black mail
-
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!
పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్ చేశాడా ఘనుడు.ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్ షోరూంలో ఐఫోన్ కొనిచ్చింది. ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పేయండి.This nithalla boy stopped eating food and was demanding iPhone from her mother.His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.Too much love will always destroy children. Parents should know where to draw the line.This is… pic.twitter.com/govTiTKRAF— Incognito (@Incognito_qfs) August 18, 2024 -
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్‌తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్‌డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
ఫోన్లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు వేధింపులు..
మహబూబ్‌నగర్: ఓ యాప్‌ను ఉపయోగించి సెల్ నంబర్ కనిపించకుండా ఎవరికై నా ఫోన్ చేసే అవకాశం ఉంది. ఆ యాప్‌ను ఉపయోగించి ఉద్యోగినిని తరుచుగా ఫోన్లో వేధిస్తున్న యువకుడిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని మద్యం డిపోలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తన ఫోన్‌కు ఓ గుర్తు తెలియని ఫోన్ నంబర్‌తో ఓ వ్యక్తి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన ప్రతి సారీ విదేశాల మాదిరిగా కొత్త నంబర్ రావడంతో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియని పరిస్థితి. 5 నెలలుగా ఫోన్లో వేధింపులు భరించిన యువతి అపరిచిత వ్యక్తిని ఎలా గుర్తించాలో తెలియని సంకటస్థితిలో మానసిక వేదనకు గురైంది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్న విషయం ఫోన్లో వివరిస్తుండడంతో ఆశ్చర్యం, అయోమయం ఏర్పడింది. అసభ్యంగా మాట్లాడడంతో పాటు తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఈ విషయాన్ని ఆమె భర్తకు వివరించింది. ఓ సారి భర్త కూడా ఫోన్ వచ్చిన సమయంలో అతనితో మాట్లాడినా అతనిలో మార్పు రాలేదు. ఫోన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం డిపోలో పనిచేస్తున్న కూలీలను, ఉద్యోగులను అనుమానించినా గుర్తించే పరిస్థితి లేకపోయింది. చివరకు సదరు వ్యక్తికి అనుమానం రాకుండా తాను కూడా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది. పెళ్లి చేసుకుందామని నమ్మించి అతనిని గుర్తించి ఒక్కసారిగా అవాక్కైంది. ఇన్నాళ్లు తనను ఫోన్లో వేధించిన వ్యక్తి తాను పనిచేసే మద్యం డిపోలో హమాలీ నాగరాజుగా గుర్తించడంతో వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి తిమ్మాజీపేటకు బదిలీ చేశామని సీఐ తెలిపారు. -
ఇన్‌స్టాలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. చివరికి బాలిక తల్లిదండ్రులు వెళ్లి
తిరువొత్తియూరు(చెన్నై): ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఓ బాలిక వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్ ఆలయం వీధికి చెందిన సతీష్ కుమార్ (21)కు తేని జిల్లాకు చెందిన బాలిక (17)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఊలందూరుపేటకు రమ్మని పిలిచాడు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి తిరిగినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మే 5వ తేదీ ఊలందూరుపేటకు వెళ్లి సతీష్ కుమార్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలిక బంధువులతో మాట్లాడిన సతీష్ కుమార్ రూ.70 వేలు ఇవ్వాలని.. లేకపోతే వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తానని బెదిరించాడు. దీనిపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు పెరియకులం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ కుమార్‌ను గురువారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి కారు పార్కింగ్ వివాదం.. కర్రతో చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు.. -
షాకింగ్: నటి బ్లాక్మెయిల్.. భరించలేక సూసైడ్ యత్నం
డబ్బు కోసం తమపై ఓ ఎయిర్‌హోస్టెస్ కమ్ నటి వేధింపులకు పాల్పడటాన్ని భరించలేక.. ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ పోర్న్ స్టార్ తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బద్నాం చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్ అనే వ్యక్తి(ఆ వీడియోలో ఉంది) ఆరోపించాడు. ఈ మేరకు తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు. నా పేరు అషి ఖాన్, ఉజ్జయినిలోని లోహె పుల్లో ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్జిమ్ అనే పోర్న్‌స్టార్ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్ ఇచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిపిస్తోంది. ఏం చేయాలో తెలియక.. నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్ అందులో పేర్కొన్నాడు. బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం. ఇక నిందితురాలు రిమ్జిమ్ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్ యాప్ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బు గుంజుతోందని తెలుస్తోంది. ఘటన జరిగాక.. బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
వాట్సాప్‌లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మంగేష్‌కుమార్‌కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ న్యూడ్ కాల్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్ వచ్చింది. మొదట వాట్సాప్‌లో హాయ్.. హయమ్ శివాని అంటూ చాటింగ్ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరో అని లిఫ్ట్ చేస్తే న్యూడ్‌కాల్ రావడంతో వెంటనే ఆయన కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు. చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్ హత్యకు ప్రతీకారంగానే?) -
తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...
మైసూరు: మహిళ స్నానం చేస్తుండగా చాటుగా వీడియోలు తీసి తద్వారా బెదిరింపులకు పాల్పడతున్న తండ్రీ కొడుకుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెబ్బాలలో సదరు మహిళ ఇంటి పక్కన ఉండే ప్రమోద్, అతని తండ్రి గోవిందరాజు నిందితులు. బాధితురాలి భర్త పనికి వెళ్ళిన సమయంలో ఇంటి ముందు బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో తండ్రీ కొడుకు కలిసి గుట్టుగా మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. దానిని ఆమె మొబైల్‌ఫోన్‌కు పంపి లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో బాధితురాలు, ఆమె భర్త హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
ఫోన్ నెంబర్ ఇచ్చింది.. ఇంటికి రమ్మంది!
అందంగా ఉంది. పైగా చనువుగా మాట్లాడుతోంది. ఇంకేం.. అనుకున్న ఆ యువకుడు ఫోన్ నెంబర్ అడిగాడు. నెంబర్ ఇవ్వడమే కాదు.. రొమాంటిక్ మెసేజ్‌లతో మత్తులో ముంచెత్తిన ఆమె, ఓ రోజు అతగాడిని ఇంటికి ఆహ్వానించింది. గాల్లో తేలుతూ వెళ్లిన ఆ యువకుడికి షాక్ తగలగడమే కాదు.. పైప్రాణాలు పైనేపోయినంత పని అయ్యింది. కేరళ తిరువనంతపురం అదిమలతురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న బాధితుడు.. ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. ఓ అమ్మాయి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేది. ఆ పరిచయంతో నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఆ ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్‌తో గడిపారు. ఈ క్రమంలో.. ఓరోజు అతన్ని ఇంటికి ఆహ్వానించింది ఆమె. తీరా ఆమె బెడ్రూమ్ దాకా వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆమె భర్త ఆ కుర్రాడిని కట్టిపడేశాడు. అంతేకాదు.. ఆమెలా వాట్సాప్‌లో ఛాటింగ్ చేసింది కూడా ఆ భర్తే అని తెలిసి సదరు యువకుడు కంగుతిన్నాడు. విషయం అర్థమయ్యే సరికి తనని వదిలిపెట్టాలని బతిమాలాడాడు ఆ కుర్రాడు. చివరకు.. లక్ష రూపాయల డబ్బు, అతని కారు ఇస్తే వదిలేస్తామని.. ఆఫర్ ఇచ్చాడు ఆమె భర్త. అయితే తన దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయని, మిగతా డబ్బు కోసం కజకుట్టమ్‌లో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్లాలని కోరాడు ఆ కుర్రాడు. ఆ వ్యక్తి, అతని స్నేహితురాలు సోని(18), మరో వ్యక్తి.. ఆ కుర్రాడి కారులో బయలుదేరారు. తీరా విలింజమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు చేరుకోగానే.. సడన్ బ్రేక్ వేసి నేరుగా పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు బాధితుడు. పోలీసులకు తన గోడు వెల్లబోసుకోగా.. సిబ్బంది బయటకు వచ్చేలోపు నిందితులంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...
సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య) -
ఆమె అందంతో మిస్టర్ పర్ఫెక్ట్కే వలేసింది.. ఐదేళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత..
జైపూర్: ఆమె అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుంది. చివరకు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ విన్నర్ కూడా ఆమె చేతికి చిక్కి ఇబ్బందులకు గురయ్యాడు. అతడిని హనీ ట్రాప్ చేసిన సదరు యువతి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ ఉందతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన రాధ.. కొన్నేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివాసం ఉంటోంది. తనకు పెళ్లి అయిన్పప్పటికీ భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, జైపూర్‌లో రాధ.. కొద్ది రోజులు బ్యూటీ పార్లర్ నిర్వహించింది. అనంతరం జైపూర్ మెట్రో పనిచేస్తుండగా.. ఆరేళ్ల క్రితం ఆమె స్నేహితురాలి ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరూ డీప్ లవ్‌లో మునిగిపోయి దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రాధ ఆ యువకుడికి దూరమైంది. ఈ క్రమంలో సదరు యువకుడు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో యువకుడికి వివాహం కూడా జరిగింది. మరోవైపు రాధ.. ఓ డ్యాన్స్ గ్రూప్‌లో చేరి అస్సాం వెళ్లింది. సదరు యువకుడిని విడిచిపెట్టి ఆమె మరికొంత మంది యువకులతో కలిసి జీవించడం ప్రారంభించింది. కాగా, గతేడాది మే నెలలో రాధ మళ్లీ జైపూర్‌కు చేరుకుంది. తన ప్రియుడికి(మిస్టర్ రాజస్థాన్) వివాహం జరిగిందన్న విషయం తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తమ సంబంధం గురించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి కొద్ది నెలలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాధ అతడిని రూ. 20 లక్షలు డిమాండ్ చేయగా.. తన వద్ద లేవని చెప్పడంతో.. రాధ ఆ వ్యక్తిని అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులు భరించలేక అతను పోలీసులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం.. సదరు వ్యక్తి ఓ హోటల్లో బ్లాక్ మెయిలర్ రాధకు రూ.50 వేల నగదు, మూడు చెక్కులను ఇస్తుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రాధను సంజయ్ సర్కిల్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
అలాంటి వీడియో కాల్స్‌తో జాగ్రత్త!
వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో తెలియని ఏదో అకౌంట్ నుంచి వీడియో కాల్స్ వస్తుంటాయి. లిఫ్ట్ చేయగానే.. షాక్. అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. కాసేపటికి అన్నోన్ నెంబర్ లేదంటే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్ కాల్స్ లేదంటే మెసేజ్‌లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్ చేస్తూ.. ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వ్యవహారాలను కొందరు లైట్ తీస్కుంటే.. చాలామంది భయంతో కంగారులో ఏం చేయాలో పాలుపోక వణికిపోతారు. సదరు అకౌంట్లను బ్లాక్ చేయడమో లేదంటే యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడమో చేస్తుంటారు. అయినా బెదిరింపులు ఆగిపోతాయనుకోవడం పొరపాటే!. చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు.. దేశంలో ఆన్లైన్ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే సైబర్ నేరాల్లో భారత్ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్టార్షన్’ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం మేవాత్ (హర్యానా), భరత్పూర్ (రాజస్థాన్) నుంచి 36 బ్యాచ్‌లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి ఆపై వాటిని బూచిగా చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయి ఈ ముఠాలు. నిజానికి సెక్స్టార్షన్.. నేరాలు కొత్తేం కాదు. కాకపోతే లాక్డౌన్ నుంచి ఈ తరహా నేరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని లక్క్ష్యంగా, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు ఈమధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మీకు తెలుసా?.. డిలీటైన వాట్సాప్ డేటాను సింపుల్‌గా ఇలా బ్యాకప్ చేయొచ్చు ఏం చేయాలంటే.. సెక్స్టార్షన్లు చాలా సీరియస్ నేరాలు. ఫేస్బుక్ మెసేంజర్లోగానీ, వాట్సాప్లోగానీ, ఇతర ఏ యాప్‌లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కంగారులో లిఫ్ట్ చేసినా కెమెరాను కవర్ చేయాలి. కాల్స్ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలి. బ్లాక్‌మెయిలింగ్ కాల్స్, మెసేజ్‌లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..
బనశంకరి: స్మార్ట్ ఫోన్ వినియోగదారులనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్, లోకాంటో వెబ్ లింక్‌లు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట మొబైల్ ఫోన్‌కు మోసపూరిత వెబ్సైట్ లింక్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు. లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్‌పై క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే చాలు.. వీడియో కాల్లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, ఫోన్‌నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్‌చేస్తామని, వాట్సప్‌కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్‌కు, వెబ్ లింక్‌లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. -
వీళ్లు మామూలు లేడీలు కాదు.. పెద్ద కేడీలు
జగిత్యాల: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు మహిళలు ప్రముఖులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫొన్లలో పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా మెదులుతూ ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాయలేడీ ముఠాల బ్లాక్‌మెయిల్స్‌కు బెదిరిన పలువురు ప్రముఖులు, డబ్బున్న యువకులు పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ముఠాల బాగోతం జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి. వరుసగా ఇదే తరహా ఘటనలు ► జిల్లాలోని ధర్మపురికి చెందిన జమున అనే మహిళ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగుచూసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పరిచయం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెదులుతూ వారిని రహస్య ప్రాంతాలకు రప్పించేది. అక్కడికొచ్చాక ఆ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులతో బెదిరించి వారి వద్ద గల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకున్నారు. ► జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన కూకట్ రాజ్‌కుమార్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తిలక్, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కోలపాక దినేశ్, ధర్మపురి పట్టణం మామిడివాడకు చెందిన మామిడి జమునతోపాటు రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో కలిసి గత అక్టోబర్ నుంచి జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు డబ్బు ఉన్న వ్యక్తులను పరిచయం చేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో సదరు ముగ్గురు వీడియోలు చిత్రీకరించే వారు. వీటిని సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు దోపిడీకి పాల్పడ్డారు. ► డిసెంబర్ 22న జగిత్యాల విద్యానగర్‌కు చెందిన ఒకరిని ఓ మహిళ మేడిపల్లి మండలం వల్లంపల్లికి పిలిపించి బెదిరింపులకు పాల్పడింది. నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ► సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన ఓ మహిళ ముఠాగా ఏర్పడి జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన ఒకరిని నాలుగు నెలల క్రితం పరిచయం చేసుకున్నారు. తన వద్ద పలువురు యువతులున్నారని, సన్నిహితంగా ఉంచేందుకు వారిని ఒప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి దశలవారీగా రూ.26 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించింది. ఈ డబ్బులను సుమారు రూ.18 లక్షలు బుగ్గారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లాయి. సదరు వ్యక్తి డబ్బుల కోసం మహిళను నిలదీయడంతో తనను, తన కూతురును వాడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజయం తెలియడంతో వారే అవాక్కయ్యారు. ► ఇదే మహిళ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఒకరిని, కోరుట్లకు చెందిన వ్యక్తిని, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. సదరు మహిళపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటి జగిత్యాల ఇన్చార్జి ఎస్పీ కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిపై బుగ్గారం మండలానికి చెందిన రాజకీయ నాయకుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ► నాలుగు రోజుల క్రితం వేములవాడలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన మహిళ కుంట సుమిత అలియాస్ నందు అక్కడి పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ సైతం పలువురు యువతులు తన వద్ద ఉన్నారని, సెల్ఫోన్లో మాట్లాడిస్తూ వారితో సన్నిహిత్యం ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచే రూ.15 లక్షలు నరెండ్ల గంగారెడ్డి అనే వ్యక్తి ఖాతాలో వేయించి మోసానికి పాల్పడింది. వెలుగుచూడని నిజాలెన్నో.. జిల్లాలో ప్రముఖులు, డబ్బున్న వారిని ఈ కిలేడీ ముఠాలు పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ అందినంత డబ్బు వసూలు చేస్తున్నాయి. వీరి బారిన పడిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నప్పటికీ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరికొంత మంది మాత్రం డబ్బులు తీసుకుని పలువురు యువతులను వారి వద్దకు పంపి వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తెప్పించుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. పరువు పోతుందనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ( చదవండి: ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ) -
ఆ దారుణం వెనుక ముగ్గురు మహిళలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయటమే కాకుండా.. వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు కొందరు. పాల్వంచలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న పాల్వంచకు చెందిన ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వీరికి ముగ్గురు మహిళలు సహాయం చేశారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసిన కళావతి అనే మహిళ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయసాగింది. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి : కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది -
హోటల్ గదిలో అత్యాచారం.. వీడియో తీసి..
భోపాల్ : మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్ మేనేజర్ దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనంతా వీడియో తీశాడు. ( దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..) ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. -
25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!
భోపాల్: లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపట్ల ఓ మహిళ అపర కాళికలా మారింది. అతనిపై తిరబడి కత్తితో 25 పోట్లు పొడిచింది. నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో గత సోమవారం జరిగింది. మృతున్ని బ్రిజ్‌భూషన్ శర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అశోక్ నగర్లో నివాసముండే శర్మ తనపై గత 15 ఏళ్లుగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శర్మ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దాంతోపాటు ఆ వీడియోలు తీసి ఇన్నేళ్లుగా బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. (చదవండి: ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం) పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకున్నా విడిచిపెట్టలేదని వాపోయింది. ఆనాటి వీడియోతో నిత్యం వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు కూడా అతని తీరు మారలేదని తెలిపింది. పని నిమిత్తం తన భర్త బయట వెళ్లాడని, అదే సమయంలో తప్పతాగి వచ్చిన శర్మ తనపై అఘాయిత్యానికి పూనుకున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశానని వెల్లడించింది. ఆ కామాంధుడి వల్ల తన జీవితం నాశనమైందని, తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, నిందితురాలిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు. (చదవండి: కన్నేసి... కాటేసి..) -
శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’
అమీర్‌పేట(హైదరాబాద్): టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రావణి ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్మెంట్లో శ్రావణి కుటుంబం ఉంటోంది. టిక్ టాక్ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అలియాస్ సన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దేవరాజ్ వారి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్‌కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్‌కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్‌రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో యువతిని మోసం చేయడంతో.. శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్‌రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. శ్రావణి వద్ద నుండి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్.. ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. రెండు రోజుల అనంతరం ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తరువాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్‌రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్ 22న ఎస్ఆర్నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్‌ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. నాకేం సంబంధం లేదు.. తన కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్‌రెడ్డి దీనిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, కుటుంబ సభ్యులు కొట్టారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. డబ్బుల కోసం తానేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ అన్నాడు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని తెలిపాడు. దేవరాజ్వల్లే..: సాయి ఇదిలా ఉండగా.. దేవరాజ్‌రెడ్డి శ్రావణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపించాడు. శ్రావణి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి సమాచారం రాగానే వెంటనే వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తానే ఆసుపత్రికి తీసుకువెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రావణిని దేవరాజ్‌రెడ్డి ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడినట్టు చెబుతు న్న ఆడియోను విడుదల చేశాడు. ప్రతి పండుగకు గొల్లప్రోలుకు వచ్చేది.. పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదా వరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన టీవీ సీరి యల్ నటి శ్రావణి ఆత్మహత్యతో ఆమె కు టుంబంలో విషాదం నెలకొంది. తమ తం డ్రి కొండపల్లి భాస్కరావు వ్యవసాయ కూలీ అని, చిన్ననాటి నుంచి సెలబ్రిటీగా ఎదగా లని శ్రావణి తపన పడేదని మృతురాలి అక్క విమల తెలిపారు. మృతురాలికి విమ ల, మహేశ్వరి అనే ఇద్దరు అక్కలు, శివ అనే సోదరుడు ఉన్నారు. తమ చెల్లి శ్రావణి ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లి తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం సంపాదించిందని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని విమల తెలిపారు. సీరియల్స్‌లోనే కాకుండా ఆర్ఎక్స్ 100తోపాటు 30 సినిమాల్లో కూడా శ్రావణి నటించిందని ఆమె వెల్లడించారు. ఇటీవలే గొల్లప్రోలులో శ్రావణి సొంతంగా ఇల్లు కొనుగోలు చేసిందని, మూడేళ్ల కిందట తమ తల్లిదండ్రులను గొల్లప్రోలు నుంచి హైదరాబాద్‌లో తన వద్దకు తీసుకువెళ్లడంతో అక్కడే ఉంటున్నారని విమల చెప్పారు. ప్రతి పండుగకు గొల్లప్రోలు వచ్చి తమతో ఆనందంగా గడిపి వెళ్లేదని, ఇటీవల వరలక్ష్మి వ్రతానికి కూడా వచ్చిందని.. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె విలపించారు. -
మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్ వీడియో లీక్
సూరత్ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్) నో చెప్పి, దూరం పెట్టిందని.. ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) -
నిజ జీవితంలోనూ విలనే !
యశవంతపుర : తనకు మత్తమందు ఇచ్చి అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నటుడు ధర్మపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని బేగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... పలు సినిమాలలో విలన్ క్యారెక్టర్లలో నటించిన ధర్మ నిజ జీవితంలో కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. మూడు నెలల క్రితం ధర్మ తన కారు డ్రైవర్ నవీన్ ద్వారా ఓ ఒక మహిళను పిలిపించుకున్నాడు. ఆ రోజు షూటింగ్ రద్దు చేసినట్లు చెప్పి హోటల్ గదికి సదరు మహిళను తీసుకెళ్లాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆ మహిళకు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోవటంతో ఆమెను వివస్త్రను చేసి అశ్లీల వీడియో తీశాడు. అనంతరం ధర్మ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే నీ భర్తకు ఈ వీడియోను పంపుతానని చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 14 లక్షల దాకా వసూలు చేశాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె గతనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నటుడు ధర్మను అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని సదరు బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాల్క సుమన్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్‌లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్‌పై దాడికి యత్నించారు. ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు: బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్ ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన -
ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై రెండు రోజులుగా వైరల్ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్‌ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్ సునీల్ పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. -
ఎంపీ బాల్కసుమన్‌పై లైంగిక ఆరోపణలు అవాస్తవం
-
డబ్బులిస్తావా.. వీడియో నీ భర్తకు పంపమంటావా..?
బంజారాహిల్స్ : వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్షుక్నగర్ పీ అండ్ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా, మరోసారి అడిగితే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. అంతేగాక మరింత డబ్బు కావాలంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో వీడియోలను నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎన్బీ స్కాం: గోకుల్‌నాథ్ సంచలన విషయాలు
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో కీలక వివరాలను ఈడీ సాధించింది. విచారణలో పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి సంచలన విషయాలను వెల్లడించాడు. బ్యాంకు జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకే తానే ఎల్వోయూల (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్ మెయిల్ చేశారని ఈడీ విచారణలో అంగీకరించాడు. అయితే ఇందుకు తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని వివరించాడు. 2010లో నీరవ్‌మోదీకి మోడీకి మొట్టమొదటి ఎల్‌వోయూను జారీ చేసినట్టుగా గోకుల్‌నాథ్ శెట్టి ఈడీ ముందు ఒప్పుకున్నాడు. దీంతో మొదటి దుర్వినియోగంపై ఇద్దరు వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడడంతో 2017 వరకు జారీ చేస్తూ వచ్చానని తెలిపాడు. ఇలా మొత్తం 13,700 కోట్ల రూపాయల విలువైన ఎల్వోయూలను జారీ చేశానని తెలిపాడు. అయితే 2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్బీ బ్రాడీహౌస్ బ్రాంచ్‌కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఈడీ అధికారులకు చెప్పాడు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి... తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదని పేర్కొన్నాడు. దీంతో విచారణలో శెట్టి తెలిపిన వివరాలపై ఈడీ మరితంగా ఆరా తీస్తోంది. కాగా ఇప్పటికే రాజీవ్ జిందాల్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీ స్కాంలో పీఎంఏల్‌ఏ చట్టం కింద మార్చి 3న, అదుపులోకి తీసుకున్న గోకుల్ నాథ్ శెట్టి జ్యుడీషియల్ కస్టడీ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీ గడువును కోరే అవకాశం ఉంది.