ప్రేమించానన్నాడు. పెళ్లికి ముందే సహజీవనం చేశాడు. గర్భం దాల్చిన తర్వాత వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో కొన్నా ళ్లు బాగానే ఉన్నాడు. ఇంతలో అతడిలో కట్నపిశాచి మేలుకుంది. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలన్న తలంపుతో దుర్మార్గపు ఆలోచనలు చేశాడు. కట్టుకున్న ఆలినే వెలయాలిగా చిత్రించాలని చూశాడు. భార్య ఫొటోలు, ఫోన్ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టాడు! వ్యక్తిత్వంపై బురదజల్లి కోర్టు ద్వారా విడాకులు పొందాలన్న ఆ ఉన్మాదిని.. భార్య ఫిర్యాదుతో పోలీసులు పట్టుకున్నారు