వాట్సాప్‌లో లేటెస్ట్‌ ఫీచర్స్‌.. వారెవ్వా! | WhatsApp latest features rolled out | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో లేటెస్ట్‌ ఫీచర్స్‌.. వారెవ్వా!

Published Sun, Oct 4 2020 12:46 PM | Last Updated on Sun, Oct 4 2020 7:54 PM

WhatsApp latest features rolled out - Sakshi

ముంబై: వాట్సాప్‌.. వెరీ వెరీ స్పెషల్‌! ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ఈ మోస్ట్‌ పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ లెటెస్ట్‌గా మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తోంది. మ్యూట్‌ బటన్‌, న్యూ ఐకాన్స్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో పొందుపరిచింది.  వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి నార్మల్‌ యూజర్లకూ అందిస్తోంది. ఆ సరికొత్త ఫీచర్లలోని కొన్ని ఇవే..

ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌
కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని వాట్సాప్‌ గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుంటారు. మొహమాటం కొద్దీ గ్రూప్‌ నుంచి లెప్ట్‌ అవలేం. అలాంటప్పుడే మ్యూట్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ల బాధ తప్పించుకుంటాం. ఈ మ్యూట్‌ బటన్‌లో ఇప్పటి వరకు 8 గంటలు, వారం, సంవ్సతరం ఆప్షన్లుండేవి. ఇప్పుడు ‘ఫరెవర్‌’ అనే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టింది. అంటే.. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే ఇంకెప్పుడూ ఆ గ్రూప్‌ నోటిఫికేషన్లు మనకు చికాకు తెప్పించవు.

లెటెస్ట్‌గా 138 ఎమోజీలు..
చాట్ చేసే సమయంలో ఎమోజీలు యాడ్‌ చేస్తే ఆ మజాయే వేరు. ముఖ్యంగా మన మూడ్‌ను తెలియపరిచేందుకు ఎక్కువగా ఈ ఎమోజీలను యూజ్‌ చేస్తుంటాం. అందుకే ఒకేసారి ఏకంగా 138 ఎమోజీలను వాట్సాప్‌ యాడ్‌ చేస్తోంది. చెఫ్‌, ఫార్మర్‌, పెయింటర్‌, వీల్‌ చెయిర్‌ వంటి ఎమోజీలతోపాటు మరిన్ని అట్రాక్టివ్‌ ఆబ్జెక్ట్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్‌.  

న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌
మనం వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పంపిస్తుంటాం. ఇందుకోసం అటాచ్‌మెంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మనకు నచ్చిన ఫైల్స్‌ను సెండ్‌ చేస్తాం. ఈ అటాచ్‌మెంట్‌ ఐకాన్‌లో ఇప్పటి వరకు డాక్యుమెంట్‌, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్‌, కాంటాక్స్‌ ఆప్షన్స్‌ ఉండగా.. ఇప్పుడు అదనంగా ‘పేమెంట్‌’, ‘రూమ్‌’లను యాడ్‌ చేశారు. ఈ పేమెంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్‌ చేసుకోవచ్చు. ‘రూమ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే నేరుగా ఫేస్‌బుక్‌ మెసెంజర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అనేబుల్‌ చేసుకోవచ్చు. 

కేటలాగ్‌ షార్ట్‌కట్‌ 
ప్రత్యేకంగా బిజినెస్‌ వాట్సాప్‌ యూజర్లకు ఈ కేటలాగ్‌ షార్ట్‌కట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. హోం మెనూలో ఉండే ఆడియో, వీడియో కాల్స్‌ ఐకాన్స్‌ను మెర్జ్‌ చేసి దాని పక్కనే కొత్తగా కేటలాగ్‌ ఐకాన్‌ షార్ట్‌కట్‌ను యాడ్‌ చేశారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, వెబ్‌ వాట్సాప్‌, డెస్క్‌టాప్‌ యాప్‌లకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. 

వీడియోలు, ఫొటోలు సరికొత్తగా.. 
ఫొటోలు, జిఫ్‌ ఇమేజ్‌లను సెండ్‌ చేసే సమయంలోనే ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌తో ‘మీడియా గైడ్‌లైన్స్‌’ అనే ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టింది. ఇకపై మనం పంపించే వీడియోలు, ఫొటోలపై టెక్స్‌ రాసుకోవడంతోపాటు స్టిక్కర్లను యాడ్‌ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్లలో కొన్ని ప్రస్తుతానికి బీటా అకౌంట్లకు పరిమితం చేసిన వాట్సాప్‌.. మరికొద్ది రోజుల్లో యూజర్లందరికీ అందించనుంది. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి వాట్సాప్‌ను ప్లేస్టోర్‌లో అప్‌డేట్‌ చేసుకుఉని లేటెస్ట్‌ ఫీచర్లను సద్వినియోగం చేసుకోండి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement