![Kiran Royal Janasena Threatens Woman](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Kiran-Royal.jpg.webp?itok=nIzaEIy4)
తనపై వీడియో విడుదల చేసిన మహిళకు కిరణ్‌రాయల్ బెదిరింపు
నీ పిల్లల కాళ్లు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన బాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరెంతో మంది కిరణ్‌రాయల్ బాధితులు బయటకొస్తారు మీడియాతో బాధితురాలు లక్ష్మి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది.
తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిరణ్‌రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.
పత్రికలో రాయలేని భాషలో ఆ మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్‌ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్‌రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్‌కళ్యాణ్ న్యాయం చేయాలి: బాధితురాలు
ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్‌కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని చెప్పారు. కాగా, కిరణ్‌రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్‌రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు.
కామాంధుడిని కఠినంగా శిక్షించాలి..
ఇదిలా ఉండగా.. కామాంధుడు కిరణ్‌రాయల్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతాయాదవ్, మధుబాల, విజయరాయల్, దుర్గా, రాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షుణ్ణంగా పరిశీలించండి : పవన్‌కళ్యాణ్
గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్‌రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించారు. అతని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్‌రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/5_61.png)
కిరణ్‌రాయల్‌పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదు
అయినా పట్టించుకోని పోలీసులు
తిరుపతి క్రైం: కిరణ్‌రాయల్‌పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్ష్మి భర్త బృందకుమార్‌రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్‌రెడ్డికి కిరణ్‌రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు.
నా వెనుక పవన్‌కళ్యాణ్ ఉన్నాడు..
‘నా ఆరి్థక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లలను చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారు నగలను, డబ్బులను తిరిగి ఇచ్చేస్తా..’ అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్‌రాయల్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం రూ.పదకొండు లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రూ.కోటీ ముప్పై రెండు లక్షలు, 300 గ్రాముల బంగారు నగలను తీసుకుని.. ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే ‘నిన్ను, నీ బిడ్డలను నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా’ అంటూ బెదిరించే వాడని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెనుక పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద వాళ్లున్నారని బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని ఆధారాలనూ సైతం పోలీసులకు అందించారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment