Royal
-
బర్త్‌డే పార్టీలో మహారాణిలా మెరిసిన పాప్‌స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (ఫోటోలు)
-
ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు!
భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ తారలతో పాటు రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల పోరులో మనం యువరాణులను, యువరాజులను చూడబోతున్నాం. దేశంలోని ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు రాజకుటుంబాలకు చెందిన పలువురికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 12 రాజకుటుంబాల వారసులు పోటీకి దిగారు. వీరిలో ఐదుగురు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఏడుగురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటకలోని మైసూర్ రాజు నుంచి త్రిపుర రాజకుటుంబానికి చెందిన రాణి వరకు పలువురు అభ్యర్థులు ఈ జాబితాలో కనిపిస్తారు. మార్చి 13న బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ వడియార్‌కు అవకాశం కల్పించింది. యదువీర్ తాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 1999 వరకు మైసూర్ నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బీజేపీ తన రెండవ జాబితాలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుండి కీర్తి సింగ్ దేవ్ వర్మకు అవకాశం కల్పించింది. ఆమె త్రిపుర మాణిక్య రాజ కుటుంబానికి చెందిన యువరాణి. ఆమె తిప్ర మోతా పార్టీ నేత ప్రద్యోత్ దేవ్ వర్మకు సోదరి. తిప్ర మోత పార్టీ ఇటీవలే ఎన్డీఏ కూటమిలో చేరి, ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తోంది. ఈ క్రమంలో వినిపించే మూడో పేరు మాళవిక కేశరి దేవ్. ఈమెను బీజేపీ ఒడిశా నుంచి బరిలోకి దింపింది. మాళవిక బీజేడీ మాజీ ఎంపీ అర్కా కేశరి దేవ్ భార్య . కలహండి రాజకుటుంబ సభ్యురాలు. 2023లో ఈ దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మహిమా కుమారి విశ్వరాజ్ సింగ్ మేవార్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈమె మేవార్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ భార్య. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై బీజేపీ రాజమాత అమృతా రాయ్‌ను పోటీకి నిలిచింది. రాయ్ కృష్ణనగర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆ ప్రాంతంలో ఆమెను రాజమాత అని పిలుస్తారు. ఛత్రపతి శివాజీ వారసుడు, మహారాష్ట్రలోని సతారా రాజ్యసభ ఎంపి ఉదయన్‌రాజే భోసలే ఈసారి బీజేపీ టిక్కెట్‌పై సతారా లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి, గ్వాలియర్ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే బీజేపీలో రాజ్యసభ ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి గుణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీకి దిగారు. ఒడిశాలోని పట్నాఘర్-బోలంగీర్ రాజకుటుంబానికి చెందిన బొలంగీర్ సిట్టింగ్ ఎంపీ సంగీతా కుమారి సింగ్ డియోకు బీజేపీ ఈసారి టిక్కెట్ ఇచ్చింది. -
ఇండోవెస్ట్రన్ స్టైల్.. 'టైమ్ లెస్ కంఫర్ట్ ప్లస్'!
'ధరించే డ్రెస్‌ను బట్టి తమ స్టైల్, లుక్ ఎదుటివారికి తెలియాలని కోరుకుంటారు. క్యాజువల్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా తమను ప్రత్యేకంగా గుర్తించాలని తపిస్తారు. ముందే పలకరిస్తున్న వేసవి తాపాన్ని తట్టుకుంటూ వేడుకలలోనూ రాయల్ లుక్‌తో మెరిసిపోవడానికి ఓవర్‌కోట్ బార్డర్ స్టైల్ తన స్పెషాలిటీని చాటుతోంది. రెడీ అవ్వడానికి తక్కువ టైమ్ పట్టడమే కాదు సౌకర్యంలోనూ సరైన ఛాయిస్ అనిపించకమానదు.' రాయల్ లుక్ కలిగిన డ్రెస్‌లు ఇవే.. ఇండోవెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్ నవతరాన్ని అధికంగా ఆకర్షిస్తుంటుంది. అప్పట్లో ఓవర్‌కోట్ అంటే మందంగా ఉండే డ్రెస్‌గా మాత్రమే చూసేవారు. ఇప్పుడు అదే స్టైల్లో పట్టు, కాటన్స్తో తయారు చేస్తున్నారు. ఎంచుకున్న మెటీరియల్‌ను బట్టి పైఠానీ, గద్వాల్, ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్ గల బార్డర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఓవర్కోట్లా ఉండే టాప్స్, అదే రంగులో ఉండే బాటమ్ ΄్యాంట్స్కి అంచును జత చేయడంతో ఈ డ్రెస్‌లో అమ్మాయిలు మరింత ప్రత్యేకంగా కనపడుతున్నారు. సిల్క్, క్రేప్ ప్లెయిన్ మెటీరియల్‌ను ఈ డ్రెస్ తయారీకి ఎంచుకున్నప్పుడు ప్రత్యేక హంగుగా హ్యాండ్ ఎంబ్రాయిడరీని ఉపయోగిస్తున్నారు. షరారా ΄్యాంట్స్, టాప్స్, టై అండ్ డై మెటీరియల్ ఎంపిక కూడా ఈ డ్రెస్సింగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా అమరుతున్నాయి. బంగారు రంగులో ఉన్న వెడల్పాటి అంచులే కాదు, ఎంబ్రాయిడరీ చేసిన లేదా కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఈ డ్రెస్ మోడల్స్‌ను స్పెషల్‌గా చూపుతున్నాయి. గాఢమైన రంగులు లేదా లేత రంగులు సందర్భానికి అనుగుణంగా డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటికి ఫ్యాషన్ జ్యువెలరీ అదీ చాలా తక్కువగా ఉపయోగించవచ్చు. లేదా ఆభరణాల ఊసు లేకపోయినా నప్పే హెయిర్ స్టైల్‌తో ఆధునికంగా మెరిసిపోవచ్చు. ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
సాగర విలాసం.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నౌక
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ఈ భారీ నౌకలో విశేషాలెన్నో... ► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది. ► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది. ► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు! ► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం. ► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు. ► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ. ► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు. ► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది. ► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే. ► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. ► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట! ► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడుస్తుంది. ► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది. ► ఐకాన్ ఆఫ్ ద సీస్లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది. ► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి. ► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి! ► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది. ► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indhu Rubasingham: రంగస్థల సింగం
‘అమ్మాయిలు నటించడం ఏమిటి?’ అనే ఆశ్చర్యం నుంచి రంగస్థలానికి వెలుగులు అద్దిన ప్రసిద్ధ నటీమణుల వరకు ఎంతో చరిత్ర ఉంది. రంగస్థలానికి సంబంధించిన చరిత్రలో మరో విశిష్టమైన పేరు ఇందు. లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ నేషనల్ థియేటర్‌కు ఇందు రుబసింగంను ఆర్టిస్టిక్ డైరెక్టర్, జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. 60 సంవత్సరాల చరిత్ర ఉన్న నేషనల్ థియేటర్‌కు మహిళా దర్శకురాలిని ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియమించడం ఇదే తొలిసారి.... ఇందు తల్లిదండ్రులు ఇంగ్లాండ్‌లో సిర్థపడిన శ్రీలంక తమిళులు. నాటింగ్హమ్ సిటీలోని నాటింగ్హమ్ గర్ల్స్ హైస్కూల్ లో విద్యాభ్యాసం చేసింది ఇందు. హల్ యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో డాక్టరేట్ చేసింది. థియేటర్ రాయల్, స్ట్రాట్ఫర్డ్ ఈస్ట్‌లో ట్రైనీ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఫ్రీలాన్స్ థియేటర్ డైరెక్టర్ గా పది సంవత్సరాలకు పైగా పనిచేసింది. ఫ్రీలాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలోనే లండన్‌లోని ‘గేట్ థియేటర్’లో అసోసియేట్ డైరెక్టర్‌గా నియామకం అయింది. లండన్‌లోని కిల్న్ థియేటర్‌కు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఇందు. గతంలో ఈ థియేటర్ శ్వేతజాతీయుల ఆధ్వర్యంలోనే నడిచేది. శ్వేతజాతేతర మహిళా దర్శకురాలు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ఇదే తొలిసారి. కిల్న్ థియేటర్ నిర్వహణలో ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’ గా తనదైన ముద్ర వేసింది ఇందు. ఆడిటోరియంను ఆధునీకరించి సీట్ల సంఖ్యను పెంచింది. కొత్త సౌకర్యాలు మాత్రమే కాదు కొత్త నాటకాన్ని థియేటర్‌కు పరిచయం చేసింది. ‘రెడ్ వెల్వెట్’‘హ్యాండ్ బ్యాగ్డ్’ ‘వెన్ ది క్రౌస్ విజిట్’ ‘ఏ వోల్ఫ్ ఇన్ స్నేక్స్కిన్ షూస్’...మొదలైన నాటకాలు డైరెక్టర్‌గా ఇందుకు మంచి పేరు తెచ్చాయి. ది ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్, ఏషియన్ ఉమెన్ ఆఫ్ ఎచీవ్మెంట్ అవార్డ్, లిబర్టీ హ్యుమన్ రైట్స్ అవార్డ్... మొదలైన ఎన్నో అవార్డ్లు అందుకుంది. ‘నాటకరంగాన్ని వినోద మాధ్యమానికి పరిమితం చేయకూడదు. మార్పు తెచ్చే శక్తి నాటకానికి ఉంది. ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చి అభిప్రాయాలు పంచుకునేలా, ఆలోచించేలా చేస్తుంది’ అంటుంది ఇందు. కొత్తదనం నిండిన నాటకాలకు ఇందు ప్రాధాన్యత ఇస్తుంది. మానవ సంబంధాలను విభిన్న కోణాల నుంచి విశ్లేషించే నాటకాలను ఎంపిక చేసుకుంటుంది. బీబీసీ రేడియో 4, బీబీసీ రేడియో 3, బీబీసి వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి రేడియో నాటికలకు కూడా దర్శకత్వం వహించింది. నేషనల్ థియేటర్ లో ‘ది వెయిటింగ్ రూమ్’ ‘ది రామాయణ’ అనుపమ చంద్రశేఖర్ ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’ నాటకాలకు దర్శకత్వం వహించింది. ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకుంది. కొత్త రచయితలను, నటులను ప్రోత్సహించడంలో ప్రపంచ రంగస్థలానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది ఇందు. ‘ఇందు నేషనల్ డైరెక్టర్‌గా నియామకం కావడం సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌గా, లీడర్‌గా ఆమె అంటే అపారమైన అభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే నాటకాలు రావడానికి, నాటకరంగాన్ని స్ఫూర్తిదాయక శక్తిగా మలిచే విషయంలో ఆమె కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారని ఆశిస్తున్నాను’ అంటుంది నేషనల్ థియేటర్ డైరెక్టర్ కేట్ వరహ్. ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా తన నియామకంపై స్పందిస్తూ... ‘నేషనల్ థియేటర్ నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇదొక అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను. నాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యున్నత బాధ్యత’ అంటుంది ఇందూ రుబసింగం. కొత్త రెక్కలతో... రంగస్థలం అనేది ఒకచోట, ఒకేకాలంలో ఉండిపోదు. కాలంతో పాటు కదులుతుంది. కాలాన్ని ప్రతిబింబిస్తుంది. రంగస్థలానికి ఆలోచనాపరులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చే శక్తి ఉంది. మానవసంబంధాల నుంచి అస్తిత్వ పోరాటాల వరకు ఎన్నో అంశాలకు నాటకం అద్దం పడుతుంది. సాంకేతిక పరంగానే కాదు ఇతివృత్త పరంగా కూడా నాటక రంగం కొత్త దారిలో వెళుతుంది. రంగçస్థల ప్రపంచంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆలోచలకు రెక్కలు వస్తున్నాయి. – ఇందు రుబసింగం, రంగస్థల దర్శకురాలు -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్‌గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్‌ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్‌ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్‌లో షమన్ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్‌కేర్ గ్రూప్‌లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
Royal London One-Day Cup: పుజారా ప్రతాపం
లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్షైర్తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు. -
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్) -
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ నిండుగా ఉండడంతో ఫుడ్ సప్లిమెంట్స్, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పాదనకు డిమాండ్ 365 రోజులూ ఉంటుంది. భారత్‌లో తేనె వ్యాపారం విలువ 2018లో సుమారు రూ.1,560 కోట్లు నమోదైంది. ఏటా 10.2 శాతం వృద్ధితో 2024 నాటికి ఇది రూ.2,806 కోట్లకు చేరుకోనుందని మార్కెట్ వర్గాల సమాచారం. వందకుపైగా రకాలు.. తేనెటీగలు 300–350 రకాల పూల నుంచి హనీని సేకరిస్తాయి. ఫ్లవర్స్ నాణ్యతనుబట్టి రంగు, రుచి, వాసన, టెక్స్చర్ మారుతుంది. తెలుపు, పసుపు, నలుపు, గోధుమ తదితర వర్ణాల్లో తేనె లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రకాల హనీ తయారవుతోంది. ‘మూడు నుంచి ఆరు వారాల జీవిత కాలం ఉండే తేనెటీగ సుమారు 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది’ అని జీనోమ్‌ల్యాబ్స్ బయో ఈడీ అశోక్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్‌లో వాడుతున్నారు. ‘అరుదైన తేనెతో విభిన్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్లోనీ బ్రాండ్‌లో ప్రీమియం వెరైటీలను ఇప్పటికే ప్రవేశపెట్టాం’ అని తెలిపారు. వినియోగం, తయారీలోనూ..: వినియోగం పరంగా యూఎస్, యూరప్, చైనా, భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ప్రీమియం హనీ ఉత్పత్తికి యూరప్‌లోని హంగేరీ పెట్టింది పేరు. యూఎస్, న్యూజీలాండ్, కెనడా, చైనా, భారత్‌లో తేనె పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. వినియోగం, తయారీ పరంగా భారత్ ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలిచింది. రూ.1,560 కోట్ల భారత హనీ విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.1,200 కోట్లుంది. డాబర్, పతంజలి, జంఢు, ఏపిస్, రస్న తదితర బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఇవేగాక ఆర్గానిక్ విభాగంలో 24 లెటర్ మంత్ర, ప్రో నేచుర్, ఆర్గానిక్ తత్వ, నేచుర్ ల్యాండ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే రాయల్.. మనుక, అకేషియా, లిండేన్, మిల్క్‌వీడ్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్లోవర్ వంటి పూలు చాలా ఖరీదైనవి. పలు దేశాల్లో ఈ పూల మొక్కలతో ప్రత్యేక తేనె ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. వీటి తేనె ఖరీదు కిలోకు రూ.1 లక్షకుపైగా ఉంటోంది. హనీ రకాల్లో అత్యంత ఖరీదైంది రాయల్ జెల్లీ. ఇతర వెరైటీలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా పేస్ట్ మాదిరి గా ఉంటుంది. క్వీన్ బీ నుంచి సేకరించిన 30 ప్లస్ గ్రేడ్ వెరైటీ కిలో ధర రూ.1.5 లక్షల పైమాటే. ఇది వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయి ఖరీదు ఉంది. -
రోల్స్ రాయిస్ వెడ్డింగ్ కారు
సాక్షి , భోపాల్: అంగరంగ వైభవంగా రాయల్‌లుక్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే మధ్యతరగతి వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్. అందమైన, ఖరీదైన కారులో ఊరేగాలన్న వధూవరుల కోరికను తీర్చేందుకు ఓ వెడ్డింగ్ ప్లానర్ కృషి ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఖరీదైన రోల్స్ రాయిస్ కారును అందంగా పెళ్లి పల్లకిలా రీమోడల్ చేశారు. మధ్య తరగతి జంటలకు వారి పెళ్లి రోజున రాయల్ ఫీలింగ్ కలిగించాలనే ఉద్దేశ్యంతో, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన హమీద్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్‌ను పెళ్లి ఊరేగింపునకు అనువుగా , అందంగా పునర్నిర్మించారు. పల్లకిని తలపించేలా సరికొత్తగా డిజైన్ చేశారు. మధ్యతరగతి వధూవరుల కలలకు ప్రాణం పోస్తూ కారును డిజైన్ చేసి..దానికి రాయల్స్ వెడ్డింగ్ కారుగా పేరు పెట్టారు. మధ్యతరగతి జంటలకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొంచినట్టు ఖాన్ తెలిపారు. ఇంకా ధర నిర్ణయించలేదన్నారు. -
కిట్టు ’రాయల్’
లేటెస్ట్ మోడల్ ద్విచక్రవాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్‌పై హల్చల్ చేసేందుకు యువత ఉరకలేస్తారు. చక్కెర్లు కొట్టేందుకు ఉర్రూతలూగుతారు. కంపెనీ నుంచి వచ్చిన బైక్‌ను తమకు అనుగుణంగా మార్చుకునేందుకు ఉవ్విళ్లూరుతారు. అటువంటి వారిలో కిట్టు ఒకరు. ఇతని పేరు తాడి కృష్ణ. ఊరు పాలకోడేరు మండలం వేండ్ర. వ్యాపారరీత్యా భీమవరంలో ఉంటారు. అతనికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అంటే మోజు. దీంతో రూ.1.60లక్షలు వెచ్చించి వాహనాన్ని కొన్నారు. కొన్నదే తడవుగా దానిని హైదరాబాద్ తీసుకెళ్లి తనకు నచ్చినట్టు మార్చుకున్నారు. హ్యాండిల్, లైట్లు, అద్దాలు, కిక్రాడ్, ఇంజిన్, సైలెన్సర్ ఇలా ప్రతిదానినీ తన మనసుకు నచ్చినట్టు తీర్చిదిద్దారు. రిమోట్‌తో స్టార్ట్ అయ్యేలా మెరుగులు దిద్దారు. దీనికి రూ.1.30లక్షలు ఖర్చుచేశారు. ఇప్పుడు ఈ బైక్‌పై భీమవరంలో హల్చల్ చేస్తున్న కృష్ణను చూసి అందరూ కిట్టూ.. రాయల్ అంటూ పిలుస్తున్నారు. - భీమవరం(ప్రకాశం చౌక్) -
బాలీవుడ్ గాలాకు ప్రిన్స్ విలియం దంపతులు
లండన్: బ్రిటిష్ రాయల్ జంట త్వరలో భారత్ లో పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబై లో నిర్వహించనున్న బాలీవుడ్ గాలా తిలకించేందుకు ప్రత్యేక అతిథులుగా వారు హాజరుకానున్నారు. సినీస్టార్ల ఉత్సవానికి హాజరైన సందర్భంలో వారం రోజులపాటు ఇండియాలో గడపనున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటులతో ఓ చల్లని సాయంత్రాన్ని ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఆస్వాదించనున్నారు. వీధిబాలల సహాయార్థం నిధులను సమకూర్చే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముంబైలోని ఓ హోటల్ లో ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో ఉగ్రవాదులు దాడి చేసిన హోటలే.. ప్రస్తుతం రాజదంపతులకు ఆవాసం కల్పించనుంది. బాలీవుడ్ కార్యక్రమానికి హాజరయ్యే రాయల్ కపుల్.. వారం రోజుల భారత్ , భూటాన్ సందర్శనలో భాగంగా ముంబై మురికి వాడల్లోని పిల్లలను పలుకరించనున్నారు. అనంతరం ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను సందర్శిస్తారు. -
మళ్లీ మళ్లీ మల్లీశ్యరి
రాయలవారి ముందు... ‘నా ప్రాణం తీసుకోండి... బావని వదిలేయండి’ ‘లేదూ నా ప్రాణం తీసుకోండి, మల్లిని వదిలేయండి’ అని ప్రాధేయపడుతుంటే మన గుండె తరుక్కుపోతుంది. ‘నా ప్రాణం తీసుకోండి’ అని ఇద్దరూ అంటున్నారంటే... నిజానికి ఒకరి ప్రాణం ఒకరిలో ఉందని. ఈ ప్రమాదం జరుగుతుందని ప్రేక్షకుడిగా మనకి ముందే అనిపిస్తుంది. అప్పుడే అనుకుంటాం... ‘అయ్యో తప్పు చేస్తున్నావు... నీ మల్లికి కావాల్సింది రాణివాసం కాదు... నీ హృదయ సామ్రాజ్యానికి రాణి అవడం’ అని అరిచి చెప్పాలని! ఈ సినిమా మనకి చెప్పే గొప్ప గుణపాఠమే అది. గమ్మత్తు కోసమైనా... పరాచికాలాడకూడదని. భానుమతికి పల్లకి పంపించమని ఎన్టీఆర్ పరాచికం ఆడితేనే... ఈ అరాచకం జరిగింది. అంత అందంగా ప్రేమించుకునే చిలకాగోరింకలు ఒంటరులై, ఎవరికి వారై, తెలిసీతెలియక కోరితెచ్చుకున్న ఎడబాటుతో కుమిలిపోయారు. గుండెను పిండే అందమైన ప్రేమకథ. ఎన్టీవోడు, భానుమతి ఇంకా అందంగా ఉంటారు. పాటలు మీగడతరకల్లా... మాటలు తేనెల ఊటల్లా... సన్నివేశాలు కవ్వించి, నవ్వించి, ఏడిపించేలా... మళ్లీ... మళ్లీ... మల్లీశ్వరిలా.... మళ్లీ చూడండి ‘‘ఏక చక్రీ మహాభోగీ! మహారాణివౌతావు. మహాభోగం పొందుతావు తల్లీ. బ్రహ్మ మాటకైనా తిరుగుంది కానీ ఈ బసవయ్య మాటకు తిరుగులేదు తల్లీ! జై శంకర మహాదేవ్’’ భానుమతి చెయ్యి చూసి ఫ్యూచర్ చెప్పాడు తిరణాల జోస్యుడు. టీన్స్‌లో ఉన్న ప్రతి పిల్లా క్వీనే కానీ... జోతిష్యుడు చెప్పాడని మహారాణి అయి కూర్చుంటుందా? ‘‘వెళ్దాం పద’’ అన్నాడు ఆ పిల్ల బావ ఎన్టీఆర్. ‘‘బావా! నీ చెయ్యి కూడా చూపించు’’ అంది భానుమతి. ‘‘ఆ.. నా చెయ్యి ఎందుకూ - నువ్వు మహారాణివైతే, నేను మహారాజునైనట్టే’’. భానుమతి బిడియంతో ముడుచుకుంది. చిరునవ్వు నవ్వింది. బావంటే భానుమతికి ప్రాణం. ఎన్టీఆర్‌కీ అంతే. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. ఒక్కరోజైనా ఇద్దరూ చూసుకోకుండా, మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఉండలేదు. ఆ రోజూ అంతే. బావామరదళ్లిద్దరూ కలిసి ఎడ్లబండిలో తిరణాలకని వీరాపురం నుండి వచ్చారు. వీరాపురం... వెరీ నియర్ టు విజయనగరం. తిరిగి వెళ్లే సమయానికి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి! ఈ పడుచు జంటపై పన్నీటి జల్లులు కురవబోతున్నాయా? వారి ప్రేమను కన్నీటి జడులు ముంచెత్తబోతున్నాయా? ఆ మేఘాలు దేనికి సంకేతం? పైన ఉరుముతోంది. పాడుబడిన సత్రంలోకి పరుగెత్తారు ఎన్టీఆర్, భానుమతి. వాన మొదలైంది. అది ఆగేవరకు వీళ్లూ ఆగాలి. వేరే దారి లేదు. వాతావరణం చల్లగా ఉంది. భానుమతి మనసు పులకించింది. ఆడింది. ‘పిలిచిన బిగువటరా ఔరౌరా...’ అని పాడింది. రాజా అంటే నాగరాజు. మన ఎన్టీఆర్. వీళ్లిక్కడికి ఎలాగైతే వర్షానికి తలదాచుకోవాలని వచ్చారో... అలాగే మరో ఇద్దరు అక్కడి చేరుకున్నారు. భానుమతి నాట్యాన్ని, పాటనీ... చూసీ, వినీ ఆ ఇద్దరూ పులకించి పోయారు. వాళ్లల్లో ఒకరు మారువేషంలో ఉన్న విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొకరు ఆయన ఆస్థాన పండితుడు. హోరు ఎంతకూ తగ్గడం లేదు. వాళ్లూ వీళ్లూ మాటలు కలుపుకున్నారు. ఊర్లూ పేర్లూ చెప్పుకున్నారు. ‘‘ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు... మల్లీశ్వరి’’ అని చెప్పాడు ఎన్టీఆర్. మల్లీశ్వరి అంటే మన భానుమతే. రాయలవారు వాత్సల్యంగా చూశారు. ‘‘అమ్మాయీ... ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో! మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం’ అని మెడలోంచి హారం తీసి ఇవ్వబోయాడు. ‘‘వద్దండీ’’ అంది భానుమతి వినయంగా. ‘‘అలా అనకూడదమ్మా. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. ఈ హారం మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలతో గౌరవింపదగింది. నువ్వు చెప్పు నాయనా’’ అన్నాడు పండితుడు ఎన్టీఆర్ వైపు చూస్తూ. తీసుకోమన్నాడు బావ. ఆభరణాన్ని అందుకుంది మరదలు. వాన హోరు తగ్గింది. భానుమతి మాటల జోరు మాత్రం తగ్గడంలేదు. తన ముందున్నది రాయలవారని తెలియక, తన ధోరణిలో తను ఏదో మాట్లాడుతూనే ఉంది. రాయల వారు నవ్వుతూ వింటున్నారు. మరదల్ని ఆటపట్టిద్దామని ఎన్టీఆర్ అన్నాడు - ‘‘ఈమె ఆటాపాట మెచ్చుకున్నారు కదా. ఒక ఉపకారం చేస్తారా?’’ అని. అడగమన్నాడు పండితుడు. ‘‘మరేం లేదులెండి, ఇందాక ఏదో సెలవిచ్చారే... మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలని! అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో, ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి... ఆ కాదులెండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకీ పంపేట్టు మాత్రం చూడండేం’’ అన్నాడు భానుమతిని ఏడిపించడానికి. రాయల వారు ముచ్చటగా నవ్వారు. అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ‘‘పో బావా నీతో మాట్లాడను. ఎందుకు చెప్పు... వాళ్లతో పల్లకి పంపమని చెప్పడం’’ అంది భానుమతి ఎన్టీఆర్ వైపు చిరుకోపంతో చూస్తూ. ఎన్టీఆర్ నవ్వాడు. ‘‘ఓస్ పిచ్చిపిల్లా! వీళ్లేనా పల్లకీలు, పట్టపుటేనుగులూ పంపేది! వీళ్లకసలు రాయలవారి దర్శనమే కాదు’’అని తేల్చేశాడు. కానీ తను చేసిందే పిచ్చి పని అని అప్పుడు అతడికి తెలీదు. ఎన్టీఆర్, భానుమతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ జంటను చూసి చెట్టూపుట్టా కూడా మురిసిపోతున్నాయి. కానీ భానుమతి తల్లే. ఆమెకు మాత్రం ఎన్టీఆర్‌ని చూస్తే చిర్రెత్తుకొచ్చేస్తోంది. శిల్పాలు చెక్కడం తప్ప వేరే పని చేతకాని అప్రయోజకుడికి పిల్లనిచ్చి చెయ్యడం ఆమెకు ఇష్టం లేదు. మేనల్లుడు ఉండగా వేరెవరికో ఇచ్చి చెయ్యడం భానుమతి తండ్రికి ఇష్టం లేదు. ఓ రోజు భానుమతి తల్లి ఎన్టీఆర్ తల్లిని పట్టుకుని కడిగేసింది. ‘‘నీ కొడుకు అప్రయోజకుడు. వాణ్ణి నా కూతురితో కలవన్వికు’ అని తిట్టేసింది. అది తెలిసి నాగరాజు పంతం పట్టాడు. నాగమ్మ (భానుమతి తల్లి) కోరినంత ధనం తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు పడేసి, తనూ ధనవంతుడినే అనిపించుకుని భానుమతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తన చేతిలో శిల్పకళ ఉంది. కష్టపడి పనిచేస్తే ఏ ఆస్థానంలోనైనా ఉద్యోగం రాకపోదని అతడి నమ్మకం. భానుమతి అడ్డుచెప్పినా వినకుండా, ‘నేను వచ్చేంత వరకు మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటావుగా’ అని మాట తీసుకుని మరీ వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. బావ కోసం ఎదురు చూస్తోంది భానుమతి. ఎంతకూ రాడు. ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావ ’ అని తన బాధను మేఘాలతో మొరపెట్టుకుంది. బావ రాలేదు. బంగారు పల్లకీ వచ్చింది! రాణీవాసం రమ్మంది. భానుమతికి తల తిరిగిపోయింది. భానుమతి తల్లి గాల్లో తేలిపోయింది. భానుమతి తండ్రి విచారంలో మునిగిపోయాడు. తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా, బావకు ఒక్కమాటైనా చెప్పే అవకాశం లేకుండా... పెద్దల ప్రోద్బలంతో రాణివాసానికి వెళ్లిపోయింది భానుమతి. డబ్బు సంపాదించుకొచ్చాడు ఎన్టీఆర్. మరదలు కనిపించలేదు! ‘‘మల్లమ్మని మర్చిపో తండ్రీ’’అని తల్లి నిట్టూర్చింది. విషయం చెప్పింది. మరదలు రాణివాసం వెళ్లిపోయిందని తెలిసి పిచ్చివాడయ్యాడు ఎన్టీఆర్. మళ్లీ ఊరొదిలి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో భానుమతిదీ ఇదే పరిస్థితి. అంతఃపురం వదిలి బయటికి రాలేదు. బావనే తలచుకుంటూ బంగారు పంజరంలో కృశించిపోతోంది. ఓరోజు - రాయలవారి ఆస్థాన శిల్పులు, రాళ్ల కోసం ఓ గుహలోకి వచ్చి, అక్కడ పిచ్చివాడిలా ఉన్న ఎన్టీఆర్‌నీ, అతడు చెక్కిన శిల్పాలను చూసి ఆశ్చర్యపోయారు. రాచనగరులో నిర్మిస్తున్న నర్తనశాలకు అవసరం అని చెప్పి, ఒప్పించి మరీ తీసుకెళ్లారు. అలా నర్తనశాల పనిలో పడ్డాడు ఎన్టీఆర్. కానీ బాధ నుండి బయటపడలేదు. ఒకనాడు అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడ్డానికి వచ్చారు. వారితో పాటు భానుమతీ వచ్చింది. ఆ శిల్పం ఈ శిల్పం చూస్తూ, అక్కడి శిల్పిగా పనిచేస్తున్న బావను చూసి ఆశ్చర్యపోయింది. అతడిని రహస్యంగా కలుసుకుని ‘బావా... బావా’ అని పరవశించిపోయింది. మరదల్ని చూడగానే ఎన్టీఆర్ కళ్లలోకి ఆనందం, అతడి కళకు ఒక పరిపూర్ణత వచ్చాయి. రెండోసారీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతీ రాజభటులకు దొరికి పోయింది. తర్వాతేమిటి? ఇంకేముంటుంది ఉరి! అపరాధానికి శిక్ష ఉరి. కానీ ఎవరు అపరాధి? బావా? మరదలా? లేక ఇద్దరూనా? ఆనాడు తను వేళాకోళంగా అన్న మాట వల్లనే తన మరదలికి రాణివాసం సంప్రాప్తించిందని రాయలవారి మాటల్లో గ్రహించాడు ఎన్టీఆర్. ‘‘అపరాధమంతా నాదే ప్రభూ... నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి’’ అని వేడుకున్నాడు. ‘‘ప్రభూ అపరాధమంతా నాదే’’ అంటూ ఏకధాటిగా రోదించింది భానుమతి. ‘‘కాదు, అపరాధమంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం’’ అన్నాడు రాయలవారు. ‘‘కాదు ప్రభూ. అపరాధమంతా నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరి తీయించి, నా బావను రక్షించండి’’ అంది భానుమతి తప్పును తన మీద వేసుకుని. ‘‘సార్వభౌముల వారికి గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మసూక్ష్మం ఎలా విడదీస్తారో’’ అన్నాడు పండితుడు. రాయలవారు చిరునవ్వుతో చూశారు. ‘‘ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించిన నాగరాజునీ ఇద్దర్నీ క్షమించేస్తున్నాం అని తీర్పు ఇచ్చారు కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ దేవరాయలు. అందరి ముఖాలూ వికసించాయి. బావా మరదళ్ల గురించి చెప్పాలా? కథ... సుఖాంతం. హిట్ సాంగ్స్ - కోతీబావకు పెళ్లంట కోవెల తోట విడిదంట - పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి - పిలిచిన బిగువటరా ఔరౌర - ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు - ఔనా నిజమేనా మమతలన్ని కలలేనా? - మనసున మల్లెల మాలలూగెనె వివరాలు-విశేషాలు - వాహినీ స్టూడియోస్ బ్యానర్ 1951 డిసెంబర్ 20న విడుదలైంది. దర్శకత్వం, నిర్మాణం బి.ఎన్.రెడ్డి. - కథాకాలం 13వ శతాబ్దం. పాటలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం : సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు. నేపథ్యగానం : ఘంటసాల, భానుమతి, మాధవపెద్ది సత్యం, శకుంతల. సంభాషణలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు. - మల్లీశ్వరి తీయాలని బి.ఎన్.రెడ్డి 1939లో అనుకుంటే, పదేళ్లకు గానీ ఆయన ఆలోచన రూపుదాల్చలేదు! - మొదట మల్లీశ్వరి పాత్రకు ఒక కొత్త అమ్మాయిని అనుకున్నారు. కానీ మల్లీశ్వరి వంటి విలక్షణమైన పాత్రకు అనుభవం ఉన్న వారైతే బాగుంటుందని భానుమతిని తీసుకున్నారు. - కళా దర్శకుడు ఎ.కె.శేఖర్ పెన్సిల్ స్కెచ్ వేస్తే వాటిని చూసి సెట్స్ తయారు చేశారు. అలా మల్లీశ్వరికి కావలసిన సెట్లన్నిటికీ ఆయన స్కెచ్‌లు గీసిచ్చారు.