chitur district
-
చిత్తూరు జిల్లా : కాణిపాకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
శాడిస్ట్ భర్త.. నెట్టింట్లో అమ్మకానికి భార్య
సాక్షి, చిత్తూరు : పుణ్యక్షేత్రం తిరుపతిలో శాడిస్టు భర్త వేధింపులు బయటపడ్డాయి. భార్య న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్న ఓ భర్త దుర్భుద్ది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా మార్చాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టీటీడీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట నిరోషాతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నాడు. అయినప్పటికీ మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు. అయితే అత్తవారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భార్యను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. (నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి) నిరోషా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కాల్ గాళ్ అనీ, గంటకు రూ.3 వేలు అంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా వేదిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. -
నాన్నా .. మాకు దిక్కెవరు?
బియ్యం తీసుకొస్తామని బయలుదేరారు. సోదరుడికి ముద్దు ఇవ్వమని బతిమలాడారు. టాటా చెప్పించుకుని సంబరపడ్డారు. అంతలోనే మమ్మల్ని వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఎలా బతికేది నాన్నా..? అంటూ ఆ చిన్నారులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముద్దుల తమ్ముడిని తలుచుకుని గుండెలు బాదుకుంటూ ఎక్కిళ్లు పెట్టడం మరింత బాధించింది. చిత్తూరు : కేవీపల్లె మండలం గ్యారంపల్లె కస్పా బస్టాప్ వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చిన్నగొట్టిగల్లు కాలనీకి చెందిన శంకరప్ప(32), భార్య రెడ్డిహారిక(27), కుమారుడు అఖిల్(05) అక్కడికక్కడే మృతి చెందారు. వలస వచ్చి.. బండరాళ్లు కొట్టి.. పదేళ్ల క్రితం కర్ణాటక నుంచి 15 కుటుంబాలు వలసవచ్చాయి. చిన్నగొట్టిగల్లు కాలనీలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో శంకరప్పతోపాటు భార్య, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వీరు చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల మండలాల పరిధిలో బండరాళ్లు కొట్టేవారు. బండలు, కూసాలు తీయడం లాంటివి చేసేవారు. శంకరప్ప కుటుంబం ఇటీవలే రాళ్లు కొట్టే పనుల కోసం వైఎస్ఆర్ కడప జిల్లా సంబేపల్లెకు వెళ్లింది. అక్కడే తాత్కాలికంగా గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది. రేషన్ కోసం వచ్చి అనంతలోకాలకు శంకరప్పకు ముగ్గురు సంతానం. శ్రుతి(7), అఖిల్(5), నిహారిక(4) ఉన్నారు. వారితోపాటు అత్త కూడా నివసిస్తోంది. ఆయనకు చిన్నగొట్టిగల్లులో రేషన్ కార్డు ఉంది. శనివారం ఉదయం భార్య, కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో చిన్నగొట్టిగల్లుకు వచ్చారు. రేషన్ తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని మృత్యువొడికి చేర్చింది. విషయం తెలుసుకున్న కుమార్తెలు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆ బిడ్డలను ఆ దేవుడే కాపాడాలంటూ బోరున విలపిస్తున్నారు. -
‘టెర్రకోట’ ఉపాధికి బాట
ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. చేపలను ఇవ్వడం కన్నా.. వాటిని పట్టే వలను అందించి ప్రోత్సహించడం మిన్న. సరిగ్గా ఈ విధానానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరికో స్వయం ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పించి స్థానికులకు శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే వారు తయారు చేసే వస్తువులను అంతర్జాతీయ విపణిలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘టెర్రకోట’ కళను ప్రోత్సహించడం ద్వారా పలువురి ఉపాధికి నడుం బిగించింది. పలమనేరు: జిల్లాలో టెర్రకోట కళాకారులకు పలమనేరు ప్రసిద్ధి. పట్టణానికి సమీపంలోని టెర్రకోట కాలనీలో సుమారు వంద కుటుంబాలకు ఈ కళే జీవనోపాధి. వీరికి మరింత చేయూతనందించడమే లక్ష్యంగా గంటావూరు సమీపంలో రూ.2కోట్లతో డీఆర్డీఏ ‘టెర్రకోట హబ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో టెర్రకోట కళాకారులు ఇప్పటి వరకు తయారు చేస్తున్న వస్తువులకు పశ్చిమ బెంగాల్, ఒడిశా డిజైన్లను జోడించి విభిన్న ఆకృతులను సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అధిక సంఖ్యలో యువతీయువకులను టెర్రకోట కళలో నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. నెలరోజుల శిక్షణ.. టెర్రకోట హబ్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఏపీఎస్‌డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్), సీఎఫ్‌సీ (కామన్ ఫెసిలిటీ సెంటర్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్, రీచ్ సంస్థల ఆధ్వర్యంలో యువతకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. వీరి పర్యవేక్షణలో 50మంది నెల రోజులపాటు శిక్షణ పొందారు. తొలి బ్యాచ్‌కు టెర్రకోట హబ్‌లోనే ఉపాధి కల్పించారు. కావాలనుకుంటే వారు ఇళ్ల వద్ద కూడా కళాకృతులను తయారు చేసుకుని ఉపాధి పొందవచ్చు. విభిన్న ఆకృతులకు డిమాండ్.. నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్న టెర్ర కోట కళాకారులు విభిన్న ఆకృతులను తయా రు చేస్తున్నారు. వాటికి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొళాయి అమర్చిన మట్టి కూజాలు, వేలాడే కుండీలతోపాటు శుభకార్యాల్లో బహుమతులు గా ఇచ్చేందుకు పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. చివరకు ఫొటోఫ్రేమ్‌లను సైతం మ ట్టితో తయారుచేయడం విశేషం. పాత పద్ధతులకు స్వస్తి.. గతంలో మట్టికుండలు తయారీలో వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రిక్ వీల్ మెషీన్ వచ్చింది. బంకమట్టిని కాళ్లతో తొక్కాల్సిన అవసరం లేకుండా ప్లగ్‌మిల్ మిక్చర్ అనే యంత్రం అందుబాటులో ఉంది. మట్టి వస్తువులను బట్టీ్టలో కాల్చే పనిలేకుండా విద్యుత్‌లో నడిచే సిలన్ వచ్చింది. దీంతోపాటు బాల్మిల్, ఫిల్టర్లు, కట్టర్లు.. ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి బొమ్మల తయారీకి యంత్రాల వాడకంపై హస్త కళాకారులకు టెర్రకోట హబ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు... టెర్రకోట హబ్‌లో తయారైన కళాకృతులను బెంగళూరుకు చెందిన పలు కంపెనీల ద్వారా ఆన్లైన్లో దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే టెర్రకోట కళాకారులే ఆన్లైన్లో విక్రయించుకునేలా డీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా పలమనేరు మట్టి విదేశాలకు సైతం చేరుతుండడం విశేషం. ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు.. ప్రభుత్వం నెలకొల్పిన శిక్షణ కేంద్రంలో టెర్రకోట కళను ఉచితంగానే నేర్చుకోవచ్చు. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బతకవచ్చు. హబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నాం. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. -రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘం, పలమనేరు టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణపొందా.. మాది గంటావూరు గ్రామం. ఉపాధి కోసం ఇక్కడ శిక్షణ పొందా. ఇప్పుడు కొంతవరకు పని నేర్చుకున్నా. ఇందులో చాలా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నాం. -స్నేహ, గంటావూరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు... మట్టిబొమ్మల తయారీపై కొత్త టెక్నిక్‌లతో శిక్షణనిస్తున్నా. ఇక్కడి వారు చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారు. నెలరోజుల శిక్షణ పూర్తయితే ఇక్కడే పీస్ వర్క్ చేసుకోవచ్చు. సొంతవూర్లోనే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారైన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. -గణేష్పాల్, శిక్షకుడు, కలకత్తా చేతిలో పని ఉంటే ఎలాగైనా బతకవచ్చు ఊరికే ఇంట్లో ఉండే బదులు ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. పని నేర్చుకున్నాక పీస్ వర్క్ చేసుకున్నా చాలు. ప్రభుత్వం మాలాంటి వాళ్లకు మంచి అవకాశం కల్పించింది. -లలిత, గంటావూరు -
షోడశ కళానిధికి షోఢశోపచారాలు..
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారు నిత్యపూజా ప్రియుడు. దేవదేవునికి నిత్యం ఆరుసార్లు పూజలు జరుగుతాయి. ఆగమ భాషలో షట్కాల పూజ అంటారు. ప్రత్యూషతో మొదలై షట్కాలాలు వరుసగా పూజలు జరుగుతాయి. ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు అందుకునే ఆ స్వామి నిత్య కైంకర్య వైభోగం అనిర్వచనీయం. –సాక్షి, తిరుమల సుప్రభాత సేవ ‘కౌసల్యా సుప్రజా రామా... సంధ్యా ప్రవక్తతే’ అంటూ వేకు వ జామున సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలుపుతారు. ఇదే ప్రథమ పూజ సేవ. నిత్యం వేకువజాము సమయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, యాదవ వంశీకుడు (సన్నిధి గొల్ల) దేవాలయం వద్దకు చేరుకుంటారు. అప్పుడే నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచె కోలను, తాళం చెవులను ధ్వజస్తంభం వద్ద నున్న క్షేత్ర పాలక శిలకు తాకించి ద్వారాలు తెరిచేందుకు అనుమతి పొందుతారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తం బురా పట్టుకుని మేలుకొలుపు పాట పాడేందుకు ముందుగా లోపలికి వెళతారు. వెంటనే పండితులు సుప్రభాతాన్ని పఠిస్తారు. ఆ తర్వాత వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయుడు తంబురా మీటుతూ మూలమూర్తిని మేల్కొలుపుతాడు. అర్చక స్వాములు అంతర్ ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాద పద్మాలకు నమస్కరించి స్వామిని మేల్కొలుపుతారు. శుద్ధి సుప్రభాత సేవ అనంతరం వేకువజామున మూడున్నర నుంచి మూడు గంటల నలౖభై ఐదు నిమిషాల వరకు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలన్నింటినీ తొలగిస్తారు. వాటన్నింటినీ సం పంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. అర్చన శ్రీవారికి రోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. జియ్యంగారు పూలగది నుంచి పుష్పమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురుగంపను తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుషసూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. పుష్పాంజలి తర్వాత భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగ విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని నమ్మిక. శ్రీవారి సువర్ణ పాదాలను(తిరువడి) స్నాన పీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తోమాల సేవ తమిళంలో ‘తోడుత్తమలై’ అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. కాలక్రమంలో ‘తోమాల’గా మారి అదే తో మాల సేవగా మారి ఉండవచ్చని అర్చకుల అభిప్రాయం. తోమాల సేవనే ‘భగవతీ ఆరాధన’ అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా వేంకటేశ్వర స్వామిని పూలమాలలతో అలం కరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి్ద అనంతరం ఈ సేవ ఉంటుంది. శుక్రవారం మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. కొలువు తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మండపంలో కొలువు శ్రీనివాసమూర్తికి దర్బార్ నిర్వహిస్తారు. బలి బేరానికి రాజోచిత మర్యాదలు నిర్వహించి ఆ నాటి గ్రహ సంచార క్రమాన్ని ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను..ఏయే నోట్లు ఎన్ని వచ్చాయి.. నాణాలు మొత్తం విలు వను స్వామి వారికి తెలియజేస్తారు. సహస్రనామార్చాన నిత్యం ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు సహస్ర నామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామి వారి వెయ్యి నామాలతో స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పుష్పాలు, తులసి దళాలతో దేవేరులకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్ర నామాలను పఠిస్తారు. మొదటి గంట, నైవేద్యం మేలుకొలుపు, అభిషేకాలు, కొలువు కూటం, సహస్ర నామార్చన పూర్తయ్యాక స్వామి వారికి నైవేద్యం పెడతారు. నైవేద్య సమర్పణకు ముందుగా శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మండపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామి వారికి ప్రసాదాలను కులశేఖరపడి (స్వామి వారికి ముందుమెట్టు) ఇవతల ఉంచి సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన ఈ అర్చనతోనే స్వామి వారికి మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలో వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఉన్న నూట ఎనిమిది(108) నామాలను అర్చకులు పఠిస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చాన జరుపుతారు. అక్కడితో మధ్యాహ్న పూజలు పూర్తవుతాయి. అనంతరం రెండో గంట నైవేద్యం ఉంటుంది. రాత్రి కైంకర్యాలు ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి పూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి. ఈ సమయంలోనే మూడో గంట మోగుతుంది. తర్వాత భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. ఏకాంత సేవ నిత్యం రాత్రి ఒకటిన్నర గంటల తర్వాత స్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు. దీనినే ఏకాంత సేవ/ పవళింపుసేవ అంటారు. ఏడాదిలో 11 నెలలు, భోగశ్రీనివాసుడికి, ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి నిర్వహిస్తారు. -
బాబు సర్కార్ 'ఉత్తమ' కక్కుర్తి
- ప్రతిభా అవార్డులు సాధించిన చిన్నారులకు మొండిచెయ్యి - ఒక్కో విద్యార్థికి రూ. 20 వేలు ఇస్తామన్న సీఎం ప్రకటన గాలికి.. - ప్రశంసాపత్రాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం సాక్షి, చిత్తూరు: ఉత్తమ విద్యార్థులకు అందించే నగదు పురస్కారాల్లో ప్రభుత్వం కక్కుర్తి చూపిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రశంసా పత్రాలు చేతిలోపెట్టి.. పైసలు ఇవ్వడం మాత్రం మర్చిపోయింది. సొంత జిల్లా చిత్తూరులో సాక్షాత్తు ముఖ్యమంత్రే బహిరంగ సభలో చెసిన వాగ్ధానం నీటిమూటలా మారింది. 2015 ఏడాదికి గాను రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 4,050 మంది ప్రతిభా అవార్డులకు ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి ప్రశంసాపత్రంతోపాటు రూ. 20 వేల నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.8.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అవార్డు సొమ్మును విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే జమచేస్తామంటూ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకున్నారు. నవంబర్ 14న తిరుపతిలో అర్భాటంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. అవార్డుల కార్యక్రమం ముగిసి మూడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఒక్కపైసా చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఇవ్వలేదు గతేఏడాది చిత్తూరు క్యాంఫర్డ్ పాఠశాలలో చదివి పదవ తరగతిలో 10 పాయింట్లు సాధించాను. ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యాను. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రూ 20 వేలను బ్యాంకుఖాతాలో వేస్తామన్నారు. ఇంతవరకూ జమ కాలేదు. - జి. దివ్య, క్యాంఫర్డ్ పాఠశాల, చిత్తూరు నగదు ఇవ్వనిమాట నిజమే విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద ఇచ్చే మొత్తం మంజూరు కాని మాట నిజమే. జిల్లాకు సంబంధించి 400 మంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వాలి. అందరి బ్యాంకుఖాతాలు పంపమంటే పంపం. మాచేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తుంది. - నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి అవార్డులిచ్చిన రోజే నగదు చెల్లించాలి ప్రతిభా అవార్డులు ఇచ్చిన రోజే విద్యార్థులకు నగదు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు అందజేయకపోవడం దారుణం. ఈ విషయాన్ని మా యూనియన్ తరఫున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వారికి న్యాయం జరిగేలా చేస్తాం. - కత్తినరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు