Latest Features
-
ఆధునిక ఫీచర్లతో ప్రారంభమైన ఐటీ శాఖ వెబ్సైట్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ఆధునికీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యూజర్లకు మరింత సౌకర్యంగా, విలువ ఆధారిత సదుపాయాలతో దీన్ని రూపొందించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.‘కొత్త టెక్నాలజీకి అనగుణంగా ఉండేందుకు, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవం కోసం ఐటీ శాఖ వెబ్సైట్ www.incometaxindia.gov.in ను యూజర్లకు అనుకూల ఇంటర్ఫేస్, విలువ ఆధారిత ఫీచ ర్లతో పునరుద్ధరించింది’అని సీబీడీటీ పేర్కొంది. -
Mi Notebook Pro X 15 : అదిరే ఫీచర్లతో వచ్చేస్తోంది
షియోమి నుంచి మరో అదిరిపోయే నోట్‌బుక్ వచ్చింది. గతేడాది విడుదలైన సక్సెస్ఫుల్ నోట్‌బుక్ సిరీస్ 15ని మరింతగా అప్డేట్ చేసి ప్రో ఎక్స్‌గా కొత్త వెర్షన్‌ని రిలీజ్‌కి ఎంఐ సిద్ధమైంది. ఫాస్ట్ ఛార్జింగ్ నోట్‌బుక్ ప్రో ఎక్స 15లో అందరినీ ఎక్కుగా ఆకట్టుకునే ఫీచర్లు రెండున్నాయి. అందులో ఒకటి ఛార్జింగ్ స్పీడ్. ఈ నోట్‌బుక్‌తో పాటు 130 వాట్స్ ఛార్జర్‌ని అందించింది. దీంతో కేవలం ఇరవై ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 80Whrగా ఉంది. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 11.50 గంటల పాటు పని చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే నోట్‌బుక్ ప్రో ఎక్స్ 15లో 15.6 ఇంచ్ డిస్ప్లే ఉంది. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు 3.5 కే ఓఎల్ఈడీ టెక్నాలజీని డిస్ప్లేకి జత చేశారు. అయితే పిక్సెల్ డెన్సిటీ విషయంలో ఎంఐ కాంప్రమైజ్ అయ్యింది. కేవలం 221 పీపీఐనే అందించింది. ఇతర ఫీచర్లు విండోస్ 10పై పని చేసే ఎంఐ నోట్‌బుక్ ప్రో ఎక్స్ 15లో గేమింగ్ కోసం నివిడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 టీఐ గ్రాఫిక్ కార్డుని ఉపయోగించారు. ఇక ప్రాసెసర్‌కి సంబంధించి 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-11300H ని వాడారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. డీటీఎస్ టెక్నాలజీతో కూడిన 4 స్పీకర్లు అమర్చారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా బ్రైట్నెస్ను అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ డిస్ప్లే, కీబోర్డులలో అందించారు. రెండు యూఎస్బీ పోర్టులు, ఒక టైప్ సీ పోర్టు, ఒక హెచ్డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. జులై 9న ఎంఐ నోట్‌బుక్ ఎక్స్ 15 లాప్‌ట్యాప్ జులై 9 నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంది. 16 జీబీ ర్యామ్ 512 ఇంటర్నల్ మెమోరీ మోడల్ ఇండియన్ మార్కెట్లో రూ. 92,100కు లభించనుండగా 32 జీబీ ర్యామ్, వన్ టెరాబైట్ ఇంటర్నల్ మెమోరీ ఉన్న మోడల్ ధర రూ. 1,15,100గా ఉంది. తొలుత చైనాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర మార్కెట్లకు వస్తామని షియోమీ తెలిపింది. చదవండి : ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా.. -
వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్.. వారెవ్వా!
ముంబై: వాట్సాప్.. వెరీ వెరీ స్పెషల్! ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ఈ మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ లెటెస్ట్‌గా మరిన్ని అప్డేట్స్ అందిస్తోంది. మ్యూట్ బటన్, న్యూ ఐకాన్స్, కేటలాగ్ షార్ట్‌కట్, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్డేటెడ్ వెర్షన్లో పొందుపరిచింది. వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి నార్మల్ యూజర్లకూ అందిస్తోంది. ఆ సరికొత్త ఫీచర్లలోని కొన్ని ఇవే.. ఆల్వేస్ మ్యూట్ బటన్ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తుంటారు. మొహమాటం కొద్దీ గ్రూప్ నుంచి లెప్ట్ అవలేం. అలాంటప్పుడే మ్యూట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ల బాధ తప్పించుకుంటాం. ఈ మ్యూట్ బటన్‌లో ఇప్పటి వరకు 8 గంటలు, వారం, సంవ్సతరం ఆప్షన్లుండేవి. ఇప్పుడు ‘ఫరెవర్’ అనే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. అంటే.. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకెప్పుడూ ఆ గ్రూప్ నోటిఫికేషన్లు మనకు చికాకు తెప్పించవు. లెటెస్ట్‌గా 138 ఎమోజీలు.. చాట్ చేసే సమయంలో ఎమోజీలు యాడ్ చేస్తే ఆ మజాయే వేరు. ముఖ్యంగా మన మూడ్‌ను తెలియపరిచేందుకు ఎక్కువగా ఈ ఎమోజీలను యూజ్ చేస్తుంటాం. అందుకే ఒకేసారి ఏకంగా 138 ఎమోజీలను వాట్సాప్ యాడ్ చేస్తోంది. చెఫ్, ఫార్మర్, పెయింటర్, వీల్ చెయిర్ వంటి ఎమోజీలతోపాటు మరిన్ని అట్రాక్టివ్ ఆబ్జెక్ట్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్. న్యూ అటాచ్మెంట్ ఐకాన్స్ మనం వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పంపిస్తుంటాం. ఇందుకోసం అటాచ్మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మనకు నచ్చిన ఫైల్స్‌ను సెండ్ చేస్తాం. ఈ అటాచ్మెంట్ ఐకాన్‌లో ఇప్పటి వరకు డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్, కాంటాక్స్ ఆప్షన్స్ ఉండగా.. ఇప్పుడు అదనంగా ‘పేమెంట్’, ‘రూమ్’లను యాడ్ చేశారు. ఈ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ‘రూమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నేరుగా ఫేస్బుక్ మెసెంజర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు. కేటలాగ్ షార్ట్‌కట్ ప్రత్యేకంగా బిజినెస్ వాట్సాప్ యూజర్లకు ఈ కేటలాగ్ షార్ట్‌కట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. హోం మెనూలో ఉండే ఆడియో, వీడియో కాల్స్ ఐకాన్స్‌ను మెర్జ్ చేసి దాని పక్కనే కొత్తగా కేటలాగ్ ఐకాన్ షార్ట్‌కట్‌ను యాడ్ చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వాట్సాప్, డెస్క్‌టాప్ యాప్‌లకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. వీడియోలు, ఫొటోలు సరికొత్తగా.. ఫొటోలు, జిఫ్ ఇమేజ్‌లను సెండ్ చేసే సమయంలోనే ఎడిట్ చేసుకునే ఆప్షన్‌తో ‘మీడియా గైడ్‌లైన్స్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇకపై మనం పంపించే వీడియోలు, ఫొటోలపై టెక్స్ రాసుకోవడంతోపాటు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లలో కొన్ని ప్రస్తుతానికి బీటా అకౌంట్లకు పరిమితం చేసిన వాట్సాప్.. మరికొద్ది రోజుల్లో యూజర్లందరికీ అందించనుంది. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి వాట్సాప్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకుఉని లేటెస్ట్ ఫీచర్లను సద్వినియోగం చేసుకోండి. -
మొబైల్ కొంటున్నారా?
శేఖర్ మొబైల్ ఫోన్ మార్చాలనుకున్నాడు. ఎలాగూ మారుస్తున్నాం కదా... చక్కని ఫీచర్లున్న బ్రాండెడ్ మొబైల్... అది కూడా కెమెరా, ర్యామ్, ప్రాసెసర్ అన్నీ బాగా అప్‌గ్రేడెడ్ అయి ఉంటే బాగుండుననుకున్నాడు. అందుకే... జీతంలోంచి నెలనెలా దాచిన మొత్తాన్ని తీసి దాదాపు రూ.50 వేలు పెట్టి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇంతా చేసి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేశాడు కానీ... దానికి గాను తగ్గించిన మొత్తం కేవలం రూ.3వేలు. కొన్నపుడేమో ఆ ఫోన్ కూడా దాదాపు 12 వేలు పెట్టి కొన్నదే. కాకుంటే ఏడాది వాడకానికే దాని ధర రూ.3 వేలకు పడిపోయింది. సరే! పోతే పోయిందని కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో తీసుకున్న శేఖర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇపుడు ఆఫీసులో అతనిదే లేటెస్ట్ ఫీచర్లున్న హై-ఎండ్ మొబైల్. నాలుగు నెలలు గడిచింది. ఆ రోజే కొన్న కొత్త ఫోన్‌ను తెచ్చి శేఖర్‌కు చూపించాడు రఘు. అందులో ఉన్న ఫీచర్లను వివరిస్తుంటే శేఖర్ బుర్ర తిరిగింది. ఎందుకంటే అన్నీ శేఖర్ ఫోన్‌కన్నా ఆధునిక ఫీచర్లే. కెమెరా నుంచి ర్యామ్, మెమరీ వరకూ అన్నీ ఎక్కువే. ధర మాత్రం కేవలం రూ.17,500. శేఖర్ కొన్న బ్రాండ్ కాకపోయినా అది కూడా మంచి బ్రాండే. శేఖర్‌కు ఆ రోజంతా నిద్రపట్టలేదు. తను రూ.50వేలు పెట్టి ఫోన్ కొని నిండా నాలుగు నెలలు కాలేదు. అంతకన్నా మంచి ఫోన్... అంతకన్నా చాలా తక్కువ ధరకే!! ఎలా సాధ్యం? మర్నాడు రఘుతో ఇదే మాటంటే తనేమన్నాడో తెలుసా? నువ్వు కొన్న ఫోన్ కూడా ఇపుడు రూ.30 వేలకే వస్తోందోయ్!! అని! గతేడాది భారతదేశ మార్కెట్లోకి 1,137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి. అంటే... రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయన్న మాట. మరి ఎంత కొత్త ఫోనైనా ఇలాంటి మార్కెట్లో నెల తిరిగేసరికి పాతబడిపోతోందంటే వింతేముంది? ఇక స్మార్ట్ఫోన్లను చూస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. అంటే సగటున భారతీయ కంపెనీలు రోజుకు 1.3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయన్నమాట. మరి రోజుకో కొత్త ఫోను మార్కెట్లోకి వస్తున్నపుడు ఏ ఫోనైనా ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది చెప్పండి? అందుకే... ఫోన్లు కొనే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తరవాత బాధ పడాల్సిన అవసరం రాకపోవచ్చనేది నిపుణుల సలహా. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో * ఒక దాన్ని మించి మరొకదాన్లో ఫీచర్లు; ధరలోనూ పోటీ * విడుదల చేసిన ఐదారు నెలలకే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు * అందుకే కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు అవసరాన్ని తెలుసుకోండి! * ఫోన్ కొనేముందు మీ అవసరమేంటో తెలుసుకోండి. కేవలం మాట్లాడటానికా? లేక గేమ్స్ ఆడటానికా? మంచి ఫొటోలు తీసుకోవటానికా? డిజిటల్ అసిస్టెంట్‌లా వివిధ అవసరాలకు వాడుకోవటానికా? ఇలా అవసరమేంటో తెలుసుకోవాలి. * ఫొటోలకోసం అనుకోండి. అప్పట్లో మార్కెట్లో అత్యధిక పిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్ ఉంటే అది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. గేమ్స్ కోసమనుకుంటే అధిక ర్యామ్ ఉండే ఫోన్‌ను, వీడియోల కోసం తీసుకునేవారు పెద్ద డిస్ప్లేను చూసుకోవాలి. ఇలా మన అవసరానికి తగ్గ ఫీచర్ హైఎండ్‌లో ఉన్నది చూసుకుని మిగతా విషయాల్లో రాజీ పడొచ్చు. అప్పుడు ఫోన్ తక్కువ ధరకే వస్తుంది. - కొన్నాళ్ల తర్వాత మరిన్ని ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా... మన అవసరానికి సంబంధించిన ఫీచర్ మాత్రం మరీ మారిపోయే అవకాశాలు తక్కువ. బాధేమీ ఉండదు. కొన్నాళ్లు వేచి చూడండి... ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. తరవాత మరింత హైఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చునని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బం దులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మం తా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయటం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాకంతా విక్రయించాలి కనుక రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా సక్సెస్ అయిన ఒకటిరెండు మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకని కాస్త వేచిచూస్తే బెటర్. హోంవర్క్ చేస్తే మంచిది... ఏదైనా ఫోన్ కొనాలనుకున్నపుడు దాని ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుని... మార్కెట్లో అలాంటి ఫీచర్లున్న ఇతర ఫోన్ల ధరలు కూడా ఎంతున్నాయో తెలుసుకోవాలి. ఇపుడు చాలా దుకాణాలు ఇలాంటి కంపేరిజన్ను అందిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సైట్లయితే చెప్పనే అక్కర్లేదు. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్లినా మూడు నాలుగు ఫోన్లను ఎంచుకుని వాటిలో ఫీచర్లను, ధరను పోల్చి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కొన్ని ఫోన్లను పోల్చి చూసుకున్నాకే ఎంచుకుంటే, తక్కువ ధరకే నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ధరలెందుకు తగ్గుతున్నాయంటే... కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి. ధరలెందుకు తగ్గుతున్నాయంటే.. కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి.