సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది.
భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్‌డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు.
డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్
చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది.
దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment