Sadist Husband Shared His Wife Naked Images In Social Media | శాడిస్ట్‌ భర్త.. నెట్టింట్లో అమ్మకానికి భార్య - Sakshi
Sakshi News home page

శాడిస్ట్‌ భర్త.. నెట్టింట్లో అమ్మకానికి భార్య

Published Wed, Dec 30 2020 4:52 PM | Last Updated on Wed, Dec 30 2020 8:06 PM

Sadist Husband In Tirupati Wife Photos In Social Media - Sakshi

సాక్షి, చిత్తూరు : పుణ్యక్షేత్రం తిరుపతిలో శాడిస్టు భర్త వేధింపులు బయటపడ్డాయి. భార్య న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్న ఓ భర్త దుర్భుద్ది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా మార్చాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టీటీడీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట నిరోషాతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నాడు. అయినప్పటికీ మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు. అయితే అత్తవారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భార్యను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. (నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి)

నిరోషా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. కాల్ గాళ్ అనీ, గంటకు రూ.3 వేలు అంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా వేదిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement