
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ఆధునికీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యూజర్లకు మరింత సౌకర్యంగా, విలువ ఆధారిత సదుపాయాలతో దీన్ని రూపొందించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది.
సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.‘కొత్త టెక్నాలజీకి అనగుణంగా ఉండేందుకు, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవం కోసం ఐటీ శాఖ వెబ్‌సైట్ www.incometaxindia.gov.in ను యూజర్లకు అనుకూల ఇంటర్‌ఫేస్, విలువ ఆధారిత ఫీచ ర్లతో పునరుద్ధరించింది’అని సీబీడీటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment