కూల్‌గా సొగసుగా!
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్‌లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి.
టాప్ డిజైన్స్‌లో మార్పులు
ఈ డ్రెస్ సెట్‌లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్‌లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు.
డిజైన్స్ కూడా సులువే!
టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు.
కాటన్ ఫ్యాబ్రిక్
కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్‌ని ఎంచుకోవచ్చు.
ఆహ్లాదకరమైన రంగులు
ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment