Sadist Husband
-
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్‌తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్‌డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
శాడిస్ట్ భర్త నిర్వాకం.. కట్టుకున్న భార్యనే
బనశంకరి(కర్ణాటక): కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి సైకో అవతారమెత్తాడో భర్త. భార్య ఫోటోను, ఆమె ఫోన్ నంబరును ఇంటర్నెట్లో పోస్ట్‌చేసి వ్యభిచారి అని రాసిన ఘరానా భర్త పై తూర్పు విభాగం మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందిరానగరకు చెందిన మహిళా టెక్కీ (25) చేసిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త జయశంకర్ కుమార్‌సింగ్ (29) ఈ నీచానికి పాల్పడ్డాడు. ఆంక్షలతో కట్టడి.. జయశంకర్ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజీనీర్గా పనిచేసేవాడు. మహిళా టెక్కీతో 2019 లో వివాహమైంది. ఇంటి ఖర్చులను ఆమే భరించేది. మీ పుట్టింటి వారితో మాట్లాడరాదని ఆమెను కట్టడి చేసేవాడు. తరచూ గొడవ పడి కొట్టడం, వేధించడం, ప్రశ్నిస్తే పొడిచి చంపుతానని బెదిరించడంతో ఆమెకు ప్రాణభయం ఏర్పడింది. దీంతో భర్త నుంచి దూరంగా ఉండాలని ఒక పీజీ హాస్టల్లో తలదాచుకుంది. అశ్లీల సందేశాలు.. కానీ సైకో భర్త ఆమెకు అశ్లీల మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపించి వేధించేవాడు. గతంలో హలసూరు పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఇకపై బుద్ధిగా ఉంటానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే ఈసారి ఆమె పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించి అందులో ఆమె మొబైల్ నెంబరు పెట్టి ఎస్కార్ట్స్ సర్వీస్ అని అప్లోడ్ చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు విపరీతంగా కాల్స్, అసభ్య సందేశాలు రావడం మొదలైంది. దీంతో ఆరా తీయగా భర్త పాడుపని గురించి తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
శాడిస్ట్ భర్త.. నెట్టింట్లో అమ్మకానికి భార్య
సాక్షి, చిత్తూరు : పుణ్యక్షేత్రం తిరుపతిలో శాడిస్టు భర్త వేధింపులు బయటపడ్డాయి. భార్య న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్న ఓ భర్త దుర్భుద్ది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా మార్చాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టీటీడీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట నిరోషాతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నాడు. అయినప్పటికీ మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు. అయితే అత్తవారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భార్యను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. (నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి) నిరోషా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కాల్ గాళ్ అనీ, గంటకు రూ.3 వేలు అంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా వేదిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. -
శాడిస్టు భర్తకు చెప్పులతో దేహశుద్ధి
కర్నూలు, డోన్: ఓ శాడిస్టుకు భార్యతో పాటు ఆమె తరఫు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం డోన్ పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. వివరాలిలా.. డోన్ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గత డిసెంబర్ 7న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌తో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసేవాడు. దీంతో వారం క్రితం ఆమె తన భర్తపై డోన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణకు పిలవడంతో అరవింద్ సోమవారం స్టేషన్ సమీపంలోకి రాగానే కావ్య, ఆమె తరఫు బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. చెప్పులతో కొడుతూ..కాళ్లతో తంతూ దేహశుద్ధి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని నియంత్రించడంతో అరవింద్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్టేషన్లోకి పరుగు తీశాడు. -
ఆడపిల్ల పుట్టిందని గంజిపోసిన భర్త
రాజేంద్రనగర్: ఆడపిల్లకు జన్మనిచ్చిందని మహిళపై శాడిస్టు భర్త వేడి గంజిపోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి ఎస్సై శ్రీధర్ తెలిపిన మేరకు.. తాండూరుకు చెందిన పి.చెన్నయ్య(33) బతుకుదెరువు కోసం భార్య శాంత(28)తో పీరంచెరువు ప్రాంతానికి వలస వచ్చాడు. ఇప్పటికే శాంత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. రెండవ కాన్పు సందర్భంగా ఆడపిల్ల పుట్టడంతో ఆ సమయంలో శాంతను తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగింది. ఆ సమయంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మందలించారు. శాంత ఈ నెల 20న మూడోకాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 23న శాంత ఇంటికి రాగా భర్త చెన్నయ్య ఆమెతో గొడవ పడి కొట్టాడు. అనంతరం వేడి గంజిని తీసి శాంతపై పోశాడు. దీంతో శాంత చాతి, కడుపు, నడుముపై గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శాడిస్ట్ భర్త చేతిలో భార్యకు చిత్రహింసలు
హైదరాబాద్ : షేక్‌పేటలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ప్రశాంత్, జ్ఞానజ్యోతి భార్యభర్తలు. అదనపుకట్నం కోసం భార్య జ్ఞానజ్యోతిని భర్త ప్రశాంత్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. జ్ఞానజ్యోతి కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి షేక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు జ్ఞానజ్యోతి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రశాంత్, అతని తల్లి, అన్నలపై జ్యోతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నేను మగాడినే.. కోర్టులో నిరూపిస్తా..
సాక్షి, చిత్తూరు: ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది..’ అంటూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఉపాధ్యాయుడు రాజేష్ పేర్కొన్నాడు. గంగాధరనెల్లూరుకు చెందిన శైలజను వివాహమాడిని ఉపాధ్యాయుడు రాజేష్‌కు మగతనం లేదని గుర్తించి చెప్పడంతో దాడి చేశాడనే ఆరోపణలపై పోలీసులు నిందితుడితో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజేష్, అతని తండ్రికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటానన్నాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు. గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. సంసార జీవితానికి పనికిరాడంటూ ఆరోపణలు చేయడంతో తొలిరాత్రి నాడే భార్యపై దాడిచేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. ఈ ఉదంతంతో తమ ఊరి అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని మోతరంగనపల్లి వాసులు అంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. పదేపదే పనికిరానివాడంటూ, శాడిస్టు మొగుడంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నిందలు వేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని కోరుతున్నారు. -
శైలజకు వైఎస్సార్ సీపీ మహిళా నేత పరామర్శ
చిత్తూరు ,తిరుపతి మంగళం : పెళ్లయిన మొదటి రోజే భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్‌ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, శైలజ అంగీకరిస్తే హైదరాబాద్‌లోని మాక్సివిజన్‌లో కళ్లకు అవసరమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శైలజకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
తొలిరాత్రే మృగమయ్యాడు
పెళ్లయిన తొలిరోజు రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. శాడిస్టు భర్త చేతిలో చిత్రహింసలకు గురైంది. నరకాన్ని చవి చూసింది. తీవ్ర గాయాలతో బయట పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగాధరనెల్లూరు: పెళ్లంటే పందిళ్లు..సందళ్లు.. తాళాలు..తలంబ్రాలు..అంటారు కవులు.. ఆ అమ్మాయి కూడా ఇలానే భావించింది. 24 గంటలు తిరగక మునుపే నరకం ఎలా ఉంటుం దో ప్రత్యక్షంగా చూసింది. తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే మర్నాడే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. గంగాధరనెల్లూరు మండలం పెద్ద దామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి వ్యవసాయం చేసుకుంటారు. ఆడబిడ్డను బాగా చదవాలని భావించారు. డిగ్రీతో సరిపెట్టకుండా కుమార్తె శైలజను ఎంబీఏ కూడా చదవుకోమని ప్రోత్సహించారు. ఈలోగా కుమార్తెకు ఓ టీచరు సంబంధం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. వి.కోట మండలంలో పనిచేసే టీచరు రాజేష్‌తో కుమార్తెకు పెళ్లి సంబంధం నిశ్చయం చేసుకున్నారు. ఇతనిది జీడీ నెల్లూరు మండలం మోతరంగనపల్లి. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రాజేష్‌తో శుక్రవారం ఉదయం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. అదే రోజు తొలిరాత్రి శైలజకు కాళరాత్రి ఎదురైంది. భర్త అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. దీంతో రాజేష్ మృగంలా మారిపోయాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా గాయపడింది శైలజ. తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను నిలువునా వంచించాడంటూ కుంగిపోయింది. నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గంగాధరనెల్లూరు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
తొలిరాత్రే ఆమెకు నరకం చూపించాడు..
సాక్షి, చిత్తూరు : మూడు ముళ్లు వేసి... 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. తొలిరాత్రే... ఆ వధువు చేదు అనుభవాన్ని చవిచూసింది. దెబ్బలకు తాళలేక నవవధువు చేసిన ఆర్తనాదాలకు భయపడిన తండ్రి... తలుపులు తీయాలన్నాడు. దీంతో... తలుపులు తీసి భర్త పరారయ్యాడు. లైట్లు వేసిన తండ్రికి.. కూతురు తీవ్రగాయాలతో పడి వున్న విషయాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. భర్త వికృత చేష్టలతో ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు, చిన్నదామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి కుమార్తె శైలజతో శుక్రవారం పెళ్లి జరిగింది. రాజేష్... వి.కోట మండలం ఆదినపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.... శైలజ ఎంబీయే సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం జీడీ నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్ట కళ్యాణమండపంలో వైభవంగా శైలజ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత... కాణిపాకం వెళ్లి నవదంపతులు దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దదామరగుంటలోని వధువు ఇంట శుక్రవారం మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త దెబ్బలు తట్టుకోలేక.. శైలజ కేకలు వేయటంతో ఆమె తండ్రి కంగారుపడిపోయాడు. గది తలుపులు తీయాలంటూ చెప్పాడు. దీంతో గది తలుపులు తీసిన భర్త రాజేష్.... శైలజ తండ్రిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పెళ్లి నిమిత్తం రూ. 20లక్షల వరకూ కట్నకానుకలు ముట్టజెప్పినట్టు తెలిసింది. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తొలిరాత్రే భార్యకు నరకం చూపించాడు..
-
శాడిస్టు భర్త నుంచి.. కాపాడిన కొరియర్ బోయ్
భర్తకు, ఆమెకు ఏం గొడవ జరిగిందో తెలియదు.. అతడు మాత్రం ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించినా.. జుట్టుపట్టుకుని ఈడ్చి లోపలకు లాక్కొచ్చి మళ్లీ చిత్రహింసలు పెట్టేవాడు. దాదాపు 15 గంటల పాటు ఆమెను దారుణంగా కొట్టి, లైంగికంగా వేధించాడు. ఇదంతా అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో గల ఫ్రాంక్లిన్ కౌంటీలో జరిగింది. తలకు తుపాకి గురిపెట్టి.. ఆమెను కాల్చి, తాను కూడా కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించాడు. అతగాడు ఇదంతా చేస్తున్న సమయంలో.. వాళ్ల మూడేళ్ల కొడుకు బెడ్రూంలో బందీగా ఉన్నాడు. ఆ 15 గంటల పాటు అతడికి తిండి కాదు కదా.. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక కొరియర్ బోయ్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ ఇంటి నుంచి ఓ ప్యాకేజి తీసుకోడానికి ఆ కొరియర్ బోయ్ వచ్చాడు. ఆమె అతడితో మాట్లాడుతుండగా.. ఆమె భర్త జేమ్స్ జోర్డాన్ తలుపు వెనక నుంచి ఆమె తలమీద తుపాకి గురిపెట్టి అక్కడే నిలబడ్డాడు. కష్టమ్మీద ఆమె ఆ బాక్సు మీద 'కాంటాక్ట్ 911' అని మాత్రం రాయగలిగింది. ఆ కొరియర్ బోయ్‌కి ఆ సందేశం అర్థమైంది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడంతా ఆ కొరియర్ బోయ్ని హీరో అని పొగుడుతున్నారు. అతడు ఫోన్ చేసి ఉండకపోతే ఈ కేసు విచారణ అస్సలు ముందుకు సాగేది కాదని ఫ్రాంక్లిన్ కౌంటీ పోలీసు అధికారి సార్జంట్ టీజీ వైల్డ్ చెప్పారు. అతడు పనిచేసే కంపెనీ కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తింది. అతడు తమవద్ద దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్నాడని, సందేశం చూసిన వెంటనే 911కు (మన దేశంలో 100 లాంటి నెంబర్) ఫోన్ చేయడంతో పోలీసులు తక్షణం స్పందించి ఆమెను శాడిస్టు భర్త బారి నుంచి కాపాడగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా... ఇంతకుముందు కూడా అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అప్పుడు కూడా ఒక మహిళ చాలా చిత్రమైన రీతిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమెను ఒక మొబైల్ ఇంట్లో ఒక వ్యక్తి నిర్బంధించి ఉంచాడు. అప్పుడామె తన కూతురికి ఒక కరెన్సీ నోటు ఇచ్చి, దాని మీద ఆ విషయాన్ని రాసిపెట్టింది. ఆ చిన్నారి ఆ నోటును స్కూలు అధికారులకు ఇవ్వడంతో వాళ్లు ఆ సందేశం చదివి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో బంధించినట్లు గమనించి, ఆమెను విడిపించారు. -
ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న
-
ఆమె మానసిక స్థితి సరిగా లేదు: శాడిస్టు భర్త
హైదరాబాద్ : తన భార్య పూర్ణజ్యోతి మానసిక పరిస్థితి సరిగా లేదని శాడిస్టు భర్త శివశంకర్ ఆరోపించాడు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానన్నాడు. కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నానని... భార్యను వేధించలేదని చెప్పాడు. అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తోందన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీరైన తన భర్త ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఐపీ పరిజ్ఞానంతో సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాటిని చూపిస్తూ వేధిస్తున్నాడని పూర్ణజ్యోతి తెలిపింది. ఆ దృశ్యాలను తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడని చెప్పింది. ప్రతి రోజు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై పూర్ణజ్యోతి బుధవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సీసీకెమెరాలతో భార్యపై నిఘా పెట్టిన భర్త!
సాక్షి, సిటీబ్యూరో: అనుమానం పెనుభూతమై భార్యను సీసీ కెమెరాలతో వేధిస్తున్న శాడిస్ట్ భర్తపై సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో బుధవారం కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన శివశంకర్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు రూ.80 వేల జీతానికి పని చేస్తున్నాడు. అకారణంగా భార్యను అనుమానించే ఇతగాడు శాడిస్ట్‌గా మారాడు. ఆమెపై కన్నేసి ఉంచాలనే దురుద్దేశంలో ఇంట్లోని బెడ్రూమ్, హాల్, వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఐపీ పరిజ్ఞానంతో పని చేసే వీటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడు. తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడు. మరోపక్క నిత్యం అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న భార్య ఎట్టకేలకు సీసీఎస్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు -
కట్టుకున్న భార్యనే కాల్‌గర్ల్ చేసిన శాడిస్ట్ భర్త
-
ఓ శాడిస్ట్ భర్త వికృత చేష్టలు
-
ఓ శాడిస్ట్ భర్త వికృత చేష్టలు
►నీలి చిత్రాలు చూపిస్తూ భార్యపై వికృత చేష్టలు ►పోలీసులను ఆశ్రయించిన మహిళ ►కేసు నమోదు చేసి గాలికొదిలేసిన పోలీసులు అనంతపురం క్రైం : సభ్య సమాజం తలదించుకునేలా భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది బాధితురాలు. భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వాపోతోంది. బాధితురాలు చివరకు తన గోడు విలేకరుల ఎదుట వెళ్లబోసుకుంది. ఆమె కథనం మేరకు, ఉరవకొండ పట్టణానికి చెందిన యువతికి యాడికికి చెందిన ఉడుముల సంజీవుల కుమారుడు ఉడుముల చిరంజీవితో గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. చిరంజీవి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వివాహం అయినప్పటి నుంచి భర్త, బంధువులు మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె వాపోయింది. ముఖ్యంగా భర్త శాడిస్టులా తయారయ్యాడు. రోజూ నీలిచిత్రాలను చూపించి, తనపై వికృత చేష్టలకు పాల్పడేవాడని చెప్పింది. పడకగదిలోని దాంపత్య ముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తన స్నేహితులకు చూపించే వాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తాను స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవాడని చెప్పింది. భర్త ఇంట్లో లేనప్పుడు మామ ఉడుముల సంజీవులు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ విషయం భర్తకు చెబితే తననే కొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాను గర్భం దాల్చడంతో, వెంటనే గర్భం తీయించుకోవాలంటూ భర్త, అత్తమామలు బలవంతంగా కొట్టి గర్భస్రావం కల్గించే మాత్రలు మింగించారని వాపోయింది. ఈ బాధలు భరించలేక పుట్టింటికి వచ్చేసినట్లు చెప్పింది. తనను రాచి రంపాన పెట్టిన భర్త, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉరవకొండ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు 155/2014 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 313, 498 (ఏ), 3అండ్4 ఆఫ్ డీపీ యాక్ట్, ఆర్/డబ్ల్యూ 341 పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఎనిమిది నెలలవుతోంది. నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని చెప్పింది. ఈ విషయంలో ఎస్ఐ మొదలుకుని సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, చివరకు వారం కిందట జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిశారు. ఎస్పీ సంబంధిత స్టేషన్ అధికారులను మందలించారు. రెండ్రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా, ప్రజా సంఘాల నాయకులు తమకు అండగా నిలవాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉరవకొండ సీఐ సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను కొత్తగా వచ్చానని, అయితే ఈ కేసుకు సంబంధించి భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని చూశామని రాజీకాకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. -
కాల్‌గర్ల్స్ సైట్లో భార్య ఫోన్ నెంబర్!
ఇన్నాళ్లూ వరకట్న వేధింపులు చూశాం, భార్య ప్రవర్తనను అనుమానించి చిత్రహింసలు పెట్టే భర్తలను చూశాం. కానీ హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భర్త మరీ శాడిస్టులా ప్రవర్తించాడు. కాల్ గర్ల్స్‌కు సంబంధించిన వెబ్సైట్లో తన భార్య ఫోన్ నెంబరును పెట్టేశాడు. దాంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు శాడిస్టు భర్త మీద పోలీసులు కేసు నమోదు చేవారు. -
శాడిస్ట్ భర్తపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: కట్టుకున్న భార్య నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెడతానని వేధిస్తున్న ఓ శాడిస్ట్ భర్తపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లైన ఆరునెలలకే తనకు విడాకులు ఇవ్వాలని భర్త వేధిస్తున్నాడని ఓ బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు... బాలనగర్ రాజుకాలనీకి చెందిన భాస్కర్‌తో ఆరు నెలల క్రితం ఉప్పల్‌కు చెందిన ఓ యువతితో పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది. నెల రోజులు సవ్యంగా సాగిన వీరి కాపురంలో విభేదాలు వచ్చాయి. విడాకులివ్వాలని భాస్కర్ చేస్తున్న ఒత్తిడికి ఆమె తలొగ్గలేదు. తనను వదిలిపెడితే నెలకు లక్ష రూపాయలు సంపాదించే యువతి వస్తుందని భాస్కర్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. బెడ్రూమ్లో రహస్యంగా తీసిన వీడియోలు యువతి స్నేహితులకు చూపిస్తానని బెదిరించేవాడు. గతంలో కూడా ఇలాగే తీసిన ఇతర యువతుల నగ్న దృశ్యాలను కూడా చూపించేవాడు. తనను వదిలిపెట్టకపోతే నగ్న దృశ్యాలను నెట్, సెల్‌ఫోన్ ద్వారా అందరికి పంపిస్తానని బెదిరించాడు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.