నటుడు ధర్మ
యశవంతపుర : తనకు మత్తమందు ఇచ్చి అశ్లీల వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని నటుడు ధర్మపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని బేగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... పలు సినిమాలలో విలన్ క్యారెక్టర్లలో నటించిన ధర్మ నిజ జీవితంలో కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. మూడు నెలల క్రితం ధర్మ తన కారు డ్రైవర్ నవీన్ ద్వారా ఓ ఒక మహిళను పిలిపించుకున్నాడు. ఆ రోజు షూటింగ్ రద్దు చేసినట్లు చెప్పి హోటల్ గదికి సదరు మహిళను తీసుకెళ్లాడు.
అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆ మహిళకు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోవటంతో ఆమెను వివస్త్రను చేసి అశ్లీల వీడియో తీశాడు. అనంతరం ధర్మ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే నీ భర్తకు ఈ వీడియోను పంపుతానని చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 14 లక్షల దాకా వసూలు చేశాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె గతనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నటుడు ధర్మను అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని సదరు బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment