపెనీ ఎథ్నిక్ వేర్ బ్రాండ్స్– జేపోర్, టీజీ అప్పారెల్ అండ్ డెకార్లను కొనుగోలు చేస్తోంది. జేపోర్ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్ అండ్ డెకార్ బ్రాండ్‌ను రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. ఈ డీల్ 30– 45 రోజుల్లో పూర్తవ్వగలదని పేర్కొంది. ఎథ్నిక్ అప్పారెల్, యాక్సెసరీల విభాగంలో మరింత పటిష్టవంతం కావడానికి ఈ బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించింది. 2012లో ఆరంభమైన జేపోర్ బ్రాండ్... చేతితో తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను, హోమ్ టెక్స్‌టైల్స్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.39 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీజీ అప్పారెల్ అండ్ డెకోర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. దేశవ్యాప్తంగా 2,714 బ్రాండ్ స్టోర్స్..... ఈ రెండు బ్రాండ్ల కొనుగోళ్లతో బ్రాండెడ్ ఫ్యాషన్ స్పేస్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎబీఎఫ్ఆర్ఎల్ ఎమ్డీ,, అశీష్ దీక్షిత్ పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీఎఫ్ఆర్ఎల్ దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 2,714 బ్రాండ్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. లూయూ ఫిలప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలే, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. పాంటలూన్స్ పేరుతో వేల్యూ ఫ్యాషన్ స్టోర్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తోంది. ద కలెక్టివ్, టెడ్ బేకర్, రాల్ఫ్ లూరెన్, అమెరికన్ ఈగిల్, సిమన్ కార్టర్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది. బ్రాండ్ల కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేర్ 0.3 శాతం లాభంతో రూ.219 వద్ద ముగిసింది. -
విల్లా.. హరివిల్లా..