website
-
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్
ముంబై: ఇన్వెస్టర్ల విస్తృత ప్రయోజనాల దృష్టా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. అలాగే, తన ఎన్ఎస్ఈ వెబ్సైట్ సేవలు మరింత మెరుగుపరిచింది. తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయికాగా, ఎన్ఎస్ఈ మొబైల్ యాప్ యాపిల్ స్టోర్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మార్కెట్‌కు సంబంధించిన ఇండికేషన్లు, అప్డేట్లు, ట్రెండింగ్, ఆప్షన్ డేటా ట్రేడింగ్ సంబంధిత కాల్స్, పుట్స్ తదితర సమగ్ర సమాచారం ఇందులో ఉంది. పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ఐటీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
‘ఆప్ కా రామ్‌రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
ఐపీఎల్ టికెట్ల పేరిట మోసం!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు వారి అభిమాన జట్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు అంటూ సరికొత్త మోసానికి తెరతీశారు. నకిలీ వెబ్సైట్లు, యాప్‌లు సృష్టించి ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కిన బెంగళూరుకు చెందిన మహిళ రూ.86 వేలు పోగొట్టుకున్నారు. మార్చి 29న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూసేందుకు సదరు మహిళ ఫేస్బుక్లో ‘ఐపీఎల్ క్రికెట్ టికెట్’ అనే అకౌంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరిట మోసగించే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఆ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఐపీఎల్ టికెట్లను బుక్ మైషోలో అధికారికంగా విక్రయిస్తున్నారు. అచ్చం బుక్ మై షో మాదిరిగానే సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి నట్టు పోలీసులు గుర్తించారు. బుక్‌మై షో తరహాలో దగ్గరగా ఉండే పేర్లతో వీటిని తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసగిస్తున్న ’book. myshow&premium.net', 'bookmyshow. cloud' అనే వెబ్సైట్లను పోలీసులు మూసివేయించారు. నకిలీ వెబ్సైట్లో ఎర్లీబర్డ్, స్పెషల్ డిస్కౌంట్, పది టికెట్లు కొంటే కొంత డిస్కౌంట్ ఇలా ఆఫర్లను పెడుతూ మోసగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ విధానంలోనే పేమెంట్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని కేసులలో సైబర్ నేరగాళ్లు టికెట్‌కు అయ్యే మొత్తంలో కొంత డబ్బులు ఆన్లైన్లో చెల్లించి బుక్ చేసుకోండి..తర్వాత స్టేడియం వద్ద మిగిలిన సొమ్ము చెల్లించి టికెట్లు పొందండి అంటూ బురిడీ కొట్టిస్తున్నట్టు తెలిపారు. ఆ వెబ్సైట్లలోనే కొనండి కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే ఐపీఎల్ టికెట్లు కొనాలని, ఫేక్ వెబ్సైట్ల మోసాలకు గురి కా వొద్దని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ ఇంకా నడుస్తున్నందున టికెట్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టికెట్ కొనుగోలు చేసేందుకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, అది సైబర్ మోసంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. సైబర్ మో సాలపై సైబర్ క్రైం పోలీసులకు 1930 టోల్‌ఫ్రీ నంబర్లో లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
సగం బాండ్ల నిధులు బీజేపీకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంతో అధికార బీజేపీకి అత్యధికంగా నిధులు సమకూరినట్లు వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎంతెంత బాండ్లు కొన్నారు? ఏ పార్టీలకు ఎంతెంత వచ్చింది? అనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. ఈసీ ఈ జాబితాలను తమ వెబ్సైట్లో పెట్టి బహిరంగపరచింది. దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. దీన్లో 46.7 శాతం... అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా... ఆ తరవాతి స్థానాల్లో రూ.1,609 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే వరుసగా నిలిచాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్–1గా నిలిచింది. కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది. రూ.వెయ్యి కోట్లను దాటి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ రెండే కాగా... వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టోరెంట్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, ఎక్సెల్ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశోద హాస్పిటల్స్, నవయుగ ఇంజినీరింగ్, దివీస్ ల్యా»ొరేటరీస్, ఎన్సీసీ, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. వ్యక్తులు, వ్యాపార/వాణిజ్య సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు అందజేశాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్సైట్ ఇదే..
సాధారణంగా చాలా మందికి రోజు ఎలా ప్రారంభమవుతుందంటే.. ఇష్టమైన పనులు చేయడంతో ప్రారంభమవుతందని చెబుతారు. కానీ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' రోజు మాత్రం వార్తాపత్రికలను తిరగేయడం, సోషల్ మీడియాను చెక్ చేయడం మాదిరిగా కాకుండా ఒక 'వెబ్సైట్' చూడటంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ ప్రతి రోజూ నిద్ర లేవగానే 'టెక్‌మీమ్' అనే వెబ్సైట్లో లేటెస్ట్ టెక్ న్యూస్ చదవడంతో ప్రారంభమవుతుందని సమాచారం. టెక్‌మీమ్ అనే వెబ్సైట్ 2005లో గేబ్ రివెరా స్థాపించారు. ఇందులో చిన్న సారాంశాలతో సేకరించిన హెడ్‌లైన్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి యాడ్స్ ఇబ్బంది లేకుండా కీలక అంశాలను త్వరగా చూసేయొచ్చు. టెక్‌మీమ్ వెబ్‌సైట్‌ను సుందర్ పిచాయ్ మాత్రమే కాకుండా.. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరితో పాటు మరికొంత మంది సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ వెబ్సైట్ తరచుగా సందర్శిస్తుంటారు. టెక్‌మీమ్ అనేది ప్రత్యేకించి టెక్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం రూపొందించినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కోరుకునే ఎగ్జిక్యూటివ్ సారాంశాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఈ వెబ్సైట్లో ఎలాంటి క్లిక్‌బైట్స్, పాప్అప్లు, వీడియోలు లేదా అనుచిత ప్రకటనలు కనిపించవు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో.. -
నేటి నుంచి ప్రజల ముందుకు సాక్షి లైఫ్
-
సాక్షి మీడియా నుంచి సాక్షి లైఫ్ హెల్త్ పోర్టల్
-
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
టీటీడీ ఆలయాల సమాచారంతో అందుబాటులోకి ఆధునీకరించిన వెబ్సైట్
-
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
వెబ్సైట్ల రారాజు గూగులే..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్ వెబ్‌సైట్‌కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌గా గూగుల్ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్ ట్రాఫిక్ ఉండే టాప్–10 వెబ్సైట్లలో నాలుగు గూగుల్‌కు చెందినవే. ► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్ వెబ్‌సైటే టాప్‌లో ఉంటూ వస్తోంది. అయితే టిక్‌టాక్ వెబ్సైట్ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్‌ను వెనక్కి నెట్టి టాప్‌లో నిలవడం గమనార్హం. ► పాపులర్ సైట్ల లిస్టులో యూట్యూబ్ 11వ స్థానంలో, అమెజాన్ 18వ, ఇన్‌స్ట్రాగామ్ 24వ, నెట్‌ఫ్లిక్స్ 25వ, వాట్సాప్ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్‌చాట్ 40వ, ట్విట్టర్ 45వ, లింక్డ్ఇన్ 68వ, జీమెయిల్ 79వ స్థానాల్లో ఉన్నాయి. -
టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా
సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారంతో చంద్రబాబు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. టీడీపీ శ్రేణులను ప్రజల ఇళ్లలోకి పంపించి.. వారి వివరాల్ని సేకరిస్తున్నారు. మభ్యపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. దాన్ని లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా ప్రజల భద్రతకు పెనుముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినా.. చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో.. ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఇంటింటికీ వెళుతున్న టీడీపీ కార్యకర్తలు ఓటరు పేరు, ఓటరు కార్డు నంబర్, కులం, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆ కుటుంబంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పిల్లల సంఖ్య, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య, కుటుంబంలోని నిరుద్యోగ సభ్యులు, కుటుంబంలోని మహిళల సంఖ్య, మొబైల్ నంబర్, ఆ తర్వాత ఓటీపీ కూడా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అవన్నీ వెంటనే వారి వెబ్ అప్లికేషన్ టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో నిక్షిప్తమవుతున్నాయి. ఆ వెబ్సైట్ సర్వర్ లొకేషన్ యునైటెడ్ కింగ్డమ్లో ఉండటం విశేషం. అంటే ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశానికి టీడీపీ తరలిస్తున్నట్టు స్పష్టమైంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారం అంతా నెట్టింట్లో పెట్టడం ద్వారా వారి వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగించేలా టీడీపీ వ్యవహరిస్తోంది. ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలన్నింటినీ తమ వెబ్‌సైట్‌కి అనుసంధానం చేసుకుని రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ముప్పు కలిగించేందుకు సైతం సిద్ధపడింది. చట్టవిరుద్ధంగా ఓటీపీల సేకరణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే క్రమంలో చట్టవిరుద్ధంగా వారి ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీని సైతం టీడీపీ కార్యకర్తలు సేకరిస్తున్నారు. యాప్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేశాక, వారి ఫోన్ నంబర్లు తీసుకుని యాప్ నుంచి జనరేట్ అయ్యే ఓటీపీని అడుగుతున్నారు. ఓటీపీ ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే.. వారిని బలవంతం చేస్తూ ఇబ్బంది పెడుతున్న ఘటనలు కూడా పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఓ మహిళా టీడీపీ కార్యకర్త ఒక ఇంట్లోకి వెళ్లి వారి వ్యక్తిగత వివరాలు సేకరించి మొబైల్ ఓటీపీ తీసుకోవడంతో గొడవ జరిగింది. ఓటీపీ తీసుకోవడం పట్ల స్థానికులు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ విషయంలో టీడీపీ నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి సైతం వెనుకాడటం లేదు. అబద్ధాలతో వివరాల సేకరణ ఈ వివరాలన్నీ ఎందుకు సేకరిస్తున్నారో ప్రజలకు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఓటర్ల వెరిఫికేషన్ ముసుగులో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నా వాస్తవానికి అవన్నీ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమం కింద చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రకటించిన పథకాలకు ఎంపికయ్యారంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో దిట్ట కావడంతో ప్రజలు వారి మాటలను నమ్మడం లేదు. దీంతో వారు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఆ వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇలా వివరాలు నమోదు చేసిన ప్రతి పౌరుడి పేరుతో టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో ఒక డ్యాష్‌బోర్డ్ పేజీని రూపొందిస్తున్నారు. ఇలా ప్రజల ఫోన్ నంబర్లను యాప్‌కు లింకు చేసి ప్రజల వ్యక్తిగత సమాచారం అంతటినీ లండన్‌లోని సర్వర్‌లో భద్రపరుస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇతర దేశాల్లోని సర్వర్లలో దాన్ని ఉంచడం ముప్పని తెలిసినా.. టీడీపీ అదే పనిని నిర్విఘ్నంగా చేస్తోంది. వన్‌టైమ్ పాస్వర్డ్ సేకరించడం ద్వారా ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ ఆన్లైన్ లావాదేవీల ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆడుకుందాం రండి!
సాక్షి, అమరావతి : దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దాదాపు 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీకి ఊరూవాడా ముస్తాబవుతున్నాయి. ఈ భారీ క్రీడా పండుగ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ‘ఆడుదాం–ఆంధ్ర’పై ప్రచారం కల్పించడంతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాకారుల వివరాలను నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ఇక పోటీలకు డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జవనరి 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులోని ఐదు క్రీడాంశాల్లో రికార్డు స్థాయిలో 2.99 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడు విధాలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ♦ రాష్ట్రంలోని 15,004 గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు ఈ పోటీలకు క్రీడాకారుల వివరాలను నమోదు చేయడంతోపాటు ప్రజలను క్రీడా మహోత్సవానికి ఆహ్వానిస్తారు. ♦ ఔత్సాహిక క్రీడాకారులు తమ పేరు, చిరునామా, ప్రాతినిధ్యం వహించే క్రీడల వివరాలను గుర్తింపు కార్డు ఐడీ/ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ♦ ఒకటి కంటే ఎక్కువ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులు ప్రాధాన్యత క్రమంలో పాల్గొనే క్రీడల వివరాలను అందించాలి. ♦ వలంటీర్ ఇంటికి వచ్చినప్పుడు లేదా క్రీడాకారులే నేరుగా తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి పోటీలకు తమ వివరాలు ఇవ్వొచ్చు. ♦ వ్యక్తిగతంగానే కాకుండా ఒక గ్రూపుగా కూడా క్రీడాకారులు తమ జట్టును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ♦ ఇక ప్రభుత్వం తీసుకొచ్చే వెబ్సైట్ ద్వారా కూడా క్రీడాకారులు నేరుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఐదు రకాల కాంపిటీటివ్ క్రీడాంశాలు, మూడు నాన్–కాంపిటీటివ్ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. వీటిల్లో 15 ఏళ్లకు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడలతో పాటు సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఐదు దశల్లో అంటే.. గ్రామ/వార్డు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రతి సచివాలయం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. సుమారు 1.50 లక్షల మంది వలంటీర్లకు క్రీడాంశాల నిర్వహణపై పీఈటీ, పీడీలతో జిల్లా చీఫ్ కోచ్‌ల సహాయంతో ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రత్యేక శిక్షణనిస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో బాలబాలిక విభాగాల్లో ఒక్కొక్క జట్టు చొప్పున లెక్కిస్తే 228 మంది పాల్గొంటారు. ఇలా మొత్తం 34.20లక్షల మంది క్రీడాకారుల ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా. సచివాలయం పరిధిలో ఒకటికి మించి ఎక్కువ జట్లు వస్తే క్రీడాకారుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం.. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకర సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆడుదాం–ఆంధ్ర పేరుతో నిర్వహించే ఈ మెగా టోర్నీని దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా నిలబెడతాం. దీనిద్వారా ఐదు క్రీడాంశాల్లో క్రీడాకారుల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. తద్వారా ప్రతిభగల క్రీడాకారులకు అవసరమైన క్రీడా శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించడానికి ఎంతో వీలుంటుంది. ప్రతి క్రీడాంశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీలు, పీడీలు, శాప్ కోచ్‌లతో పాటు వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కోసం యాప్, వెబ్‌సైట్‌ను దాదాపు సిద్ధంచేశాం. క్రీడాకారులు వీలైనంత త్వరగా వివరాలు నమోదు చేసుకోవాలి.– ధ్యాన్‌చంద్, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ ఇలా.. ♦ గ్రామ/వార్డు సచివాలయం: డిసెంబర్ 15 నుంచి 20 వరకు ♦ మండల స్థాయి : డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు ♦ నియోజకవర్గం : జనవరి 5 నుంచి 10 వరకు ♦ జిల్లా స్థాయి : జనవరి 11 నుంచి 21వరకు ♦ రాష్ట్రస్థాయి : జనవరి 22 నుంచి 26 వరకు -
ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
అవసరంలేని, అప్రాధాన్య జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదు
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏ మాత్రం అవసరంలేని, ప్రాధాన్యతలేని, ఇతర సాధారణ జీవోలను అధికారిక వెబ్సైట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. మెడికల్ బిల్లులు, పెట్రోల్ అలవెన్సులు, ఇతర చెల్లింపులు తదితరాలకు సంబంధించిన జీవోలు ప్రజలకు అంత అవసరంలేదని, అందుకే వాటిని వెబ్సైట్లో ఉంచడం లేదని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ హైకోర్టుకు వివరించారు. ఇందులో దాచేందుకు ఏమీలేదని తెలిపారు. మిగిలిన జీవోలను విడుదలైన వారం రోజుల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. అత్యవసర జీవోలను మరుసటిరోజే అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. జీవోల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై ఈ నెల 22న విచారిస్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు విచారణ జాబితాలో ఉన్నప్పటికీ విచారణకు నోచుకోని వీటిపై అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ల న్యాయవాదులు బుదవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యధిక జీవోలను ప్రభుత్వం అప్లోడ్ చేయకుండా గోప్యత పాటిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జీవోలను వెబ్సైట్లో ఉంచడం వల్ల నష్టమేముందని ప్రశ్నించింది. జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదేగా అని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ప్రజలకు అవసరంలేని, ప్రాధాన్యతలేని, సాధారణ జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదని తెలిపారు. మిగిలిన జీవోలను వెబ్సైట్లో ఉంచుతున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాల్లో విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్లైన్ చాట్ సైట్ షట్‌డౌన్
2009లో మొదలైన వర్చువల్ చాట్ సైట్ 'ఒమెగల్' (Omegle) ఈ రోజు షట్‌డౌన్ అయింది. ప్రస్తుతం ఈ సైట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తే ఒక ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఈ చాట్ సైట్ నిలిపివేయడానికి కారణం ఏంటి? ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒమెగల్ ఫౌండర్ 'లీఫ్ కె-బ్రూక్స్' (Leif K-Brooks) ప్రకారం.. ఆపరేటింగ్ సమస్యలు, పెరిగిన ఖర్చుల కారణంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. మనకు ప్రస్తుతం కనిపించే ఫొటోలో సమాధి రాయి మీద బ్రాండ్ లోగో, దాని కింద 2009 - 2023 వంటివి చూడవచ్చు. లీఫ్ కె-బ్రూక్స్ 'ఒమెగల్' గురించి వివరిస్తూ.. కొత్త వ్యక్తులకు పరిచయ వేదికగా పనిచేసిన ఒమెగల్, 14 సంవత్సరాలు సేవలు అందిస్తూ వచ్చింది. యూజర్స్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో అప్డేట్స్ తీసుకువచ్చినప్పటికీ.. కొందరు దీనిని స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. 2023 జూన్ నాటికి ప్రతి రెండు రోజులకు ఒకసారి పిల్లలపై ఆన్లైన్ లైంగిక వేధింపులు వచ్చాయని, అలాంటి వాటికి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొన్ని నియమాలు ప్రవేశపెట్టినట్లు బ్రూక్స్ వెల్లడించారు. అయితే ఒమెగల్ ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవలపై జరిగిన దాడుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా నిర్వహణ, దీని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒత్తిడి వంటి వాటితో పాటు ఆర్థిక భారాలు పెరగటం వల్ల 14 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్స్ స్పష్టం చేశారు. Omegle has officially shut down after 14 years. pic.twitter.com/agGJkd65KV — Pop Base (@PopBase) November 9, 2023 -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
సెలెవిదా వెల్నెస్ పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా సెలెవిదా వెల్నెస్ డైరెక్ట్ టు కంజ్యూమర్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఈ పోర్టల్ ద్వారా మధుమేహ రోగుల కోసం పలు ఉత్పత్తుల అమ్మకంతోపాటు ఆహార సిఫార్సులు, సమాచారం అందిస్తారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2019 నుంచి సెలెవిదా బ్రాండ్‌లో న్యూట్రాస్యూటికల్స్ తయారీ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్‌కోడ్స్‌కు వీటిని సరఫరా చేస్తోంది. -
నా టీనేజ్ ఫోటోలు అశ్లీల వెబ్సైట్లో కనిపించాయి: జాన్వీ కపూర్
2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగా ఫేమ్ ఉన్నప్పటికీ తన గ్లామర్‌తోనూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మిలి మూవీతో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో అలరించింది. ఈ ఏడాదిలో వరుణ్ ధావన్ సరసన బవాల్‌లో నటించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరనస దేవరతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను స్టార్ కిడ్ కావడంతో ఫోటోలు, వీడియోలు నా జీవితంలో ఓ భాగమయ్యాయని తెలిపింది. అంతే కాకుండా ఈ డిజిటల్ యుగంలో తనపై తీవ్ర ప్రభావం చూపించాయని వెల్లడించింది. (ఇది చదవండి: 'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!) జాన్వీ మాట్లాడుతూ..' కెమెరాలు ఎల్లప్పుడూ నా జీవితంలో ఒక భాగం. నా చిన్నతనం నుంచి నా సమ్మతితో లేక నా అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు నాతోపాటు నా సోదరి ఖుషీ కపూర్ల ఫోటోలు తీశారు. అయితే అవీ మేము యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసినవి. కానీ కొందరు తమ మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్స్‌లో పెట్టారు. నేటి డిజిటల్ యుగంలో నకిలీ చిత్రాల బెడద ఎక్కువైంది. కానీ ప్రజలు ఇలా మార్ఫింగ్ చేసిన చిత్రాలు చూసి అవి వాస్తవమైనవని నమ్ముతున్నారు. అది నాకు చాలా ఆందోళనకు గురిచేసింది.' అని అన్నారు. తనకు కేవలం 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఇంటర్నెట్లో నా ఫోటోలు కనిపించాయి. స్కూల్లో చదువుతున్నప్పుడే యాహూ హోమ్‌పేజీలో నా ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఒక రోజు పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో తన క్లాస్మేట్స్ కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న నా ఫోటోలు చూశారు. అవీ చూసి తాను చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు వారంతా భావించారు. కానీ ఆసమయంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని జాన్వీ పేర్కొంది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేశారని తెలిపింది. ఇండస్ట్రీలో నేను కష్టపడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావు? అని ప్రశ్నించేవారని తెలిపింది. వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో.. నన్నెందుకు జడ్జ్ చేస్తున్నారో అర్థమయ్యేది కాదని దేవర భామ వెల్లడించింది. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) -
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్సైట్ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్సైట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, షేర్ చేయొద్దని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్ఎల్లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్సైట్ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారినపడితే బ్యాంకు ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–4 జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది. వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్సైట్లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆధునిక ఫీచర్లతో ప్రారంభమైన ఐటీ శాఖ వెబ్సైట్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ఆధునికీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యూజర్లకు మరింత సౌకర్యంగా, విలువ ఆధారిత సదుపాయాలతో దీన్ని రూపొందించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.‘కొత్త టెక్నాలజీకి అనగుణంగా ఉండేందుకు, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవం కోసం ఐటీ శాఖ వెబ్సైట్ www.incometaxindia.gov.in ను యూజర్లకు అనుకూల ఇంటర్ఫేస్, విలువ ఆధారిత ఫీచ ర్లతో పునరుద్ధరించింది’అని సీబీడీటీ పేర్కొంది. -
ఆన్లైన్లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 18న ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు www. psc. ap. gov. in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 19న శాంపిల్ టేకర్ పరీక్ష ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మిని్రస్టేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టుల భర్తీకి చేపట్టిన పరీక్ష ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌టికెట్లు కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, అభ్యర్థులు 18వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాల రీత్యా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్విస్ కమిషన్ వెబ్సైట్ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 21, 22 తేదీల్లో ఏఈఈ పరీక్ష వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
ఒక్క క్లిక్... రెడీ టు కుక్
బతికిన చెరువు చేపలు, రొయ్యలు... తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు... ఎండుచేపలు, రొయ్యల పచ్చళ్లు... నేరుగా వండుకుని తినేలా స్నాక్ ఐటమ్స్‌తోపాటు ‘రెడీ టు కుక్’ పేరిట మసాలా అద్దిన (మారినేట్) మత్స్య ఉత్పత్తులు... కనీసం వారం రోజులు నిల్వ చేసుకునేలా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో ఐస్‌లో భద్రపర్చిన కటింగ్ ఫిష్, రొయ్యలు... ఇలా 60 రకాల మత్స్య ఉత్పత్తులలో ఏది కావాలన్నా ఇక నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో డోర్ డెలివరీ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను విస్తరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... మరో అడుగు ముందుకేసి స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా 50లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... తలసరి వినియోగంలో కేవలం 8.07 కేజీలు మాత్రమే ఉంది. దీనిని వచ్చే ఐదేళ్లలో కనీసం 30 శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లాకు ఒక ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్లెట్లతోపాటు ఈ–మొబైల్ 3 వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ వెహికల్స్ డెయిలీ (ఫిష్ కియోస్‌్క), సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా 1,826 స్టోర్స్ అందుబాటులోకి రాగా, మరో 2వేల యూనిట్లను త్వరలో ప్రారంభించనుంది. తాజాగా ఒక్కో కేటగిరీలో 20 చొప్పున ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ కేటగిరీల్లో 60కి పైగా మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేస్తున్నారు. తొలి దశలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో, రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వారు సొంతంగా డోర్ డెలివరీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెచ్చారు. యూ ట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘ఫిష్ ఆంధ్ర’ ఆన్లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఇటీవల రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. రిటైల్ అవుట్‌లెట్స్, ఇతర యూనిట్లను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్విగ్గీ, జొమాటో తరహాలో ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు. త్వరలో డోర్ డెలివరీకి శ్రీకారం ఫిష్ ఆంధ్ర పేరిట దాదాపు 2వేల అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశాం. ఇంత పెద్దఎత్తున చైన్ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. మరో అడుగు ముందుకేసి కోరుకున్న మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – కూనపురెడ్డి కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
స్తంభించిన మార్గదర్శి చిట్‌ఫండ్ వెబ్సైట్.. ఖాతాదారుల్లో అనుమానాలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ స్తంభించింది. నిర్వహణ సమస్య వలన నిలిచిపోయినట్లు మార్గదర్శి పేర్కొంది. త్వరలో పునరుద్ధరిస్తామంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ వెల్లడించింది. అకస్మాతుగా మార్గదర్శి వెబ్సైట్ స్తంభించడంపై ఖాతాదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం.. ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐడీ వెల్లడించింది. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ పేర్కొంది. చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్ -
రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం
-
హెచ్ఐవీ బాధితులా? డోంట్ వర్రీ.. సంబంధం చూసి పెడతారు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల పేరు పలకడానికి సైతం కొంతమంది సిగ్గుపడుతుంటారు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్ వాలివ్ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పుణేకు చెందిన యాభైఏళ్ల అనిల్ వాలివ్ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి (ముంబై)గా పనిచేస్తున్నాడు. అది 2005... అనిల్‌కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్ఐవీ సోకి తన కళ్లముందే చనిపోవడం. అతని కొడుకుకి కూడా హెచ్ఐవీ సోకడం అనిల్‌ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక... ‘‘హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది’’ అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్‌సైట్‌తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్ సాథీ డాట్‌కామ్ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది. బ్రెయిన్ సర్జరీ అయినప్పటికీ.. ఒకపక్క ఉద్యోగం... మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్‌కు 2015లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. హెచ్వీ రోగికి మరో హెచ్ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేలమంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు. అంటరానివారిగా చూస్తుండడంతో... ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్ఐవీ అని తెలియగానే..కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్‌కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందునుంచి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో...హెచ్ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు. ఎన్నిసైట్లు వెతికినా... పాజిటివ్ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తనే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే positivesaathiను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇప్పటిదాకా మూడు వేలమందికిపైగా ఈ సైట్ ద్వారా వివాహం చేసుకున్నారు. అర్ధంతరంగా పోకుండా.. సైట్ నిర్వహణ అంత సులభంగా లేదు. కొంతమంది నకిలీ ప్రొఫైల్స్ తో రిజిస్టరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లన్నీ సరిచూసుకోవడం కష్టం. ఎక్కువమంది తమ కులానికి చెందిన వారిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పాజిటివ్ రోగులకు జతను వెతికే పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇలా పెళ్లిళ్లు జరిగితే హెచ్ఐవీ వ్యాప్తి కొంతవరకైనా నిరోధించవచ్చవచ్చు. వాళ్లు అంటరాని వాళ్లలా అర్ధంతరంగా చనిపోకుండా, కొంతకాలం అయినా తోడుతో ఆనందంగా జీవిస్తారు. – అనిల్ వాల్వి -
వైద్య పోస్టుల భర్తీకి బోర్డు
సాక్షి, అమరావతి: ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు భర్తీ చేస్తున్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంఎస్ఆర్బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ బోర్డు కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తారు. పదోన్నతుల ద్వారా డిప్యూటి సివిల్ సర్జన్, సివిల్ సర్జన్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియను సంబంధిత విభాగాధిపతుల కార్యాలయాల ద్వారానే చేపడుతున్నారు. ఇకపై ఈ నియామకాలను బోర్డు చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రస్తుతం వెబ్సైట్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో బోర్డు కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టుల భర్తీ ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా మానవ వనరులను సమకూర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు 49 వేల వరకు పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులను ఇచ్చింది. వైద్య శాఖలో 4 వారాలకు మించి ఏ పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
సెంచురీ మ్యాట్రెస్ గుడ్‌న్యూస్: 50 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్ తన వెబ్సైట్నుమరింత వినియోగ అనుకూలంగా మార్పు చేసినట్టు ప్రకటించింది. కస్టమర్లు తమకు అనుకూలమైన మ్యాట్రెస్‌ను సులభంగా తెలుసుకునే విధంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. అదే సమయంలో ‘స్లీప్ స్పెషలిస్ట్ సేల్’ పేరుతో అమ్మకాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ ఫోమ్-ఆధారిత ప్రొడక్ట్స్‌కు సెర్టిపుర్-యూఎస్, బీఐఎస్,ఓయికో టెక్స్ క్లాస్-1 సర్టిఫికేషన్లతో పరుపులను అందిస్తున్నట్టు తెలిపింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ , ISO 9001-2015 సర్టిఫికేషన్ ఉన్న తొలి ఇండియన్ మ్యాట్రెస్ కంపెనీ అని పేర్కొది. ఇదీ చదవండి : IPL victory: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం! కాపర్ జెల్ మెమరీ ఫోమ్, యాంటీ-మైక్రోబయల్ ట్రీట్మెంట్, బ్రీతబుల్ CNC-ఆకారపు ఫోమ్‌లు తదితర వినూత్న ఉత్పత్తులను అందించే పరిశ్రమలో టాప్‌లో ఉంది సెంచరీ. కంపెనీ 18 రాష్ట్రాల్లో 4,500+ మల్టీ-బ్రాండ్ డీలర్లు, 450+ ప్రత్యేక బ్రాండ్స్ ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌లలో కూడా పాపులర్అయింది. మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఎర్రర్..టైమ్ అవుట్!
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ సతాయింపులు, సర్వర్ సమస్యలు గురుకుల కొలువుల అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) విఫలమైంది. దీంతో వేలాది మంది దరఖాస్తుకు దూరం కావాల్సిన పరిస్థితి దాపురించింది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) కొలువులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. కానీ గడువు ముగిసే చివరి నిమిషంవరకు సాంకేతిక సమస్యలు వెంటాడాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. బోర్డు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించని అధికారులు, గడువు తేదీ పొడిగింపుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో రెండ్రోజుల్లో మ్యూజిక్ టీచర్, టీజీటీ దరఖాస్తు ప్రక్రియ సైతం ముగియనుంది. అప్పటివరకు ఇవే సమస్యలు పునరావృతమైతే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఎదురుకానుంది. తొలిరోజు నుంచీ ఇదే తీరు... టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తొలిరోజు నుంచే కొనసాగుతూ వచ్చాయి. రాష్ట్ర గురుకుల సొసైటీల పరిధిలోని 9,231 ఉద్యోగాల భర్తీకి గత నెల 5వ తేదీన బోర్డు ఏకకాలంలో 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెల 17వ తేదీ నుంచి గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించింది. నెల రోజుల పాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటీఆర్ నమోదు, ఆ తర్వాత దరఖాస్తుల సమర్పణకు ఉపక్రమించిన అభ్యర్థులకు గురుకుల వెబ్సైట్ చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్ సతాయింపుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీతో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగియగా.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా గురుకుల పాఠశాలల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియగా.. సాంకేతిక సమస్యలు కొనసాగడంతో దీనికీ మెజారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొందరైతే ఫీజులు చెల్లించినప్పటికీ దరఖాస్తును సబ్మిట్ చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. వివరాలు ఎంట్రీ చేశాక ఎర్రర్! గురుకుల వెబ్సైట్లో ప్రధానంగా రెండు దశల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఓటీఆర్ నమోదుకు సంబంధించి ఆధార్ వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే వివరాల పేజీ తెరుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎర్రర్ అంటూ డిస్ప్లే అవుతుండటంతో తిరిగి వెబ్‌పేజీని తెరవాల్సివస్తోంది. ఇలా పలుమార్లు ప్రయతి్నస్తేనే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయగలిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొందరైతే ఓటీఆర్ నమోదుకే రోజుల తరబడి ప్రయత్నించినట్లు తెలిపారు. ఓటీఆర్ నమోదు తర్వాత ఫీజు వివరాలను నమోదు చేయా ల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులో వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే సమయంలో సర్వర్ ఎర్రర్, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటూ వస్తోంది. మెజారిటీ అభ్యర్థులకు ఇదే అనుభవం ఎదురవుతుండడంతో గురుకుల బోర్డు హెల్ప్ డెస్‌్కకు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. కానీ హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదులు, వినతులతో ఉపయోగం లేదని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన పీజీటీ అభ్యర్థి ఎస్.పాండురంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు గడువు పెంపు లేనట్టే..! కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును గురుకుల బోర్డు పెంచలేదు. దీంతో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు విషయంలోనూ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారు. -
Hyderabad: మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుకుకి ఇస్తారా?
హైదరాబాద్: కుమార్తెల పెళ్లిళ్ల కోసం వెబ్సైట్లో పోస్టు పెట్టిన ఓ వృద్ధ తండ్రిని సైబర్ నేరగాళ్లు మోసగించాడు. వివరాల్లోకి వెళ్తే..నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి వివాహం చేసేందుకు ఇటీవల వారి సామాజికవర్గానికి చెందిన ఓ వెబ్సైట్లో ఇద్దరి అమ్మాయిల వివరాలను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి పెద్ద కుమార్తె నచ్చిందని మాట కలిపాడు. మరుసటి రోజు మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుకుకి ఇస్తారా? ఒకటే చోట ఇద్దరూ కలసి ఉంటారంటూ నమ్మించారు. ఎట్టకేలకు ఒకటేసారి ఒకే కుటుంబానికి చెందిన వారి పెళ్లి సంబంధం రావడంతో ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. వారం రోజుల పాటు ఇరువైపులా కేవలం ఫోన్ల ద్వారానే మాటలు సాగాయి. ముందుగా సంప్రదించిన వ్యక్తి తన కుమారుడు అర్జెంటుగా యూఎస్‌కు వెళ్లాలి, త్వరగా పెళ్లి చేద్దామనే ప్రపోజల్ పెట్టాడు. ఇద్దరి అమ్మాయిలకు సంబంధించి ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని డబ్బు కావాలని కోరాడు. అతగాడి మాటలు నమ్మిన ఆ తండ్రి పలు దఫాలుగా రూ.26 లక్షలు ముట్టచెప్పారు. అడిగినంత ఇస్తూనే ఉన్నాడు కానీ..పెళ్లి చూపులకు ఇంటికి మాత్రం రావడం లేదు. వారి సామాజిక వర్గానికి చెందిన వెబ్సైట్లో ఎంకై ్వరీ చేయగా..మీరు చెప్పిన వివరాలతో మా వెబ్సైట్లో ఎవరూ లేరనే విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. తన ఇద్దరి కుమార్తెల భవిష్యత్‌ను కాపాడాలని, దోచుకున్న డబ్బును ఇప్పించాలంటూ ఆ వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. -
జగనన్నకు చెబుదాం వెబ్ సైట్ లాంచ్
-
ఏపీ: పాఠ్యపుస్తకాల విషయంలో విద్యాశాఖ కొత్త విధానానికి బీజం
సాక్షి, విజయవాడ: పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెబ్సైట్లో ఫ్రీ డౌన్ లోడ్స్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వెబ్సైట్ నుంచి ఎవరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు, ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని, విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి అన్నారు. -
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్‌ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ డేటా రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ 2023లో 27.23 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాల ద్వారా రానుంది. -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్ బుకింగ్ వెబ్సైట్ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్! ట్రైన్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్ సేవల కోసం ఆన్లైన్లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్సీటీసీ సర్వర్ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టికెట్ బుకింగ్ కోసం యూజర్లు లాగిన్ చేస్తున్న సమయం నుంచి పేమంట్ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్ బుకింగ్ కోసం అమౌంట్ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్ అయినప్పటికీ రైలు టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్, మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. @IRCTCofficial Still trying to Book ticket through #irctc website. Is it going to work today ? It's been an half an hour now for tatkal ticket slot booking, but still website is not working. pic.twitter.com/fYFuXCaHrj — Prashant waghmare (@Prashan95320710) March 4, 2023 #irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv — 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023 When someone says Bhai #Tatkal_tickets kaat de Me : pic.twitter.com/g96AuufaM5 — Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023 -
ఆన్లైన్లో నోటరీల సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నోటరీల వివరాలు ప్రజలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం నోటరీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో పెడుతున్నారు. నోటరీల ఫొటోలు, అడ్రస్, లొకేషన్లతో పాటు వారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, రెన్యువల్ అయ్యారా? లేదా (ఫోర్స్‌లో ఉన్నారా? లేదా?) వంటి వివరాలని్నంటినీ త్వరలో వెబ్సైట్లో చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఎవరికీ నోటరీని ఇచ్చే అవకాశం లేదు. జనాభానుబట్టి కేంద్రం రాష్ట్రాలకు నోటరీలు కేటాయిస్తుంది. రాష్ట్రానికి ఇచ్చిన కోటా గతంలోనే పూర్తయింది. ఉన్న నోటరీలను ఐదేళ్లకోసారి రెన్యువల్ చేస్తారు. మొదటి రెన్యువల్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, రెండో రెన్యువల్‌ను కమిషనర్ అండ్ ఐజీ, మూడు ఆ తర్వాత జరిపే రెన్యువల్స్‌ను ప్రభుత్వం చేస్తుంది. ఎక్కువ మంది నోటరీలు ఫోర్స్‌లో ఉన్నారా లేదా అనే విషయం ప్రజలకు తెలియడంలేదు. ఫోర్స్‌లో లేకపోయినా చాలామంది నోటరీలు చేస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. మరోపక్క సొసైటీలు, ఫర్మ్ రిజిస్ట్రేషన్ల సేవలను కూడా ఆన్లైన్లో ఆధునీకరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి మళ్లీ ప్రారంభిస్తున్నారు. -
సాక్షి వెబ్సైట్లో.. మీ జిల్లాతో పాటు, ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట..
సాక్షి వెబ్సైట్లో ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన అన్ని వార్తలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలోనైనా మీ జిల్లాతో పాటు ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట sakshi.comలోని జిల్లా వార్తలలో చదవొచ్చు. Dont miss. -
Wikipedia: వికిపీడియాను బ్యాన్ చేసిన పాకిస్తాన్.. ఎందుకంటే..?
ఇస్లామాబాద్: ప్రముఖ వెబ్సైట్ వికిపీడియాను బ్యాన్ చేసింది పాకిస్తాన్. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మతాన్ని అగౌరపరిచేలా ఉన్న కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని 48 గంటలు గడువు ఇచ్చినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాక్ టెలికం శాఖ ఈమేరకు చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లను బ్యాన్ చేయడం పాకిస్తాన్లో తరచూ జరగుతూనే ఉంది. 2012లో ఏకంగా 700 యూట్యూబ్ లింకులను బ్లాక్ చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా కంటెంట్ ఉందని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకుంది. పాక్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా వికిపీడియా కూడా ఈ జాబితాలో చేరింది. మతానికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థకు పాక్ ప్రభుత్వం నోటీసులు పంపింది. తమ ఆదేశాలు పాటించకపోతే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. అయినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం. అయితే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పులువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్దమని, సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలోని వర్గాలపై ప్రభావం పడుతుందని డిజిటల్ హక్కుల కారకర్త ఉసామా ఖిల్జీ అన్నారు. మరోవైపు వికిపీడియా సంస్థ కూడా దీనిపై స్పందించింది. తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన సంపదను పాక్ ప్రజలు కోల్పోతారని, దేశ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండదని పేర్కొంది. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
ఇక ఆన్లైన్లో యాదాద్రి బ్రేక్ దర్శనం టికెట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో బ్రేక్ దర్శనం టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్ దర్శనాలకు రూ.300 టికెట్ కొనుగోలు చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. http://yadadritemple.telangana.gov.in లో లాగిన్ కావాలని ఈవో6 సూచించారు. ఈ వెబ్సైట్లో ఉఈ్చటటజ్చిnకు వెళ్లి బ్రేక్ దర్శనం రూ.300 అన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్లో రుసుము చెల్లించి టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్‌కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్‌లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
మారుతి ఎస్-క్రాస్ ఔట్: వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన ఫ్టాగ్‌షిప్ కారు మారుతి ఎస్-క్రాస్ కారును నిలిపివేసింది. గ్రాండ్ విటారాకు కంటే ముందు తీసుకొచ్చిన నెక్సా తొలి కారుఎస్-క్రాస్‌ను మారుతి నెక్సా వెబ్సైట్ నుంచి తొలగించింది. అంటే మార్కెట్‌నుంచి నిలివేసింది. 2015లో నెక్సా ఫస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ కార్గా దీన్ని లాంచ్ చేసింది. (‘ప్లీజ్..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం) కాంపాక్ట్ ఎస్యూవీ గ్రాండ్ విటారా లాంచ్, ధర ప్రకటన తర్వాత మారుతి తన అధికారిక నెక్సా వెబ్సైట్ నుండి ఎస్-క్రాస్‌ను తీసివేసింది. గ్రాండ్ విటారా ఇప్పటికే 60వేల బుకింగ్‌లను పొందింది. దీనికి 28 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. తాజాగా మారుతి ఎస్-క్రాస్ ప్లేస్‌ను 2022 గ్రాండ్ విటారా ఎస్యూవీ ఆక్రమించింది. 1.6-లీటర్, 1.3-లీటర్ డీజిల్ ఇంజీన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S-క్రాస్ ముందుగా మార్కెట్లోకి వచ్చింది. తర్వాత డీజిల్ వెర్షన్‌ను ఆపేసి, 2020లో పెట్రోల్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ దూసుకుపోవడంతో S-క్రాస్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో ఒక్క కారు కూడా విక్రయించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో S-క్రాస్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. గ్రాండ్ విటారాతో మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో పట్టు నిలుపుకోవాలని మారుతి భావిస్తోంది. క్రెటా, సెల్టోస్‌కు రానున్న రోజుల్లో ఇది గట్టి పోటీ ఇస్తుందని మారుతి అంచనా వేస్తోంది. (క్లిక్ చేయండి: గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!) -
నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు
న్యూఢిల్లీ: నకిలీ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ కంపెనీ పేరుతో కొందురు వ్యక్తులు నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఈమెయిల్ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారంటూ పలు కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో సదరు కంపెనీల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభంలో సుమారు ఏడుగురుని అదుపులోకి తీసకున్నట్లు వెల్లడించారు. నిందితులు షమ్మీ, ఆలం ఖాన్, అతుల్ దీక్షిత్, ప్రేమ్ దత్, ఢిల్లీ నివాసితులు, సర్దార్ అమిత్ సింగ్, మోను కుమార్, సందీప్ చౌదరి, గోపాల్ కుమార్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. నిందితులందరూ బిహార్‌లు నివాసితులని చెప్పారు. తదుపరి ఆపరేషన్‌లో మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో సదరు నిందితులు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి, ఈమెయిల్ ఐడీలు క్రియోట్ చేసుకుని క్లయింట్లకు మెసేజ్‌లు, కాల్లు చేయడం వంటివి చేసి వారితో లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేగాదు కంపెనీ మార్కుతో కూడిన ఆమోద లేఖలను సైతం బాధితులకు పంపి మోసగించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు బాధితులు ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...) -
హెలికాప్టర్ సర్వీస్ అని రూ.17 వేలు టోపీ
మైసూరు: మైసూరు నగరంలో ఆన్లైన్ మోసాలకు హద్దు లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వంచనకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దర్శనం కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెబ్సైట్లో గాలించి రూ. 17,000 పోగొట్టుకున్నాడు. మైసూరు గాయత్రి పురంలో నివాసం ఉంటున్న జీ బసవణ్ణ (32) వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం జమ్ములో నుంచి ఆలయం వరకు హెలికాప్టర్ సర్వీసు ఉన్నదని, బుక్ చేసుకోవచ్చని హిమాలయ హెలిప్యాడ్ అనే సంస్థ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు వెబ్సైట్ ద్వారా రూ. 17,000 చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిరోజులైనా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: వరదలపై సమీక్ష సమావేశం... నిద్రపోయిన మంత్రి) -
కవాల్ టైగర్ రిజర్వ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో తయారుచేసిన సైట్‌ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో మంగళవారం ప్రారంభించారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్లైన్ బుకింగ్ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్టైగర్.కామ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా... కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్‌లెట్‌ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక నివేదికను సైతం మంత్రి విడుదల చేశారు. కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్న మంత్రి... ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌ను అభినందించారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్.. జుడే వతన్)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్లో ముగియనుందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ -
94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం
న్యూఢిల్లీ: 2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్‌కు సంబంధించి వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ కోవిడ్‌కు సంబంధించిన, చర్యలు తీసుకోదగ్గ 34,125 ప్రశ్నలకు స్పందించిందన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్ తెలిపారు. -
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్‌సైట్‌పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
ఆల్ట్ న్యూస్ జుబేర్ అరెస్ట్.. రాహుల్, ఒవైసీ ఖండన
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మొహమ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి.. కస్టడీకి తరలించారు. నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టును కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్లు శశిథరూర్, జైరాం రమేష్‌లతో పాటు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. లాయర్, ఉద్యమవేత్త ప్రశాంత్ భూషణ్ సైతం.. ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. ఆయన్ని మరొక కేసులో అరెస్ట్ చేశారని జుబేర్ సహ ఉద్యోగి, ఆల్ట్ న్యూస్ మరో సహవ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ఆరోపిస్తున్నారు. 2020లో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించేందుకు పిలిచారు. ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు సైతం రక్షణ ఇచ్చింది. అయితే.. తీరా అక్కడికి వెళ్లాక పోలీసులు కొత్త కేసును తెర మీదకు తెచ్చారు. పైగా అది నాలుగేళ్ల కిందటిది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జుబైర్‌ను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఏ ఎఫ్ఐఆర్ మీద అరెస్ట్ చేశారో చెప్పమంటే.. కనీసం కాపీ కూడా చూపించట్లేదు అని సిన్హా ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. Arrest of @zoo_bear is highly condemnable. He’s been arrested with no notice & in some unknown FIR. Total violation of due process. @DelhiPolice does nothing about anti-Muslim genocidal slogans but acts swiftly against “crime” of reporting hate speech & countering misinformation — Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2022 Every person exposing BJP's hate, bigotry and lies is a threat to them. Arresting one voice of truth will only give rise to a thousand more. Truth ALWAYS triumphs over tyranny. #DaroMat pic.twitter.com/hIUuxfvq6s — Rahul Gandhi (@RahulGandhi) June 27, 2022 Please note. pic.twitter.com/gMmassggbx — Pratik Sinha (@free_thinker) June 27, 2022 -
చహల్ పేరిట వెబ్సైట్.. ఆ మాత్రం ఉండాలి!
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్‌తో మెరిశాడు. కేకేఆర్ మ్యాచ్‌ను లాగేసుకుంటున్న తరుణంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ మ్యాజిక్ చేశాడు. తొలుత వెంకటేశ్ అయ్యర్‌ను స్టంప్ ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే చహల్ సాధించిన ఘనతకు గుర్తింపుగా రాజస్తాన్ రాయల్స్ అతని పేరిట ప్రత్యేక్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. ఆ వెబ్‌సైట్‌కు www.Yuzigetshattrick.com అని పేరు ఇచ్చి చహల్‌ను గౌరవించుకుంది. ఆ వెబ్సైట్లో చహల్ ఫోటోలతో పాటు అతను ఈ సీజన్లో వికెట్లు తీసిన సందర్భాలను గుర్తుచేస్తూ షేర్ చేసింది. దీంతో పాటు సీజన్లో మరెవరైనా హ్యాట్రిక్ నమోదు చేసినా ఈ వెబ్సైట్లో కనిపించేలాగా డిజైన్ చేసింది. అయితే అవన్నీ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లు మాత్రమే. తాజాగా చహల్ పేరిట వెబ్‌సైట్‌ను డిజైన్ చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''చహల్ సాధించింది మాములు ఘనత కాదు.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం గొప్ప విషయం.. వెబ్సైట్ తయారు చేయడంలో తప్పులేదు.. ఆ మాత్రం ఉండాల్సిందే..'' అని పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం..'' చహల్ సాధించింది ఘనతే కావొచ్చు.. అంతమాత్రానా వెబ్సైట్ తయారు చేయడం ఏంటని తప్పుబట్టారు. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు.. So we did a thing... 😂https://t.co/zvjEuIDk2X https://t.co/l3kOpsNkw0 — Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2022 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌మేళా వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. -
Election Results 2022: కచ్చితమైన సమాచారం కోసం..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో, మణిపూర్‌లో 2 దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్తా చానళ్లు, వెబ్సైట్లు తమ అందించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే కచ్చితమైన, అధికారిక సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా చూడాలి? ► ముందుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ (results.eci.gov.in)లోకి వెళ్లాలి. ► 'అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికలు - మార్చి 2022' లింక్‌పై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే మీరు కొత్త వెబ్‌పేజీకి మళ్లించబడతారు ► ఎన్నికల ఫలితాలను చూడాలనుకుంటున్న రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే ఎన్నికల ఫలితాల ట్రెండ్ పేజీ ఓపెనవుతుంది. ► పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థులు అందరూ, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్.. ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోండి. ► ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు. ► దీంతో పాటు sakshi.comలోనూ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
‘ఉపకారం’.. బహుదూరం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ మొదలై 5 నెలలవుతున్నా ఇంకా 76 శాతం మంది విద్యార్థులే వివరాలు నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియను సర్కారు ఇప్పటికే రెండుసార్లు పొడిగించినా అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. 31తో గడువు పూర్తి కానుండటంతో ఆలోపు 90 శాతం లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. దీంతో గడువును మరోసారి పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో మొదలు రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సర్కారు గడువు పెట్టింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో గడువును నవంబర్ వరకు పొడిగించింది. అయినా అనుకున్న లక్ష్యం పూర్తవకపోవడంతో ఈ నెల 31 వరకు పెంచింది. ఇప్పటికీ కూడా 9.60 లక్షల మందే ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనాల ప్రకారం మరో 3 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత గడువులోగా 3 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం లేదు. వాస్తవానికి కాలేజీ యాజమాన్యాలు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించడం, వాళ్ల నుంచి వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలి. దీనిపై సంక్షేమ శాఖలు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. పరిశీలనపై తీవ్ర ప్రభావం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు గతంలో (కరోనాకు ముందు) నవంబర్ చివరి వారం, డిసెంబర్ రెండో వారం నాటికి 95 శాతం వచ్చేవి. వీటిని ఫిబ్రవరి రెండో వారం కల్లా సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి అర్హతను ఖరారు చేసేవారు. బడ్జెట్ లభ్యతను బట్టి నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి దరఖాస్తు ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. లక్ష్యం దూరంలో ఉండటంతో గడువును మరో నెల పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు మరింత ఆలస్యంగా ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది. -
అశ్లీల కంటెంట్.. అయినా ఆమ్రపాలి ఓకే
Onlyfans CEO Amrapali Ami Gan Biodata And Intresting Details: ‘‘ప్రొఫెషనలిజానికి ఏది అడ్డు రాదు. కారాదు కూడా. లోపాలు వెతుక్కుంటూ, విమర్శలకు భయపడి కూర్చునిపోతే అక్కడే ఆగిపోతాం. కెరీర్లోనే కాదు.. జీవితంలోనూ ముందుకు వెళ్లలేం. అందుకే తన ఎంపికనూ గర్వంగా చాటాల’ని కోరుకుంటోంది ఆమ్రపాలి గ్యాన్. ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో దూసుకుపోతున్న ఓ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ కంపెనీకి ఆమ్రపాలి ఇప్పుడు సీఈవోగా నియమితురాలైంది. అయితే అది అడల్ట్ కంటెంట్ ఫ్రెండ్లీ వెబ్సైట్ కావడం విశేషం. అందుకే ఆసక్తికరమైన చర్చకు దారితీసింది!. ప్రతీ రంగంలోనూ ఇప్పుడు భారతీయల హవా నడుస్తోంది. టెక్ కంపెనీల నుంచి ప్రతీదాంట్లోనూ సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు రాణిస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా చేరింది 36 ఏళ్ల ఆమ్రపాలి అమీ గ్యాన్. ముంబైలో పుట్టిపెరిగింది ఆమ్రపాలి. 2020లో ఓన్లీఫ్యాన్స్‌లో చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది గ్యాన్. అయితే ఓన్లీఫ్యాన్స్ వ్యవస్థాపకుడు టిమ్ స్టోక్లే పదవి నుంచి దిగిపోవడంతో.. ఇప్పుడు(డిసెంబర్ 21 నుంచి) గ్యాన్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టింది. ఇంతకు ముందు ఆమ్రపాలి.. కన్జూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపెనీల్లో కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పని చేసింది. ఆపై ఆర్కడ్ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా, కన్నాబిస్ కేఫ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, క్వెస్ట్ న్యూట్రీషియన్‌కు బ్రాండ్ కమ్యూనికేషన్స్ హెడ్‌గా, రెడ్ బుల్ మీడియా హౌజ్‌కి కూడా పని చేసింది. ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్ సీఈవోగా భారీ సవాళ్లు ఆమె ముందు ఉన్నాయి. అయితే కరోనా టైంలో వెబ్సైట్ చందాదారుల సంఖ్య పెరగడానికి కారణం.. ఆమ్రపాలి ఇచ్చిన ఐడియాలే!. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా సవాళ్లను అధిగమిస్తానని చెబుతోందామె. ఓన్లీఫ్యాన్స్.. లండన్ కేంద్రంగా పని చేసే ఇంటర్నెట్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్. 2016 నుంచి ఇది కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు(ఫ్యాన్స్) అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం.. మరోవైపు వెబ్‌సైట్‌కు కమిషన్ చేరుతోంది. అయితే కరోనా టైం నుంచి ఇది ఎక్కువస్థాయిలో అడల్ట్, పోర్న్ కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా సె*వర్కర్లకు, అడల్ట్ నటులకు కాసులు కురిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అశ్లీల కంటెంట్‌తో దూసుకుపోతున్న ఓన్లీఫ్యాన్స్‌కు ఓ భారతీయురాలు సీఈవో కావడం చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Tim Stokely (@timstokely) చదవండి: బూతు వెబ్సైట్లు.. పెయిడ్ సర్వీసులు బంద్! -
కట్నం లేకుండా పెళ్లికి ఓకేనా? అయితే, ఈ వెబ్సైట్ చూడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారి కోసం idontwantdowry.com సంస్థ ఈనెల 19న స్వయంవరం ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు జూమ్‌యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి ఉన్న వాళ్లు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, మరిన్ని వివరాలకు 9885810100 నంబర్లో సంప్రదించాలని సూచించింది. (చదవండి: గతేడాది నుంచి ప్రేమించుకుంటున్న సునీత, శ్రీనివాస్.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..) -
ఏపీఎస్ఆర్టీసీ ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి,తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి దృష్టా గత రెండేళ్ల కాలంపాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం భక్తుల కోసం దర్శనాలను పరిమితం చేసింది.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతూ ఉచిత దర్శనాలు,వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు కరోనా నిభందన మేరకు అనుమతి ఇస్తోంది. ఈ క్రమంలోనే రూ. 300ల స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేశారు. అయితే పరిమిత సంఖ్యలో టికెట్లు విడుదల చేస్తుండడంతో.. చాలా తక్కువ సమయంలో టికెట్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో దేశ విదేశాల్లోని వెంకన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల టీటీడీ కల్పించింది .ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో టికెట్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.in వెబ్సైట్లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమ శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది. భక్తుల సద్వినియోగం చేసుకోవాలి టీటీడీ అధికారులు ఆధ్మాత్మిక కోణంలో ఆలోచించి ఇచ్చిన దర్శన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.విజయవాడ,గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇడీ ప్రూఫ్,ఆర్టీసీ టికెట్స్ జిరాక్స్ కాఫీ,సాంప్రదాయ వస్త్ర దారణలో టీటీడీ నిభందనల మేరకు భక్తులను టీటీడీ అనుమతి ఇస్తోంది. –ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.చెంగల్ రెడ్డి చదవండి: గోల్డెన్ ఫిష్ @ రూ.2.60 లక్షలు -
స్వల్పంగా పెరిగిన మోదీ సంపద.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు విలువ గతేడాదితో పోలిస్తే స్పల్పంగా పెరిగింది. పీఎం వెబ్సైట్లో పొందుపరిచిన తాజా గణాంకాల ప్రకారం.. మోదీ నికర ఆస్తులు రూ. 3,07,68,885కు పెరిగాయి. గతేడాది ఈ సంపద 2.85 కోట్లు ఉండగా.. ఏడాదిలో 22 లక్షలు పెరిగింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం, మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31 నాటికి రూ 1.5 లక్షలు, చేతిలో నగదు రూ 36,000 ఉంది. ఇక ఎస్బీఐ గాంధీనగర్ బ్రాంచ్‌లో గత ఏడాది రూ 1.6 కోట్లుగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ 1.86 కోట్లకు పెరగడంతో మోదీ సంపద ఎగబాకింది. చదవండి: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం.. మోదీ పేరిట ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. ఎలాంటి ఆర్థిక సంస్థల నుంచి కూడా ఆయన రుణం తీసుకోలేదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి ఎలాంటి సంపద లేదు. అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో రూ.8,93,251, , లైఫ్ ఇన్స్‌రెన్స్ పాలసీ రూ.1,50,957, 2002లో కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్‌లో రూ. 20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు.. మోదీకి రూ 1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. చదవండి: పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి ఇకగుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు ప్రధాని మోదీ గాంధీనగర్ సెక్టార్ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3531 చ.అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనిని 2002 అక్టోబర్ 225న కొనుగోలు చేయగా.. అప్పట్లో దీని ఖరీదు రూ. 1.3 లక్షలుగా ఉంది. భూమిపై రూ. 2.4 లక్షల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దీని విలువ..రూ. 1.10 కోట్లు పలుకుతోంది. అయితే 2014 ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏ కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేయలేదు. -
రేపు సింగరేణి ఎలక్ట్రీషియన్ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ జనరల్ మేనేజర్(పర్సనల్) ఎ.ఆనందరావు తెలి పారు. హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచామని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని నాలుగు కేం ద్రాలు.. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కాలేజీ, సింగరేణి హైస్కూల్, అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష జరుగుతుంది. -
స్మార్ట్‌కార్డులు సిద్ధం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమంలో కీలక అడుగుపడింది. పథకం అమలుకు దిక్సూచిలా భావిం చేస్మార్ట్కార్డులు సిద్ధమవుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్మార్ట్‌కార్డులు అందజేస్తానని ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి వీటిని ఈనెల 17వ తేదీన లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్నప్పటికీ, కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలన్న యోచనతో ఆలస్యంగా జరిగింది. 24వ తేదీ వరకు గడు వు అనుకున్నా.. ఇంకా స్పష్టత రాకపోవడం తో 28వ తేదీ వరకు కార్డులను పంపిణీ చే యాలని లక్ష్యంగా పెట్టుకుంది. దళితబంధు అమలు కోసం ప్రత్యేక వెబ్సైట్, సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకమైన బయోమెట్రిక్ కార్డులు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో సెల్‌ఫోన్ సిమ్ కార్డు తరహాలో ఉన్న ప్రత్యేకమైన చిప్‌లో దళితబంధు లబ్ధిదారుల సమాచారం ఉంటుంది. లబ్ధిదారునితోపాటు అతని భార్యాపిల్లలు, ఎంచుకున్న ఉపాధి/వ్యాపారం/యూనిట్ వివరాలు, వాటికి అయిన ఖర్చు, బ్యాంక్ బ్యాలెన్సు, రోజువారీ లావాదేవీలు, పొదు పు, నిర్వహణ, బీమా/నామినీ ఇలా మొత్తం అతను ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం పొందుపరిచి ఉం టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లబ్ధిదారులకు ఇది ఆధార్‌కార్డుతో సమానం. ఈ కార్డు ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఖాతాలో రూ.10 లక్షలు జమ అయిన దగ్గర నుంచి వాటిని ఖర్చు చేస్తున్న తీరు, బిల్లుల చెల్లింపు, లాభనష్టాలు అన్నింటినీ అధికారులు పర్యవేక్షిస్తారు. వారి వ్యాపారస్థితిని బట్టి అప్రమత్తం చేస్తుంటారు. ప్రత్యేక యాప్‌లో వివరాలు.. త్వరలోనే దళితబంధు యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో లబ్ధిదారులకు కావాల్సిన సమాచారం. అధికారుల ఫోన్‌నెంబర్లు, వ్యాపారం వివరాలు, తోటి వ్యాపారుల పురోగతి, మార్కెట్ ట్రెండ్స్, వివిధ వ్యాపారాల సమాచారం తదితర కీలకమైన విషయాలు అందుబాటులో ఉంచుతారు. దీనికితోడుగా దళితబంధుకు ప్రత్యేక పోర్టల్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, దేశంలోనే ఇంతటి భారీ ఆర్థిక ప్యాకేజీతో రూపొందించిన పథకం కావడంతో దీని అధ్యయనానికి వివిధ పరిశోధక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నుంచి పలువురు హుజూరాబాద్‌ను సందర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పరిశోధక సంస్థలు కూడా ఈ పథకం అమలు అధ్యయనంపై ఆసక్తి చూపిస్తున్నాయి. -
ఉద్యోగం కోసం వెబ్సైట్లో ప్రొఫైల్ పెట్టాడు.. కాసేపటికే..
బాలానగర్: ఉద్యోగం కోసం నౌకరి డాట్ కామ్‌లో ప్రొఫైల్ పెడితే సైబర్ నేరగాళ్ల బారిన పడిన ఓ వ్యక్తి రూ.25,314లను పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ తెలిపిన వివరాలు.. ఆర సాయికుమార్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం కోసం నౌకరిడాట్ కామ్‌లో ఈ నెల 19న తన ప్రొఫైల్‌ను పెట్టాడు. అదే రోజు ఓ మహిళ హిందీలో మాట్లాడి నౌకరి డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నాని చెప్పింది. ఇంటర్వ్యూ గురించి 10 రూపాయలు పంపాలని లింక్ పంపిందిం. లింక్ ఓపెన్ చేసి అతని క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వేసేందుకు ప్రయత్నించినా 25,314 రూపాయలు డెబిట్ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించి సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పార్సిల్ రాలేదని సెర్చ్ చేస్తే రూ.7 వేలు.. సరైన సమయంలో పార్సిల్ రాలేదని ఓ వ్యక్తి ఆ పార్శిల్ సంస్థకు చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి బాలానగర్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏఆరస్సీ పార్శిల్ సంస్థ కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా అందులో కనిపించిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా ఫోన్లో ఓ వ్యక్తి హిందీలో మాట్లాడి మీకు వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి మట్లాడండి అని చెప్పాడు. వెంటనే ఫోన్ వచ్చింది పార్శిల్ వివరాలు కనుక్కొని పార్శిల్‌ను రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను ఒక లింక్ పంపిస్తాను. దాంట్లో పార్శిల్ వివరాలు నమోదు చేసి కేవలం 5 రూపాయలు పంపండి అని చెప్పాడు. ఆ లింక్‌లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, యూజర్ నేమ్, పాస్‌వర్డు ఎంట్రీ చేసి 5 రూపాయలు పంపగా కొద్ది సేపటి తరువాత 7వేలు అతని అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. మోసం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు -
అమెజాన్ కస్టమర్లకు షాక్! ఫిర్యాదుల మోత
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల పాటు ఆన్లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలు, ప్రైమ్ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్ మారు మోగింది. ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే, సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు. ఇంటర్నెట్లో అంతరాయాలను గుర్తించే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్‌లోని పలు రకాల సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
రాష్ట్రానికి మేలు జరిగేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా పార్టీ పెడుతున్నామని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో మహానేత వైఎస్ఆర్ జయంతి రోజైన ఈ నెల 8న పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె టీం వైఎస్ఎస్ఆర్.కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. నూత న రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులు, నేతలు, సోషల్ మీడియా వారియర్స్ కోసం ప్రత్యేకించి ఈ వెబ్‌సైట్‌ను రూ పొందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ముందుగా అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృ ద్ధి, సంక్షేమం కోసం రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తేవడమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్లు చెప్పారు. కార్యాలయం ముట్టడికి సీమ రైతుల యత్నం వైఎస్ షర్మిల కార్యాలయాన్ని ముట్టడించేందుకు అమరావతి పరిరక్షణ సమితి యత్నించింది. బుధవారం లోటస్‌పాండ్‌లోని ఆమె కార్యాలయానికి ఆ కమిటీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ తన అనుచరులతో వచ్చి కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ ఆందోళన చేపట్టడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. -
క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన వీరేంద్రుడు
న్యూఢిల్లీ: భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ CRICURUని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అతను ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని పేర్కొన్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించాడు. CRICURU సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్‌ఫర్ట్‌లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తామని, తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందని వివరించాడు. ఈ సందర్భంగా వెబ్సైట్ కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కోచింగ్ అందించడమే తమ లక్ష్యమని, ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకునే వెసలుబాటును తమ వెబ్సైట్ కల్పిస్తుందని, ఇందుకు కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలని వివరించాడు. ఈ వెబ్సైట్లో కోచింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉండనున్నాయని, అలాగే కోచింగ్ క్లాస్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు www.cricuru.comకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వెబ్సైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. చదవండి: టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం.. -
సైబరాబాద్ పోలీస్: కోవిడ్ సేవల కోసం ప్రత్యేక వెబ్సైట్
సాక్షి, సిటీబ్యూరో( హైదరాబాద్) : కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు మరో ఆవిష్కరణ చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో covid.scsc.in పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా, వాట్సాప్ తదితరాల్లో కొవిడ్‌పై రకరకాలైన అంశాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం, ఏది కాదో తెలియక ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఆ పరిస్థితులకు covid.scsc.in వెబ్సైట్ ఓ పరిష్కారం అవుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సైట్లో వివిధ రకాలైన ఉపయుక్త సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు. సైట్లో ఉండే వివరాలివి... ► క్రిటికల్ కేర్ సర్వీసెస్: అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు ► సెల్ఫ్ కేర్ సర్వీసెస్: ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు, డాక్టర్ ఆన్ కాల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహారం అందించే సంస్థలు ► ప్రివెంటివ్ కేర్ సర్వీసెస్: సైకాలజిస్టులు/కౌన్సిలర్ల సేవలు, వాక్సినేషన్ సెంటర్ల వివరాలు, పీపీఈ కిట్స్ సరఫరాదారులు, శానిటైజేషన్ సేవలు అందించే సంస్థలు ► లేటెస్ట్ ఇన్ఫర్మేషన్: కోవిడ్ బులెటిన్స్, కీలక ఫోన్ నెంబర్లు, వివరాలు, నెట్వర్క్ గ్రూపులు ( చదవండి: కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా? ) -
ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలి. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలి. పౌరులనుంచి గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలి. గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలి. అలాగే పౌరుడి నుంచి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలి. నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్ పరిష్కారం కాకపోతే అది ఏ స్థాయిలో నిలిచిపోయింది అన్నది తెలియాలి. సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్ వెళ్లాలి. స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తాం’’ అని అన్నారు. పటిష్టంగా నవరత్నాల అమలు నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. తర్వాత నెలలో వెరిఫికేషన్ చేయాలి. వాటిని వెంటనే పరిష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలి. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది. అర్హులందరికీ ఇళ్ల పట్టా దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి. కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి పట్టా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇంటి పట్టా అందించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం కాగా, పాత స్పందన పోర్టల్‌లో 2677 సబ్జెక్టులు, 27,919 సబ్ సబ్జెక్టులు ఉండేవి. అప్డేషన్ చేసిన పోర్ట్ల్లో 858 సబ్జెక్టులు, 3758 సబ్ సబ్జెక్టులు ఉన్నాయి. దీనివల్ల చాలావరకూ సమయం ఆదా అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌లో పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్ సెంటర్ ద్వారా కాని, వెబ్ అప్లికేషన్ ద్వారా కాని, మొబైల్ యాప్ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉంది. తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరిస్తారు. తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ లింక్ ద్వారా లేదా 1902కు కాల్చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతిస్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చు. సేవలపట్ల పౌరుడు నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు థర్డ్ పార్టీ ఆడిట్‌కూడా జరుగుతుంది. -
వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదు
-
ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారు. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనని సీఎం పేర్కొన్నారు. దురుద్దేశపూర్వక ప్రచారంమీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. చదవండి: హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ.. చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం -
నేతన్నలకు బాసటగా శ్రీకాకుళం టెకీలు
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్ కాటన్‌కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!) దానిలో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్2హోమ్’ వెబ్ పేజ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
సంక్షేమంలో ముందున్నాం: సజ్జల
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సంక్షేమం.. ప్రజా సంక్షేమంలో భాగమేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన అనుభవం లేకున్నా.. సంక్షేమంలో ముందున్నామని, ఏడాదిన్నరలోనే ప్రపంచ, దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్లకుపైగా అప్పులు పెట్టి పోయింది. కోవిడ్ కట్టడిలో ఖర్చుకు వెనుకాడని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కావాలనే ఘర్షణ వైఖరి) ‘‘ప్రజా జీవనం కోవిడ్ కారణంగా స్తంభించింది. ఎవరికైనా సమాచారం చాలా ముఖ్యం. సమాచార వారధి ఉండటం చాలా అవసరం. నేను రాజకీయ నాయకుడిని కాదు. పరిష్కారం దిశగా ఏ సమస్య అయినా ఆలోచించగలగడానికి కారణం సీఎం జగన్ పట్టుదల. సీఎం జగన్ వెంట నడుస్తున్న వారిగా మేం అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వ విధానాలను అమలు చేసే యంత్రాంగం సమస్యలు తీర్చాలి. సీఎం జగన్ స్వేచ్ఛగా తాను అనుకున్నవి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) -
ఆస్తుల నమోదుకు వెబ్సైట్..
సాక్షి, హైదరాబాద్: యజమానులే స్వయంగా వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ (www.npb.telangana.gov.in) ను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఈ వెబ్సైట్లో యజమానులే నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మీ–సేవ ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మీ–సేవ కేంద్రాలకు చెల్లించాల్సిన చార్జీలను జీహెచ్ఎంసీ/పురపాలికలే చెల్లిస్తాయని చెప్పారు. నకిలీ లావాదేవీలను నిర్మూలించేందుకు ఆధార్ నంబర్, యాజమాన్య హక్కులకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తం చేసేందుకు మొబైల్ ఫోన్ నంబర్, ఆస్తులపై కుటుంబసభ్యుల హక్కులను పరిరక్షించేందుకు వారి వివరాలను, మెరూన్ రంగు పాసుబుక్‌పై ముద్రించేందుకు యజమాని ఫొటో, స్థలం విస్తీర్ణం/ నిర్మిత ప్రాంతం వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుందని వివరించారు. ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ), ఓసీలకు సంబంధించిన ఆస్తుల నమోదుకు త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. శనివారం నాటికి 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ధరణి ప్రాజెక్టు తీసుకొస్తోందని, ఆస్తుల క్రయవిక్రయాలు జరిగిన వెంటనే మ్యూటేషన్లు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.ఆస్తుల యజమానుల వివరాలను రహస్య (ఇన్‌క్రిప్టెడ్) కోడ్ భాషలో రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో నిల్వ చేస్తామన్నారు. ఈ సమాచారాన్ని ధరణి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని వివరించారు. 25న ‘ధరణి’ ప్రారంభం: ఈ నెల 25న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆ రోజు నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, ధరణి నిర్వహణ, సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. -
వాటికి చెక్ : టిక్‌టాక్ కొత్త ఎత్తుగడ
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడికి వ్యతిరేకంగా రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో తన ప్లాట్‌ఫామ్ భద్రతపై తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకునేందుకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే డేటా సెక్యూరిటీపై సందేహాలను తీర్చేందుకు ఒక ట్విటర్ ఖాతాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. (టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు) అమెరికా ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండించిన టిక్‌టాక్ ఒక వెబ్సైట్ (www.tiktokus.info)ను, @tiktok_comms పేరుతో ట్విటర్ అకౌంట్ ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా టిక్‌టాక్ సంబంధించిన వాస్తవ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే సంబంధిత వార్తలకు వెంటనే స్పందించే ఉద్దేశ్యంతో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశాన్ని యూజర్లకు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. కుటుంబ సభ్యులుగా, వినియోగదారులు, క్రియేటర్స్, భాగస్వాములుగా వైట్ హౌస్ సహా మీరు ఎన్నుకున్న ప్రతినిధులకు మీ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉందని టిక్‌టాక్ ప్రకటించింది. అలాగే చైనా ప్రభుత్వంతో వ్యక్తిగత డేటాను పంచుకుందున్న ఆరోపణలను మరోసారి తీవ్రంగా ఖండించింది. చైనాలో టిక్‌టాక్ అందుబాటులో లేదు. అక్కడి ప్రభుత్వానికి అమెరికా వినియోగదారుల డేటాను ఎప్పుడూ అందించలేదు.. అందించదు అని టిక్‌టాక్ స్పష్టం చేసింది. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) కాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్ ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. -
భళా ‘మేడ్చల్ బడి’!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కరోనా కరాళ నత్యం చేస్తున్న వేళ...విద్యా సంస్థలు నిరవధికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలను తెరవకూడదని పేర్కొనటంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. అలాగే, ఫీజులుం కోసం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించగా, పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఐదు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ చర్యలకు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు బడికెళ్లకుండానే ... పాఠాలు నేర్చుకునే విధంగా జిల్లా విద్యా శాఖ ‘మేడ్చల్ బడి’ పేరుతో గత నెల 7న అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌కు విద్యార్థుల నుంచి భారీగా స్పందన లభిస్తున్నది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు బడికి వెళ్లకుండానే తమకు నచ్చిన సమయంలో... తమకు నచ్చిన పాఠ్యాంశాన్ని వీలున్నప్పుడు చూస్తూ...చదువు కొనటానికి అవకాశం ఏర్పడింది. కరోనా కష్ట కాలంలో పాఠశాలలు మూతబడిన దశలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠాలు నేర్పే చదువులమ్మగా ‘మేడ్చల్ బడి’ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. విద్యార్థులకు ప్రయోజనం ఇలా... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ‘మేడ్చల్ బడి’ వెబ్‌సైట్‌ను డీఈఓ విజయకుమారి ప్రత్యేక శ్రద్ధతో రెండు నెలలు శ్రమించి అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్లో బోధించాలనే ఉద్దేశ్యంతో సంబంధిత ఉపాధ్యాయుల సహకారాలతో మేడ్చల్‌బడి’ని డీఈఓ తయారు చేయించారు. పాఠాలకు సంబంధించిన వీడియోలను రూపొందించి వెబ్సైట్లో పెట్టిన విద్యాశాఖ ప్రయోజనకరంగా ఉందన్న ఉద్దేశ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు వీలున్నప్పుడల్లా లాగిన్ అయి పాఠాలు వింటున్నారు. వెబ్సైట్లో 250 పాఠ్యాంశాలు మేడ్చల్ బడి వెబ్సైట్లో 250 పాఠ్యాంశాలు అప్లోడ్ చేయటంతో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతి రోజు 3 వేల నుంచి 5 వేల మంది సంబంధిత పాఠ్యాంశాలను వీక్షిస్తున్నారు. ఈ నెల 7 వ తేదీ వరకు 1,11,339 మంది విద్యార్థులు తమకు సంబంధించిన పాఠ్యాంశాలను వీక్షించి పాఠాలు నేర్చుకున్నారు. జులై 11న అత్యధికంగా 13,889 మంది వెబ్సైట్ ద్వారా పాఠాలు వినగా, అత్యల్పంగా ఈ నెల 3 వ తేదీన 1414 మంది విద్యార్థులు పాఠాలు విన్నారు. అందులో భాగంగా ప్రత్యేక మార్పులు తీసుకువచ్చి రోజూ ఒక సబ్జెక్టు మేరకు సమయం ఇచ్చి విద్యార్థులు అభ్యసనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అనునిత్యం అసైన్మెంట్లు అప్లోడ్ చేస్తున్నారు. విద్యార్థులు కూడా తాము చేసిన అసైన్మెంట్లు అప్లోడ్ చేసే వీలు కల్పించారు. విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు మేడ్చల్‌బడి వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు మంచి జరుగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల స్పందన ఆధారంగా ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసి వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. వెబ్సైట్లో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించి పెట్టాం. అందరికి అందుబాటులో ఉండేలా పాఠాలను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. – డీఈఓ విజయకుమారి -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రూ.75కే మీడియా సంస్థ అమ్మకం!
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఈ–ఎస్ఆర్’
ప్రభుత్వ ఉద్యోగులు/ అధికారులకు సర్వీసు పరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నెలా ఒకటవ తేదీన టంచన్‌గా వేతనం పొందడంతో పాటు, ఉద్యోగ విరమణ చేసే రోజునే బెనిఫిట్స్ అన్నీ చేతికందేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్) స్థానంలో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్‌సీఎం) అనే నూతన ఆర్థిక విధానాన్ని జూన్ నెల నుంచి అమలు చేసేందుకు ఆర్థిఖ శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ఉద్యోగ, అధికారులు ‘ఈ–ఎస్ఆర్’ పొందేందుకు వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాక్షి, మచిలీపట్నం: సర్వీసు రిజిస్టర్ పుస్తకాలతో పనిలేకుండా చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే తమ సర్వీసుకు సంబంధించిన సమస్త సమాచారం కనిపిస్తుంది. ఆన్లైన్లోనే ఉద్యోగుల సర్వీసు పరమైన వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఉద్యోగి/అధికారి ప్రభుత్వ కొలువులో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు పుస్తక రూపంలో ఉన్న సర్వీసు రిజిస్టర్‌ను ఉద్యోగ కాలం మొత్తంగా అంటే 30 నుంచి 35 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా భద్రపరచాల్సి వస్తోంది. ఏదైనా అనుకోని ఘటనల్లో సర్వీసు రిజిస్టర్ పోతే అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయా శాఖల్లోని సీనియర్ అసిస్టెంట్లు, అక్కడ నుంచి డీడీఓలు, అటు తరువాత ఎస్టీఓ, డీటీఓ ఇలా పలువురి వద్దకు ఎస్ఆర్ వెళితేనే కానీ సవ్యంగా వేతనాలు, ప్రోత్సాహకాలు అందుకోని పరిస్థితి ఇప్పటివరకు ఉంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ప్రస్తుత ప్రభుత్వం చక్కటి ఆలోచన చేసింది. ఈ–ఎస్ఆర్ ఇలా పూరించాలి ఈ–ఎస్ఆర్ పొందేందుకు ప్రతి ఉద్యోగి/అధికారి తప్పనిసరిగా ఆన్లైన్లో పూర్తి స్థాయి వివరాలు పొందుపరచాలి. ఆయా శాఖల ఉన్నతాధికారుల సూచనల మేరకు వెబ్సైట్లో లాగిన్ అయిన తరువాత మొదటిగా సీఎఫ్ఎంఎస్ ఐడీ నంబర్ (ఎనిమిది అంకెలు) నమోదు చేయాలి. ఆ తరువాత వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌ను నమోదుచేస్తే, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తరువాత ఒక్కో పార్టులో అడిగిన సమాచారం పూరించాలి. ఇలా ప్రతి ఉద్యోగి/ అధికారి తమ వివరాలు 12 పార్టుల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడి నుంచి డీడీఓల లాగిన్ చేరుతుంది. డీడీఓల ధ్రువీకరణ తరువాత ప్రభుత్వానికి వివరాలు చేరుతాయి. చదవండి: బాబు పీఏ కోసం నిబంధనలు తుంగలో తొక్కి..! ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి 1.ఎస్‌ఆర్‌లో ఇప్పటికే నమోదుచేసి ఉన్న పదో తరగతి/ఎస్ఎస్సీ సర్టిఫికెట్ 2. ఇటీవల దిగిన పాస్‌ఫొటో 3. ఉద్యోగంలో చేరిన నాటి ఫొటో 4. లోకల్ స్టేటస్‌ను ధ్రువీకరించే పత్రం 5. విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు 6. పాన్‌కార్డు 7. బ్యాంకు అకౌంట్ మొదటి పేజీ 8. పీఎఫ్ స్లిప్/పీఆర్ఏఎన్ కార్డు 9. ఏపీజీ ఎల్ఐసీ బాండు 10. దివ్యాంగులైతే మెడికల్ సరి్టఫికెట్ 11. కుల ధ్రువీకరణ పత్రం. 12 పార్టులుగా వివరాలు 1. వ్యక్తిగత సమాచారం 2. సర్టిఫికెట్స్ 3. సర్వీసు డీటైల్స్ 4. వేతనం వివరాలు 5. సెలవుల సమాచారం 6. లీవ్ ట్రావెల్స్ కన్సెక్షన్ సమాచారం 7. ఇంట్రస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ 8. గ్రూప్ ఇన్సూ్యరెన్స్ డీటైల్స్ 9. సర్వీసు వెరిఫికేషన్ డీటైల్స్ 10 డిపార్ట్మెంట్ పరీక్షలు, శిక్షణలు 11. ఇన్సెంటివ్, పనిష్మెంట్స్ 12. ఫెన్షన్ ప్రపోజల్స్ ప్రభుత్వ నిర్ణయం మంచిదే ప్రభుత్వ నిర్ణయం మంచిదే. వేతనాలు, బెనిఫిట్స్ కోసం సర్వీసు రిజిస్టర్లు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. సమయానికి అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. అయితే దీనిపై ఉద్యోగుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. శాఖల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. –చేబ్రోలు శరత్చంద్ర, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగులకు ఎంతో మేలు ఈ–ఎస్ఆర్ అమలు వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు హెచ్ఎం, ఎంఈఓల చుట్టూ ఉపాధ్యాయులు తిరగాల్సి వస్తుంది. ఈ–ఎస్ఆర్ వల్ల ఎప్పుడు, ఏ బెనిఫిట్స్ రావాలో ఆటోమేటిక్‌గా జనరేట్ అయి, ఉద్యోగుల ఖాతాల్లోకి చేరుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. –ఎంవీ మహంకాళిరావు, వైఎస్సార్ టీఎఫ్, జిల్లా కార్యదర్శి -
కరోనా ట్రాకర్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి కోరలు చాచడంతో లాక్డౌన్ కారణంగా దేశమంతా ఇంటికే పరిమితమైంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇదే సమయంలో ఏ నగరంలో ఎక్కడ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇలా తెలుసుకోవడం వల్ల ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే, మీ పరిసరాల్లో ఎంత మంది కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు గోవాకు చెందిన విద్యార్థులు కరోనా ట్రాకర్ (www.cosonatracker.in) వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇది యాప్ రూపంలోనూ లభిస్తుంది. గోవాకు చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీ కెనీ, అతని స్నేహితులు సలీల్ నాయక్, నికేత్ కామత్, రిషికేశ్ భండారీ, సాకేత్ మరాఠేతో కలసి కరోనా ట్రాకర్‌ను డిజైన్ చేశాడు. హప్కిన్స్ యూనివర్సిటీ మరికొన్ని నమ్మకమైన ఎన్జీవోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ యాప్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన.. ఆ ప్రాంతాలను మార్క్ చేసి చూపిస్తుంది. మనదేశంలో ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది కోలుకున్నారు? మరణాలు, రికవరీ రేటు, డెత్ రేటు తదితరాలు పొందుపరిచారు. వయసులవారీగా ఎంతమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందో కూడా గ్రాఫ్‌ల ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ యాప్ ఆధారంగా.. దేశంలో మొత్తం 1,199 మందికి పాజిటివ్ రాగా, అందులో 20–30 ఏళ్లవారు దాదాపు 130 మంది ఉన్నారు. 30–40 ఏళ్లవారు సుమారు 90 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వెబ్సైట్/యాప్ ద్వారా వివరించారు. అంతేకాదు, ఈ వెబ్సైట్ ద్వారా విరాళాలు కూడా పంపవచ్చు. ఆన్లైన్, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా విరాళాలు అందించవచ్చు.