'ధరించే డ్రెస్‌ను బట్టి తమ స్టైల్, లుక్ ఎదుటివారికి తెలియాలని కోరుకుంటారు. క్యాజువల్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా తమను ప్రత్యేకంగా గుర్తించాలని తపిస్తారు. ముందే పలకరిస్తున్న వేసవి తాపాన్ని తట్టుకుంటూ వేడుకలలోనూ రాయల్ లుక్‌తో మెరిసిపోవడానికి ఓవర్‌కోట్ బార్డర్ స్టైల్ తన స్పెషాలిటీని చాటుతోంది. రెడీ అవ్వడానికి తక్కువ టైమ్ పట్టడమే కాదు సౌకర్యంలోనూ సరైన ఛాయిస్ అనిపించకమానదు.'
రాయల్ లుక్ కలిగిన డ్రెస్‌లు ఇవే..
- ఇండోవెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్ నవతరాన్ని అధికంగా ఆకర్షిస్తుంటుంది. అప్పట్లో ఓవర్‌కోట్ అంటే మందంగా ఉండే డ్రెస్‌గా మాత్రమే చూసేవారు. ఇప్పుడు అదే స్టైల్‌లో పట్టు, కాటన్స్‌తో తయారు చేస్తున్నారు.
- ఎంచుకున్న మెటీరియల్‌ను బట్టి పైఠానీ, గద్వాల్, ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్ గల బార్డర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఓవర్‌కోట్‌లా ఉండే టాప్స్, అదే రంగులో ఉండే బాటమ్ ΄్యాంట్స్‌కి అంచును జత చేయడంతో ఈ డ్రెస్‌లో అమ్మాయిలు మరింత ప్రత్యేకంగా కనపడుతున్నారు.
- సిల్క్, క్రేప్ ప్లెయిన్ మెటీరియల్‌ను ఈ డ్రెస్ తయారీకి ఎంచుకున్నప్పుడు ప్రత్యేక హంగుగా హ్యాండ్ ఎంబ్రాయిడరీని ఉపయోగిస్తున్నారు.
- షరారా ΄్యాంట్స్, టాప్స్, టై అండ్ డై మెటీరియల్ ఎంపిక కూడా ఈ డ్రెస్సింగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా అమరుతున్నాయి.
- బంగారు రంగులో ఉన్న వెడల్పాటి అంచులే కాదు, ఎంబ్రాయిడరీ చేసిన లేదా కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఈ డ్రెస్ మోడల్స్‌ను స్పెషల్‌గా చూపుతున్నాయి.
- గాఢమైన రంగులు లేదా లేత రంగులు సందర్భానికి అనుగుణంగా డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటికి ఫ్యాషన్ జ్యువెలరీ అదీ చాలా తక్కువగా ఉపయోగించవచ్చు. లేదా ఆభరణాల ఊసు లేకపోయినా నప్పే హెయిర్ స్టైల్‌తో ఆధునికంగా మెరిసిపోవచ్చు.
ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్!
Comments
Please login to add a commentAdd a comment