![Tirupati Lakshmi Sensational Allegations Over Kiran Royal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Kiran-Royal.jpg.webp?itok=YFPlGcrx)
సాక్షి, తిరుపతి: జనసేన నాయకుడు కిరణ్ రాయల్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు లక్ష్మీ. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అమ్ముకుని బ్రతికే వ్యక్తి కిరణ్ అని చెప్పారు. అలాగే, శ్రీవారి వస్త్రం అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. ఇదే సమయంలో అమ్మాయిలను మోసం చేసి విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి కిరణ్ రాయల్ అని ఆరోపించారు. ఆయన కుటుంబానికి కావాల్సింది డబ్బులు మాత్రమేనని వెల్లడించారు.
జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీ శనివారం తిరుపతితో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మీ.. ‘కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు. అంత లగ్జరీ జీవితం ఎలా గడుపుతున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి.. ఇంత డబ్బు ఎక్కడిది?. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని బ్రతుకుతున్నాడు. తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేసే దుర్మార్గుడు. కిరణ్ రాయల్‌కు చెన్నైలోని నల్లి సిల్క్స్‌తో ఏం సంబంధం ఉంది?. తాను మోసం చేసే ప్రతీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లి వారితో ఖరీదైన చీరలను కొనుగోలు చేయిస్తాడు. వేలు ఖర్చు చేయించి మరీ చీరలు కొంటాడు. నల్లి సిల్క్స్‌లో ఏం జరుగుతుందో నేను చెప్పను. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
ఇక, తిరుమలలో శ్రీవారికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే వస్త్రం అది. ఒక టికెట్ ద్వారా అది ఇస్తారంటా. అక్కడ కొన్ని చీరలను ఇంటికి తీసుకువచ్చి పసుపు, కుంకుమ చల్లి.. రాత్రి వాళ్ల ఇంట్లోనే ఉంచి.. దేవుడి చీరలని అమ్ముకుంటాడు. శ్రీవారి వస్త్రం టికెట్ అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు. వస్త్రం, చీరల బాధితులు కూడా ఉన్నారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఏడు కొండల స్వామిని కూడా మోసం చేస్తున్న వ్యక్తి కిరణ్. ఇలా మోసం చేసి సంపాదించడమే కిరణ్ రాయల్‌కు తెలుసు. ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసి.. అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు.. బెదిరిస్తాడు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇవ్వన్నీ అతడి భార్యకు, కుంటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ, వారికి కావాల్సిందే డబ్బు మాత్రమే. అందుకే కిరణ్‌కు వారి సపోర్టు ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/dsfdsds.jpg)
ఇది కూడా చదవండి: కిరణ్ రాయల్ పరమ నీచుడు.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు: లక్ష్మీ
Comments
Please login to add a commentAdd a comment