![Pawan Kalyan Really Surrendered To Kiran Royal Black Mail](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Kiran_Royal_Pawan_Videos.jpg.webp?itok=kjii29x8)
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్‌చుప్‌గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .
పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు.
.. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment