
బంజారాహిల్స్ : వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్‌షుక్‌నగర్ పీ అండ్ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా, మరోసారి అడిగితే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. అంతేగాక మరింత డబ్బు కావాలంటూ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో వీడియోలను నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment