dresses
-
డ్రెస్సుల వల్ల అలర్జీ!
చలిని తట్టుకోవడానికి ఈ సీజన్లో చేసే కొన్నిపనులు మేనిచర్మాన్ని దెబ్బతీసేలలలా ఉంటాయి. దురద, పొడిబారడం తోపాటు రకరకాల చర్మ సమస్యలు(Allergy) కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి...ఫ్యాషన్ డ్రెస్సులుఈ సీజన్లో చలి నుంచి రక్షణగా స్వెటర్లు, మందపాటి క్లాత్స్, షాలువా.. వంటివి ధరిస్తూ ఉంటాం. ఎక్కువ గంటలు లేదా రాత్రి మొత్తం ఇలాంటి డ్రెస్సుల్లో ఉంటే చర్మం దురద పెడుతుంది. అందుకని, పలచటి కాటన్ డ్రెస్ వేసుకోవాలి. కొన్ని డ్రెస్సులు(dresses) వార్డ్ రోబ్లలో నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఈ సీజన్‌కి అవి సరైన ఎంపిక అని, వాటిని శుభ్రం చేయకుండా అలాగే వేసుకుంటే బాక్టీరియా చర్మానికి హాని చేస్తుంది. అందుకని, వార్డ్రోబ్ నుంచి తీశాక వెంటనే వేసుకోకుండా వాటిని ఆరుబయట గాలికి, కొద్దిపాటి ఎండకు వేసి తర్వాత ధరించాలి. కనీసం కొద్దిసేపు గాలికి ఆరవేయాలి.బిగుతుగా, మేని మొత్తం కవర్ చేసే దుస్తుల వల్ల బ్యాక్ యాక్నె పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఎక్కువ గంటలు, బిగుతుగా ఉండే డ్రెస్సుల్లో ఉండకూడదు. షూ(Shoe) వంటివి వేసుకున్నప్పుడు వాటిలో చెమ్మ ఏర్పడుతుంది. డ్రయ్యర్‌తో షూ లోపల మొత్తం చెమ్మ లేకుండా చేసి, తర్వాత వాడుకోవాలి.స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ఈ కాలం చర్మం చాలా పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు స్క్రబ్, పీల్ చేయడం.. వంటి బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించకూడదు. వైటెనింగ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మ రంధ్రాల్లోని సహజ తైలాలు పోయి, చర్మం నిస్తేజంగా మారుతుంది. చర్మం మృదువుగా ఉండటానికి రకరకాల బాడీ లోషన్స్కి బదులు క్రీమ్స్ వాడుకోవడం మేలు.వేడికి హీటర్చలి ఎక్కువ కాబట్టి టెంపరేచర్ కోసం రూమ్ హీటర్స్ వాడుతుంటారు. రాత్రి వేళ మొత్తం ఈ హీటర్స్‌లో ఉండటం వల్ల చర్మం డీ హైడ్రేట్ అయి త్వరగా పొడిబారుతుంది.నూనె శాతం అధికంగా ఉండే అవకాడో, నట్స్.. వంటి విటమిన్ ఇ, ఎ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది. (చదవండి: మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!) -
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్ ఒంటిపై మట్టితో చేసిన డ్రస్ (ఫొటోలు)
-
ట్రెడిషనల్ డిజైనర్ వేర్లో రష్మిక స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
తొమ్మిదిరోజులూ, తొమ్మిది రకాలు, ఇండో వెస్ట్రన్ మెరుపుల కళ
నవరాత్రులలో దాండియా ఆటలు ప్రత్యేకమైనవి. ఉత్సాహపరిచే ట్యూన్స్‌కి అనుగుణంగా నృత్యం చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలాంటప్పుడు ధరించే డ్రెస్ కూడా అడుగుల కదలికలకు తగినట్టుకదులుతున్న మెరుపులా నవరాత్రులకు ఆకర్షణీయమైన హంగుగా అమరాలి. నవరాత్రులలో దాండియా నృత్యాలు అనగానే మనకు పెద్ద పెద్ద అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయ లెహంగా– చోలీలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా కాకుండా ఈసారి దాండియా డ్రెస్సులకు కొంత ఫ్యూజన్ ని జత చేసి, కొత్తగా మెరిపిద్దాం. అందుకు, మీ వార్డ్‌రోబ్‌ని పండగ స్పెషల్‌గా మార్చేయండి. వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్సులతోనే నవరాత్రుల్లో న్యూ లుక్‌తో ఆకట్టుకునే తొమ్మిది ఐడియాలు.. దాండియా రాత్రిలో అబ్బురపరచడానికి మరో అందమైన ఆలోచన చీరకట్టు. వేరే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు, చీరతో దాండియాలో పాల్గొనాలంటే స్టైలిష్ బ్లౌజ్ బదులుగా సంప్రదాయ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్‌ను ఎంచుకోవాలి. పెద్ద పెద్ద చెవిపోగులు, పాపిట బిళ్లను జత చేయండి. శారీ గౌన్ లేదా మల్టీకలర్ ప్లెయిన్ షిఫాన్, బనారస్, ఇకత్ శారీస్... కలంకారీ, జైపూర్ ప్రింట్స్ ఈ వేడుకకు బాగా నప్పుతాయి. వీటిమీదకు ఇండోవెస్ట్రన్ క్రాప్ టాప్ బ్లౌజ్‌లు, సిల్వర్/ఆక్సిడైజ్డ్ ఆభరణాలు ధరిస్తే ఎందరిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయ్. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు లైట్ వెయిట్‌తో డ్రెసప్ అవాలనుకుంటారు. ఇలాంటప్పడు ఫ్లోరల్ పింట్స్, బ్రొకేడ్ స్కర్ట్ లేదా పలాజో ధరించి, టాప్‌కి తెల్లటి షర్ట్ జత చేయండి. దీనికి ఆక్సిడైజ్డ్ హారాలను అలంకారానికి ఉపయోగించండి. మోకాళ్ల కింది వరకు ఉండే గాగ్రాలు, ధోతీ ΄్యాంట్ల మీదకు స్టైలిష్ క్రాప్ టాప్‌లు వేసుకోవచ్చు. ధోతీ ప్యాంట్లను హారమ్ ప్యాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పండగల సీజన్లో ఈ ప్యాంట్స్ మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిమీదకు ఎంబ్రాయిడరీ జాకెట్స్ లేదా సింపుల్ క్రాప్‌టాప్స్ ధరించినా చాలు దాండియా హుషారు వెంటనే పలకరిస్తుంది. ప్రతిరోజూ కొత్తదనం నింపుకోవడం ఎలా అని ఆలోచనలో పడినట్లైతే దుపట్టాతో లుక్‌ని ఇట్టే మార్చేయవచ్చు. బాందినీ దుపట్టాలు నవరాత్రి కళను ఇట్టే సృష్టిస్తాయి. సల్వార్ కమీజ్ వేసుకున్నా బాందినీ దుపట్టాలను భుజం మీద నుంచి నడుము వరకు తీసుకువచ్చి, వెడల్పాటి ఎంబ్రాయిడరీ బెల్ట్‌ను పెట్టేస్తే ఆకట్టుకునే లుక్‌తో మెరిసి΄ోతారు. ఆక్సిడైజ్డ్ జూకాలు, హారాలు వేసుకుంటే చాలు. సిల్వర్/ఆక్సిడైజ్డ్ హారాలు, చైన్లు, థ్రెడ్ జ్యువెలరీ నవరాత్రి డ్రెస్సుల మీదకు ఆకర్షణీయంగా అమరుతాయి. ఆడ–మగ వాళ్లు కూడా ఈ జ్యువెలరీని హెవీ డిజైన్ ధోతీ ప్యాంట్ల మీదకు ధరించవచ్చు. -
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్‌ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్‌తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్‌కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్‌తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్‌లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్‌కఫ్‌లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్‌తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్‌లెటర్‌తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్‌లో ఖరీదైన యాక్సెసరీస్‌తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
సమ్మర్లో కంఫర్టబుల్‌గా... కలర్ఫుల్గా! (ఫోటోలు)
-
మండే ఎండల్లో.. మీరు మెచ్చే, మీకు నప్పే దుస్తులు (ఫొటోలు)
-
ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి. టాప్ డిజైన్స్‌లో మార్పులు ఈ డ్రెస్ సెట్లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు. డిజైన్స్ కూడా సులువే! టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్ని ఎంచుకోవచ్చు. ఆహ్లాదకరమైన రంగులు ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది. -
క్యాజువల్ వేర్ ఆర్ పార్టీ వేర్: లుక్ మాత్రం అదుర్స్ ! (ఫోటోలు)
-
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
ఇండోవెస్ట్రన్ స్టైల్.. 'టైమ్ లెస్ కంఫర్ట్ ప్లస్'!
'ధరించే డ్రెస్‌ను బట్టి తమ స్టైల్, లుక్ ఎదుటివారికి తెలియాలని కోరుకుంటారు. క్యాజువల్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా తమను ప్రత్యేకంగా గుర్తించాలని తపిస్తారు. ముందే పలకరిస్తున్న వేసవి తాపాన్ని తట్టుకుంటూ వేడుకలలోనూ రాయల్ లుక్‌తో మెరిసిపోవడానికి ఓవర్‌కోట్ బార్డర్ స్టైల్ తన స్పెషాలిటీని చాటుతోంది. రెడీ అవ్వడానికి తక్కువ టైమ్ పట్టడమే కాదు సౌకర్యంలోనూ సరైన ఛాయిస్ అనిపించకమానదు.' రాయల్ లుక్ కలిగిన డ్రెస్‌లు ఇవే.. ఇండోవెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్ నవతరాన్ని అధికంగా ఆకర్షిస్తుంటుంది. అప్పట్లో ఓవర్‌కోట్ అంటే మందంగా ఉండే డ్రెస్‌గా మాత్రమే చూసేవారు. ఇప్పుడు అదే స్టైల్లో పట్టు, కాటన్స్తో తయారు చేస్తున్నారు. ఎంచుకున్న మెటీరియల్‌ను బట్టి పైఠానీ, గద్వాల్, ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్ గల బార్డర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఓవర్కోట్లా ఉండే టాప్స్, అదే రంగులో ఉండే బాటమ్ ΄్యాంట్స్కి అంచును జత చేయడంతో ఈ డ్రెస్‌లో అమ్మాయిలు మరింత ప్రత్యేకంగా కనపడుతున్నారు. సిల్క్, క్రేప్ ప్లెయిన్ మెటీరియల్‌ను ఈ డ్రెస్ తయారీకి ఎంచుకున్నప్పుడు ప్రత్యేక హంగుగా హ్యాండ్ ఎంబ్రాయిడరీని ఉపయోగిస్తున్నారు. షరారా ΄్యాంట్స్, టాప్స్, టై అండ్ డై మెటీరియల్ ఎంపిక కూడా ఈ డ్రెస్సింగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా అమరుతున్నాయి. బంగారు రంగులో ఉన్న వెడల్పాటి అంచులే కాదు, ఎంబ్రాయిడరీ చేసిన లేదా కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఈ డ్రెస్ మోడల్స్‌ను స్పెషల్‌గా చూపుతున్నాయి. గాఢమైన రంగులు లేదా లేత రంగులు సందర్భానికి అనుగుణంగా డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటికి ఫ్యాషన్ జ్యువెలరీ అదీ చాలా తక్కువగా ఉపయోగించవచ్చు. లేదా ఆభరణాల ఊసు లేకపోయినా నప్పే హెయిర్ స్టైల్‌తో ఆధునికంగా మెరిసిపోవచ్చు. ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
ఇక కాటన్స్తో ఆరంభం..
చలి ప్రభావం తగ్గుతూ ఎండ ప్రతాపం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం. మనం కూడా అందుకు రెడీగా ఉండకతప్పదు. ఈ రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఫాస్ట్ ఫ్యాషన్‌ను వదిలేసి మనవైన దేశీయ కాటన్ దుస్తులతో వార్డ్రోబ్ను సిద్ధం చేసుకుంటే రాబోయే వేసవి రోజులను ఫ్యాషనబుల్‌గానూ.. హాయి హాయిగా, కులాసాగానూ గడిపేయచ్చు. సీజన్‌కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్‌ను కూడా మార్చుకుంటాం. అందులోనూ వేసవి కంఫర్ట్‌తో గడిపేయాలనుకుంటాం. కాటన్స్ అయితే డల్‌గా ఉంటాయి అనే మాటలు పక్కన పెట్టేసి మోడర్న్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా వైభవంగా వెలిగి΄ోవచ్చు. మనవైన చేనేతలు కాటన్ అనగానే మనకు ముందుగా ఖాదీ గుర్తుకు వస్తుంది. ఖాదీ చీరలు, షర్ట్లే కాదు ఇండో వెస్ట్రన్ స్టైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దీనితో పాటు నారాయణ్‌పేట్, ఇక్కత్, గద్వాల.. వంటి చేనేతలు సంప్రదాయ వేడుకల సందర్భాల్లోనూ ధరించడానికి బాగుంటాయి. ఇండోవెస్ట్రన్ జంప్‌సూట్స్, ష్రగ్స్, గౌన్లు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్ డిజైన్స్ ఎన్నో ఇప్పుడు మనకు కాటన్ మెటీరియల్‌తో తయారైన డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాజువల్ లేదా కాక్టెయిల్ పార్టీ ఏదైనా సందర్భానికి తగినట్టు వీటిని ఎంచుకోవచ్చు. ఆభరణాల ఊసు కాటన్ మెటీరియిరల్ పైగా వేసవి టైమ్ కాబట్టి ఉడెన్, టెర్రకోట జ్యువెలరీతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎక్కువ అలంకరణ హంగామా లేకుండా సింపుల్ అండ్ ఎలిగేంట్ లుక్స్ అనిపించేలా రెడీ అవడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. బ్లాక్ ప్రింట్ గౌన్స్ కాటన్‌పై వేసిన బ్లాక్ ప్రింట్ మెటీరియల్‌తో ఏ స్టైల్ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడానికి సౌకర్యంగానే కాదు, ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇవి చదవండి: అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్ -
Catherine Tresa: అందమైన నటి కేథరిన్ థ్రెసా స్టైలిష్ డ్రస్సులు (ఫోటోలు)
-
మిల మిల మెరిసే దుస్తులలో మాధూరి దీక్షిత్.. ఫొటోలు
-
France: బుర్ఖా నిషేధంపై రగడ
ప్యారిస్: ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు. 'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. ఇదీ చదవండి: ప్రిగోజిన్ మృతి చెందాడా..? రష్యా జన్యు పరీక్షల్లో ఏం తేలింది..? -
కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు.. మహిళలు రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తే..
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది. అసలేం జరిగిందంటే..ఈ ఏడాది ఫిబ్రవరి 8న కోజికోడ్ జిల్లాలోని నంది బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కవితా శిబిరంలో చంద్రన్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా తన చేయి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని ఆరోపించింది. అక్కడ తన ఒళ్లో కూర్చోవాలని అడిగాడని, ఛాతీ నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత కూడా తనకు పదే పదే ఫోన్లు చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదులో చంద్రన్‌పై 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఈ కేసుపై కోజికోడ్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. నిందితుడు బెయిల్ దరఖాస్తుతోపాటు అందజేసిన ఫోటోగ్రాఫ్స్‌ను పరిశీలిస్తే యువతి(బాధితురాలు) ఆ సమయంలో కావాలనే లైంగికంగా ప్రేరేపించే దుస్తులను ధరించినట్లు ఉందని అన్నారు. సెక్షన్ 354ఏ ప్రకారం అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే ఈ కేసు నిలబడదన్న జడ్జి.. 74 ఏళ్ల దివ్యాంగుడైన చంద్రన్ యువతిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఛాతిని నొక్కాడనే అరోపణలు నమ్మేలా లేవని తోసిపుచ్చారు. కాబట్టి నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
షాపింగ్ బ్యాగులతో వినూత్నంగా డ్రెస్సులు
షాపింగ్‌కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్ బ్యాగులతో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్ తెగ ప్రశంసిస్తున్నారు. వేస్టేజ్‌ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్‌ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్ బ్యాగ్ డ్రెస్సులు క్లిక్ అయ్యాయి. ఒక్కో బ్యాగ్ కట్ చేసి.. వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఉంచిన బ్యాగ్‌లను బయటకు తీసుకువచ్చింది. లాక్డౌన్ టైమ్ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్ బ్యాగుల నుండి ఫ్యాషన్ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్. డ్రెస్సుల కోసం వాల్‌మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్ జో బ్రాండ్ బ్యాగ్‌లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి, అమరిక ప్రకారం కుట్టింది. మిగిలిన సంచుల మెటీరియల్ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్ డ్రెస్ డిజైన్స్ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. -
పెళ్లి కూతుళ్లకు ఉచితంగా డ్రస్సులు
ఏదో ఒకటి కట్టుకుని ఎలాగోలా పెళ్లి చేసుకునే నిరుపేద వధూవరులు ఈ దేశంలో కొల్లలు. అబ్బాయిలు సరే. అమ్మాయిలకు ఎన్ని కలలని. కనీసం పెళ్లినాడు మంచి పెళ్లికూతురి డ్రస్సు వేసుకోవాలని ఉండదా? దానికి కూడా వీలు లేకపోతే ఎంత బాధ? కేరళకు చెందిన సబిత ఈ బాధ గ్రహించింది. దేశంలోని దాతల నుంచి వారు ఉపయోగించిన పెళ్లి డ్రస్సులు సేకరించి కాబోయే పెళ్లికూతుళ్లకు ఉచితంగా ఇస్తోంది. అవి కట్టుకున్న ఆడపిల్లలు ఆనందబాష్పాలు రాలుస్తుంటే సబిత అదే పెద్ద ఆశీస్సుగా భావిస్తోంది. కేరళ కోస్తా టౌన్ అయిన కన్నూర్‌లో సముద్రపు అలలు ఎన్ని ఉంటాయో పేద ఆడపిల్లల కష్టాలూ అన్నే ఉంటాయి. వరుడు దొరకడం, ఆ వరుడికి చేయాల్సిన మర్యాదలకు డబ్బు దొరకడం, పెళ్లి ఖర్చు దొరకడం, అన్నింటికి మించి కనీసం మంచి పెళ్లి డ్రస్సు ఏర్పాటు చేసుకోవడం... నిరుపేద ఆడపిల్లలు నోరు తెరిచి ఏమీ అడగలేరు. మనసులో ఉంటుంది అంతే. ఆ మనసును గ్రహించింది సబిత. ప్రార్థిస్తున్న ద్రౌపదికి వస్త్రాలు బహూకరించాడు కృష్ణుడు. పెళ్లిబట్టలకు కూడా వీలు లేక మనసులోనే బాధపడుతున్న పెళ్లికూతుళ్లకు కొత్త బట్టలు ఇస్తోంది సబిత. అమ్మాయి మనసు కన్నూరులో ‘రెయిన్ బో’ పేరుతో ఒక బొటిక్ నడుపుతోంది సబిత తొమ్మిదేళ్లుగా. కొనుక్కోగలిగిన ఆడపిల్లలు ఆమె దగ్గరకు వచ్చి డిజైనర్ దుస్తులు, డిజైనర్ పెళ్లిబట్టలు కొనుక్కుని వెళ్లేవాళ్లు. కాని కొందరు ఆడపిల్లలు కేవలం చూడ్డానికి వచ్చేవారు. ఈ చూడ్డానికి వచ్చే ఆడపిల్లలు పెళ్లి పెట్టుకొని అలాంటి డ్రస్సులు కొనలేక కనీసం చూసన్నా పోదామని వచ్చేవారు. వారిని గమనించి తనకు వీలున్నప్పుడు కొన్ని డ్రస్సులు తయారు చేయించి సబిత ఇచ్చేది. కాని వారికి అంతగా సంతృప్తి కనిపించేది కాదు. ఎందుకంటే ఉచితంగా వస్తోంది కనుక ఇచ్చింది తీసుకోవాల్సి వచ్చేది. ఛాయిస్ ఉండేది కాదు. ‘నచ్చింది తీసుకున్నామన్న’ తృప్తి వారికి కావాల్సి వచ్చేది. కాని అందుకు బదులుగా ఏం చేయాలో సబితకు అర్థమయ్యేది కాదు. రెండు నెలల క్రితం ఒక అమ్మాయి మాత్రం తనకు పెళ్లి కుదిరిందని, పెళ్లి డ్రస్సు కోసం తండ్రి వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు సబితకు వచ్చింది ‘ఉపయోగించిన పెళ్లిబట్టలను సేకరించాలనే’ ఆలోచన. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ‘పెళ్లికోసం మీరు మంచి డ్రస్సులు కొనుక్కుంటారు. కాని అవి ప్రత్యేకమైనవి కాబట్టి ఒకటి రెండుసార్లు ఉపయోగించి దాచుకుని ఉంటారు. అవి వృధాగా పడి ఉంటాయి. అలాంటి బట్టలు పేద వధువులకు ఉపయోగపడతాయి. మంచి కండిషన్లో ఉండి, డ్రైక్లీనింగ్ చేయించి ఉన్న పెళ్లి బట్టలను మాకు పంపండి. పేద ఆడపిల్లలకు ఇస్తాం’ అని సబిత ఇన్‌స్టాగ్రామ్‌లో, తన వాట్సప్ గ్రూప్‌లో రెండు నెలల క్రితం వీడియో పెట్టింది. అంతే. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది స్త్రీలు సబితకు ఫోన్లు చేశారు. తమ పెళ్లిబట్టలు ఇస్తామని చెప్పారు. వెంటనే సబిత వాటిని కలెక్ట్ చేయడానికి ఒక మనిషిని అపాయింట్ చేసింది. కొన్ని బట్టలు కొరియర్లో వచ్చాయి. ఇప్పటి వరకూ ఆమె 300 జతల పెళ్లి బట్టలు రిసీవ్ చేసుకుంది. వాటిలో ఒక్కోటి లక్ష రూపాయల డ్రస్సు కూడా ఉన్నాయి. కొందరు చెప్పులు, ఇమిటేషన్ జువెలరీ కూడా పంపారు. విడి షోరూమ్ సబిత తన షోరూమ్‌కు ఆనుకునే ఒక గదిని ఈ ఉచిత పెళ్లిడ్రస్సుల షోరూమ్‌గా మార్చింది. దీని గురించి తెలిసిన ఆడపిల్లలు వారు ఏ మతం వారైనా కాని వచ్చి ఉచితంగా తమకు నచ్చినది తీసుకుని వెళ్లవచ్చు. కాని వారికి త్వరలో పెళ్లి కాబోతున్నదని ఏదైనా ఆధారం (వెడ్డింగ్ కార్డ్, మత పెద్ద రాసిచ్చిన లేఖ) చూపించాలి. ఈ ఏర్పాటు గురించి కేరళ అంతా తెలిసి పోయింది. దూర ప్రాంతాల నుంచి డ్రస్సులు అడిగేవారు, డ్రస్సులు పంపుతామనే వారు పెరిగిపోయారు. దాంతో సబిత తన పరిచయస్తులు, బంధువుల ద్వారా ముఖ్యమైన టౌన్లలో వారి ఇళ్లలోనే ఒక గదిలో ఈ బట్టలను చేర్చే ఏర్పాటు చేసింది. ఫోన్ వస్తే దగ్గరి ఊర్లో ఉన్న ఉచిత బొటిక్కు రిఫర్ చేస్తుంది. ఆనందబాష్పాలు ‘ఒక అమ్మాయి ఈ ఉచిత డ్రస్సు కోసం వచ్చింది. దానిని తీసుకున్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది. తర్వాత ఫోన్ చేసి చెప్పింది... నాకు ఏడుపు వచ్చేసింది.. అది కనపడకూడదని పరిగెత్తాను అని. మరొకమ్మాయి.. అక్కా... దేవుడు నా ప్రార్థనను నీ ద్వారా తీర్చాడు అని చెప్పింది. ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నేను ఇదంతా ప్రచారానికి చేయడం లేదు. నేను ఆ ఆడపిల్లల ఫొటోలు తీయడం కూడా చేయను. అందుకే వారు అసౌకర్యం లేకుండా నా దగ్గరికి వస్తున్నారు’ అంది సబిత. ఆమె భర్త షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఆమె చేస్తున్న పనికి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. మంచివాళ్లు ఉన్నారు లోకంలో. – సాక్షి ఫ్యామిలీ -
డ్రామాకు కేరాఫ్ అ‘డ్రస్’
రాజాం సిటీ /రూరల్: సాంస్కృతిక నాగరికతలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రంగస్థల కళకు కళాకారులు వన్నె తెస్తే.. వేదిక వెనుకనే ఉంటూ రూపకల్పన చేసే వారు ఎంతోమంది ఉంటారు. ఆహార్యం, వస్త్రధారణ విషయంలో కీలకభూమిక పోషించే రంగస్థల నటులు ధరించే వ్రస్తాలను నైపుణ్యంతో కుట్టడంలో దర్జీల పాత్ర ఎంతైనా ఉంది. ఈ అరుదైన వృత్తిని చేపట్టి గతంలో రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు వస్త్రాలను కుట్టి ఇచ్చిన దివంగత బాదిరెడ్డి పాపారావు తన వారసత్వాన్ని కుమారుడు బాదిరెడ్డి సీతారాంకు అప్పగించి కళారంగ అభిమానాన్ని చాటుకున్నారు. రాజాం మండలం కొండంపేటకు చెందిన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అంతరించిపోతున్న కళల్లో ప్రథమ స్థానంలో ఉన్న రంగస్థల కళాకారులకు దుస్తులను కుట్టే బాధ్యతను స్వీకరించి పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. రంగస్థల దిగ్గజం, బళ్లారి రాఘవ అవార్డు గ్రహీత దివంగత అమరపు సత్యనారాయణ నుంచి లోలుగు ఆచారి, యడ్ల గోపాలం, డాక్టర్ మీగడ రామలింగస్వామి, మొలకారెడ్డి వంటి మహామహులకు సైతం దుస్తులు సమకూర్చిన పాపారావు 2018 పరమపదించారు. అత్యంత కఠినమైన ఈ విద్యను తన పెద్ద కుమారుడికి అప్పగించారు. అప్పటికే దర్జీ పనిలో ఉన్న సీతారాం తండ్రి అప్పగించిన బాధ్యతను కష్టనష్టాలకోర్చి నేటికీ కొనసాగిస్తున్నాడు. ఆదరణ కరువైనా.. నానాటికీ పౌరాణిక కళ అంతరించిపోతుండడంతో ఈ రంగంలోకి వచ్చేవారే కరువయ్యారు. దీంతో డ్రామాడ్రస్సులు కుట్టించేవారు లేక పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు రెండు నెలలకో, ఆరు మాసాలకో వచ్చే ఆర్డర్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో సాంప్రదాయ నృత్యాలు, బుర్రకథలు తదితర వస్త్రాలు అవసరమైనప్పుడు పని ఉంటుంది. ఒకసారి కుట్టిన వస్త్రం సుమారు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగించేలా ప్రత్యేక శైలిలో కుట్టి ఇస్తామని, దీనికి విపరీతమైన ఖర్చు ఉన్నప్పటికీ సాదకబాదకాలను భరించి కుట్టి ఇవ్వడంలో సంతృప్తి మిగులుతుందని ఆయన తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో.. డ్రామాడ్రస్సులు కుట్టడంలో ఎవరూ లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. డ్రామా డ్రస్సులతోపాటు పంచె చిలకట్టులు కూడా కుట్టడంతో హైదరాబాద్, బెంగళూరు, రాయలసీమ, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. ఓ డ్రామా పంచె కుట్టేందుకు రెండు రోజులు సమయం పడుతుందని సీతారాం తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు పంచెలు కుట్టినట్లు పేర్కొన్నారు. ప్రోత్సహించాలి.. నా చిన్నతనం నుంచి స్కూల్ ముగియగానే నాన్న వద్ద బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. డ్రామా డ్రస్సులు కుట్టే పని అరుదుగా లభిస్తుందని చెప్పడంతో మక్కువ పెంచుకున్నాను. ప్రస్తుతం దర్జీ వృత్తి కూడా రడీమేడ్ వ్రస్తాల రాకతో సంక్షోభంలో పడింది. అరుదైన డ్రామా డ్రస్సులు కుట్టే వృత్తిని గుర్తించి ప్రభుత్వం, దాతలు ప్రోత్సహిస్తే రంగస్థల కళకు పునరుజ్జీవం పోసేందుకు అవకాశం ఉంటుంది. – బాదిరెడ్డి సీతారాం -
హైదరాబాద్‌లో మాంగళ్య షాపింగ్ మాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్త్రాలు, రెడీమేడ్స్ రంగంలో వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాంగళ్య బ్రాండ్ హైదరాబాద్‌కు విస్తరిస్తోంది. మదీనగూడలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌ను ఏర్పాటు చేసింది. జనవరి 3న ఈ ఔట్‌లెట్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రారంభిస్తారని మాంగళ్య చైర్మన్ కాసం నమశ్శివాయ తెలిపారు. సంస్థ ఫౌండర్ పి.ఎన్.మూర్తి, డైరెక్టర్లు కాసం శివప్రసాద్, పి.అరుణ్‌తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేటలో మాంగళ్య మాల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మార్చి తొలివారంలో బోడుప్పల్ కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాదే సూర్యాపేటలో ఇటువంటి సెంటర్ రానుంది. స్వయంవరం, కాసం తదితర బ్రాండ్లలో ఔట్లెట్లను నిర్వహిస్తున్నాం. మొత్తం 35 స్టోర్లున్నాయి. 1,500 మంది పనిచేస్తున్నారు. టర్నోవరు రూ.350 కోట్లుంది’ అని వివరించారు. -
కుర్తా కుచ్చిళ్లు
చీరకట్టులో ఓ కొత్త స్టైల్ కుర్తా–కుచ్చిళ్లు. చీరను కుచ్చిళ్లుగా మడిచి ... బ్లౌజ్‌ను కుర్తాగా ధరించి... పల్లూను దుపట్టాలా సింగారిస్తే... చూపులకు చక్కగా స్టైల్‌కి సూపర్బ్‌గా... సౌకర్యంలో సుందరంగా... సందర్భమేదైనా, వేడుక ఏదైనా చీరను మించిన ఎవర్గ్రీన్ డ్రెస్ లేదన్నది నేటితరమూ ఒప్పుకుంటున్న మాట. అయితే, ఒకప్పటిలా కాకుండా చీరకట్టులో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. పవిటను తీరొక్కతీరుగా అలంకరించడం నిన్నటి మాట. బ్లౌజ్ పార్ట్‌ని భిన్నమైన టాప్స్‌తో చీరకు జత చేయడం నేటి మాట అయ్యింది. అవి నవతరం మెచ్చేలా స్టైలిష్ లుక్‌తో పాటు సంప్రదాయతను చాటేలా ఉండటం ప్రధానంగా కనిపిస్తోంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తా – చీర కాంబినేషన్ లేదా లాంగ్ జాకెట్–చీర, షర్ట్ స్టైల్ –చీర.. ఇలా ఈ స్టైల్స్ ఆధునిక కాలం అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక సందర్భాలలో ఈ కుర్తా లేదా కుర్తీ చీరకట్టు మరింత ప్రత్యేకతను చాటుతోంది. చీరకట్టులో కుర్తీ శారీ నేటి కాలానికి తగినట్టు స్టైలిష్‌గా ఉండటంతో ఆకట్టుకుంటోంది. పైగా సౌకర్యవంతంగా ఉంటుంది.కుర్తా శారీ ఎంపికలో రెండు భిన్న రంగులను ఎంచుకోవాలి. అలాగే ఫ్యాబ్రిక్లోనూ మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంచుతో కూడిన ప్లెయిన్ శారీ అయితే తెల్లటి కుర్తా టాప్‌గా ధరిస్తే చాలు మంచి కాంబినేషన్ అవుతుంది. ∙ప్రింటెడ్ శారీకి ప్లెయిన్ కుర్తా పర్ఫెక్ట్ ఎంపిక. చీరకట్టులోనే కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణ అవసరం లేదు. సింపుల్‌గా చెవులకు జూకాలను ధరిస్తే సరిపోతుంది. క్రోషెట్ లేదా లేస్ ఫ్యాబ్రిక్ కుర్తాలు కూడా బ్లౌజ్ పార్ట్ (కుర్తా టాప్)కి బాగా నప్పుతాయి. షార్ట్ కుర్తీ వేసుకున్నప్పుడు అంచులు తగిలేలా పవిటను తీయాలి. అలాగే లాంగ్ కుర్తా (నీ లెంగ్త్) ధరించిన్నప్పుడు పవిటను కుర్తా అంచులను తగిలేలా సెట్ చేస్టే స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తీలను చీర మీదకు ధరించడం వల్ల ఫార్మల్ లుక్‌తో ఆకట్టుకుంటారు. ప్రత్యేక∙సభలు, సమావేశాలకూ ఈ లుక్ నప్పుతుంది. – కీర్తిక, డిజైనర్ -
కుట్టు కూలి ఇచ్చేదెప్పుడో!
పరిగి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారాల కోసం గత విద్యా సంవత్సరం చివరలోనే క్లాత్ పంపిణీ చేసిన సర్కారు.. నేటికీ కుట్టు కూలి డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు దుస్తుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కుట్టు కూలి డబ్బులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కారణంగా నేటికీ యూనిఫారాలు దర్జీల వద్దే మూలుగుతున్నాయి. పాఠశాలల పునః ప్రారంభం రోజునే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులు పంపిణీ చేస్తామని హడావుడి చేసిన విద్యాశాఖ.. స్కూళ్లు తెరుచుకుని 25 రోజులు గడుస్తున్నా వారికి యూనిఫారాల పంపిణీ విషయంలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. 70 లక్షలు అవసరం జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 70 లక్షల నిధులు కుట్టు కూలి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 82 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందు లో 9, 10 తరగతులకు దుస్తులు పంపిణీ చేయడం లేదు. ఆ రెండు తరగతులను మినహాయిస్తే 70 వేల మంది విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. 1నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయాలి. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 1,40,000 దుస్తులు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో జత కుట్టేందుకు అధికారులు రూ. 50 చొప్పున వెచ్చిస్తున్నారు. అంటే ఈ లెక్కన జిల్లాలో సుమారు రూ.70 లక్షల కుట్టు కూలి డబ్బులు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరీక్షిస్తున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పునః ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు రెండు జతల దుస్తులు, నూతన పాఠ్య పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ ఆర్భాటంగా ముందుగానే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మూడు నెలల ముందుగానే యూనిఫారాలకు సంబంధించి క్లాత్ కూడా పంపిణీ చేసింది. ఎస్ఎంసీ(స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) తీర్మానాల మేరకు ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు కుట్టించుకోవాలని హెచ్ఎంలకు సూచించింది. ఈక్రమంలో అనుకున్న విధంగానే చాలాచోట్ల పాఠశాలల పునఃప్రారంభం నాటికి దర్జీల వద్ద స్టిచింగ్ సైతం పూర్తయింది. అయితే, దర్జీలకు కూలి డబ్బులు మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలేదు. కాగా, కొందరు దర్జీలు హెచ్‌ఎంలపై నమ్మకంతో కొన్ని పాఠశాలలకు దుస్తులు అందజేశారు. మెజారిటీ దర్జీలు తమకు కూలి డబ్బులు ఇచ్చే వరకు దుస్తులు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో కుట్టిన దుస్తులు వారివద్దే ఉండిపోయాయి. ఈ విషయమై పరిగి ఎంఈఓ హరిశ్చందర్‌ను వివరణ కోరగా.. ఇంకా కూలి డబ్బులు మంజూరు కాలేదని, అవి నేరుగా ఎస్ఎంసీ ఖాతాల్లోకే వస్తాయని తెలిపారు. నిధులు వచ్చాక దర్జీలకు చెల్లించి యూనిఫారాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తామని వివరించారు. -
తెలంగాణ వచ్చాకే చిరునవ్వులు
మెదక్ మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మెదక్ పట్టణంలో ముస్లింలకు రంజాన్ పండగ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు. క్రిస్టల్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. షాది ముబారక్ ద్వారా యువతుల పెళ్లిళ్లకు రూ.10,0116లు అందజేయడం జరుగుతుందన్నారు. మెదక్‌లో రూ.2కోట్లతో షాదిఖానా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈద్గా, మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.2కోట్లు అందిస్తుందని తెలిపారు. మెదక్‌లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరొకటి బాలికలకోసం మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 1250 మంది ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం మెదక్ జిల్లాను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మెదక్ జిల్లా అయినప్పటికీ సంగారెడ్డి కేంద్రంగా కార్యకలాపాలు సాగేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్‌ను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. రూ.100కోట్లతో మెదక్ పట్టణానికి ఫుట్‌పాత్, నాలుగు వరుసల రోడ్డు, బట్టర్ఫ్లై లైట్లతో సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో రూ.50 కోట్లతో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నట్లు తెలిపారు. చేగుంట రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పిట్లం చెరువు, గోసముద్రంంలను మీనిట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు నెలరోజుల్లో ఆఖరి సఫారి వాహనం అందిస్తామని తెలిపారు. ప్రతియేడు సిద్దిపేట జిల్లా నుండి 5వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్ర పంపించడం జరుగుతుందన్నారు. ఈ యేడు నుంచి మెదక్ జిల్లా నుండి 5 వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్రకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 260మంది పేద ముస్లింలకు రూ.1.30కోట్లను షాది ముబారక్ ద్వారా అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్నారని తెలిపారు. కవర్లను వాడబోమని మాటివ్వండి ప్లాస్టిక్ కవర్లను ఇకనుండి వినియోగించమని మాటివ్వాలని మంత్రి హరీశ్‌రావు ముస్లింలను కోరగా, వారు వాగ్ధానం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రతియేడు దేశంలో ఎంతోమంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద గల బాలికల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల అదనపు మౌలిక వసతుల కల్పన ప్రారంభించారు. ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించే గురుకుల పాఠశాలలకు రూ.1లక్ష నజారానా ఇస్తామన్నారు. అలాగే నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు చంద్రకళ, రాధా, బట్టి సులోచన, జ్యోతి, సలాం, ఆర్కెశ్రీనివాస్, కో అప్షన్ సభ్యుడు సాధిక్, నాయకులు హమీద్, షాహెద్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
హీట్ సమ్మర్..కూల్ ఫ్యాబ్రిక్స్
సాక్షి, సిటీబ్యూరో : హాట్‌హాట్ సమ్మర్లో కూల్‌గా ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.. కానీ తప్పదు.. శరీరాన్ని వేడి నుంచి రక్షించుకోవడంలో దుస్తులూ ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేసవిలో కలర్ ‘ఫుల్’ దుస్తులకు కాస్త దూరంగా ఉండి శరీరానికి చల్లదనాన్ని అందించే ఫ్యాబ్రిక్స్‌తో తయారైన డ్రెస్సెస్ను ప్రిఫర్ చేస్తే హీట్ సమ్మర్‌పై హిట్ కొట్టినట్లేనని ఫ్యాషన్ డిజైనర్లు అంటున్నారు. సో.. ఫ్యాషన్ మార్చిసమ్మర్కు కూల్ వెల్కమ్ చెబుదాం.. లేత రంగులు బెస్ట్.. ఈ సీజన్లో ముదురు రంగు దుస్తులకు బదులు లేత వర్ణంలో ఉండే సమ్మర్ ఫ్రెండ్లీ దుస్తుల వైపు మొగ్గు చూపడం మంచిది. నలుపు, ఎరుపు, ముదురు నీలం తదితర రంగులను వేసవిలో ప్రిఫర్ చేస్తే అవి వేడి పుట్టిస్తాయి. అందుకు వీలైనంత వరకు పింక్, లైట్ బ్లూ, వైట్, క్రీమ్, లెమన్ ఎల్లో తదితర లేత రంగులు ధరించడమే మంచిదని ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. కంఫర్ట్.. బాడీ ఫ్రెండ్లీ.. సమ్మర్ ఫ్యాషన్ వేర్లో విభిన్న డిజైన్లు, ఆకట్టుకునే రంగుల్లో రూ.500 నుంచి రూ.15,000 ధరల్లో దుస్తులు అందుబాటులో ఉన్నాయి. లెంగ్త్ ఫ్రాక్స్, కోల్డ్ షోల్డర్స్, పాప్ స్టైల్ వెస్ట్ స్కర్ట్స్, హై కట్ టాప్స్, ట్యాంక్ డ్రస్, ఫెమ్మీ ఫ్లోరల్ లాంగ్ స్కర్ట్స్, ప్రామ్ చూడీస్ మొదలైన పాటర్న్లు ఈ సీసన్లో బాడీ ఫ్రెండ్లీగా ఉంటూ కావాల్సిన కంఫర్ట్‌ని అందిస్తాయి. ఒంటికి పట్టేసే దుస్తులతో ఇబ్బంది సమ్మర్లో వదులుగా ఉండే దుస్తులు ధరించటం మంచిది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఒంటికి పట్టేసే దుస్తులు వేయడం మానుకోకపోతే మరింత అసౌకర్యం కలగడంతో పాటు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. భారీ ఇయర్ టాప్స్, బాడీ జ్యూవెలరీ వంటి యాక్సిసరీస్ను వీలైనంత వరకు తగ్గించటం మంచిది. – అఖిలేష్, (ఏ అండ్ కే లేబిల్ ఫ్యాషన్ డిజైనర్స్) -
అవునా! క్లాత్‌తోనా!!
వార్డ్‌రోబ్‌లో కొన్నాళ్లుగా వదిలేసిన డ్రెస్సులు, స్కార్ఫ్‌లు, దుపట్టాలు మొదలైనవి చెక్కుచెదరకుండా అలాగే పడి ఉంటాయి. లేదంటే డ్రెస్ కుట్టగా మిగిలిన అదనపు క్లాత్‌లు, గిఫ్ట్ ప్యాక్‌లకు వచ్చే రంగు రంగుల రిబ్బన్లు చెత్తబుట్టలోకి చేరుతుంటాయి. కొంచెం సృజన, మరికొంచెం ఆసక్తి జోడిస్తే ఖాళీ సమయంలో ఇలాంటి అందమైన ఆభరణాలను ఎన్నో రూపొందించుకోవచ్చు. రిబ్బన్ మెటీరియల్‌తో గులాబీలుగా చుట్టి కుట్టాలి. వీటికి ముత్యాలు, చీర రంగుకు మ్యాచ్ అయ్యే పూసల దండను జత చేర్చితే ఇలా అందమైన కంఠాభరణం సిద్ధం.రంగు రంగు క్లాత్‌ను తీసుకొని దానిని పొడవుగా కత్తిరించి, జడను అల్లిన విధంగా రెండు మూడు వరసలుగా అల్లాలి. ఒక వరుసకు ఉడెన్ బీడ్స్ జత చేస్తే ఆధునిక అమ్మాయిలు ఇష్టపడే నెక్ జూవెల్రీ రెడీ. పసుపు, నారింజ, పచ్చ కాటన్ క్లాత్‌లను చుట్టి, మధ్య మధ్య మరో దారంతో ముడులు వేయాలి. ఒక వరస జడలా క్లాత్‌తో అల్లాలి. వీటికి కలంకారీ బెల్ట్‌ను జతచేయాలి. మోడ్రన్ డ్రెస్‌ల మీదకు ఆకర్షణీయంగా ఉంటుంది. పట్టు, బెనారస్ చీరల అంచు లేదా జాకెట్టు కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్‌తో ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు. ఇందుకు రెండు రంగుల ఫ్యాబ్రిక్, పెద్ద డ్రెస్ బటన్, పూసలు జత చేసి ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు.రంగుమారిన ప్లాస్టిక్, ఉడెన్ గాజులకు ఇలా రంగు దారాలతోనూ, బట్ట ముక్కలతో గ్లూతో అతికిస్తూ చుడితే నాజూకు చేతులను ఆకర్షణీయంగా మార్చేస్తాయి. -
ఆ విషయంలో నేను చాలా వీక్!
దీపికా పదుకొనే చాలా స్టయిలిష్‌గా ఉంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులంటే కాలేజీ గాళ్స్‌కి తెగ క్రేజ్. మంచి అభిరుచి ఉంది కాబట్టే దీపికా డ్రెస్సులన్నీ బాగుంటాయని కూడా అంటుంటారు. అంత అందంగా డ్రెస్ చేసుకునే దీపిక బహుశా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏమైనా చేశారేమో అని కూడా అనుకుంటారు. ఆ మాటే ఈ బ్యూటీతో అంటూ ‘నేనా.. ఫ్యాషన్ డిజైనింగా.. భలేవారే.. నాకసలు ఫ్యాషన్ గురించి ఏమీ తెలియదు’ అని నవ్వేస్తారు. మరి.. ఇంత స్టయిలిష్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అనే ప్రశ్న దీపిక ముందుంచితే - ‘‘నా ఇంటికొచ్చి నా వార్డ్ రోబ్ చూస్తే, జీన్స్-టీ షర్ట్స్, కాటన్ షర్ట్స్ తప్ప వేరే ఏవీ కనిపించవు. అవి మాత్రమే కొనుక్కోవడం వచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నేను వీక్. అందుకే డిజైనర్ల మీద ఆధారపడిపోతుంటా. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి.. డిజైనర్‌కి ఫోన్ కొడతా. అదెలాంటి ఫంక్షనో చెప్పేస్తా. అందుకు అనుగుణంగా వాళ్లే డ్రెస్ డిజైనింగ్ చేసి ఇచ్చేస్తారు. సినిమాలకు ఎలాగూ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ల మీద ఆధారపడిపోతాను. కలర్ కాంబినేషన్ కూడా చెప్పడం తెలియదు. వాళ్లేది తయారు చేసిస్తే అది వేసేసుకుంటా. లక్కీగా అన్నీ బాగుంటున్నాయి. దాంతో నాకు మంచి టేస్ట్ ఉందని అనుకుంటున్నారు. నా టేస్ట్ ప్రకారం నేను బట్టలు వేసుకుంటే ఇక అంతే సంగతులు. ‘దీపికా సో బోరింగ్’ అనేస్తారు’’ అని చెప్పారు. -
ఐశ్వర్య దారిలో కత్రినా
ఓ లుక్కేస్తారా! సీనియర్లు చెప్పిన సలహాలను ఆచరణలో పెట్టడం కంటే... సీనియర్లు ఆచరించి చూపించిన దారిలో నడవడమే సులభం. జస్ట్ ఫాలో అయి పోవడమే కదా మరి! కత్రినాకైఫ్ కూడా అదే పనిలో ఉంది. 68వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి ఆమె నల్లరంగు టాప్‌లెస్ గౌన్ ధరించింది. గతంలో ఐశ్వర్య కూడా ఇదే తరహాలో గోధుమరంగు దుస్తుల్లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్‌కార్పెట్ మీద నడిచింది. ‘జీవితం అందరికీ అన్నీ ఇవ్వదు. ఏదో పొందుతూ ఉంటాం, ఇంకేదో కోల్పోతూ ఉంటాం. లెక్కలు, కారణాలు, అర్థాలు... అంటూ జీవితానికేమీ పట్టవు. అదొక అంతులేని ప్రవాహంలా సాగుతూ ఉంటుందంతే!’ ఆమె పుస్తకం చదవడం అయిపోయింది. ఆఖరి వాక్యాలు మళ్లీ చదివి, పుస్తకం మూసి, చిన్నగా నిట్టూరుస్తూ బెడ్ మీద నుండి లేచి పెరటి వైపు కెళ్లింది. అక్కడ తను పెంచుతున్న పూలతోటలోని పూలు ఆమె రాకకోసమే ఎదురుచూస్తున్నాయి. సమయం మధ్యాహ్నం నుండి సాయంత్రంలోకి రూపం మార్చుకుంటోంది. పువ్వులను ఆమె సుకుమారంగా చూసుకుంటూ పాదులు సరిచేస్తోంది. ఇంతలో ఇంటివాకిట గేటు చప్పుడయ్యింది. ఆమెకు ఎవరొచ్చారో తెలుసు. గేటు తీసుకుని అతను నేరుగా పెరటివైపు వచ్చాడు. ఆమె ఇప్పుడెక్కడ ఉంటుందో అతనికీ తెలుసు. ‘‘ఏం చేస్తున్నారు?’’ అలవాటుగా ప్రశ్నించాడతను.‘‘కూర్చోండి’’ అంటూ ఆమె మొక్కలను సరిచేస్తోంది.ఆమెను చూస్తున్నాడతను. లేత ఆకుపచ్చరంగు చీర, వదులుగా అల్లిన నల్లని జడ, ఎరుపు, పసుపు కలిసిన మేని ఛాయతో తెల్లగా నవ్విందామె అతని వైపు చూసి, ఇంద్రధనుస్సులా. కొద్దిగా తత్తరపడ్డాడు ఆమె నవ్వు చూసి. మళ్లీ తేరుకుని... ‘‘నేనడిగిన విషయం...’’ అంటూ సూటిగా విషయంలోకొచ్చాడు. ‘‘సమయం కావాలన్నానుగా’’ ఆమె పువ్వుల వైపు చూస్తూ చెప్తోంది. ‘‘మీకోసం ఎంత సమయమైనా... నాకేం అభ్యంతరం లేదు’’ అన్నాడతను. ఆమె లేచి, ‘‘కాఫీ తాగుతారా?’’ అనడిగింది. తల ఊపాడతను. ఐదు నిమిషాల్లో కాఫీ కలుపుకొచ్చిందామె. ఒకటి అతనికిచ్చి తను ఒకటి తీసుకుంది. కాసేపు మాటల్లేవు. ఆమె కాఫీ కప్పు కింద పెడుతూ, ‘‘మీరు బాగా ఆలోచించారా?’’ అనడిగింది. ‘‘ఆలోచించడానికేం లేదు’’ అతని స్పష్టమైన సమాధానం. ‘‘అయితే, ఎప్పుడో ఒకసారి మీవాళ్లదగ్గరికెళ్దాం’’ అందామె. అతను సంతోషంగా లేచి నిలబడి, ‘‘మీ తోటలో ఒక పువ్వు కోసుకోవచ్చా?’’ అనడిగాడు. అలాగే అంటూ తలూపిందామె. అతను నెమ్మదిగా ఒక రోజాపువ్వు కోసి ఆమెకే ఇచ్చాడు. ‘‘తీస్కోండి, ఇదే తొలి కానుక’’ అన్నాడు. ఆమె నవ్వుతూ తీసుకుంది. ‘‘వస్తానండీ, మళ్లీ కలుస్తాను’’ అంటూ వెళ్లిపోయాడతను ఆనందంగా. అప్పుడే పూస్తున్న పువ్వుని మృదువుగా చూసుకుంటూ లోపలికెళ్లిందామె. ఆమె తోటలో సగం పువ్వులు వెలుతురులోను, సగం పువ్వులు నీడలోను ఉన్నాయి. ఆమె ఆ రాత్రి మిద్దెమీద నిలబడ్డప్పుడు వెన్నెలంతా తనకోసమే కురుస్తున్నట్లు అనిపించిందామెకి. నల్లని పూలున్న తెల్లని చీరతో ఆకాశానికి పోటీగా నిలబడిందామె. కానీ ఆ వెన్నెల పక్కన చీకటిలాగా గతం తాలూకు జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయి ఆమెని చేదుగా... ఆమెకిదివరకే పెళ్లయింది. కానీ అసలు జీవితం అంటూ ఏమీ చూడకుండానే పెళ్లయిన సరిగ్గా వారంలోపే ఆమె భర్త మరణించాడు. తన ఫ్రెండ్స్‌కి పెళ్లి పార్టీ ఇచ్చి వస్తూ, దారిలో కారు యాక్సిడెంట్లో మరణించాడు. తర్వాత అంతా మామూలే. తలా ఒక మాట అన్నారు, తలా ఒక దారి పట్టారు ఆమెని ఒంటరిని చేస్తూ. ఆమెకు మొన్నటివరకూ అమ్మ అయినా ఉండేది అండగా. కానీ ఆమె కూడా ఈ మధ్యే చనిపోయింది. ఇప్పుడామె పూర్తిగా ఒంటరి. అందుకే తను చేస్తున్న ఉద్యోగంలో అడిగి మరీ మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించుకుని వచ్చేసింది.ఆమె అప్పటినుండి పుస్తకాల్లోన్నే ప్రపంచం చూస్తోంది. పువ్వులతోనే నేస్తంగా ఉంటోంది. ఆమె తోటలోని పువ్వులు మొగ్గలు తొడిగే సమయానికి ఆమెకి నిద్రపట్టింది. ఆమె తయారయ్యింది చక్కగా. వివేక్ వాళ్లింటికెళ్లాలిప్పుడు. వాళ్ల అమ్మగారు రమ్మన్నారు మాట్లాడ్డానికి. ఆమెకు మనసులో ఒకింత బెరుకుగానే ఉంది. బయల్దేరి వెళ్లింది. వివేక్ ఆమెకోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె వెళ్లగానే సాదరంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టాడు. వివేక్ వాళ్ల అమ్మగారు వచ్చాక, పలకరింపులు, కాఫీలు, కొంత సమయం అయ్యాక, ‘‘అమ్మా నీ గురించి మావాడు అంతా చెప్పాడు. నాకు మొదట్లో కొంచెం ఇబ్బందనిపించిన మాట వాస్తవమే. కానీ నిన్ను చూసి, నీతో మాట్లాడాక, నా అనుమానాలు, అపార్థాలు తొలగిపోయాయి. మావాడి ఇష్టమే నా ఇష్టం. ఏదో ఒకసారి నీ ప్రమేయమే లేకుండా జరగరానిది జరిగిందని నీ జీవితాన్ని బలిచేసుకోకుండా నువ్వు కూడా మంచి నిర్ణయమే తీసుకున్నావు. మా ఇంట్లోకి రావటానికి ఇక నీకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంది వివేక్ వాళ్ల అమ్మగారు. ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర. ఇంకా ఇంత మంచివాళ్లు తన చుట్టూ ఉన్నందుకు. ఆమె వాళ్లమ్మగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయింది. ఆమె పెరట్లో సగం కాసిన పువ్వులు ఆమెకోసం ఎదురుచూస్తున్నాయి. ‘‘మన పెళ్లి జరగదు వివేక్‌గారూ’’ మళ్లీ గట్టిగా చెప్పిందామె. ‘‘అదే, ఎందుకని అడుగుతున్నాను’’ ఆవేశంగా ఉన్నాడతను. ‘‘అన్నింటికీ కారణాలు చెప్పలేను, కానీ జరగదంతే’’ గట్టిగా చెప్పిందామె. ‘‘అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్‌గా కాదంటే నేనేం కావాలి, అసలిదంతా ఏమిటి?’’ గట్టిగానే అరుస్తూ అడుగుతున్నాడు వివేక్. ‘‘చూడండి వివేక్, నా రాత అంతే. నేనేదన్నా ఇష్టపడే లోపే నాకది దూరం అయిపోతుంది. అదీ మంచిదే, పూర్తిగా ఇష్టపడ్డాక పోతే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది.’’ అవును, నేనేమీ మిమ్మల్ని చూడగానే ప్రేమించలేదు. నా జీవన ప్రయాణంలో మీరు కలిశారు. మంచివారు, కలిసి నడుద్దాం అనుకున్నాను. కానీ కుదరడం లేదు. అందుకే ఒంటరిగానే ముందుకెళ్దామనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సులభంగానే మర్చిపోవచ్చు. ఎందుకంటే మనమేం చిన్నపిల్లలం కాదు కదా, పైగా ప్రేమికులం అంతకన్నా కాదు’’ ఒత్తి పలికింది ఆఖరి వాక్యాలు. అతను విసిగిపోయాడు. ‘‘అసలిదంతా ఎందుకు? ఒక్క సరైన కారణం చెప్పండి, ఈ పెళ్లి వద్దు అనటానికి. నేనే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాను’’ వివేక్ కళ్లు, మాటలు ఎర్రబడ్డాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆమె నెమ్మదిగా ‘‘వివేక్‌గారూ! నాకు మరొకరితో సంబంధం ఉంది’’గద్గద స్వరంతో చెప్పింది. ఆమె కళ్లల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఆమె మాటల అబద్ధపు సాక్ష్యాలుగా. ‘‘మరి నాతో పెళ్లికి ఒప్పుకోవటం, మా ఇంటికి రావటం... ఇదంతా..’’ అతని గొంతు వణుకుతోంది. ‘‘ఆ తర్వాతే... అంతా జరిగింది. ఇక ఇంతకన్నా ఇప్పుడు ఏం చెప్పలేను. ప్లీజ్. వెళ్లిపోండి. దయచేసి మళ్లీ కనిపించకండి.’’ ఆమె మనసు, శరీరం అంతా దుఃఖంతో నింపుకుని లోపలికెళ్లిపోయింది. అతను ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడిపోయాడు అచేతనంగా. ఆమె తోటలో సగం పూసిన పూలు ఎందుకో వాడిపోయాయి. కాలం గడుస్తోంది. మనుషులు, వాళ్ల ఇష్టాలు, కష్టాలు, ఆలోచనలు, విలువలు ఇవేమీ పట్టనట్టుగా, కఠినంగా. మళ్లీ దాదాపు రెండేళ్ల వరకు వివేక్ కనపడలేదామెకు. నిజానికి ఆమే వివేక్కి దూరంగా తప్పించుకు తిరిగింది. ఆ రోజు ఆమె ఉంటున్న ఊరు నుండి కొద్ది దూరంలో ఉన్న నగరానికి వెళ్లిందామె నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడానికి. పుస్తకాలు చూస్తుండగా ఎవరో పక్కన నిలబడ్డట్టు అనిపించి చటుక్కున అటు తిరిగి చూసిందామె. పక్కన వివేక్... ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూస్తుండగా, ‘‘బావున్నారా?’’ అడిగాడు వివేక్ మర్యాదగా. ‘‘ఆ...’’ అంటూ తలూపిందామె. ‘‘బైదిబై ఈమె నా మిసెస్. పేరు కల్పన. అఫ్కోర్స్ తను నా మేనమామ కూతురే’’ అంటూ ఆమెకు కల్పనను పరిచయం చేశాడు. ఆమె నమస్కరించింది కల్పనకు. ముగ్గురికీ పరిచయాలయ్యాక, ఆ పక్కనే ఉన్న కాఫీ హోటల్లో కూర్చుని కాఫీ తాగారు మామూలు కబుర్లతో. కాఫీలయ్యాక, కల్పన, వివేక్ ముందు నడుస్తుండగా, ఆమె వెనకాలే వస్తోంది. వివేక్ గమనించకుండా కల్పన ఒక చిన్న కాగితాన్ని చుట్టి ఆమె మీదకు విసిరింది. అది తీసి చదివిందామె - ‘థాంక్యూ ఫర్ గివింగ్ బ్యాక్ మై లైఫ్ టు మి’ అని రాసుందందులో. ఆమె చిన్నగా నవ్వుకుంది అది చూసి. ఆ నవ్వులో తృప్తి ఉందో, వేదన ఉందో వెతకటం కష్టమే. అసలేం జరిగిందంటే... ఆమె వివేక్వాళ్ల అమ్మగారితో మాట్లాడి వచ్చిన రెండ్రోజులకు... ‘‘మీరేనా మా బావని పెళ్లిచేసుకోబోతున్నది’’ అంటూ సూటిగా దూసుకొచ్చింది కల్పన ఆమె ఇంట్లోకి. ‘‘అసలు మీరెవరు?’’ అడిగిందామె ఆశ్చర్యంగా. ‘‘నేను వివేక్ మరదలిని’’ అంది కల్పన. ‘‘ఓహ్! అయామ్ సారీ. నాకు తెలీదు, కూర్చోండి’’ అందామె. ‘‘మీతో ఒక విషయం మాట్లాడాలి’’ పూర్తిగా ఒక నిర్ధారణతో మాట్లాడుతోంది కల్పన. ‘‘చెప్పండి.’’ ‘‘నేను మా బావని ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే ప్రాణం పెట్టేంతగా.’’ ఆశ్చర్యంగా చూసిందామె. ‘‘అవునండీ, నాకు మా బావంటే చిన్నప్పటినుండీ ఇష్టం. చాలా ఇష్టపడ్డాను. కానీ తన అభిప్రాయమే సరిగ్గా తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఇప్పుడు మీరంటే ఇష్టపడుతున్నాడని తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను’’ అంది కల్పన. ‘‘ఏం మాట్లాడాలి?’’ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదామె. కల్పన ఒక్క క్షణం ఆగి చెప్పనారంభించింది. ‘‘మీకిదివరకే పెళ్లయింది. కానీ దురదృష్టవశాత్తూ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు జీవితాన్నిస్తానంటూ మా బావ వచ్చాడు. నా మాట ఒకటి శ్రద్ధగా వినండి.’’ ఆమె వింటోది. ‘‘మీ చెదిరిన జీవితానికి ఆసరాగా ఒక తోడు కావాలి మీకు. నిజమే. అది మా బావ కావొచ్చు. మరొకరు కావొచ్చు. తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఇష్టపడి, అర్థం చేసుకునే వ్యక్తి కావాలి మీకు. అంతే. కానీ నా విషయం అలా కాదు, నా బలం, బలహీనత అన్నీ మా బావే నాకు. నా సర్వస్వం అతనే. మీరు మా బావని వదులుకుంటే ఒక మంచి మనిషిని దూరం చేసుకుంటారు అంతే, మరేమీ కాదు. ఎందుకంటే మీరేం ప్రేమికులు కాదు కదా! కానీ నేను మా బావని వదులుకుంటే నన్ను నేను పూర్తిగా కోల్పోయినట్లే. నేనున్నా లేనట్లే. మీరు మా బావని మర్చిపోవాలంటే కొన్ని జ్ఞాపకాలు వదులుకుంటే చాలు. నేను మర్చిపోవాలంటే నా జీవితాన్నే వదులుకోవాలి’’ కల్పన కళ్లల్లో కన్నీళ్లు. ‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’ అడిగిందామె కల్పన దగ్గరికొస్తూ. ‘‘నా జీవితాన్ని నాకివ్వండి’’ అంటూ ఆమె చేతులు గట్టిగా పట్టుకుంది కల్పన. ఆమె కల్పన చేతుల్ని గట్టిగా నొక్కింది అభయమిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఆమె నగరంలో వివేక్ వాళ్లని కలిసి ఇంటికొచ్చాక, అన్యమనస్కంగా పనులు చేసుకుంటోంది. ఇంతలో ఆమె సెల్‌కి ఏదో మెసేజ్ వచ్చినట్లుంటే యథాలాపంగా చూసింది. అందులో ‘‘నిండు జీవితం అంటూ ఏమీ ఉండదు. ఉండే జీవితంలోని గుర్తులు, జ్ఞాపకాలు మన వెంట తీపిగా, చేదుగా వస్తూనే ఉంటాయి. అవి మనసుకు తీసుకోవడం, తీసుకోకపోవడం మన ఇష్టం. అవి మీకు బాగా తెలుసు. అందుకే ఏదైనా తీసుకోగలరు, ఏదైనా వదులుకోగలరు. మీ వ్యక్తిత్వానికి మరొకసారి జోహార్లు. అయినా ఒక చిన్న సలహా. మీరు మళ్లీ మళ్లీ మరో కల్పనను ఉద్ధరించే పని మాత్రం పెట్టుకోకండి. ఒక్క వివేక్ చాలు బలి కావడానికి. అందరూ మీలాగా ఉండలేరు. టేక్ కేర్ సంధ్యగారూ..’’ అది వివేక్ నుండి వచ్చిన మెసేజ్. అది చదివిన ఆమెకు వివేక్కి అంతా తెలిసిందని అర్థమైంది. ఆమె మెసేజ్ చదువుతూ పెరటివైపు వెళ్లింది. అక్కడ ఆమె పూలతోటంతా చీకటి కప్పుకుని రోదిస్తోందో, విశ్రమిస్తోందో తెలియటం లేదు. ‘‘మీకిదివరకే పెళ్లయింది. కానీ దురదృష్టవశాత్తూ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు జీవితాన్నిస్తానంటూ మా బావ వచ్చాడు. నా మాట ఒకటి శ్రద్ధగా వినండి’’ అంటూ చెప్పుకుపోతోంది కల్పన. -
ఈ ఫ్యాషన్స్‌తో వెన్ను నొప్పి ఖాయం
న్యూఢిల్లీ: నేటితరంలో చాలామంది ఫ్యాషనబుల్‌గా ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంటికి అతుక్కుపోయే దుస్తులను ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే ఇలా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్‌లు నరాల పనితీరుమీద ఒత్తి డి కలిగిస్తాయని, దీంతో వెన్నునొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని క్యూఐ స్పైన్ క్లినిక్‌కి చెందిన వెన్నునొప్పి నిపుణులు సూరజ్ బఫ్నా ఈ సమస్యపై తన సూచనలిస్తున్నారు. ► ఒంటికి అతుక్కుపోయే జీన్స్ నడుము, తొడలు, కండరాలపై ఒత్తిడిన కలుగజేస్తాయి. ఇది మోకాలి జాయింట్ పేయిన్స్కి కారణమవుతాయి. ► బరువైన బ్యాగ్‌లు ధరించడం కూడా ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. సాధారణంగా బ్యాగ్‌ను ఏదైనా ఒకవైపే ఎక్కువగా ధరిస్తాం. అధిక బరువు ఉన్న బ్యాగ్‌లను ఒకే వైపు ఉంచడంతో వెన్ను మీద అధిక భారం పడుతుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది. ► నగరాల్లో యువతులు ఎక్కువగా హైహీల్స్ ధరిస్తున్నారు. ఇది పాదాలు, వెన్నెముకపై ఒత్తిడి కలిగిస్తుంది. తొడ కండరాలు క్షీణించేలా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తడంతోపాటు, మోకాలి చిప్ప అరుగుదలకు కూడా కారణమవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా కంఫర్టబుల్ పాదరక్షలు వాడడం ఉత్తమం. -
సత్సంప్రదాయానికి వారధి
తెలుగు ఉగాది యుగాది అనే పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి వికృతి ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చే సే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే! తెలుగు సంప్రదాయం ఉట్టిపడే ఈ పండుగలో దాగి ఉన్న విశేషాలను అవలోకిద్దాం... మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న ‘జయ’ నామ సంవత్సరం నుంచి రేపటితో ‘మన్మథ’ నామ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు లేదా నామనక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఆరోగ్యానికి అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారనిశాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, నలుగు పెట్టి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. నూత్న వస్త్రాలు లేదా శుభ్రవస్త్రాలు ఉగాది రోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదర . ఈ పండగ నాడు ఏమి చేయాలి? ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి మండలతో లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. అనంతరం పంచాంగ పఠనం లేదా శ్రవణం చేయాలి. పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, వారం వల్ల అనుకూలతను, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివారణ, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో విజయాన్ని కాంక్షించేవారు తప్పక పంచాంగం చూడాలి. పంచాంగ శ్రవణం ఎందుకు? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని, పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదిన పంచాంగ ఫలాలను తెలుసుకోవాలి. ఆ ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తుంది ఉగాది పచ్చడి. వైవిద్యభరితం అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తే, ఇంకొన్ని ప్రాంతాలలో జారుగా చేసి, కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. తెలుగు సంప్రదాయానికి నాంది... తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితోనే ఆరంభమవుతుంది కాబట్టి వేడుకలు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. అవేమీ లేకపోయినా, ఉగాది సంప్రదాయం మేరకు ప్రతి ఒక్కరూ పాత కక్షలు, కార్పణ్యాలు మరచి అన్యోన్యంగా, సంతోషంగా గడపాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అలంకరించిందీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని అనేక చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాది మంచి శుభతరుణం అన్నమాట.మీరు సంకల్పించిన శుభకార్యాలన్నీ నెరవేరాలని, ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. -
ఫ్యాషన్ " షో "
-
వస్త్ర‘దారుణాలు’
వీరంతా అమెరికా మాజీ అధ్యక్షులు.. ఓ పత్రిక వీరి డ్రెస్సులు చూసి.. చీ.. తూ.. యాక్.. అనేసింది. ‘డెయిలీ మెయిల్’ రూపొందించిన ‘‘ఫ్యాషన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు పాల్పడిన వస్త్ర‘దారుణాలు’-20’’ జాబితాలో వీరు టాప్-3లో ఉన్నారు. నంబర్-1: రోనాల్డ్ రీగన్.. 1984లో అయోవాకు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్నప్పుడు తన సిబ్బంది ఉద్దేశించి.. ప్రసంగిస్తున్న దృశ్యమిదీ.. ఇందులో ఆయన రెగ్యులర్ షర్ట్, షూ వేసుకున్నా.. నైట్ డ్రెస్ కింద వాడుకునే ప్యాంట్లాంటిదాన్ని వేసుకున్నారు. అదీ.. నడుముకి ఎంతెత్తున కట్టారో చూడండి.. ఇంత చండాలమైన కాంబినేషన్ వేసుకున్నారు కాబట్టే.. ఈయనకు జాబితాలో మొదటి ప్లేసు దక్కింది. నంబర్-2: మన గూఢచారి చిత్రాల్లోని హీరోలు వేసుకున్న డ్రెస్‌లా బాగుందనే అనిపిస్తోంది కానీ.. అమెరికాలో అధ్యక్షుడి స్థాయి వ్యక్తి ఇలా టెక్సాస్‌లోని కౌబాయ్‌లా టింగురంగా అంటూ తయారవడం బాగోలేదట. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ డ్రెస్ వేశారు. నంబర్-3: షార్ట్స్‌కు తక్కువ.. చెడ్డీకి ఎక్కువలా కనిపిస్తున్న ఈ పొట్టి షార్ట్స్‌ను 1992లో బిల్ క్లింటన్ వేసుకున్నారు. ఉదయం జాగింగ్‌కు వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న ఈ డ్రెస్ చాలా మందికి పెద్దగా నచ్చలేదట. టాప్-3లో వీరున్నా.. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా సహా పలువురు మాజీ అధ్యక్షులు టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
లేడీస్‌కి లెగ్గింగ్స్... మగాళ్లకి మెగ్గింగ్స్!
మెన్ ఫ్యాషన్ కొంతకాలం క్రితం వరకు మగాడికి ఓ బాధ ఉండేది... అమ్మాయిలకు ఉన్నన్ని డ్రెస్సులు మాకు లేవే అని. ఈ మధ్య డిజైనర్లు ఈ విషయం గుర్తించినట్టు ఉన్నారు. అందుకే పురుషుల దుస్తుల్లోనూ కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని అందరిలో వేసుకోవడానికి బాగుంటున్నాయి. ఇంకొన్ని ప్రయోగాలుగానే మిగిలిపోతున్నాయి. ఇటీవలే ఆడవాళ్లకు లెగ్గింగ్స్‌కు అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన జెగ్గింగ్స్ వచ్చాయి. అవి చూశాక తమకు కూడా ఇలాంటివి ఉంటే బాగుణ్నని అనుకుంటున్నారు పురుషులు. అంతే... వెంటనే మెగ్గింగ్స్ పుట్టుకొచ్చాయి. పురుషుడి శరీర నిర్మాణానికి ఇది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని కొందరు భావిస్తున్నా ఇంకొందరు మాత్రం వీటిని చాలా ఇష్టంగా ధరిస్తున్నారు. ఓసారి మీరూ ప్రయత్నించండి!